1962 చైనాతో యుద్ధం సమయంలోనూ మన కమ్యూనిస్టులది అదే ధోరణి
హజంగా భారతదేశ ప్రయోజనాలకు లబ్ది చేకూర్చే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించడం కమ్యూనిస్టుల నైజం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే యుద్ధ సమయాల్లో కూడా వీరి వైఖరి ఇదే విధంగా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది.

1962 భారత్ – చైనా యుద్ధం జరుగుతున్న సమయం.. ఈ యుద్ధంలో కమ్యూనిస్టులు చైనాకు మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే కారణంతో అప్పటి ప్రభుత్వం అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలను జైలుకు తరలించింది. అప్పటి కేరళ సీపీఐ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వీఎస్ అచ్యుతానందన్ కూడా ఈక్రమంలో జైలుపాలయ్యారు. అతడు తిరువనంతపురం జైలు కమిటీ సభ్యుడుగా ఉండేవారు. జైలులో ఉన్న అచ్యుతానందన్,  తమ పార్టీ జైలు కమిటీ సభ్యుల సమావేశంలో ఓ ప్రతిపాదన చేసారు. యుద్ధంలో గాయపడ్డ భారత జవాన్ల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటుతో పాటు జైలులో తమకు లభిస్తున్న రేషన్ కూడా వారికోసం విరాళంగా ఇద్దాం అని సూచించారు. 

వీఎస్ అచ్యుతానందన్ చేసిన ప్రతిపాదనను అదే పార్టీలో ఉన్న మరో కమ్యూనిస్ట్ నేత ఓ.జే.జోసెఫ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ అచ్యుతానందన్ మరో సమావేశంలో కూడా ఇదే ప్రతిపాదన చేసారు. దీంతో ఓ.జె. జోసెఫ్, అచ్యుతానందన్ మధ్య ఈ ప్రతిపాదన అంశంలో ఘర్షణ తలెత్తింది. ఈ జైలు అధికారులు కలుగచేసుకుని పరిస్థితి చక్కదిద్దే పరిస్థితి ఏర్పడటంతో ఈ వ్యవహారం అంతా మీడియా దృష్టికి వచ్చింది.

ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు జ్యోతి బసు పార్టీపరమైన విచారణకు ఆదేశించారు. పార్టీలో ఈ వ్యవహారం తీవ్రతరం అవుతున్నందున  దీంతో అచ్యుతానందన్ తన ప్రతిపాదన విరమించుకున్నారు.

ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోలేదు. 1965లో అదే కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఓ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్ పై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశాడు. యుద్ధంలో భారత సైనికులకు మద్దతు ఇవ్వడం ద్వారా అచ్యుతానందన్ పార్టీ  వ్యతిరేక విధానాలను అవలంబించారు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీపీఐ వెంటనే ఈ వ్యవహారంపై మరోసారి విచారణ నిర్వహించింది.

పార్టీ వర్గాలు తమ విచారణలో.. భారత జవాన్లకు మద్దతిచ్చిన అచ్యుతానంద్ ను దోషిగా నిర్ధారించారు. దేశహితం, దేశ భద్రతల కన్నా తమ పార్టీ సిద్ధాంతం, భావజాలమే మిన్న అని భావించే కమ్యూనిస్ట్ పార్టీ అధినాయకత్వం వెంటనే మరో ఆలోచన లేకుండా వీఎస్ అచ్యుతానందన్ పై చర్యలు తీసుకుంది. పార్టీ కేంద్ర కమిటీ నుండి అతడిని తప్పించింది.
ఇలా దేశ హితం గురించి మాట్లాడిన సొంత పార్టీ వారినే సహించని కమ్యూనిస్ట్ లు ఆ యుద్ధంలో చైనా సైన్యం కోసం ఇక్కడ నిధులు సేకరించారు.

మూలము: www.oneindia.com

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top