Page Nav

HIDE

Grid

HIDE_BLOG

సౌకర్యలహరి శ్లోకం - Saukaryalahari Slokam

సౌకర్యలహరి శ్లోకం జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా గతిః ప్రాదక్షిణ్య-క్రమణ-మశనాద్యా హుతి-విధిః | ప్రణామః సంవేశః సుఖమఖిల-...


సౌకర్యలహరి శ్లోకం

జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య-క్రమణ-మశనాద్యా హుతి-విధిః |
ప్రణామః సంవేశః సుఖమఖిల-మాత్మార్పణ-దృశా
సపర్యా పర్యాయ-స్తవ భవతు యన్మే విలసితమ్
తాత్పర్యం:
శర్వాణీ !ఆత్మ సమర్పణ బుద్ధి తో నేను నోటితో పలికిన మాటలన్నీ నీవు నిర్మించినవే .నువ్వు నిర్మించినవే కనుక అవి నీ మంత్ర జపమే .ఈ శరీరం నీవే ఇచ్చావు కనుక ,నేను చేసే హస్త విన్యాసాలన్నీ నీకు చేసే ముద్రా విధానాలుగానే భావించు .ఎంతటి వివేకమూ వినయమూ శ్రీ భాగవత్పాదులలో ఉన్నాయో దీనితో మనకు అర్ధమవుతోంది .అంతా ఆమె ఇచ్చింది కనుక తాను కొత్తగా చెప్పేదేమీ లేదని ,తాను చేసే చేష్టలన్నీ ఆమె కైన్కర్యాలే నని గడుసుగా చెప్పారు .నీవు సర్వ వ్యాపివి కనుక నేను చేసే సంచారం అంతా నీకు చేసే ప్రదక్షినమే అనుకో .నా అంగ భంగిమలన్నీ ,నీకు ప్రనామాలే .నీవే జతరాగ్ని వి కనుక నేను గ్రహించే అన్న ,పానాదు లన్నీ ,నీ ప్రీతీ కోసం చేసే హోమం గా స్వీకరించు .శబ్ద స్పర్శాడులతో నేను చేసే చేష్ట లన్నీ నీ సపర్యలె అని భావించు .అని అమ్మ ఇచ్చినవన్నీ అమ్మకే సమర్పిస్తున్నానని భావన .

విశేషం – అన్ని అక్ష రాలు ,మాతృకా వర్ణ రూపాలే కనుక పలుకులన్నీ జపంతో సమానాలే అని భావం .హస్త విన్యాసాలన్నీ జపం లో చేసే ముద్రలే .అన్నీ ఆమెకే చెందు తాయి .మాత జథరాజ్ఞి స్వ రూపం .కనుక మనం తిన్నదంతా ఆమెదే .సందేశం అంటే శయనం నీ ముద్రాదులన్నీ ఆత్మ సమర్పణ ద్రుశాలు .ఇదంతా ”సపర్యా పర్యాయం ‘.’భగవద్ గీత లో కూడా ”మన్మనా భవ ,మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు –మమే వేశ్యసి కౌంతేయ ,ప్రతి జానే ప్రయోజనే ”అన్నాడు శ్రీ కృష్ణ భాగ వాన్ .ఏమి చేసినా ,ఎలా చేసినా ,సర్వం భగ వతికి అర్పణమే .ఇంకేదైనా పూజ చేస్తే ఆది పూజా క్రమం కాదు అని తెలియ జేయటమే .

సంకలనం: భానుమతి అక్కిశెట్టి