నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Tuesday, June 16, 2020

గృహ వైద్యం : వంటింటి పదార్థాలలో ముఖ్యమైన వాము - Vamu - Gruha Vaidyam
వాము లేని వంటిల్లు ఉండదు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఇమిడి ఉన్నాయి. వాము చేసే మేలు ఒక్కమాటలో చెప్పలేనిది. ఇది చిన్న చిన్న కడుపునొప్పుల నుండి పెద్ద పెద్ద (క్యాన్సర్‌ వంటి) వ్యాధులను నయం చెయ్యగలిగే ఔషధం. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు వాము, వేడినీళ్ళు, ఉప్పు కలిపిన కషాయం త్రాగవచ్చు. 

జలుబు చేసినప్పుడు (బాగా పడిశం పట్టినప్పుడు) ఈ వాముగింజలను కుంపటిమీద నిప్పులో వేసి, వచ్చేపొగనిపీల్చడం వల్ల ఉపశమనం కలుగుతుంది. వాము, బెల్లం కలిపిన ముద్దని రోజూ తినడం వలన ఆస్తమా (ఉబ్బసం వ్యాధి) తగ్గిపోవును. షుగర్‌ వ్యాధి ఉన్నవారికి కూడా ఈ వాము ఒక దివ్య ఔషధం. 

వాము పులావు ఆకు ముద్దగా నూరి దాని రసం త్రాగడంవలన మెరుగుపడవచ్చును. కలుషిత నీరు త్రాగడంవలన కలిగే కలరా జబ్బు సోకడంవలన కడుపులో పట్టే పురుగులను హత మార్చడంలో వాము నీరు ఒక దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. మద్యానికి బానిసలయిన వారికి వామునీరు విరుగుడుగా పనిచేస్తుంది. దీనిని 50 రోజులపాటు రెండుపూటలాత్రాగించాలి. 

చిన్న (13-16ఏళ్ళ) వయసులో వాము గింజలు తినిపించడంవలన అవాంఛిత కామవాంఛ తగ్గును. పైన తెలిపిన అనేక కారణాలు, వ్యాధులు, గుణాలు, ఉపయోగాలు తెలుసుకున్నాము కనుక ప్రతిరోజూ ఏదో ఒకవిధంగా వామును ఆహారములో భాగంగా సేవించాలి.

రచన: ఉషా లావణ్య
« PREV
NEXT »