నలంద విశ్వవిద్యాలయం విధ్వంసం, అసలైన చరిత్ర తెలుసుకుందాం - The destruction of Nalanda University

నలంద విశ్వవిద్యాలయం విధ్వంసం, అసలైన చరిత్ర తెలుసుకుందాం - The destruction of Nalanda University

అసలైన చరిత్ర - నలంద విశ్వవిద్యాలయం ఎలా నాశనం చేయబడిందో తెలుసుకుందాం..

తుర్కిష్ సైన్యాధ్యక్షుడు భక్తియార్‌ఖిల్జీ చేతుల మీదుగా 1193 లో నలంద నాశనం చేయబడింది. అదెలా జరిగిందో తెలుసుకుందాం.

ఒకసారి ఖిల్జీకి తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. తన ఆస్థాన వైద్యులు చేత కూడా నయం కాలేదు. ఆస్థాన సలహాదారు నలందలో రాహుల్ శ్రీభద్ర అనే ఒక ఉపాద్యాయుడు ఉన్నాడు. అతనే నలందకి సర్వాధికారి (ప్రిన్సిపాల్) ఆయన సహాయం చేయగలడు అని చెప్పాడు.. అందుకు ఖిల్జీ ఒప్పుకోలేదు..

"ఇతర మతాచారాలు పాటించే వారితో చచ్చినా వైద్యం చేయించుకొను.." అని ఆగ్రహం వ్యక్తంచేశాడు.. రోజులు గడుస్తున్నాయి, కానీ ఖిల్జీకి నయం కాక బభరించరాని బాధతో ఇంకో దారి లేక, ఖిల్జీ తన అహం చంపుకుని ఒప్పుకున్నాడు.. రాహుల్ శ్రీభద్ర కి ఒక నిబంధన విధించాడు "నీ మత విశ్వాసం కాకుండా మందులుతోనే నయం చేయాలి అలా చేయలేని పక్షంలో నీ తల తీస్తాను.." అన్నాడు..

శ్రీ భద్ర సరే అని... మీ ఇస్లాంలో నయం చేసే ప్రార్థనలు ఉంటే చేసుకోమన్నాడు... ఆశ్చర్యంగా చూస్తూ అలానే చేసాడు ఖిల్జీ. ఖిల్జీకి నయం అయిపోయింది... ఖిల్జీ పట్టరాని ఆనందంతో "ఎలా సాధ్యం అయింది అని అడిగాడు. మా వైద్యులు కూడా మందులు వేశారు నేను ప్రార్థనలు చేసాను కానీ అప్పుడు నయం కాలేదు, ఇప్పుడు ఎలా నయం అయింది.." అన్నాడు..

అప్పుడు శ్రీభద్ర ఇలా చెప్పాడు "చేసే పనిలో శ్రద్ధ, నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది మనస్సులో ఉండాలి వైద్యుడు వైద్యం కోసం వచ్చే వారిలో నమ్మకం నింపాలి భయం పోగొట్టాలి ఆ తర్వాత వైద్యం చేయాలి, నా మీద నీకు పూర్తి నమ్మకం ఏర్పడింది, అందువల్లే జబ్బు నయం అయుంది.." అని చెప్పాడు.. ఇంతకు ముందు అవి మీకు లేవు అని ఖిల్జీ తో చెప్పాడు.. ఆ తరువాత భద్ర దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాడు...

విధ్వంసం:
నలందలో అన్ని విద్యలు ఆత్మరక్షణ విద్యలు, కళలు, సాహిత్యం, జ్యోతిష్యం, ఖగోళ, తాంత్రిక, గ్రహాంతర వాసులతో కనెక్ట్ అవడం.. వగైరా కనీ వినీ ఎరుగని అన్ని విద్యలూ సాధన చేస్తున్నారు అని వేగులు ద్వారా తెలుసుకుని విధ్వంసకరమైన కుటిల పన్నాగానికి ప్రణాళిక సిధ్దం చేసాడు ఖిల్జీ..
  • ➧ మహా పాండిత్యం ఉన్న వీళ్ళు ఎప్పటికి అయినా ప్రమాదం అని భద్రని సాగనంపి తాను కోలుకున్న తరువాత మిగతా అన్ని పనులూ పక్కనబెట్టి సైన్యాన్ని వెంటబెట్టుకుని నేరుగా వెళ్ళి నలందని నాశనం చేశాడు..
  • ➧ 1193 లో బఖ్తియార్ ఖిల్జీ అనే టర్కీ సైన్యాధికారి చేత బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం సర్వనాశనం చేయబడినది,,
  • ➧ అక్కడ విద్య నేర్చుకుంటున్న 10 వేలమంది విద్యార్థులను, ఆచార్యులనూ సజీవ దహనం చేసి విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద చేశారు,,
  • ➧ లైబ్రరీలో ఉన్న సుమారు 1 కోటి 10 లక్షల తాళపత్ర గ్రంధాలను తగుల పెట్టినపుడు అవి కాలి బూడిద కావడానికే 6 నెలల సమయం పట్టినదట,,
  • ➧ ఆ పొగ సుమారు 150 కిలోమీటర్ల మేర కనిపించేదట,,
  • ➧ సహాయం చేసిన వారికి ద్రోహం చేయడం అంటే ఇదే..
భక్తియార్‌పూర్:
భక్తియార్‌పూర్ పేరు వినగానే ప్రతి భారతీయునికి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.. కారణం నలంద విశ్వవిద్యాలయం ఆ ఊరిలోనే ఉంది..

దానికి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా??
1193లో భక్తియార్‌ఖిల్జీ అనే ముస్లిం సేనాధిపతి కేవలం 100 మంది కరడుగట్టిన ముస్లిం ఛాందసవాద సైనికులతో ఆ ఊరు వచ్చి, అక్కడ ఉన్న 10,000 మంది విద్యార్థులనూ, అధ్యాపకులనూ నరమేధం చేసి, నలంద యూనివర్సిటీని నేలమట్టం చేసి, అక్కడి లైబ్రరీలో ఉన్న 11 మిలియన్ల గ్రంధాలను తగులబెట్టాడు..

ఆ గ్రంధాలు అన్నీ పూర్తిగా తగల పడడానికి 6 మాసాల సమయం పట్టిందట.. ఆ పొగ 150 కి.మీ దూరం కనిపించిందట.. సిగ్గులేని ఖాంగ్రెస్ అతని పేరు మీద ఆ ఊరికి భక్తియార్‌పూర్ అని పేరు పెట్టింది.. చరిత్ర తెలియని మనం అదేదో భక్తితో కూడుకున్న పేరులా భలేగా ఉంది అని గుడ్డిగా 70 ఏళ్లుగా అలాగే పలుకుతూ ఉన్నాం.... ఇకనైనా నలంద అని మార్చాలి....

సంకలనం: కోటేశ్వర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top