నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
చరిత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చరిత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, సెప్టెంబర్ 2020, శనివారం

ఇజ్రాయిల్ లో భారతీయ సైనికుల వీరోచిత పోరాటం – హైఫా యుద్ధం - Battle of Haifa 1918

ఇజ్రాయిల్ లో భారతీయ సైనికుల వీరోచిత పోరాటం – హైఫా యుద్ధం - Battle of Haifa 1918
సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది టర్కీ ఒట్టమాన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.

ఈ యుద్ధం తరువాత బ్రిటిష్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సేనలతో కలిసి పోరాడిన భారతీయ సైనికులు మొత్తం ఇజ్రాయిల్‌ను విముక్తం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇజ్రాయిల్‌లో జరిగిన వివిధ పోరాటాల్లో 900 పైగా భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఇప్పటికీ వారి సమాధులను ఇజ్రాయిల్‌ ప్రభుత్వం పరిరక్షిస్తోంది. ప్రతి సంవత్సరం 23 సెప్టెంబర్‌ను భారతీయ సైనికుల స్మృతి దినంగా పాటిస్తారు. వారి బలిదానాల గురించి పాఠశాలల్లో పిల్లలకు చెపుతారు. పాఠ్య పుస్తకాల్లో కూడా వారి విజయగాథలు చేర్చారు. భారత సేనలకు నాయకత్వం వహించిన మేజర్‌ దలపత్‌సింగ్‌ షెకావత్‌ను ‘హైఫా హీరో’గా గుర్తిస్తారు. ఆ యుద్ధంలో ఆయన చనిపోయినప్పటికీ సైనికులు మాత్రం వెనకడుగువేయకుండా భారత్‌కు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టారు.

ప్రపంచ చరిత్రలో ఇది చాలా అరుదైన, చెప్పుకోదగిన యుద్ధంగా నిలిచిపోయింది. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సైన్యం తమ భూభాగంలో సురక్షితంగా ఉంది. ఆ సేన దగ్గర తుపాకులు, ఫిరంగులు మొదలైన ఆధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి. మరోవైపు జోధ్‌పూర్‌, మైసూర్‌లనుండి వెళ్ళిన భారతీయ సైనికులు ప్రధానంగా అశ్వికులు. కొద్దిమంది సాధారణ కాలిబంటులు. వారి దగ్గర కత్తులు, బల్లాలు తప్ప ఆధునిక ఆయుధాలు లేవు. ఇలా కత్తులు, బల్లాలతో కొద్దిమంది సైనికులు ఆధునిక ఆయుధాలు కలిగిన అపారమైన సైన్యాన్ని ఓడించడం ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. అలాగే ఇలాంటి యుద్ధం జరగడం కూడా ఇదే ఆఖరుసారి. కనుక ఇలాంటి అపూర్వమైన యుద్ధం ప్రతి భారతీయుడికి ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తుంది. హైదరాబాద్‌ నిజాం కూడా బ్రిటిష్‌ సేనలకు సహాయంగా అశ్వికదళాన్ని పంపాడు. కానీ ఆ దళానికి యుద్ధంలో పట్టుకున్న శత్రుసైనికులను చూడటమే వారి పని. వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలేదు.


హైఫా విజయం ప్రాముఖ్యత
హైఫా ఇజ్రాయిల్‌ నౌకా పట్టణం. క్రీ.శ 1516లో టర్క్‌ ఒట్టమాన్‌లు దీనిని ఆక్రమించి 402 ఏళ్ళపాటు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. హైఫా లేకుండా, సరైన రోడ్డు మార్గాలు లేకుండా సైనిక దళాల కదలిక సాధ్యం కాదని బ్రిటిష్‌ అధికారులకు అర్థమైంది. అందుకనే 1918 సెప్టెంబర్‌ 22న బ్రిగెడియర్‌ జనరల్‌ కింగ్‌ యుద్ధశకటాలను తీసుకుని నజరత్‌ మార్గం గుండా హైఫా చేరుకోవాలని ప్రయత్నించాడు. కానీ పర్వత సానువుల నుండి టర్క్‌లు వారిపై గుళ్ళవర్షం కురిపించారు. దానితో బ్రిటిష్‌ సేనలు వెనక్కి తగ్గక తప్పలేదు.

భారతీయ సైనికుల ప్రతిస్పందన
జోధ్‌పూర్‌, మైసూర్‌ మహారాజాలు పంపిన రెండు అశ్వికదళాలలోని సైనికులకు ఇలా వెనక్కి తగ్గడం ఏమాత్రం నచ్చలేదు. అశ్వికదళాలకు నేతృత్వం వహిస్తున్న మేజర్‌ దలపత్‌ సింగ్‌ షెకావత్‌కు ఇది చాలా అవమానమనిపించింది. అయితే శత్రువులు సురక్షితమైన, కీలక ప్రదేశాలను ఆక్రమించుకుని ఉన్నారని, వారి వద్ద అధునాతన ఆయుధాలు కూడా ఉన్నాయని వీరికి నచ్చచెప్పాలని బ్రిటిష్‌ అధికారులు ప్రయత్నించారు. కానీ మహారాజా సైనిక దళాల పట్టుదలను చూసి ఎదురుదాడికి అనుమతిని ఇచ్చారు.

23 సెప్టెంబర్‌, 1918 – హైఫా యుద్ధం
ఇజ్రాయిల్‌ను విముక్తం చేయడంలో భారతీయ పరాక్రమం జోధ్‌పూర్‌, మైసూర్‌ మహారాజాలు పంపిన అశ్వికదళంవద్ద కేవలం కత్తులు, బల్లాలు మాత్రమే ఉన్నాయి. అయినా వాటితోనే దళాలు 23 సెప్టెంబర్‌,1918 హైఫా పట్టణం వైపు సాగాయి. సైనికులు కిషోన్‌ నది, దాని కాలువల వెంబడి చిత్తడి నేలలో కార్మెల్‌ పర్వత సానువుల వెంబడి ముందుకు కదిలారు. ఇలాంటి ప్రదేశంలో అశ్వదళం కదలడమే చాలా కష్టం. వాళ్ళు దాదాపు 10 గంటలకు హైఫా పట్టణానికి చేరుకుంటున్నప్పుడు కార్మెల్‌ పర్వత సానువుల నుండి 77 ఎం.ఎం ఫిరంగులు ఒక్కసారి వారిపై విరుచుకుపడ్డాయి. హైఫా పట్టణంలోనేకాక చుట్టుపక్కల ప్రదేశాలలో కూడా టర్క్‌లు జర్మన్‌లు, ఆస్ట్రియా దళాలు సమకూర్చిన ఫిరంగులను మొహరించారు.

మైసూరు అశ్విక దళం (వీరితోపాటు షెర్‌వుడ్‌ దళం కూడా ఉంది) దక్షిణం వైపు నుంచి కార్మెల్‌ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. శత్రువును ఆశ్చర్యపరుస్తూ ఆ దళం రెండు నావికాదళ ఫిరంగులను కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాదు శత్రువు కురిపిస్తున్న మిషన్‌గన్‌ కాల్పులకు ఎదురువెళ్ళారు. అప్పుడే మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో జోధ్‌పూర్‌ అశ్వదళం బ్రిటిష్‌ సేనతోపాటు హైఫాను ముట్టడించింది. అన్ని వైపుల నుండి జరుగుతున్న మెషిన్‌గన్‌ కాల్పులను లెక్కచేయకుండా వాళ్ళు శత్రువుపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత ఒక గంట లోపు భారతీయ అశ్వసైనికులు ఒట్టమాన్‌ల నుండి హైఫాను స్వాధీనం చేసుకున్నారు. వారి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు.

ఆనాటి భారతీయ దళాల యుద్ధనైపుణ్యం, పోరాట పటిమ గురించి ప్రపంచయుద్ధపు అధికారిక చరిత్ర – మిలటరీ ఆపరేషన్‌ ఇన్‌ ఈజిప్ట్‌లో (2వ సంపుటం) ఇలా వివరించారు – ”ఈ మొత్తం యుద్ధంలో భారత అశ్వదళం చూపిన పరాక్రమం మరెక్కడా కనిపించదు. మెషిన్‌గన్‌ కాల్పులు కూడా అశ్వదళపు మెరుపుదాడిని అడ్డుకోలేకపోయాయి. కాల్పులకు ఎదురొడ్డి గుర్రాలను నడపడం మరెక్కడా చూడం. యుద్ధం తరువాత చాలా గుర్రాలు చని పోయాయి.” ఇలా ముందుకురికిన అశ్వదళం ఒక దుర్భేద్యమైన పట్టణాన్ని సైతం స్వాధీన పరచు కోవడం మిలటరీ చరిత్రలో మరెక్కడా కనిపించదు.

హైఫా హీరో మేజర్‌ ఠాకూర్‌ దలపత్‌ సింగ్‌కు నివాళి
మేజర్‌ షెకావత్‌ సాధించిన అపూర్వమైన విజయానికిగాను బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకు అత్యుత్తమ సైనిక పురస్కారం ‘మిలటరీ క్రాస్‌’ను (ఇప్పటి పరమవీర చక్రకు సమానం) ఇచ్చింది. దలపత్‌ సింగ్‌ స్మృత్యర్థం మేవార్‌ ప్రభుత్వం ప్రతాప్‌ పాఠశాల ఆవరణలో ‘దలపత్‌ స్మృతి మందిరం’ నిర్మించింది. మహారాజా ఉమేద్‌ సింగ్‌ ప్రత్యేక వెండి నాణాలు విడుదల చేయించారు. అవి ఇప్పటికీ జోధ్‌పూర్‌ 61 అశ్వదళ కేంద్రంలో ఉన్నాయి.

ఇతర హైఫా యుద్ధవీరులు
కెప్టెన్‌ అనూప్‌ సింగ్‌, సెకెండ్‌ లెఫ్టినెంట్‌ సాగత్‌ సింగ్‌ లకు కూడా మిలటరీ క్రాస్‌ లభించింది. కెప్టెన్‌ బహదూర్‌ అమన్‌సింగ్‌ జోధా, దఫాదార్‌ జోర్‌ సింగ్‌లకు ఇండియన్‌ ఆర్టర్‌ ఆఫ్‌ మెరిట్‌ లభించింది. బ్రిటిష్‌ రాణి భారతీయ సైనికులకు ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం మిలటరీ క్రాస్‌. ఇది ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పరమ్‌ వీర్‌ చక్ర వంటిది.

వ్యాస మూలము: విశ్వ సంవాద కేంద్రము

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు? - Khilafat movement

Khilafat movement

–డా. శ్రీరంగ గోడ్బోలే

ఖిలాఫత్ ఉద్యమానికి కర్తలు ఎవరు? ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని వాళ్ళు ఎక్కడ అందిపుచ్చుకున్నారు?  వాళ్ళ వేరువేరు మార్గాలు చివరికి ఒకే లక్ష్యం వైపుగా ఎలా సాగాయి?  మొదటి ప్రపంచ యుద్ధం నుండి  ఖిలాఫత్ ఉద్యమం వరకు జరిగిన సంఘటనల్లో ప్రధాన పాత్ర పోషించినవారి ఆలోచనలు ఏమిటన్నది తెలుసుకోవడం చాలా అవసరం.

అలీఘర్ ఉద్యమం:
1857 తిరుగుబాటుకు ముస్లింలే ప్రధాన కారణమని బ్రిటిష్ వారు భావించారు. ఎందుకంటే దేశంలో ఇస్లాం పాలన అంతం కావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. హిందువులను వాళ్ళు పాలితులుగానే చూశారు తప్ప తోటి పౌరులుగా స్నేహభావంతో చూడలేకపోయారు. ఈ అసంతృప్తి, నిరాశ నుంచి ముస్లిం ఐక్యత అవసరం పుట్టుకువచ్చింది. ఆ ముస్లిం ఐక్యత కోసం ఆలీఘర్ ఉద్యమం ప్రారంభమయింది.

ఈస్ట్ ఇండియా కంపెనీకి విశ్వాసపాత్రుడైన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (1817- 1898 ) దీనికి సూత్రధారి. ఇతను 1878 నుండి 1883 వరకు  గవర్నర్ జనరల్   లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా.  సయ్యద్ దృష్టిలో ముస్లింల సాధికారత అనేది  బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండటం, ఇస్లామిక్ విద్యను వ్యాప్తి చేయడం, రాజకీయాలకు దూరంగా ఉండటం ద్వారానే సాధ్యపడుతుందని భావించేవాడు.  మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ను ఈ ఉద్దేశ్యం తోనే 1875 లో స్థాపించాడు. లాహోర్ లో జరిగిన ఒక ఇస్లామిక్  విద్యారంగ సమావేశంలో మాట్లాడుతూ, ” ఇస్లాంను ఆచరించాలి. మన ఇళ్ళలో యువత ఇంగ్లీష్ చదువుతో పాటు మన మతపరమైన సందేశాలను, చరిత్రను తెలుసుకోవాలి, వారికి ఇస్లాం విధానంలో ప్రధానమైన విషయాలు, అరబిక్, పెర్షియన్ భాషలతో పరిచయం ఉండాలి. ముస్లింలు అందరిలో పరస్పర అన్యోన్యత ఉండటం కోసం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అందరూ కలసి ఉండటం, భోజనం చేయటం, చదువుకోవడం చేయాలి…ఇవి లేకపోతే మనం ఒక జాతిగా నిలబడలేము” అని అన్నాడు.(Syed Ahmad Khan and Muslim Nationalism in India, Sharig Al Mujahid, Islamic Studies, Vol. 38, No.1, 1999, P.90)

1867 లో బెనారస్ కమిషనర్ షేక్స్పియర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హిందూ ముస్లిం లను రెండు వేరు వేరు దేశాలుగా సయ్యద్ పేర్కొన్నాడు. 1883 లో ఇచ్చిన మరో ఉపన్యాసం లో మాట్లాడుతూ ఒకవేళ బ్రిటీషువారు  భారతదేశాన్ని వదిలి వెళ్లిపోతే …మరి ఈ దేశ పాలకులు ఎవరు అవుతారు?  హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకే సింహాసనం మీద కూర్చుని సమానమైన అధికారాలతో రాజ్యం చేయడం ఎలా సాధ్యపడుతుంది? అది సాధ్యం కాదు. వారిలో ఎవరో ఒకరు మరొకరిని జయించి సింహాసనం అధిష్టించవలసిందే’’ అని స్పష్టం చేశారు. (The Making of Pakistan, Richard Symonds, Faber, 1950, P. 31).

1906 లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వ్యవస్థాపక సూత్రాలలో ‘బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండటం’ అనే అలీఘర్ విధానాన్ని కూడా చేర్చారు. అయితే సయ్యద్ కి ఉన్న, అలీ ఘర్ స్నేహితులతో సహా, చాలా మంది ఈ బ్రిటిష్ అనుకూలతను అంగీకరించలేదు. 1888 లో దేవబందీలు సయ్యద్ కు వ్యతిరేకంగా ఒక ఫత్వా జారీ చేశారు.

శిబ్లి నూమానీ అనే అలీఘర్ కళాశాల మాజీ ఉపాధ్యాయుడు లక్నోలో 1894 లో నద్వత్ – ఉల్ – ఉలామా (పండితుల సభ) పేరుతో ఒక ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు.1911 లో జరిగిన బెంగాల్ విభజన లో ముస్లిం ఆధిక్యత ఉన్న అస్సాం, తూర్పు బెంగాల్ లు  నష్ట పోయాయి.  దీనితో  బ్రిటిష్ వారిపట్ల విధేయత అనే విధానం మారిపోయింది. అలాగే 1911-13 మధ్య జరిగిన బాల్కన్ యుద్ధాల వల్ల ఒట్టమాన్ టర్క్ లు యూరోప్ లోని తమ భూభాగాలను కోల్పోవలసి వచ్చింది. అలాగే బ్రిటిష్ వారు అలీఘర్ ముస్లిమ్ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలు అన్నింటినీ తిరస్కరించడంతో అలీఘర్ బ్రిటిష్ వ్యతిరేకతతో అట్టుడికిపోయింది.  తరువాత బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు అన్నింటికీ కేంద్ర బిందువు అయింది. ప్రపంచ ఇస్లాం సిద్ధాంతానికి, భారతీయ ముస్లిం ప్రయోజనాలకు నష్టం కలుగుతోందన్న భావనే బ్రిటిష్ వ్యతిరేకతకు  కారణమైందన్నది విషయం ఇక్కడ గమనించాలి.

ఖిలాఫత్ ఉద్యమంలో లో ప్రధాన పాత్ర పోషించిన షౌకత్ అలీ (1873-1938)  మహమ్మద్ అలీ జహౌర్(1878-1931) సోదరులు మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ పూర్వ విద్యార్తులు, తర్వాత వారే ఆ కళాశాల ట్రస్టీలు ఆ తర్వాత ఆల్ ఇండియా ముస్లిం  లీగ్ వ్యవస్థాపక సభ్యులు.  వీరిలో మహమ్మద్ అలీ ‘ కామ్రేడ్'(1911)  అనే ఆంగ్ల పత్రికను, ‘హమ్ దర్ద్’ అనే ఉర్దూ వార్తా పత్రికను ప్రారంభించగా,  షౌకత్ అలీ ‘అంజుమన్ -ఇ -ఖుద్ధామ్ -ఇ -కాబా’ ను 1913లో స్థాపించడంలో సహకరించాడు.

 ఇస్మాయిలీ ఖోజా తెగ కు  చెందిన మత గురువు ఆగాఖాన్ (1877-1957)  అలీఘర్ విశ్వవిద్యాలయ పోషకులలో  ఒకరు.  ఈయన కూడా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వ్యవస్థాపక సభ్యుడిగా 1906 -13 లో పని చేశాడు.  ఖిలాఫత్ ఉద్యమ అనుకూలుడు  అయినప్పటికీ ఈయన సహాయ నిరాకరణోద్యమాన్ని వ్యతిరేకించాడు.  అలీఘర్ కు  చెందిన మరో పూర్వ విద్యార్థి మౌలానా  హస్రత్ మోహానీ (1878-1951)  ఉర్దూ వార పత్రిక ‘ఉర్దూ ఇ ముల్లా వ్యవస్థాపక సంపాదకులు.  ఈయన 1921లో ముస్లింలీగ్ అధ్యక్షుడు మరియు ఖిలాఫత్ ఉద్యమ నాయకుడిగా పని చేశాడు.

దేవ్ బంద్ పాఠశాల:
1867 లో వాయువ్య ఉత్తర ప్రదేశ్ లోని దేవ్ బంద్ లోని ఒక మసీదులో షా వాలియుల్లా ప్రారంభించిన ఢిల్లీ మదర్సాలోని ముగ్గురు పూర్వ విద్యార్థులు, మౌలానా మహమ్మద్ ఖాసిమ్ నానోటావి (1832-1880), మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి (1826-1905), మౌలానా జుల్ఫికర్ అలీ (1819-1904)లు దార్ అల్-ఉలూమ్ (జ్ఞానపు నివాసం)ను స్థాపించారు.  పాశ్చాత్య విద్యకు ఉండే కొన్ని సంస్థాగత లక్షణాలను అవలంబిస్తూ,  సాంప్రదాయ ఇస్లామిక్ పాఠ్యాంశాలను సంస్కరించడం, ఇస్లామిక్ సామాజిక   చైతన్యాన్ని పునరుద్దరించడం  లక్ష్యంగా పెట్టుకున్నారు.  ప్రభుత్వ పోషణపై ఆధారపడకుండా, వారు అన్ని వర్గాల ముస్లింల నుండి ఆర్థిక సహాయం పొందేవారు.  అలీఘర్ వాదుల మాదిరిగానే,  కొత్తగా స్థాపించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి వీరు మొదట్లో  దూరం పాటించారు.  ముస్లింలు బ్రిటిష్ వారి నుండి రాయితీలు పొందటానికి హిందువులతో సహకరించడం సరైందేనని,  అయితే అలాంటి చర్య ఇస్లాం ప్రాథమిక సూత్రాలను మాత్రం ఉల్లంఘించకూడదని గనోహి ఫత్వా ద్వారా స్పష్టం చేశారు.  అలీఘర్ వాదుల  మాదిరిగానే, దేవబందీ  సిద్దాంతం కూడా  ఇస్లాం  ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నది,  ముస్లిం ప్రయోజనాలకు ఉపయోగపడితేనే హిందువులతో ఏ విషయంలోనైనా సహకారం అనుమతిస్తారు.

ముగ్గురు వ్యవస్థాపకుల మరణం తరువాత, దార్ అల్-ఉలూమ్ దేవబంద్  ఎక్కువగా మౌలానా మహముద్ అల్-హసన్ (1851-1920) పై ఆధార పడింది, తరువాత రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న ఆయనకు 1920, జూన్ 8 న సెంట్రల్ ఖిలాఫత్ కమిటీ (సికెసి) ”షేక్ అల్-హింద్” బిరుదు ఇచ్చింది.

పాశ్చాత్య విద్యావంతులైన ముస్లిం యువకులకు  ఇస్లామిక్ భావ ధోరణి లో తర్ఫీదు ఇవ్వడానికి,
మౌలానా మహమూద్-అల్ హసన్  ఢిల్లీలోని ఫతేపురి మసీదులో నజరత్ అల్-మారిఫ్ అల్-ఖురానియా (ఖురాన్ పరిజ్ఞాన ప్రకాశం; 1913 లో స్థాపించబడింది)అనే ఒక ఖురాన్ పాఠశాలను ప్రారంభించారు,  అది రెండు సంవత్సరాలు కొనసాగింది. హాసన్ పూర్వ విద్యార్ధి, సిక్కు మతం నుంచి ఇస్లాం స్వీకరించిన మౌలానా ఒబైదుల్లా సింధి (1872-1944) ఈ విషయంలో ఎంతో సహాయం చేశారు.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అంతర్గత శత్రుత్వం, రాజకీయ ద్వేషాలు  కారణంగా, దేవబంద్ సంస్థ  1913 లో ఈ  ఓబైదుల్లా సింధిని  అవిశ్వాసిగా ప్రకటించి, నిషేధిస్తూ ఫత్వా జారీ చేసింది.

నజారత్ అల్-మరీఫ్ అల్-ఖురానియా సంస్థ,  దాని పోషకులలో  ఇద్దరు అలీఘర్ ధర్మకర్తలు హకీమ్ అజ్మల్ ఖాన్ (1865-1927) మరియు డాక్టర్ ముక్తార్ అహ్మద్ అన్సారీ (1880-1936),   హకీమ్ అజ్మల్ ఖాన్ 1919 లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వ్యవస్థాపక సభ్యుడు మరియు దాని అధ్యక్షుడు. 1919-25 వరకు సికెసి ఉపాధ్యక్షుడయ్యాడు మరియు 1921 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) అధ్యక్షుడయ్యాడు. ఢిల్లీలో డాక్టర్ అన్సారీ, అజ్మల్ ఖానంద్ అలీ సోదరులతో సన్నిహితంగా ఉండేవారు.  1912-13లో, అతను రెడ్ క్రెసెంట్ మెడికల్ మిషన్‌ను టర్కీకి నడిపించాడు.  అదే సంవత్సరంలో, అతను ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సభ్యుడయ్యాడు.  1919 నుండి, అతను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరియు సికెసి రెండింటిలోనూ సభ్యుడు.  అతను 1922 గయాలో జరిగిన ఖిలాఫత్ సమావేశానికి అధ్యక్షతవహించాడు. ఆ సమయంలో మౌలానా ఒబైదుల్లా సింధీని టైమ్ పత్రికలో జర్నలిస్టులుగా ఉన్న ముహమ్మద్ అలీ, అబుల్ కలాం ఆజాద్ లకు పరిచయం చేసినది డాక్టర్ అన్సారీనే.

మహమూద్ అల్-హసన్, సింధిలు ఇద్దరూ సిల్క్ లెటర్స్ కుట్రలో (1913-20) చిక్కుకున్నారు, ఒట్టమన్ టర్కీ, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్ ల కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవాన్ని ప్రారంభించే ప్రయత్నాల గురించి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేశారు.  మహమూద్ అల్-హసన్ మరొక దేవబంద్ సహచరుడు మౌలానా హుస్సేన్ అహ్మద్ మద్ని (1879-1957). ఇతను  హెద్జాజ్  మదీనాకు వలస వచ్చి 1902 లో ఒట్టమన్ పౌరసత్వాన్ని పొందాడు.  ప్రపంచ ఇస్లాం సాధన పథకాలలో మహమూద్ అల్-హసన్ సహ కుట్రదారుడు.  1916  అరెస్ట్ అయ్యాడు.  1917-20 వరకు బ్రిటిష్ ప్రభుత్వం ఇతనిని  మాల్టాలో నిర్బంధించింది.  తరువాత అతను మళ్ళీ ఖిలాఫత్ ఉద్యమంలో చేరాడు. అలీఘర్ లో 29 అక్టోబర్ 1920 న మహమూద్ అల్ హసన్, మౌలానా ముహమ్మద్ అలీ, హకీమ్ అజ్మల్ ఖాన్, ఎంఏ అన్సారీ తదితరులు కలసి “జామియా మిలియా ఇస్లామియా” ను (నేషనల్ ఇస్లామిక్ విశ్వవిద్యాలయం) స్థాపించారు.  బ్రిటిష్ ప్రభావం లేని ముస్లిం విశ్వవిద్యాలయంగా ఈ సంస్థ  ఉండాలనేది వారి ఆశయం.

ఫిరంగి మహల్:
ఔరంగజేబు కాలం నుండీ లక్నోలోని ఒక ప్రత్యేక ప్రాంతం ఇస్లామిక్ సిద్ధాంతాల అధ్యయనానికి కేంద్రం అయింది. అదే ఫిరంగి మహల్(ఫిరంగీలు లేదా విదేశాస్టులు నివసించే ప్రదేశం).  ముల్లా నిజాముద్దీన్  పేరు మీద మదర్సాల కోసం అభివృద్ధి చేసిన ప్రాథమిక ఇస్లాం విద్యాప్రణాళిక దారుస్- ఇ- నిజామియా  ఇక్కడే తయారయింది.  నిజాముద్దీన్ శిష్యుడైన మౌలానా అబ్దుల్ బరి (1879-1920) తన ప్రాథమిక విద్యాభ్యాసం ఈ ఫిరంగి మహల్ లో పూర్తి చేశాడు. అతనికి ఇక్కడే హుస్సేన్ ఆలీ, షరీఫ్ ఆఫ్ మక్కా తో పరిచయం అయింది.  1908లో భారత దేశానికి వచ్చే ముందే ఈయన  ఒట్టమన్ సామ్రాజ్యం  లో విస్తృతంగా పర్యటించాడు.  1911లో ఈయన రెడ్ క్రెసెంట్ మెడికల్ మిషన్ కోసం విస్తృతంగా నిధులు సేకరిస్తూ ఉండగా అలీ సోదరులు, డా. అన్సారీ లతో పరిచయం అయింది.  1912లో ఈయన ఎం.హెచ్ కిద్వాయి ద్వారా ప్రభావితుడయ్యాడు.   ‘అంజుమన్ – ఇ   -ఖు ద్ధా o – ఇ – కాబా ను 1913 లో అలీ సోదరుల సహకారంతో ఏర్పాటు చేయడంలో పాలుపంచుకుని కిద్వాయ్ ఆధ్యాత్మిక శిష్యుడిగా మారాడు. ఈ అంజుమన్  సంస్థ కాబాలు,ఇతర ముస్లిం  ప్రార్థనా స్థలాలను పరిరక్షిస్తూ, ముస్లిమేతరుల ఆక్రమణ నుండి వాటిని రక్షిస్తూ ఉంటుంది. దీనిలో ప్రముఖులైన డాక్టర్ అన్సారీ, హకీమ్ అజ్మల్  ఖాన్, మౌలానా బారీ 1919లో  ‘జమియత్ ఉల్ ఉలామా  ఇ హింద్’ ను స్థాపించారు.  1921 నుండి ఈయన   సికేసీ వ్యవస్థాపక  సభ్యుడు. ఈయన హిందువులతో  కలిసుండడం ముస్లింల ప్రయోజనాలకు హానికరం అని భావించేవాడు. ( The Khilafat Movement in India, 1919-1924, Muhammad Qureshi, dissertation submitted to University of London, 1973, p.58)

 ఉలామాలు, పాశ్చాత్య ప్రభావితులైన ముస్లిమ్  నాయకులకు మధ్య మౌలానా బారీ వారధిగా పని చేశారు. ఉలేమాలు రాజకీయ  ప్రాబల్యం సాధించి  అధికారంలో  ఉన్న వారితో చేతులు కలిపినప్పుడే మతపరమైన ఆధిక్యతను చూడగలమని నమ్మేవాడు. అలా కానప్పుడు ఇస్లాం ఆధిక్యత ఒక కలగానే మిగిలిపోతుందని  భావించాడు. (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Qureshi, dissertation submitted to University of London, 1973, p.303)

మితవాదులు:
ఇప్పటి వరకూ చూసిన వివిధ సిద్ధాంతాల  నాయకులతో పాటు, ఒకే నమూనాకు సరిపోని కొద్దిమంది నాయకులు ఉన్నారు.  అటువంటి ‘మితవాదులు’(నాన్-కన్ఫార్మిస్ట్) నాయకులకు అద్భుతమైన ఉదాహరణ మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888-1958).

మక్కాలో అరబ్ తల్లికి  జన్మించిన అతను తన కలకత్తా ఇంటిలో, దారుస్-ఎ-నిజామియా ప్రకారంగాను, తరువాత  లక్నోలోని నద్వత్-ఉల్-ఉలామా వద్ద చదువుకున్నాడు.  సర్ సయ్యద్ అహ్మద్ రచనల ద్వారా మొదట్లో బాగా ప్రభావితమయ్యాడు.  అతను ఉర్దూ వార్తాపత్రికలు, లిసాన్-ఉస్-సాదిక్ (1904), అన్-నద్వా (1905-06), వకిల్ (1907), అల్-హిలాల్ (1912) మరియు అల్-బాలాగ్ (1913) వంటి పత్రికలను ప్రారంభించి సంపాదకుడిగా వ్యవహరించాడు.  ఆజాద్ 1913 లో ముస్లిం లీగ్‌లో చేరాడు, 1920 వరకు దాని సభ్యుడిగా కొనసాగాడు, అదే సమయంలో 1919 లో మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానితో కలిసి జామియత్-ఉల్-ఉలామా-ఇ-హింద్ (భారతదేశ ఉలామా అసోసియేషన్) ను సృష్టించడం వెనుక చోదక శక్తిగా ఉన్నాడు.  ఆజాద్ , ఖురాన్ ఆధారిత మత సంస్కరణ, ఉలామాల  రాజకీయ కార్యకలాపాలకు బలమైన ప్రతిపాదకుడు. ఆజాద్ అహంకారి.  అతను అలీ సోదరులతో ఎప్పుడూ కలవలేకపోయాడు.  అతని దృష్టిలో  షౌకత్ అలీ కి  తెలివితేటలు తక్కువగా ఉండగా, ముహమ్మద్ అలీని ప్రైవేట్ సంభాషణలో మున్షి (గుమస్తా) గా పిలిచేవాడు.

1923 లో, 35 సంవత్సరాల  పిన్న వయస్సులో, ఆజాద్  కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసి ప్రత్యేకత సాధించాడు.

అల్-హిలాల్‌లో అత్యధిక భాగం  టర్కీ నుండి వచ్చిన వార్తలకె కేటాయించేవారు. బాల్కన్ యుద్ధాల సమయంలో, ఆజాద్ వివిధ టర్కీ నాయకుల సద్గుణాలను ప్రశంసించాడు, టర్కి రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ నిధుల కోసం నిరంతరం విజ్ఞప్తి చేశాడు. ‘ఒట్టమన్ సామ్రాజ్యంలో పరిస్థితులు’ అనే ఒక వ్యాసం రాశాడు.  ఒక సంచికలో, ఆజాద్ స్పష్టంగా ఇలా అన్నాడు, “ఒట్టమన్ ఖలీఫ్ ఇస్లాం పవిత్ర స్థలాల సంరక్షకుడు,  టర్కీకి మద్దతు ఇస్లాంకు మద్దతుతో సమానం”.

ఆజాద్‌ హన్‌బాలికి చెందిన ఇకన్ తైమియా (1263-1328) ను తత్వవేత్త, గొప్ప హీరో గా భావించేవాడు మరియు చివరి వరకు అలాగే ఉన్నారు.  తన ప్రభావంతో, ఆజాద్ రాజకీయ జీవితంలో జిహాద్ ను, మేధో జీవితంలో ఇత్తేహాద్ ను సమర్థించాడు. (Ideological influences on Abul Kalam Azad, Qazi Jamshed, proceedings of the Indian History Congress, Vol. 71, 2010-2011, P. 665).

జమియత్-ఉల్- ఉలమా- ఇ-హింద్:
ఖిలాఫత్ ఉద్యమం నేపథ్యంలో జమియత్-ఉల్-ఉలామా-ఇ-హింద్ నవంబర్ 1919 లో స్థాపించబడింది.  ఇది వివిధ ఇస్లామిక్ ఆలోచనల,  సిద్ధాంతాలకు చెందిన ఉలామా సంస్థగా ప్రారంభమైంది, అయితే కాలక్రమేణా, ఇది దేవబంద్ ఉలామాల ఆలోచనలపై ఆధిపత్యం చెలాయించింది.  ఇప్పటికీ ఈ సంస్థను జాతీయవాద ముస్లిమ్ సంస్థగానూ, ఖిలాఫత్ ఉద్యమ అనుకూల సంస్థగా,  తరువాత కాలంలో పాకిస్తాన్ డిమాండ్ ను  వ్యతిరేకించిన ‘జాతీయవాద’ ముస్లిం సంస్థగా పరిగణిస్తారు.  సికెసి , జామియత్-ఉల్-ఉలామా-ఇ-హింద్ రెండింటిలో మౌలానా ఆజాద్  కీలక సభ్యులుగా వ్యవహరించారు.  ఈ సంస్థ రాజ్యాంగంలో  దాని లక్ష్యాలు, ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి,
 • 1. ఇస్లాం అనుచరులను రాజకీయ మరియు రాజకీయేతర విషయాలలో మతపరమైన కోణం నుండి మార్గనిర్దేశం చేయడం.
 • 2. షరియత్ ను అనుసరించి, ఇస్లాం, ఇస్లాం కేంద్రాలు (జాజిరత్-ఉల్-అరబ్, ఖిలాఫత్ స్థానం), ఇస్లామిక్ ఆచారాలు, ఇస్లామిక్ జాతీయవాదం వీటన్నిటి రక్షణ కోసం పనిచేయడం
 • 3. ముస్లింల సాధారణ మత హక్కులు, జాతీయ హక్కులను సాధించడం, రక్షించడం.
 • 4. ఉలేమాలు అందరినీ ఐక్యం చేసి ఒకే వేదికపైకి తీసుకురావడం
 • 5. ముస్లిం సమాజాన్ని నైతికంగాను, సామాజికంగాను సంస్కరించి వారి అభివృధి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం.
 • 6. షరియాత్-ఇ-ఇస్లామియా అనుమతించిన మేరకు దేశంలోని ముస్లిమేతరులతో మంచి, స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడం.
 • 7. షరియత్ లక్ష్యాల ప్రకారం దేశం, మతపు స్వేచ్ఛ కోసం పోరాడటం.
 • 8. సమాజంలోని మతపరమైన అవసరాలను తీర్చడానికి ‘మహాకిమ్ –ఐ-షరియా’ (మత న్యాయస్థానాలు) ఏర్పాటు చేయడం
 • 9. ఇస్లాంను ప్రచారం చేయడానికి, భారతదేశం, ఇతర దేశాలలోమిషనరీ కార్యకలాపాలు నిర్వహించటం
 • 10. ఇస్లాంలో చెప్పినట్లు ఇతరదేశాల ముస్లింలతో ఐక్యత, సోదర సంబంధాలను కొనసాగించడం, బలోపేతం చేయడం.
మొత్తం మీద వివిధ సంస్ధల నేపథ్యం కలిగిన నాయకులు , ఖిలాఫత్  ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ప్రధానంగా వారి వ్యక్తిగత, ఇస్లాం, ముస్లిం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పని చేశారు. వీరి అభిప్రాయంలో దేశం కంటే ఇస్లాం ప్రయోజనాలే ముఖ్య మైనవి.  భారతదేశానికి స్వేచ్ఛ లేదా స్వపరిపాలన వారు  పెద్దగా పట్టించుకోలేదు, వారికి  టర్కీ ఖలీఫా  ప్రతిష్ట ముఖ్యమైనది.  హిందువులతో కలిసి ఉండడం, సహకారం వారి  ఇస్లామిక్ లక్ష్యాలను సాధించడానికి ఒక సాధనం.

అలీఘర్ ఉద్యమంతో సంబంధం ఉన్న బ్రిటీష్ విద్యావేత్త థియోడర్ మోరిసన్ (1863-1963) భారతదేశంలోని ముస్లింల గురించి ఇలా అన్నారు, “ వారిలోని జాతీయత ఎలాంటిదంటే ఇక్కడి ఇతర సిక్కులు, బెంగాలీలు ఇంకా ఈ భూమిని పంచుకుంటున్న ఇతర మతాలలో కలవరు., కానీ  వారి సహ-మతవాదులు, వారు ఎక్కడ దొరికినా, అది అరేబియా లేదా పర్షియాలో లేదా భారతదేశ సరిహద్దుల్లో ఉండవచ్చు, వారితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారు.’’ (Roots of Islamic Separatism in India Subcontinent, Om Prakash, Proceedings of the Indian History Congress, Vol. 64, 2003, P. 1053)

ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్ధించిన ముస్లిం నాయకుల ధోరణిని మోరిసన్ చక్కగా వివరించారు.
ఆ కాలానికి చెందిన ఇద్దరు కథానాయకులు ఇంకా ప్రస్తావించలేదు – ఇద్దరూ తరువాత తమతమ దేశాల ‘జాతిపిత’ లుగా పిలువబడ్డారు.  వారు మహాత్మా గాంధీ మరియు ముహమ్మద్ అలీ జిన్నా.
(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు) 

NOTE: “ఖిలాఫత్ ఉద్యమ అసలు చరిత్ర”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:

__విశ్వ సంవాద కేంద్రము

23, సెప్టెంబర్ 2020, బుధవారం

ఖిలాఫత్ ఉద్యమం: ముందు వందేళ్లు - Khilafat Movement: Hundreds of years ago

Khilafat Movement: Hundreds of years ago

– డా. శ్రీరంగ గోడ్బోలే
మొదటి ఇస్లాం దురాక్రమణదారుడు భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి సాగిన చరిత్రను పరిశీలిస్తే ఖిలాఫత్ ఉద్యమం (1919-11924) అనివార్యమైనదని మనకు అర్ధమవుతుంది. ఆధునిక కాలంలో సూఫీలు, ఉలామా, మధ్యతరగతి ముస్లిం మేధావులు, ముస్లిం పత్రికలు, సాధారణ ముస్లింలలో టర్కీ ఒట్టమాన్ ఖలీఫా పట్ల వ్యామోహం, నిష్ట 1830 నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చును. ఖిలాఫత్ ఉద్యమానికి బీజాలు వందఏళ్ల ముందే పడ్డాయి. 1857 తిరుగుబాటు ఇస్లాం ఉద్యమానికి ప్రారంభమైనా 18వ శతాబ్దంలోనే దానికి సైద్ధాంతికమైన పునాది పడింది. 1857 పోరాటాన్ని ప్రధమ స్వాతంతంత్ర్య సంగ్రామం అన్నప్పటికీ ఆ పోరాటం విజయవంతమై బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం వదిలిపోతే అప్పుడు పాలకులు ఎవరవుతారన్న ప్రశ్నకు ముస్లింల దగ్గర స్పష్టమైన సమాధానం ఉంది. బ్రిటిష్ పాలన దార్ – ఉల్ – హర్బ్ (యుద్ధానికి మూలం; ఇస్లాం ప్రధాన మతంకాని భూమి). అది దార్ – ఉల్ – ఇస్లాం (ఇస్లాం మూలస్థానం; ఇస్లాం ప్రధాన మతమైన భూమి)కు పెద్ద అడ్డంకి. ముస్లిం రాజ్యాన్ని, పాలనను పునరుద్ధరించడమే ముస్లింలందరి అంతిమ లక్ష్యం.

1857 తిరుగుబాటు వెనుక ఉన్న జిహాదీ లక్షణం, దానికి ఖిలాఫత్ ఉద్యమంతో ఉన్న సంబంధాన్ని డా.అంబేడ్కర్ ఇలా వివరించారు – “1857 తిరుగుబాటును అధ్యయనం చేస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి అది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగించిన జిహాద్. భారత్ లో బ్రిటిష్ పాలన మూలంగా ఏర్పడిన దార్ – ఉల్ – హర్బ్ కు వ్యతిరేకంగా ముస్లింలు తిరుగుబాటు చేయాలంటూ సయ్యద్ అహ్మద్ వంటివారు కొన్ని దశాబ్దాలుగా ఇచ్చిన పిలుపుకు అది పర్యవసానమని అర్ధమవుతుంది. భారత్ ను తిరిగి దార్ – ఉల్ – ఇస్లాంగా మార్చడానికి ముస్లింలు చేసిన ప్రయత్నమే ఆ తిరుగుబాటు. ఆ ప్రయత్నపు తాజా ఉదాహరణ 1919లో భారత్ పై ఆఫ్ఘనిస్తాన్ దాడి. ఖిలాఫత్ ను సమర్ధించిన ముస్లింలు భారత్ లో బ్రిటిష్ పాలనను తొలగించేందుకు ఆఫ్ఘనిస్తాన్ సహాయాన్ని కోరారు. దాని కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది.’’(Pakistan or partition of India, B.R. Ambedkar, Thacker and company Limited, 1945, PP. 288)

1857కు ముందు ప్రపంచ ఇస్లాం ఉద్యమం (pan Islam Movement)
భారత్ లో ముస్లింపాలన అంతమయిన తరువాత మళ్ళీ ప్రపంచ ఇస్లాం అనే వాదాన్ని వినిపించినవాడు షా వలీయుల్లా(1703-62). ఖిలాఫత్ ను స్థాపించడం, జిహాద్ లేదా అవిశ్వాసులపై పవిత్ర యుద్ధాన్ని చేయడం  అనే కర్తవ్యం ఎంత ముఖ్యమో మళ్ళీ ముస్లింలకు గుర్తుచేశాడు. భారత్ లో భౌతికమైన అధికారాన్ని, ప్రబల్యాన్ని ముస్లింలు కోల్పోయిన తరుణంలో ఇస్లాంను పరిరక్షించేందుకు 19వ శతాబ్దంలో అనేకమంది ముస్లిం పండితులను తయారుచేశాడు వలీయుల్లా. ముస్లిమేతరులతో ఎంత తక్కువగా కలిస్తే అప్పుడు భారతీయ ముస్లింలు అంత ఎక్కువగా భగవంతుని సేవకులు అవుతారని బోధించాడు.(The Muslims of British India, P. Hardy, Cambridge University Press, 1972, PP. 29, 30). 1857 తిరుగుబాటులోగానీ, ఖిలాఫత్ ఉద్యమంలోగానీ హిందువుల సహాయం తీసుకోవడానికి కారణం వారంటే స్నేహం, అభిమానం కాదు. కేవలం అవసరం మాత్రమే.

ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేసినవారిలో మరొక ముఖ్యుడు సయ్యద్ అహ్మద్ బరేల్వీ(1786-1831). ఇతడు ఒకప్పటి పిండారీ (దారిదోపిడిదారుడు). ఇతనికి సూఫీల మద్దతు బాగా ఉంది. ఇతను మహారాజా రంజిత్ సింగ్ కు వ్యతిరేకంగా 1826లో జిహాద్ ప్రారంభించాడు. జనవరి, 1827లో ఇతను ఇమామ్ అయ్యాడు. అలాగే ఇతని పట్ల `బైయ’(విధేయత ప్రకటించడం; ఈ పద్దతి ప్రవక్త మహ్మద్ ప్రారంభించాడు) ప్రకటించారు. హిందువుల పవిత్ర స్థలాలకు వెళ్ళడం, హిందువుల పవిత్ర ఉత్సవాల్లో పాల్గొనడం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులను సంప్రదించడం వంటివాటికి దూరంగా ఉండాలని ముస్లింలను ఆదేశించాడు. ఇతని అనుచరులు ఎప్పటికైనా బ్రిటిష్ పాలనను అంతంచేయడానికి ప్రయత్నిస్తారని బ్రిటిష్ వాళ్ళు అప్పుడే ఊహించారు (Hardy, The Muslims of British India, PP. 53-54).

ప్రపంచ ఇస్లాం సిద్ధాంతంలో ముఖ్యమైన అంశం ముస్లిమేతరులను పక్కన పెట్టడం లేదా ముస్లింలపై వారి ప్రభావాన్ని పూర్తిగా తొలగించడం. సయ్యద్ అహ్మద్ బరేల్వికి సమకాలికుడైన హాజీ షరియత్ – అల్లా (1781-1840) బెంగాల్ లో ఫరైజీ ఉద్యమాన్ని (1821) ప్రారంభించాడు. ఖురాన్ లో చెప్పిన ముస్లింల మత కర్తవ్యాల (ఫరైజ్) నుంచి ఈ ఉద్యమానికి ఆ పేరు వచ్చింది. కుఫ్ర్ (అవిశ్వాసం), బిద్దా(సృజనాత్మకత)ను నిరాకరించడం ఆ పవిత్ర మత కర్తవ్యాల్లో ప్రధానమైనవి. హాజీ కుమారుడు దూదూ మియాన్(1819-1862) ఈ ఫరైజీల సైన్యాన్ని తయారుచేశాడు. బెంగాల్ లో టీటూ మీర్ (1782 – 1831)మరొక హింసాత్మక ఇస్లాం పునరుద్ధరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. దాని ప్రకారం ముస్లింలు గడ్డాలు పెంచడమేకాక, విలక్షణంగా ధోతి కట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. కానీ బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని పంపి ఆ ఉద్యమాన్ని అణచివేశారు. (Hardy, The Muslims of British India, PP. 55-59). ఈ ప్రపంచ ఇస్లాం ఉద్యమాలు లేదా మతమౌఢ్య ఉద్యమాలన్నీ భారతీయ ముస్లింలను వారు ఇస్లాం స్వీకరించకముందు అనుసరించిన హిందూ ఆచారాలు, పద్దతుల నుంచి బలవంతంగా దూరం చేయడానికి ప్రయత్నించాయి. అప్పటి వరకు తప్పనిసరి పరిస్థితుల్లో మతం మారినప్పటికీ భారతీయ ముస్లింలు తమ పాత హిందూ ఆచారాలనే అనుసరిస్తూ ఉన్నారు.

ముస్లింలు మతమౌఢ్యం కలిగిన, ఇతరులతో ఏమాత్రం కలవని వర్గమని బ్రిటిష్ వాళ్ళు గ్రహించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆఫ్ఘనిస్తాన్ ఎమిరేట్ ల మధ్య 1838లో జరిగిన మొదటి ఆఫ్ఘన్ యుద్ధంతో బ్రిటిష్ వారికి, వహాబీ ముస్లింలకు మధ్య ఘర్షణ మొదలైంది. వాయువ్య ప్రాంతంలో ఉన్న వహాబీలు ఆఫ్ఘన్ ల వైపు పోరాడటమేకాక అక్కడ ఉన్న బ్రిటిష్ సైన్యంలోని సిపాయిలను కూడా ఆఫ్ఘన్ ల వైపుకు మార్చారని ఆరోపణలు వచ్చాయి (The Wahabis in the 1857 Revolt: A Brief Re – appraisal of their role, Iqtibar Alam Khan, Social Scientist, Vol. 41, May-June 2013, P. 17).

1857 జిహాద్
1857 తిరుగుబాటు గురించి హిందువులు, ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళ అభిప్రాయాలు, ధోరణుల గురించి చరిత్రకారుడు థామస్ మెట్ కాఫ్ ఇలా వ్రాశాడు – “తమ కుల(మత) ఆచారాలపై దాడి జరుగుతుందనే భయంతో హిందువులలో మొదటగా బ్రిటిష్ వారిపట్ల అసంతృప్తి వెళ్లడయింది. కానీ ఆ తరువాత ఆ అసంతృప్తి సెగలను మరింత పెంచి,  వ్యాపింపచేయడంలో ముస్లింలు ముందున్నారు. ఈ మతపరమైన అసంతృప్తి ద్వారా తాము కోల్పోయిన రాజకీయాధికారం తిరిగి పొందవచ్చని వారికి అనిపించింది. మరోవైపు బ్రిటిష్ వాళ్ళు ఈ సిపాయి తిరుగుబాటును రాజకీయ కుట్రగా మలచినది ముస్లిం నాయకత్వమేనని, తద్వారా బ్రిటిష్ పాలనను అంతంచేయాలని ముస్లింలు భావించారని అనుకున్నారు’’(The Aftermath of Revolt: India 1857 – 1870, Princeton, 1965, P. 298).

ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీల్లో ఉన్న బెంగాల్ సైనిక దళాలు 1857 మే, జూన్ లలో తిరుగుబాటు చేసినప్పుడు స్థానిక ముస్లింలలోని జిహాదీలు కూడా ఆయుధాలతో వారిని కలిశారు. గ్వాలియర్ వంటి చోట్ల ముస్లిము సిపాయిలే నాయకత్వం వహించారు. అలహాబాద్, లక్నో, గ్వాలియర్ లలో పాల్గొన్న సాయుధ జిహాదీలు వహాబీ ఉద్యమానికి చెందినవారు కారు. వాళ్ళు సూఫీలు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందువులతో కలిసి సాయుధ పోరాటం చేయడం పట్ల వహాబీ నేతలకు అనేక సందేహాలు ఉన్న కారణంగా వాళ్ళు మొదట్లో అంతగా చొరవ చూపించలేదు. (Iqtidar Alam Khan, The Wahabis in the 1857 Revolt: A Brief Re – appraisal of their role, pp. 18,19)

11 మే, 1857 ఢిల్లీ తిరుగుబాటుదారుల వశం అయిన తరువాత నామమాత్రపు మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ తిరుగుబాటు దళాలకు ప్రధాన సైనికాధికారిగా బఖ్త్ ఖాన్ (మరణం 1859)ను నియమించాడు. 100మంది జిహాదీలతో బఖ్త్ ఖాన్ ఢిల్లీకి వచ్చాడు. ఈ బఖ్త్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన రుహేల ఆఫ్ఘన్ ల మద్దతుదారుడు. వీళ్ళు అమీర్-ఉల్-ముజాహిదీన్ మౌలానా సర్ఫ్రాజ్ అలీ నేతృత్వంలో పనిచేసేవారు. వీళ్ళు హాన్సీ, హిస్సార్, భోపాల్, టోంక్ ల గుండా ఢిల్లీకి వచ్చారు. (Bakht Khan : A leading sepoy General of 1857, Iqbal Hussain, హిస్టరీ కాంగ్రెస్ పత్రాలు, సం. 46, 1985, పుట. 376). హిందూ, ముస్లిం ఐకమత్యం గురించి ముస్లిం నాయకుల్లో ఎలాంటి భ్రమలు లేవని మౌల్వీ మహమ్మద్ సైద్ మొగలు చక్రవర్తి బహదూర్ షా జఫర్ కు వ్రాసిన పత్రంలో స్పష్టమవుతుంది. 20 మే, 1857 వ్రాసిన ఆ పత్రంలో “హిందువులకు వ్యతిరేకంగా సాధారణ ముస్లింల మనస్సుల్లో సంసిద్ధతను కలిగించేందుకు పవిత్ర యుద్ధం ప్రారంభమయింది’’అని స్పష్టం చేశాడు. 1857 జూన్ 14న పంజాబ్ ప్రధాన కమిషనర్ లారెన్స్ కు వ్రాసిన లేఖలో మేజర్ జనరల్ టి. రీడ్ “వాళ్ళు ఆకుపచ్చ జెండాలను నగరంలో ఎగురవేసి హిందువులను రెచ్చగొడుతున్నారు’’అని తెలిపాడు. వారణాసిలో 1857 జూన్, 4న వెలువడిన అధికారిక రిపోర్ట్ “కొందరు ముస్లింలు విశ్వేశ్వర మందిరంలో ఆకుపచ్చ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి’’అని పేర్కొంది. (The sepoy Mutiny and the Revolt of 1857, R. C. Mujumdar, Firma KLM, 1957, p. 230)

1857 తిరుగుబాటులో పాల్గొన్న ముస్లిం జిహాదీవాదులకు ప్రపంచ ఇస్లాం సిద్ధాంతంతో సంబంధాలను ఇక్కడ పరిశీలించాలి. 1857 జిహాద్ లో ప్రముఖ పాత్ర పోషించిన సయ్యద్ ఫద్ల్ ఆలావి, రహమతుల్లా కైరాన్వి, హాజీ ఇమ్దాదుల్లా మక్కీ, నవాబ్ సిద్దిక్ హాసన్ ఖాన్, మౌలానా జాఫర్ తనెశ్రీ వంటివారు విచారణను తప్పించుకునేందుకు ఇతర దేశాలకు పారిపోయారు. వాళ్ళు ప్రపంచ ఇస్లాం ప్రచారానికి అన్ని రవాణా, సమాచార వ్యవస్థలను, మార్గాలను ఉపయోగించుకున్నారు. వాళ్ళు మక్కా, కైరో, కాన్ స్టాంటిన్ నోపుల్ కు తరచూ వెళ్లివచ్చేవారు. (Fugitive Mullahs and Outlawed Fanatics ; Indian Muslims in Nineteenth Century trans – Asiatic Imperial Rivalries, Seema Alavi, Modern Asian Studies, vol. 45, November 2011, PP. 1337-1382;)(Muslim Cosmopolitanism in the age of Empire, Harvard University Press, 2015).

రౌలత్ కమిటీ నివేదిక
తమ పాలనను తొలగించి ముస్లింలు అధికారం చేజిక్కించుకోవాలనుకోవడం బ్రిటిష్ వారికి మింగుడు పడలేదు. రౌలత్ కమిటీ నివేదికగా పేరుపడిన కుట్ర విచారణ కమిటీ నివేదిక (1918) `భారత్ లో తిరుగుబాటు ఉద్యమంతో సంబంధం కలిగిన నేరపూరిత కుట్రల స్వరూపం’ ఏమిటన్నదానిపై దృష్టి సారించింది. 226 పేజీల నివేదికలో `మహమ్మదీయ ధోరణి’అనే భాగం కూడా ఉంది. ఆ నివేదికలోని ముఖ్యమైన అంశాలు కొన్ని చూద్దాం –
క్రిమియా యుద్ధం నాటి నుంచి భారతీయ ముస్లింలలో టర్కీ పట్ల సానుభూతి, ఆదరణ పెరిగాయి.
మతమౌఢ్యులైన ముస్లింలతో కూడిన చిన్న సమూహం బ్రిటిష్ పాలనను తొలగించి ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలని భావిస్తోంది.

`సిల్క్ లేఖలు’ అనే ఒక ఉద్యమ ప్రణాళిక బయటపడింది.  వాయువ్య ప్రాంతంపై దాడి చేసి, అదే సమయంలో దేశంలో ముస్లిం తిరుగుబాటు తేవాలన్నది ఆ ఉద్యమ లక్ష్యం.

సిక్కు మతం నుంచి ఇస్లాం మతానికి మారిన మౌల్వీ ఒబేదుల్లా 1915లో అబ్దుల్లా, ఫతే మహమ్మద్, మహమ్మద్ అలీ అనే తన ముగ్గురు సహచరులతో కలిసి వాయువ్య సరిహద్దును దాటి ముందుకు వెళ్ళాడు. దేవబందీ మౌల్వీల ద్వారా ఇస్లాం అనుకూల, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించాలన్నది అతని ఆలోచన.

ఒబేదుల్లా టర్క్-జర్మనీ ఉద్యమకారులను కలిశాడు. మౌల్వీ మహమ్మద్ మియాన్ అన్సారీ 1916లో భారత్ కు తిరిగివచ్చాడు. హెద్జాజ్ టర్కీ సైనిక గవర్నర్ అయిన గాలిబ్ పాషా ద్వారా జిహాద్ ప్రకటన చేయించాడు.

భారత్ నుంచి దేవుని సైనికులను తయారుచేసి ఇస్లాం రాజ్యాల మధ్య సమన్వయాన్ని తేవాలన్నది ప్రణాళిక. ఈ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం మదీనా అయితే కాన్ స్టాంటిన్ నోపుల్, టెహరాన్, కాబూల్ లలో స్థానిక కేంద్రాలు ఉంటాయి.

విదేశాల్లో ఉన్న భారతీయ ముస్లింల పాత్ర
విదేశాల్లో, ముఖ్యంగా లండన్ లో, నివశిస్తున్న భారతీయ ముస్లింలు ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని, భావాన్ని వ్యాప్తిచేయడంలో ముఖ్యమైన పాత్రే పోషించారు. 1886లో లండన్ లో అంజుమన్ – ఈ – ఇస్లాం అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ శాఖలు భారత్ లో కూడా ఏర్పాటుచేశారు. అయితే ఆ తరువాత ఎలాంటి కార్యకలాపాలు లేకుండా మిగిలిపోయిన ఈ సంస్థను 1903లో అబ్దుల్లా అల్- మామూన్ సుహ్రావర్దీ(1875 – 1935) అనే బారిస్టర్ `పాన్ ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ లండన్’ పేరుతో పునరుద్ధరించాడు. ఈ సంస్థ టర్కీతో నేరుగా సంబంధాలను ఏర్పరచుకోవడమేకాక `పాన్ ఇస్లాం’ అనే పత్రిక ద్వారా ఇస్లాం, టర్కీ లను ప్రభావితం చేసే అంశాలపై ముస్లింలలో అవగాహన కలిగించింది.

సెప్టెంబర్ 1911లో బ్రిటిష్, ఫ్రెంచ్ సేనలతో కలిసి ఇటలీ ఒట్టమన్ ట్రిపోలి పై దాడి చేసినప్పుడు భారతీయ ముస్లింలలో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమయ్యాయి. టర్కీకి సహాయంగా స్వచ్ఛంద కార్యకర్తలను పంపుతామంటూ లండన్ ముస్లిం లీగ్ హెచ్చరించింది కూడా. ట్రిపోలి వాసులకు వైద్య సహాయం అందించడానికి రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రారంభమైంది. లాహోర్ నుంచి మద్రాస్ వరకు షియాలు, సున్నీలు అనే తేడా లేకుండా అంతా సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. సున్నీలకు కృతజ్ఞతాపూర్వకంగా ఉత్తర పర్షియాలో రష్యా ఆక్రమణ, ఇరాన్ లోని మెషెడ్ లో ఇమామ్ అలీ రజా మందిరపు కూల్చివేతలను షియాలు వ్యతిరేకించారు. (The Khilafat movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to university of London, 1973, P. 19-23).

అలజడి మొదలైంది
1912 లో బాల్కన్ రాజ్యాలన్నీ మూకుమ్మడిగా టర్కీ పై దాడి చేసినప్పుడు భారతీయ ముస్లింలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉలేమాలంతా తమ విభేదాలను పక్కన పెట్టి ఏకమయ్యారు. మతగురువు, కవి అయిన శిబ్లీ నుమాని `ఇస్లాం ప్రమాదంలో ఉంది’ అంటూ నినదించాడు. అతని యువ శిష్యుడైన అబుల్ కలాం ఆజాద్ జిహాద్ కు సమయం ఆసన్నమయిందంటూ పిలుపునిచ్చాడు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన జర్నలిస్ట్ షౌకత్ అలీ (1875-1958) స్వచ్ఛంద కార్యకర్తలను సమీకరించుకోవాలని `కామ్రేడ్’ అనే పత్రికలో వ్రాశాడు. అతని అన్నగారు, కామ్రేడ్ పత్రిక సంపాదకుడు అయిన మహమ్మద్ అలీ (1878-1951) అలీఘర్ విశ్వవిద్యాలయం కోసం సేకరించిన నిధులు టర్కీకి అందించాలని సలహా ఇచ్చాడు. డా. ముఖ్తార్ అహ్మద్ అన్సారీ(1880-11956) నేతృత్వంలో ఒక అఖిల భారత వైద్య బృందం డిసెంబర్ 1912లో  కాన్ స్టాంటిన్ నోపుల్ చేరుకుంది. ఆ బృందం యువ టర్కీ నాయకులనేకాక ఈజిప్ట్ జాతీయవాదులను కూడా కలుసుకుంది. మసడోనియా ముస్లిం శరణార్ధుల కోసం అనటోలియాలో ఒక పునరావాస కాలనీ, మదీనాలో ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇస్లాం బ్యాంక్, సహకార సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రణాళికను కామ్రేడ్ పత్రిక గట్టిగా సమర్ధించడమేకాక టర్కీ సెక్యూరిటీ బాండ్ లను కొనడం ద్వారా నిధులు అందించాలని భారతీయ ముస్లింలను ప్రోత్సహించింది.
భారత్ లో ప్రపంచ ఇస్లాం ఉద్యమపు ప్రధానమైన  పరిణామం 1913 మే లో అంజుమన్ – ఈ – ఖుద్దమ్ – ఈ – కాబా (కాబా సేవకుల సంఘం) ఏర్పాటు. ఈ సంఘానికి లక్నో ఫిరంగి మహల్ మతకేంద్ర అలీమ్ అయిన మౌలానా అబ్దుల్ బారి (1879-111926) అధ్యక్షుడు కాగా, ఎం. హెచ్. హుస్సేన్ కిద్వాయి, అలీ సోదరులు ట్రస్టీలు. వీళ్ళు రెండు దశల ప్రణాళికను రూపొందించారు. మొదటిది, ముస్లిమేతర దాడి ఏదైనా, దానికి వ్యతిరేకంగా ముస్లిం ప్రదర్శనలు నిర్వహించడం. రెండవది, ముస్లిం పవిత్ర స్థలాలను పరిరక్షించే విధంగా టర్కీ ఒక స్వతంత్ర, సార్వభౌమ ముస్లిం రాజ్యంగా పటిష్టవంతమయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించడం.

అలాగే భారతీయ ముస్లింలలో అలజడి రేపేందుకు టర్కీ నుంచి సంపన్నులైన కొందరు ఇక్కడకు వచ్చారన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. భారతీయ ముస్లింలకు అందజేయడం కోసం టర్కీ ప్రభుత్వం తుపాకులు కొనుగోలు చేయాలని కూడా అనుకుందని, అందుకు హాంబర్గ్ లోని ఒక జర్మన్ కంపెనీతో చర్చలు కూడా జరిపిందని వార్త. (Qureshi, The Khilafat movement in India, 1919-1924, p. 22-29).

సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే 1914 జులైలో సెర్బియా, ఆస్ట్రియాల మధ్య ఘర్షణ మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది.

సశేషం.. 

(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)

21, సెప్టెంబర్ 2020, సోమవారం

ఖిలాఫత్ ఉద్యమం : మతగ్రంధం, చారిత్రక సంఘటనలు - Khilafat Movement: Religious Scripture, Historical Events

Khilafat Movement: Religious Scripture, Historical Events - ఖిలాఫత్
రచన – డా. శ్రీరంగ గోడ్బోలె

త నిష్ట కలిగిన ముస్లింకు స్వీయ వివేకం కంటే మతసూత్రాలే ఎక్కువ. ఇస్లాం మత సూత్రాలకు ప్రధానంగా మూడు ఆధారాలు ఉన్నాయి. అవి- ఖురాన్, హదీస్ (మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాలు లేదా ఆచరించిన పద్దతులు), సిరా(మహమ్మద్ ప్రవక్త జీవితచరిత్ర) లేదా సున్నా (మహమ్మద్ ప్రవక్త సంప్రదాయం లేదా అనుసరించిన మార్గం). వ్యక్తిగత స్థాయిలోనైనా, సామాజికంగానైనా ఏదైనా ఆలోచన, చర్య నైతికమైనవి, చట్టబద్దమైనవి అవునా, కాదా అన్నది మతగ్రంధమే నిర్ధారిస్తుంది. నిజాయితీ, న్యాయం, మంచితనం, వివేకం, పవిత్రత మొదలైనవాటిని మతగ్రంధమే నిర్వచిస్తుంది, వివరిస్తుంది. ఆ నిర్వచనం, వివరణ ప్రపంచపు ప్రమాణాలకు తగినట్లుగా ఉంటుందని ఏమి లేదు. కొన్నిసార్లు విరుద్ధంగా కూడా ఉండవచ్చును. ఉమ్మా(ముస్లిం వర్గం) ఏ జాతీయతకూ పరిమితమైనది కాదు. ఎందుకంటే ముస్లిం సమూహాన్ని భౌగోళికమైన సరిహద్దుల ఆధారంగా విభజించడాన్ని ఇస్లాం తీవ్రంగా నిరసిస్తుంది. ఏ జాతీయతకు పరిమితంకాని ధోరణి `ప్రపంచ ఇస్లాం’ అనే రాజకీయ ఉద్యమంగా ఎలా రూపొందిందో గుర్తించడం అంత కష్టమైన పనేమీకాదు. ఆరేళ్లపాటు భారతీయ ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమాన్ని సాగించారంటే దానికి మతపరమైన సమ్మతి తప్పకుండా ఉందని మనం గ్రహించాలి. ఇలాంటి మతపరమైన అంగీకారం, సమ్మతి ఉన్నదంటే ఇలాంటి ఖిలాఫత్ ఉద్యమాలు ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని కూడా గుర్తించాలి.

ఇక్కడ `ప్రపంచ ఇస్లాం’(Pan Islam) గురించి రెండు మాటలు. ఈ పదాన్ని మొట్టమొదటసారిగా ఫ్రాంజ్ వాన్ వెర్నర్ (మురాద్ ఎఫన్దీ) తన టర్కీ ప్రణాళికలు (జర్మన్ భాషలో టర్కిస్కోస్కిజెన్), 1877 అనే పుస్తకంలో వాడాడు. ఆ తరువాత ఫ్రాన్స్ కు చెందిన జర్నలిస్ట్ గాబ్రియల్ చార్మెస్ 1881లో ఈ పదాన్ని ఉపయోగించాడు. ఈ పదానికి ఇస్లాంలో సమానార్ధం కలిగిన పదాలు ఇత్తిహాద్ – ఇ – ఇస్లాం, ఇత్తిహాద్ – ఇ – దిన్, ఉహువ్ వెట్ – ఇ – దిన్. వీటిని ఒట్టమాన్ లు, భారత్ లో ముస్లిం పాలకులు, మధ్యాసియా, ఇండోనేషియా పాలకులు తమ ఉత్తరప్రత్యుత్తరాలలో ఉపయోగించేవారు.(లండన్ విశ్వవిద్యాలయానికి మహమ్మద్ నయీమ్ ఖురేషీ సమర్పించిన The Khilafat Movement in India, 1919-1924, అనే పరిశోధన వ్యాసం, పుట. 6). ప్రపంచ ఇస్లాం అనే మాట తరువాత వచ్చినదే అయినా దానికి ఆధారం మాత్రం `ఈ మన ఉమ్మా అంతా ఒకటే. నేనే మీ సంరక్షకుడిని, భగవంతుడిని. కాబట్టి నాకు తప్ప మీరు మరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు’(23:52) అనే ఖురాన్ సందేశంలో కనిపిస్తుంది.

ఇస్లాం చరిత్రలో ఖిలాఫత్
ఉప పాలకుడు లేదా తరువాతి పాలకుడిని ఖలీఫా (వారసుడు, బహువచనం: ఖులాఫా)అని ఖురాన్ 2.30. 4.59.  6.165, 35.39, 38.26 సురాలలో పేర్కొంది. మొట్టమొదటి ముస్లిం పాలకుడు ప్రవక్త మహమ్మద్(570-632). మహమ్మద్ దివ్య సందేశాలను ఇవ్వడం క్రి.శ 610లో ప్రారంభించినా క్రి.శ. 622లో మదీనా పాలకుడు అయ్యాడు. అలా పదేళ్లపాటు ప్రవక్త, పాలకుడు, సైనికాధికారి, న్యాయనిపుణుడు, న్యాయమూర్తిగా అనేక పాత్రలు పోషించాడు. ఖురాన్, ప్రవక్త మహమ్మద్ లు ఖలీఫా కంటే ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇస్లాం ప్రకారం ప్రవక్త మహమ్మద్ ప్రవక్తలందరిలో ఉన్నతుడు(ఖురాన్ 33:40). అలాగే భగవంతుని సందేశకుడిగా అతని స్థానాన్ని ఇంక ఎవరు తీసుకోలేరు. అయితే పాలకుడిగా ఆయన స్థానాన్ని మరెవరైనా తీసుకోవచ్చని ఖురాన్ చెపుతోంది. `ఓ విశ్వాసులరా! దేవుడికి, అతని ప్రవక్తకు, మీలో (పాలన)అధికారం పొందినవారికి విధేయులై ఉండండి’(4:59) అని ఖురాన్ చెప్పింది. హదీస్ కూడా పాలకుడిపట్ల చూపవలసిన విధేయత గురించి అనేక చోట్ల చెప్పింది. `ఎవరైతే భూమిపై అల్లా పాలకుడిని అగౌరవపరుస్తాడో అలాంటివారిని అల్లా కించపరుస్తాడు’ (తిర్మిజీ, అల్ – హదిత్, మిష్కట్ – ఉల్ – మసబి అనువాదం, సంపుటం; 2, ఇస్లామిక్ బుక్ సర్వీస్, ఢిల్లీ, పుట. 560).

 మొదటి ఖలీఫా అయిన అబూ బకర్ ను ఖలీఫతు రసూల్ అల్ – అల్లా (అల్లా సందేశకుడి వారసుడు)అని అన్నారు. మొదటి నలుగురు ఖులాఫా(ఖలీఫా ఏకవచనం; ఖులాఫా బహువచనం)అబూ బకర్(632-634), ఉమర్(634-644), ఉథ్మన్(ఉస్మాన్, ఒట్టమాన్ 644-656), అలీ(656-661)లును ఖులాఫా రషిదున్(సరైన మార్గంలో నడిచే ఖులాఫా)అని సున్నీ ముస్లిములు పిలుస్తారు. ఈ నలుగురూ ప్రవక్త మహమ్మద్ హాషిమైట్ తెగతో పాటు ఇతర తెగలు ఉన్న ఖురాయిష్ వర్గానికి చెందినవారు. వీరి కాలంలో ముస్లిం సైన్యం సస్సానీద్ రాజ్యాన్ని ఓడించింది. బైజాంటిన్ సామ్రాజ్యాన్ని సగానికి పైగా తగ్గించి, దాదాపు నాశనం చేసింది. దక్షిణ, మధ్యాసియాల్లో ఇస్లాం సామ్రాజ్యాన్ని విస్తరించింది. మొదటి నలుగురు ఖలీఫాల కాలాన్ని ఇస్లాం స్వర్ణయుగంగా పరిగణిస్తారు. అయితే విచిత్రంగా ఈ స్వర్ణయుగంలోనే ఈ నలుగురు ఖలీఫాల్లో ముగ్గురు హత్యకు గురయ్యారు. అలీ తరువాత ఖిలాఫత్ ఉథ్మన్ తెగకు చెందిన ఉమయ్యద్ ల చేతిలోకి వెళ్లింది. వాళ్ళు 90 ఏళ్లపాటు ఖలీఫాలుగా వ్యవహరించారు. ఆ తరువాత క్రీ.శ. 750లో ఉమయ్యద్ లను తొలగించి అబ్బాసిద్ లు ఇరాక్ లోని బాగ్దాద్ లో ఖిలాఫత్ ను ఏర్పాటుచేశారు. వివిధ వంశాలకు చెందినవారికి కూడా అధికారం పంచాల్సివచ్చినా 1517లో టర్కీ కి చెందిన ఒట్టమాన్ ఈజిప్ట్ పై దండయాత్ర చేసేవరకు అబ్బాసిద్ లు బాగ్దాద్ ఖిలాఫత్ ను ఏలారు. ఆ తరువాత 1517 నుంచి 1924 వరకు ఖిలాఫత్  ఒట్టమాన్ ల చేతిలోనే ఉంది. ఒట్టమాన్ సామ్రాజ్యం కేవలం మరొక ముస్లిం సామ్రాజ్యం లేదా రాజ్యం మాత్రమే కాదు. అది ఐదు శతాబ్దాలపాటు క్రైస్తవ యూరోపియన్ లకు వ్యతిరేకంగా పొరాడి ఇస్లాంను నిలబెట్టింది. 1453లో సుల్తాన్ మెహ్మెట్ కాన్ స్టాంటిన్ నోపుల్ ను జయించాడు.

ఇస్లామిక్ చరిత్రలో ఖిలాఫత్ గురించి అభూత కల్పనలు
ఒకే ఉమ్మా(ముస్లిం వర్గం) గురించి మతగ్రంధాలు ఎంత చెపుతున్నా, యదార్ధం మాత్రం మరో విధంగా ఉంది. ఇస్లాం చరిత్ర చూస్తే వివిధ ముస్లిం వర్గాలు, సమూహాలు ఎల్లప్పుడు పరస్పరం ఘర్షణ పడుతూనే ఉన్నాయని మనకి తెలుస్తుంది. ప్రతి వర్గం మిగిలినవారంతా మతసూత్రాలను ఉల్లంఘించినవారేనని, తాము మాత్రమే వాటిని తూచ తప్పకుండా పాటిస్తున్నవారమని చెప్పుకోవడం కనిపిస్తుంది. అవిశ్వాసులతో వ్యవహారించవలసి వచ్చినప్పుడు మాత్రమే ఈ ముస్లిం ఉమ్మా గుర్తుకువస్తుంది. అప్పుడు మాత్రమే ఒక మతవర్గంగా ప్రవర్తిస్తారు. ప్రవక్త మహమ్మద్ చనిపోయి రెండు దశాబ్దాలు కాకుండానే ముస్లింలలో షియా వర్గానికి చెందినవారు ఖిలాఫత్ ఎందుకని ప్రశ్నించారు. ఆలీకి ముందున్న వారిని ఖలీఫాలుగా గుర్తించమని తేల్చిచెప్పారు. అలాగే ఖలీఫా ఖురాయిష్ తెగకు చెందివారే ఉండాలా అన్న చర్చ సున్నీలలో మొదలైంది. క్రీ.శ. 750నాటికి ముస్లిం ప్రపంచం అంతా గుర్తించిన ఖిలాఫత్ ఏది లేకుండా పోయింది. స్వతంత్ర పాలకులు కూడా అమీర్ – ఉల్ – మోమినిన్ (విశ్వాసుల నాయకుడు, సేనాధిపతి), ఖలీఫా వంటి బిరుదులు ధరించడం మొదలుపెట్టారు. ఒక సమయంలో తమకే విశ్వాసుల గుర్తింపు, గౌరవం ఉన్నాయంటూ చెప్పుకున్న ఖలీఫాలు ఏకంగా ముగ్గురు ఉన్నారు. ఇలా `ప్రధాన’ ఖిలాఫత్ నామమాత్రమైనదే అయినా అల్ – మావర్దీ (974-1058), అల్ – ఘజలి(1058-1111) వంటివారు మాత్రం ఖిలాఫత్ అధికారం ఏమాత్రం తగ్గలేదంటూ ప్రచారం చేస్తూవచ్చారు. సున్నీ ముస్లింలు మాత్రం కైరోలోని అబ్బాసిద్ ఖులాఫా లకు, ఆ తరువాత కాన్ స్టాంటిన్ నోపుల్ లోని ఒట్టమాన్ లకు విధేయంగా ఉన్నారు.

భారత్ లో సుల్తాన్, ఖలీఫాల మైత్రి
క్రీ.శ. 711లో అరబ్ లు సింద్ ప్రాంతంపై దండెత్తిన నాటినుంచి భారత్ కు ఈ ప్రధాన ఖిలాఫత్ అనే కట్టుకధ వినడం అలవాటైపోయింది. మొగల్ పాలనకు ముందు సుల్తాన్ లకు చట్టబద్దమైన ఆమోదం, గుర్తింపు బాగ్దాద్ లోని అబ్బాసిద్ ఖులాఫాల నుంచి, ఆ తరువాత కైరోలోని వారి వారసుల నుంచి లభిస్తుందని నమ్మేవారు. ఘజ్నాకు చెందిన మహమ్మద్(998-1030), షమ్స్ – ఉద్ –దీన్ ఇల్ తుత్ మిష్ (1211-1236), మహమ్మద్ బిన్ తుగ్లక్(1325-1351)వంటి సుల్తాన్ లు ప్రత్యేకంగా ఖలీఫా గుర్తింపు పొందారు. ఢిల్లీ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం పొందిన కొద్దిమంది సున్నీ పాలకులు కూడా అబ్బాసిద్  ఖులాఫా ల పేర్లను తాము విడుదల చేసిన నాణాలపై ముద్రించారు.
 ఖిలాఫత్ కైరో నుంచి కాన్ స్టాంటిన్ నోపుల్ కు మారిన సమయంలోనే భారత్ లో మొగలుల పాలన(1526) మొదలైంది. రెండు సామ్రాజ్యాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు 18వ శతాబ్దం వరకు కొనసాగినా మొగలులు ఇతర స్వతంత్ర రాజుల(షియా పర్షియా) మాదిరిగానే తమది ప్రపంచ ఖిలాఫత్ సామ్రాజ్యం అనే ఒట్టమాన్ ల వాదనను మాత్రం ఎప్పుడు అంగీకరించలేదు. అయితే మొగలుల సామ్రాజ్యం బీటలువారడం మొదలుపెట్టినప్పటి నుంచి వారి ధోరణి కూడా మారింది. 18వ శతాబ్దపు ద్వితీయార్ధం వచ్చేనాటికి భారత్ లో ముస్లింలు మళ్ళీ మెల్లగా ఒట్టమాన్ లకు మద్దతునివ్వడం ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన షా వలీ ఉల్లా అనే సూఫీ తన తాఫీమత్ – ఇ – ఇలహియా అనే గ్రంధంలో టర్కీ సుల్తాన్ ను అమీర్ – ఉల్ – మోమినిన్ అని సంబోధించాడు. ఇక 1789లో టిప్పు సుల్తాన్ ఒట్టమాన్ ల గుర్తింపును పొందే ప్రక్రియను మళ్ళీ ప్రారంభించాడు. ఒట్టమాన్ ఖలీఫా అబ్దుల్ – హమీద్ I నుంచి టిప్పు అదికారిక గుర్తింపు పొందాడు.

భారతీయ ఉలామాల టర్కీ వ్యామోహం
ఒట్టమాన్ ఖిలాఫత్ పట్ల భారతీయ ముస్లింల వ్యామోహం 1840నుంచి పెరిగింది. వలీ ఉల్లా మనవడైన షా మహమ్మద్ ఇషాక్ (1778-1846) ఒట్టమాన్ రాజకీయ విధానాలను సమర్ధించిన బహుశా మొట్టమొదటి భారతీయ అలీమ్(పండితుడు; బహువచనం: ఉలామా)కావచ్చును. అతను 1841లో మక్కాకు వలసపోయాడు. అప్పటి నుంచి ఉలామా అంతా, ముఖ్యంగా వలీ ఉల్లా వర్గానికి చెందినవాళ్ళు, ఒట్టమాన్ ను ప్రపంచ ఖిలాఫత్ గా గుర్తించడం ప్రారంభించారు. 1850 తరువాత సుల్తాన్ లను భారత్ లో ఖలీఫా ప్రతినిధులు అనే ప్రచారాన్ని ఒట్టమాన్ లే ప్రారంభించారు.
 1854లో ప్రారంభమయిన క్రీమియా యుద్ధం (బ్రిటన్, ఒట్టమాన్ టర్కీ, ఫ్రాన్స్ లతో కూడిన కూటమికి, రష్యాకు మధ్య జరిగింది. ఇందులో రష్యా ఓడిపోయింది) భారత్ లోని ముస్లింలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా దేశపు పశ్చిమ ప్రాంతంలో ఉన్నవారు ఆ యుద్ధాన్ని చాలా ఆసక్తిగా గమనించారు. 1858లో ముస్లిం పాలన దాదాపుగా అంతమైనప్పుడు ముస్లింల చూపు కాన్ స్టాంటిన్ నోపుల్ వైపు మళ్ళింది. బ్రిటిష్ అణచివేత, వ్యతిరేకతను ఎదుర్కునేందుకు, తమకంటూ ఒక `కేంద్రాన్ని’ ఏర్పాటుచేసుకునేందుకు భారతీయ ఉలామా ఒట్టమాన్ ఖలీఫా వైపు చూశారు. రహమతుల్లా కైరన్వి(1818091), హాజీ ఇందాబ్దుల్లా(1817-99), అబ్దుల్ ఘని(1878లో చనిపోయాడు), ఖైరుద్దీన్(1831-1908)లు మక్కాకు వలసపోయారు. అంతేకాదు వారంతా కాన్ స్టాంటిన్ నోపుల్ సందర్శించారు కూడా. వీరేకాదు బ్రిటిష్ వాళ్ళపట్ల విధేయత ప్రకటించిన కరామత్ అలీ జౌన్ పురి (1800-73) కూడా `బ్రిటన్ కు, మా మతాధినేత అయిన టర్కీ సుల్తాన్ కు స్నేహసంబంధాలు ఉన్నాయి’ అని అన్నాడు.

భారతీయ ముస్లిం మానసంలో ఖిలాఫత్
టర్కీ సుల్తాన్ ల పట్ల ఆరాధనాభావం కేవలం ఉలేమాలకే పరిమితం కాలేదు. అది ముస్లిం పత్రికలతోపాటు సాధారణ ముస్లింలలో కూడా కనిపిస్తుంది. 1850కి ముందు నుంచి ఉన్నా, లేకపోయినా ఆ తరువాత మాత్రం ఈ ధోరణి బాగా కనిపిస్తుంది. 19వ శతాబ్దపు ఆఖరు దశాబ్దాలలో ఈ ప్రపంచ ఇస్లాం ధోరణి బాగా పెరిగింది. 1875 రష్యా, టర్కీల మధ్య యుద్ధం తరువాత ఈ మార్పు వచ్చింది. అలాగే ఇది ఆ తరువాత నాలుగు దబ్దాలపాటు బ్రిటిష్ పాలనలో ముస్లింల వైఖరిని నిర్ధారించింది కూడా. ఆ నాలుగు శతాబ్దాల్లో టర్క్-గ్రీక్ యుద్ధం (1896), ట్రిపోలిపై ఇటలీ దాడి(1911), బాల్కన్ యుద్ధం(1912-14) (Review : The Khilafat Movement : Religious Symbolism and Political Mobilization in India by Gail Minault; Review by Sharif al – Majahid; Pakistan Horizon, Vol. 39, No. 2, 1986, p. 87).

1870నాటి నుంచి ముస్లింలు ఖుత్బ (శుక్రవారం మధ్యాహ్నం చేసే ప్రత్యేక ప్రార్ధనలు)లో ఖిలాఫత్ అల్ – ఇస్లాంకు దీర్ఘమైన ఆయువు, ఐశ్వర్యం, విజయపరంపర దక్కాలంటూ ప్రార్ధించడం ప్రారంభించారు. పత్రికల్లోనూ, బహిరంగంగాను ఖలీఫా కోసం ప్రచారం మొదలుపెట్టారు. (Review : The Khilafat Movement : Religious Symbolism and Political Mobilization in India by Gail Minault; Review by Sharif al – Majahid; Pakistan Horizon, Vol. 39, No. 2, 1986, p. 81). సయ్యద్ అహ్మద్ (1817-98)వంటి మధ్యతరగతి ముస్లిం మేధావులు కేంద్ర టర్కీ ఖిలాఫత్ అనే కల్పనను బాగా ప్రచారం చేశారు.

టర్కీ వ్యామోహపు స్వరూపం
1830 నుంచి భారతీయ ముస్లింలలో టర్కీ అంటే వ్యామోహం పెరగడానికి గల కారణాలను తెలుసుకోవాలంటే మూడు విషయాలను అర్ధం చేసుకోవాలి. మొదటిది, ఈ ప్రపంచ ఇస్లాం అనే భావన పట్ల కేవలం భారతీయ ముస్లింలు మాత్రమే ఆకర్షితులు కాలేదు. 17వ శతాబ్దం మొదటి నుంచి మధ్యాసియా, ఇండోనేషియా, మలేషియాలలో కూడా ప్రపంచ ఇస్లాం పట్ల ఆలోచనలు, ఉద్యమాలు జరిగాయి. రెండవ విషయం, తమ అధికారాన్ని బలపరుచుకునేందుకు, అంతర్గత కలతలను నివారించేందుకు, యూరప్ శక్తుల ఆక్రమణను నిరోధించేందుకు, అరబ్ లు జాతీయవాదాన్ని తిరిగి పెంచకుండా చూసేందుకు సుల్తాన్ అబ్దుల్ అజీజ్(1861-1876), అతని వారసుడు అబ్దుల్ హమీద్(1876-1909) వంటివారు ఈ టర్కీ ఖిలాఫత్ అనే కల్పనను తెరపైకి తెచ్చారు. యూరోప్ శక్తులు కూడా సుల్తాన్ ల ప్రచారానికి సహకరించారు. ఆస్ట్రియా – హంగరీ ఒప్పందం(1908), ఇటలీ(1912), గ్రీస్, బల్గేరియా(1913)వంటి ఒప్పందాల్లో ఖిలాఫత్ ను గుర్తించాయి. మూడవ విషయం, ముస్లిం సమాజాన్ని ఒక తాటిపైకి తేవడం కోసం షియాలు సున్నీలతో కలిసి ఒట్టమాన్ రాజులకు మద్దతు ప్రకటించారు. ఇలా ముస్లింలను ఏకత్రితం చేయడంలో బొహరా నాయకులు బబ్రుద్ధీన్ తయాబ్జీ (1844-1906), మహమ్మద్ అలీ రోగయ్ వంటివారితో కూడిన అంజుమన్ – ఇ – ఇస్లాం (ముంబై), ఆ తరువాత హైదరబాద్ (దక్కన్)కు చెందిన చిరాగ్ అలీ(1844-1895), అమీర్ అలీ (1849-1928), ఆగా ఖాన్ (1877-1957), ఎం. హెచ్. ఇస్ఫాని, మహమ్మద్ అలీ జిన్నా(1876-1948) తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు. (Review : The Khilafat Movement : Religious Symbolism and Political Mobilization in India by Gail Minault; Review by Sharif al – Majahid; Pakistan Horizon, Vol. 39, No. 2, 1986, p. 15)

ఇలా 1919లో ప్రారంభమయిన ఖిలాఫత్ ఉద్యమానికి ఎంతో చారిత్రక నేపధ్యం, భూమిక ఉన్నాయి. అవి భారత్ లో ముస్లిం పాలన కాలానికి చెందినవి. కేంద్ర ఖిలాఫత్ అనే భావనను సుల్తాన్ లు, బాద్షాలు, ఉలమాలు, మేధావులతోపాటు సాధారణ భారతీయ ముస్లింలు కూడా బాగా విశ్వసించారు, ప్రచారం చేశారు. ముస్లిం ప్రపంచం మొత్తానికి చెందిన ఈ నమ్మకం కేవలం భారతీయ ముస్లింలకే పరిమితం కాలేదు. `నాగరిక ప్రపంచంలో హాస్యాస్పదమైనదిగా’ ముస్తఫా కేమల్ అతతుర్క్ అభివర్ణించిన ఖిలాఫత్ ను రద్దు చేస్తున్నట్లుగా టర్కీ గ్రాండ్ అసెంబ్లీ 1924, మార్చ్ 3న ప్రకటించింది. కాబట్టి ఆ ఖిలాఫత్ ను తిరిగి స్థాపించడం కోసం సాగిన సుదీర్ఘమైన పోరులో ఖిలాఫత్ ఉద్యమం కేవలం ఒక దశ, భాగం మాత్రమే. ముస్తఫా సబ్రి ఎఫెన్దీ(1869-1954), ఆఖరి ఒట్టమన్ షయాఖ్ అల్ – ఇస్లాం(1924), అబు అల్ – అలా మవాదుది(1903-1979), జమైత్ – ఇ- ఇస్లామి(1967), తాకియుద్దీన్ అల్ – నభాని (1909-1979), హిజ్బుల్ – తహ్రీర్ లేదా జోర్డాన్ లో లిబరేషన్ పార్టీ, సయ్యద్ కుద్బ్(1906-66), అబు బక్ర్ అల్ – బాగ్దాద్(1971-2019), ఐసిస్(2014)లు 1924 తరువాత ఖిలాఫత్ గురించి బాగా ప్రచారం చేసి, దానిని సాధించడానికి ప్రయత్నించిన వ్యక్తులు, సంస్థలలో కొన్ని. అలా ఖిలాఫత్ కోసం పోరు సాగుతూనే ఉంది.
(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)

మూలము: విశ్వ సంవాద కేంద్రము 

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

అరాచక రజాకార్ లు అంతం అయ్యారా??

–చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి

దిహెడు సెప్టెంబర్ అనగానే. తెలంగాణ ప్రాంతం లోని ఎన్నో హిందు కుటుంబాలు. ‘రజాకార్’ ల అరాచకాలను. అమానుషాలను. తలచుకొని ఆవేశపడటం జరుగుతూనే ఉంది. అధికార దాహం. మత ఛాందసవాదం. ఆధిపత్య ధోరణి. హింసాత్మక ప్రవృత్తి మూల సూత్రాలుగా ఈ రజాకార్ కార్యక్రమాలు మొదలై, ఆటవిక అరాచక రాజ్యానికి దారితీసిన చరిత్ర మనం గమనించ వచ్చు. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఈ కలుపు మొక్కలు మళ్లీ చిగురించి. ప్రస్తుత హిందూ ‘నిజాము’ పాలనలో ‘అభివృద్ధి’ పంటను ఎదగనీయని పరిస్థితి కనిపిస్తోంది.

గతంలోలాగానే దేశం యావత్తు ఒకేతాటిపై నడుస్తూఉండటం అనేక కీలకమైన అంశాలపై తాత్సారంలేని నిర్ణయాత్మక ధోరణితో నాయకత్వం నడుచుకోవడం. దీంతో దిక్కుతోచని అరాచకవాదులు. మతమౌఢ్యంతప్ప వేరే ఆలోచనలేని’ అ’ శాంతి’వాదులు. అధికారంకోసం ఏ దారుణాలకైనా తెగించే రాజకీయవిషసర్పాలు. పొరుగుదేశాలలో అధికారంలో తమ కామ్రేడ్స్కోసం తమ తలతాకట్టు పెట్టి ఎఱ్ఱగంతలగాడిదలు అన్నీ కలిసి మళ్ళా అప్పటి పరిస్థితులను పునరావృత్తం చేస్తారేమొ అనిపించడం వింతేమికాదు. సారూప్యాలు మనకు అర్ధం అవుతూనేఉన్నాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీ లో జరిగిన అల్లర్లు. ఆ అల్లర్లకు కారణమైన సంస్థలు. బెంగళూరు నగరంలో జరిగిన విధ్వంసం వాటి వెనుక ఉన్న కుట్ర. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం లోని భైంసా లో జరిగిన విధ్వంసం ఇవన్నీ చరిత్రను పునరావృతం చేస్తున్నట్టే కనిపిస్తోంది.
రజాకార్ లు అరాచకార్ లు గా మారి సామాన్య ‘హిందూ’ జనబాహుళ్యాన్నిభయకంపింతులను చేసే ప్రయత్నానికి కారణమైన పరిస్థితులు మనం గమనిస్తే అప్పటి కి యావత్భారతం బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ ఏకతాటిపై నడుస్తూంటే. ఆ ‘శాంతి’ మతస్తులు మాత్రం ఎక్కడో టర్కీలోని ‘ఖిలాఫత్’ కోసం తెగ ఆయాస పడిపోయి , అనేక రకాలైన మూర్ఖత్వాన్ని ప్రదర్శించి ఏమీ చేయలేక, ఆ ఉక్రోషాన్ని ‘ హిందువులపై’ చూపి అనేక అరాచకాలు జరిపిన పరిస్థితి. కేరళాలో, గుజరాత్ లో, బెంగాల్ లో, ఉత్తర ప్రదేశ్ లో ఇలా అనేక చోట్ల ఈ అరాచకాలు జరిగాయి. ‘ ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ‘ లోనే అప్పట్లో ఈ అరాచక భావాలను, ఆధిపత్య ధోరణీ నూరిపోసి పంపించే వారు. ఆ ‘శాంతి’ యుత భావజాలం లో తర్ఫీదు పొందిన ఒకానొక దుష్ట ‘గ్రహ’ శకలంశ్రీయుత ‘ఖాసిం రజ్వీ’ సూకరోత్తముడు. వారు విద్యావంతులు పై పెచ్చు, మత ఛాంధసులు. వారి నాయకత్వం లో ఈ “ఇత్తెహదుల్ముసల్మీన్” అనే సంస్థ ఈ అరాచకాలకుతెరతీసింది. వారికి ఉన్న ప్రధాన మైన సమస్య ఏమిటీ అని ఆలోచిస్తే, ‘ భారత దేశానికి స్వాతంత్య్రం వస్తే, అప్పటి దాకా ముస్లిం రాజ్యం గా ఉన్న హైదరాబాదు సంస్థానం, ముస్లిం రాజ్యంగా ఉండదు’ అది వారి మనస్సును అల్లకల్లోలం చేసిన సమస్య. సరే ‘రాజ్యాధికారం’ వదులుకోవటం కష్టం అయిన పనే, అయితే రాజ్యం నిలుపుకోవాలంటే ఏం చెయ్యాలి?? తగిన సైన్యాన్ని సిధ్ధం చేసుకోవాలి. సరిహద్దుల వద్ద సైన్యాన్ని మొహరించి శత్రువుని ఎదుర్కోవాలి. ఇలా ఏదోక వీరోచితమైన విన్యాసాలు, రాజనీతి ప్రదర్శించాలి. ఏ పరిపాలకుడైనా చేసే సాధారణ చర్యలు ఇవి.

కానీ ఇక్కడ ఉన్నది ఎవరు సాక్షాత్తు ‘ ఖాసిం రజ్వీ’ మహశయుడు, వారు ‘నిజాము’ గారి అప్రకటిత సైన్యాధ్యక్షుడు. వారి వీరత్వం కృరత్వం అనితర సాధ్యం. వారు అరివీర భయంకరంగా చేసిన యుద్ధం ఎవరిమీద?, అమాయకులైన సామాన్య ప్రజానికం పైన ‘ అది కూడా హిందువులైతేనే’. మీకు అనుమానం రావచ్చు అలా ఎందుకూ? వాళ్ళు రాజును ఏమన్నా ఎదిరించారేమొ అందుకే అట్లా’ అని. అలాంటి పిచ్చి సంశయాలు పెట్టుకునే మీరందరికీ ఆ మహశయుడు అప్పట్లో పత్రికా ముఖంగా ప్రకటించారు కూడా. ” హిందువులను చంపడం ముస్లిం ల జన్మసిధ్ధ హక్కు” అని. “సంస్థానంలోని కోటి అరవై లక్షల’ హిందువుల’ నందరినీ తగలపెట్టేస్తాననీ” కూడా సభాముఖం గానే ప్రకటించారు.

వారి వీరోచిత కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి. నిరాయుధులైన సామాన్య హిందువులపై దాడి చేయుట, హిందూ స్త్రీ లను మానభంగం చేయటం ద్వారా వారి ప్రవక్త చూపిన స్వర్గానికి అర్హత సాధించుట, పైగా ఆ స్త్రీమూర్తుల చే నగ్నంగా ‘ బతుకమ్మ ‘ ఆడించి పరమత సహనం చాటుట. ఇలా అనేకానేక వర్ణించనలవి గాని అనేక చారిత్రక కార్యాలు. సరే ఇదంతా మీ వంటి సహన శీలురకు చాలా ఇబ్బందిగా ఉండి ఉండ వచ్చు అప్పుడెప్పుడో జరిగిన దుస్సంఘటనలు ఇప్పుడు ఎందుకు? మన సైన్యం పోలీసు చర్య జరిపింది వారి పీచమణిచి వేసింది కదా ఇంకా అదే పట్టుకు కూర్చోవటం అవసరమా? అని. మీరు చెప్పింది అక్షరాలా నిజం, అప్పుడు అలా జరిగింది కదా మరి ఆ నాలుగు లక్షల ‘రజాకార్’ ల ను సైన్యం అణచివేసింది నిజమే. మరి ఆ ‘భావజాలాన్ని’ ఏం చేసింది??. సమాధానం చాలా సులువు ‘ ఆ భావజాలం’ ఇంకా అదే పేరుతో హైదరాబాద్ నగరంలో కొనసాగుతూ విషవృక్షం గా తన ఊడలు దించుతూనే ఉంది. జాతీయవాదం ఈ వేర్పాటు వాదాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తునే ఉంది. కానీ అవకాశ వాద రాజకీయం మాత్రం, వారు కోరిన విధంగా ” పదిహేను నిముషాలు పోలీసులను ఎలా తప్పించాలా??” అన్న అరాచకపు ఆలోచనే చేస్తోంది. మరి మీరు ఏం చేస్తారు?? తలవంచి అరాచకాన్ని ఆహ్వానిస్తారా?? లేక జాగృతి తో సశక్త భారత సమాజానికి జేజేలుచెబుతారా??. మతమౌఢ్యం మూల స్తంభంగా ఎదిగే మూర్ఖత్వాన్ని నిర్ధ్వందంగా నిరసించి తరిమికొడతారా లేక నా దాకా రాలేదులే అనుకున్న” స్వాతంత్య్రం పూర్వం …. పాకిస్తాన్ అని ఇప్పుడు చెప్పబడుతున్న ప్రాంతం లోని హిందువుల లాగా ” ధన, మాన, ప్రాణాలను కోల్పోతారా??. మీ చుట్టూ ఉన్నఈ సెక్యుల‌ర్‌ స‌మాజానికి తగిన కట్టుదిట్టం చేస్తారా? లేదా కళ్ళు మూసుకున్నపిల్లులలాగా మీ ఆస్తులు తగుల బెట్టిన తరువాత కానీ గమనించుకోరా?? మీరు నిర్మించుకున్నమీ ఊహల సౌధాన్నిఈ అరాచకవాదం ఛిన్నాభిన్నం చేస్తుంటే మనం ఏమి చేస్తే బాగుంటుంది?“ చిన్నపామునైనా పెద్దకఱ్ఱతో కొట్టాలి‘ అన్నట్టుగా మన శాంతియుత సమాజం కోసం ఆలోచనలు సాగాలి ? యువత భావోద్రిక్తం అయ్యి ఆఅరాచక ఎజెండా సఫలీకృతం కానీయకుండా తగిన సన్నద్దతతో ఉండే విధంగా తగిన వ్యూహ రచన జరగాలి. ఇవన్నీజరగాలి అంటే బాధ్యత కలిగిన ప్రతీ పౌరుడు ఒకనాయకుడు కావాలి. మీకు దిశానిర్దేశం కావాలీ అంటే ఇదిగో ఈ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన అ’సామాన్యుల’ చరిత్రను చదవండి. అరాచకాన్నిఆత్మస్తైర్యంతో ఎదుర్కొన్న వీరుల సంస్మరణ జరపండి. మళ్ళా అలాంటి పరిస్థితి రాకుండా చూడండి.

__విశ్వ సంవాద కేంద్రము

12, సెప్టెంబర్ 2020, శనివారం

విశ్వమత మహాసభ, చికాగో, సెప్టెంబర్ 11వ తేది, 1893వ సంవత్సరమున 'స్వామి వివేకానంద ప్ర‌సంగం' - Swami Vivekananda's Chicago Speech 1893


స్వాగతానికి  ప్రత్యుత్తరం - విశ్వమత మహాసభ, చికాగో, సెప్టెంబర్ 11వ తేది,  1893వ సంవత్సరం.

స్వామి వివేకానంద ప్ర‌సంగం

అమెరికన్ సోదర సోదరీమణులారా,....
మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ  సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు; సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు; నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనం తరఫున మీకు నా అభివాదాలు.

సహనభావాన్ని వివిధదేశస్థులకు తెలిపిన ఘనత, గౌరవం సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందటం ఎంతో సమంజసమని, అటువంటి ప్రతినిధుల గురించి ఈ సభావేదిక నుంచి మీకు తెలిపిన వక్తలకు కూడా నా అభివాదాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని,లోకానికి భోదించిన సనాతనధర్మం నాదని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నేకాక సర్వమతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం. సమస్తమతాలకు చెందిన,  సమస్త దేశాలనుంచీ పరపీడితులై , శరణాగతులై వచ్చినవారికి శరణమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి,శరణుపొందిన యూదులను –నిజమైన యూదులనదగ్గవారిలో మిగిలినవారిని – మా కౌగిట చేర్చుకున్నామని తెలపటానికి గర్విస్తున్నాను. మహాజొరాస్టరీయ సంఘంలో మిగిలినవారికి శరణు ఇచ్చి –నేటికీ వారిని ఆదరిస్తున్న(సనాతన) ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సోదరులారా, ప్రతిరోజూ కోట్లాది పారాయణం చేస్తున్న, నేను కూడా అతిబాల్యంనుంచి పారాయణ చేస్తూన్న ఒక స్త్రోత్తం నుంచి కొన్ని చరణాలను ఉదహరిస్తాను: “వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో కలసినట్లే, వివిధ భావాలచే మనుషులు అవలంబించే వివిధ ఆరాధనామర్గాలు వేరువేరుగా కనపడినా, సర్వేశ్వరా, నిన్నే చేరుతున్నవి.”

“ ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో, నేను వారినలాగే అనుగ్రహిస్తున్నాను. అందరూ సమస్త మార్గాల ద్వారా  చివరికి నన్నే చేరుతున్నారు” అని గీతలో తెలిపిన అద్భుతసిద్దాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ మతమహాసభే  సమర్థిస్తూ, ముక్తకంఠంతో  లోకానికి చాటుతుందని చెప్పవచ్చును. శాఖాభిమానం, స్వమత దురభిమానం, దానివల్ల కలిగిన మూర్ఖత్వం సుందరమైన యీ జగత్తును చిరకాలంగా అక్రమించాయి. వాటివల్ల దౌర్జన్యాలు జరిగి అనేకసార్లు ఈ భూమి రక్తసిక్తమైంది.  ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకుంటే, మానవ సమాజం నేటికంటే విశేషాభివృద్ది చెంది ఉండేది. కానీ ఆ ధౌర్జన్య శక్తుల అంతకాలం  ఆసన్నమైంది; ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించిన  గంట కత్తితో కానివ్వండి, కలంతో కానివ్వండి, సాగించే సర్వవిధాలైన స్వమత దురభిమానానికీ, పరమత ద్వేషానికి ముగింపు వాక్యం కావాలి.  నానావిధాలైన హింసకు మాత్రమేకాక, కొందరిలోని నిష్టుర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

__ విశ్వ సంవాద కేంద్రము

3, సెప్టెంబర్ 2020, గురువారం

ఖిలాఫత్ ఉద్యమం అసలు చరిత్ర: ఇప్పుడు మనం తెలుసుకోవలసినది - The actual history of the Khilafat movement— డా. శ్రీరంగ గోడ్బోలె

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ ఒట్టమన్ సామ్రాజ్య విచ్ఛిన్నం, టర్కీ ఖలిఫత్ రద్దు తరువాత భారతీయ ముస్లింలలో వచ్చిన మార్పును ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) సూచిస్తుంది. ఖలీఫాను(ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరి మత నాయకుడు)  తిరిగి నియమించుకోవడమే ఈ ఉద్యమపు ప్రధాన లక్ష్యం. ఖిలాఫత్ ఉద్యమం జరిగి వందేళ్లు అయినా ఇప్పటికీ దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది. అది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. ఆ ఉద్యమం వెనుక అనేక చారిత్రక పరిణామాలు, మతపరమైన ఆలోచనలు ఉన్నాయి. దాని వల్ల మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం ప్రభావితమయ్యింది. అది దేశ విభజనకు ఒక కారణమయ్యింది.

ఖిలాఫత్, సహాయనిరాకరణోద్యమం:

చాలమందికి ఖిలాఫత్ ఉద్యమానికి, సహాయనిరాకరణోద్యమానికి మధ్య సంబంధం పెద్దగా తెలియదు. `21 మార్చ్ 1919 బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టం, 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా గాంధీజీ 1920 సెప్టెంబర్ 4న సహాయనిరాకరణోద్యమం ప్రారంభించారు’ అని మనం తరతరాలుగా చదువుకుంటున్నాము. ప్రస్తుతం మన విద్యావంతులందరికి `జ్ఞానప్రదాత’ అయిన వికీపీడియాలో ఇలాగే ఉంటుంది.

చరిత్రకారులుగా చెలామణి అయిన పార్టీ సిద్ధాంతకర్తలు `దేశంలో అతి పెద్ద మతవార్గాలైన హిందువులు, ముస్లిములు కలిసి ఖిలాఫత్ తో పాటు సహాయనిరాకరణోద్యమం చేస్తే ఈ దేశంలో బ్రిటిష్ పాలన అంతమవుతుందని గాంధీజీ భావించారు. ఆ రెండు ఉద్యమాలు నిజంగానే బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనపై ఎంతో ప్రభావం చూపాయి’(Themes in Indian History part III, Textbook of History for class XII, published by NCERT, p. 350) అంటూ బాగా నూరిపోశారు. కాంగ్రెస్ అధికారిక చరిత్రలో(పట్టాభి సీతారామయ్య వ్రాసిన హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సి డబ్ల్యూ సి, మద్రాస్, 1935, పేజీ. 334, 335) కూడా సహాయనిరాకరణోద్యమాన్ని `స్వరాజ్య’ సాధన కోసం కాంగ్రెస్ ప్రారంభించింది’ అని వ్రాసారు. ఇది చరిత్రను తలక్రిందులు చేయడమే.

ఖిలాఫత్ ఉద్యమం గురించి నిజాలు విపరీతమైన అబద్ధపు ప్రచారంలో కూరుకుపోయాయి. రాజకీయ, సైద్ధాంతిక ప్రయోజానాల కోసం కొందరు ఆ పని చేస్తూ ఉంటారు.

రాజకీయ చర్చ

కాంగ్రెస్ అధికారిక వెబ్ సైట్ లో 2018 అక్టోబర్ 28న ఖిలాఫత్ గురించి ఒక వ్యాసం ప్రచురితమయింది. ఆ వ్యాసంలో ఇలా పేర్కొన్నారు – ‘’బ్రిటిష్ పాలన నుండి విముక్తం కావడానికి భారత్ చేసిన చెప్పుకోదగిన ప్రయత్నాలలో ఖిలాఫత్ ఉద్యమం ఒకటి…బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో హిందువులు, ముస్లింలు కలిసి చేసిన పోరాటం అది…సహాయ నిరాకరణ ఉద్యమంతోపాటు ఖిలాఫత్ ఉద్యమాన్ని కలిపి ముందుకు తీసుకువెళ్లాలన్న గాంధీజీ నిర్ణయం సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా వాణిని మరింత గట్టిగా వినిపించడానికి అవకాశం కల్పించింది… శోషణకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలను కలపడానికి, వారివారి ప్రయోజనాలను సాధించడానికి ఇది సదవకాశమని ఆయన గ్రహించారు…`స్వరాజ్’ అనే స్వీయ పరిపాలన ప్రతిపాదనను ఖిలాఫత్ లక్ష్యాలతో ముడిపెట్టడం ద్వారా ఆయన రెండు ప్రయోజనాలను ఒకేసారి సాధించాలనుకున్నారు…భారత స్వాతంత్ర్య సంగ్రామంలో హిందూ, ముస్లిం ఐక్యతకు సంబంధించిన అపూర్వమైన ఉదాహరణ ఖిలాఫత్ ఉద్యమంలో కనిపిస్తుంది…భారత జాతీయ కాంగ్రెస్ నేతలు, ఖిలాఫత్ నాయకులు భుజంభుజం కలిపి పనిచేసినందువల్ల ఇది సాధ్యపడింది…హిందువులు, ముస్లిములు కలిసి పోరాడితేనే బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందగలరనే గాంధీజీ ప్రగాఢ విశ్వాసానికి ఆనాటి పరిస్థితులు ప్రత్యక్ష నిదర్శనం’’ (https://www.inc.in/en/in-focus/the-khilafat-movement-a-landmark-movement-in-indias-journey-to-freedom).

విద్యా సంబంధ చర్చ

కొందరు చరిత్రకారులు తమతమ ప్రయోజనాల కోసం అనేక అపోహలు, భ్రమలు ప్రచారం చేశారు. స్కాటిష్ చరిత్రకారుడు హామిల్టన్ గిబ్ (1895 – 1971) ఖిలాఫత్ ఉద్యమం పెరుగుతున్న హిందూ జాతీయవాదంపై వచ్చిన ప్రతిక్రియ అన్నాడు. “ప్రపంచం మొత్తంలో ముస్లిములు ఉన్నా, భారత దేశంలోని ముస్లిములు మాత్రమే ఇస్లాం యొక్క అంతర్జాతీయ హోదా గురించి మాట్లాడారు. నిజానికి హిందూ జాతీయవాదాన్ని ఎదుర్కొనడం కోసమే వాళ్ళు అలా మాట్లాడారు’’ అంటూ గిబ్ వ్రాశాడు. (Whither Islam? A survey of the modern movement in the Moslem world, 1932,Routledge, p 73). కొన్నిసార్లు చరిత్రకారుల వ్రాతలు హాస్యాస్పదంగా ఉండేవి. కెనడాకు చెందిన ముస్లిం చరిత్రకారుడు విల్ఫ్రెడ్ కాంట్ వెల్ స్మిత్ తన Modern Islam in India: A Social Analysis(Minerva Book Shop, Lahore) అనే పుస్తకంలో ఇలా వ్రాశాడు – “ఖిలాఫత్ అనే మాటకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక విచిత్రమైన అర్ధం ఉంది. అది వ్యతిరేకత అనే అర్ధం కలిగిన `ఖిలాఫ్’ అనే ఉర్దు పదం నుంచి వచ్చిందని భావించేవారు. కాబట్టి ఖిలాఫత్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతగా వాళ్ళు అనుకునేవారు. వాళ్ళకి ఇస్లాం తెలుసు. కానీ మహమ్మద్, ఒట్టమన్ సామ్రాజ్యం గురించి తెలియదు.’’ డి.జి. టెండూల్కర్ కూడా తన Mahatma: Life of Mohandas Karamchand Gandhi (vol2, p 47) లో ఇవే అసంబద్ద, హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు.  అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రచురించిన, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా ఆవిష్కరించిన భారత జాతీయ కాంగ్రెస్ శతవార్షిక చరిత్ర (Academic Foundation, Delhi, 1985, Vol.2, p. 66)లో ఇలాంటి విషయాలే కనిపిస్తాయి. అయితే ఇలాంటి అసంబద్ధ విషయాలు ఉన్న ఈ సంపుటి సంపాదకులు ప్రముఖ నెహ్రూ మార్కు సెక్యులర్ వాదులైన రవీంద్ర కుమార్, బి ఎన్ పాండే అంటే మనకు ఏమి ఆశ్చర్యం కలగదు.

ఖిలాఫత్ ఉద్యమం భారత్ లో ఇస్లాం వ్యాప్తికి సంబంధించిందేకానీ ప్రపంచమొత్తం ఇస్లాం వ్యాప్తి గురించి కాదని కొందరు మేధావులు కొత్తవాదనలు లేవదీశారు. (ది ఖిలాఫత్ మూమెంట్: రిలిజియస్ సింబాలిజం అండ్ పోలిటికల్ మొబిలైజేషన్ ఇన్ ఇండియా, గైల్ మినాల్ట్, కొలంబియా యూనివర్సిటీ ప్రెస్, 1982). మరొక `ప్రముఖ చరిత్రకారుడు’ ప్రొఫెసర్ భోజనందన్ ప్రసాద్ సింగ్ అయితే ఖిలాఫత్ ఉద్యమంలో సెక్యులరిజాన్ని చూపించాలని ప్రయత్నించాడు. (ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, సంపుటి.63, పుట; 615-621). “ఆ ఉద్యమానికి సంబంధించి కావాలని మత విషయాలను ప్రచారం చేసి అందులోని సెక్యులర్ అంశాలు బయటపడకుండా చేశారు. చివరికి ఆ ఉద్యమం గురించి అధికారిక వ్రాతల్లో కూడా లేకుండా చేశారు..’’అంటూ ఆయన ఆరోపించాడు. ఈ ధోరణిని రఫిక్ జకారియా తన వ్యాసం `ట్రూత్ అబౌట్ ద ఖిలాఫత్ మూమెంట్’(హిందూస్తాన్ టైమ్స్, న్యూఢిల్లీ, 24, ఆగస్ట్, 1997)లో ప్రశ్నించారని ప్రసాద్ సింగ్ పేర్కొన్నాడు. సెక్యులర్ జాతీయవాదాన్ని పెంపొందించడానికి గాంధీగారు అనుసరించిన వ్యూహంలో ఖిలాఫత్ ఉద్యమం ఒక భాగమని ఆ `ప్రముఖ చరిత్రకారుడు’ సూత్రీకరించాడు. అంతేకాదు ఇంకా చాలా `అద్భుత’ విషయాలు చెప్పాడు. “స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య భారతాన్ని వివిధ మతాలకు చెందినవారంతా సోదరభావంతో కలిసిమెలసి జీవించే విధంగా రూపొందించడం కోసం గాంధీజీ సహాయనిరాకరణ, ఖిలాఫత్ వంటి సెక్యులర్ జాతీయవాద ఉద్యమాలను ప్రారంభించారు…సహాయనిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాల్లో అహింస ప్రధాన సూత్రం….’’

చరిత్రను నిరాకరించడం

ఖిలాఫత్ ఉద్యమానికి ఎలాంటి మతపరమైన, చరిత్రపరమైన నేపధ్యం లేదని, అది హఠాత్తుగా ప్రారంభమైపోయిందని కొందరు వాదిస్తారు. ఆ ఉద్యమపు హిందూవ్యెతిరేక ధోరణిని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు. గార్గి చక్రవర్తి “పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముస్లింలను సమైక్యపరచాలనే ఇస్లాంను వ్యాప్తిచేయాలనే సిద్ధాంతం 1911లో ఇటలీ, టర్కీల మధ్య యుద్ధం ప్రారంభమయ్యేవరకు భారత్ లో కనిపించలేదు. ఇటలితో బ్రిటన్ రహస్య ఒప్పందం చేసుకుంది. దీనితో భారతీయ ముస్లిములు బ్రిటన్ కు దూరమైపోయారు. తమ ఇస్లాం సంస్కృతిని నాశనం చేయాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదం చూస్తోందని వారికి అనిపించింది. `ఇస్లాం ప్రమాదంలో ఉంది’ అనే నినాదం క్రైస్తవ మతం, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పుట్టిన పిడివాద ద్వేషం నుంచి వచ్చినదే తప్ప అది హిందువులకు వ్యతిరేకం కాదు’’(mainstream, సంపుటి: LVIII నెం. 6, న్యూఢిల్లీ, 25 జనవరి, 2020). చక్రవర్తి వ్రాసిన ఈ వ్యాసం నిజానికి `Globalisation and Religious Diversity : issues, perspectives and the Relevance of Gandhian Philosophy’ అనే పేరుతో ఇంటర్నేషనల్ వింటర్ స్కూల్ లో జరిగిన సెమినార్ లో సమర్పించిన పత్రం. 2020 జనవరి 8 నుండి 14 వరకు ఢిల్లీ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, డెన్మార్క్ కు చెందిన ఆర్హస్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సెమినార్ నిర్వహించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచ ఇస్లామీకరణ (పాన్ ఇస్లామిజం)ను పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి ప్రతిస్పందనగా, ప్రతీకారంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.

సెక్యులరిస్ట్ లుగా పేరుపడినవారి సంగతి ఇలా ఉంటే ఎలాంటి మొహమాటం, సంకోచం లేని ఇస్లాం వాదుల వాదన ఎలాఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. ట్రినడాడ్ టొబాగో ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సర్వీస్ ఆఫీసర్ గా పనిచేసిన షేక్ ఇమ్రాన్ హోసైన్ 1985లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇస్లాం ఉద్యమాన్ని చేపట్టాడు. అతను ఖిలాఫత్ ఉద్యమం గురించి ఇలా వ్రాశాడు -“కత్తి చూపి బెదిరించి బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులు యూరోప్ రాజకీయ సెక్యులరిజాన్ని ఇస్లాంకు ప్రత్యామ్నాయంగా రుద్దాలని చూశారు. హిందువులు, ముస్లిములు ఈ కొత్త యూరోప్ మతమైన `సెక్యులరిజాన్ని’ తిరస్కరించారు, సవాలు చేశారు. తమదైన రాజకీయ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు సిద్ధపడ్డారు….శ్వేతేతర ప్రపంచంపై సామ్రాజ్యవాద పాశ్చాత్య దేశాలు బలవంతంగా రుద్దాలనుకున్న యూరోపియన్ రాజకీయ సెక్యులరిజం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని ఖిలాఫత్ ఉద్యమం తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి సమయంలో టర్కీలో కొత్తగా ఏర్పడిన ముస్తఫా కమల్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రభుత్వం సహాయంతో ఖలీఫత్ ను రద్దుచేసి, అపూర్వమైన, హిందూ, ముస్లిం ఐక్యతతో సాగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని అణచివేయాలని బ్రిటిష్ పాలకులు అనుకున్నారు.’’(The Return of the Khilafat). ఖిలాఫత్ ను స్థానిక సంస్కృతిని పరిరక్షించే, జాతి దురహంకారాన్ని వ్యతిరేకించిన ఉద్యమంగా చిత్రీకరించడానికి చాలా ప్రయత్నమే జరుగుతోందని ఈ వ్రాతలను బట్టి మనకు తెలుస్తుంది.

గతం నుంచి వర్తమానం దాకా

ఖిలాఫత్ ఉద్యమం వంటిదే మరొకటి ఈ దేశంలో తమకు కావలసిన రాజకీయ మార్పు తెస్తుందని చరిత్రకారులుగా చెలామణి అవుతున్న కొందరు `మేధావులు’ ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రిన్ స్టాన్ విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించే జ్ఞాన్ ప్రకాష్ వంటివారు ఏకంగా ఖిలాఫత్ ఉద్యమానికి, ఇటీవల దేశంలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలకు పోలిక ఉందంటూ ప్రచారం మొదలు పెట్టారు కూడా. “భారత్ లో తమ స్థానాన్ని గురించి ఆర్ ఎస్ ఎస్ ప్రేరిత దుష్ప్రచారాన్ని ఎదుర్కునేందుకు ముస్లింలు గట్టిగా నిలబడ్డారు. తాము కేవలం ముస్లింలు మాత్రమే కాదని, భారతీయులు కూడా అని వాళ్ళు స్పష్టం చేశారు. ముస్లింలలో ఉన్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీజీ ఖిలాఫత్ ను ఉపయోగించారు. అందులో కూడా భారతీయతతో పాటు ముస్లిం అస్తిత్వం కూడా ఉంది. ‘’(why the protests remind us of Gandhi`s Khilafat movement , Economic Times, 12 Jan , 2020)

ఖిలాఫత్ ఉద్యమం గురించి కొత్త భాష్యాలు చెపుతున్నవారు ఏమంటారంటే – “సామ్రాజ్యవాద పాలకుల బాధలు తట్టుకోలేని ఒక వర్గం, ముస్లిమేతర సోదరులతో కలిసి మహాత్మాగాంధి నాయకత్వంలో ప్రారంభించిన ఉద్యమం.’’ ఇక్కడ `సామ్రాజ్యవాద పాలకులు’ అనే మాటను `హిందూ ఆధిక్యత’ తోనూ, `ముస్లిమేతర సోదరులు’ అనే మాటను `ఎక్కువతక్కువలున్న హిందూ వ్యవస్థలో అణచివేతకు గురైన వారు’ అని సవరించి చూసుకోండి ఇప్పుడు సాగుతున్న `ఉద్యమాల’ రహస్యం బయటపడుతుంది.

ఖిలాఫత్ ఉద్యమానికి `తెల్ల రంగు’ వేయాలనుకుంటున్నవారి  ప్రయత్నాలను వమ్ముచేయాలి. ఎందుకంటే ఖిలాఫత్ కు కారణమైన 100 ఏళ్లనాటి ధోరణే నేటికీ పనిచేస్తోంది, కనిపిస్తోంది. ఈ మనస్తత్వం, ధోరణే దేశంలో ఏడవ శతాబ్దపు మతవాతావరణాన్ని మళ్ళీ సృష్టించాలని చూస్తోంది. చరిత్రను ఎవరు మరచిపోతారో వారు ఆ చారిత్రక తప్పిదాలను మళ్ళీ చేసి నష్టపోతారు. అలాగే చరిత్రను మాసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నవారు కూడా మిగలరు. కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పాలి.

(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)

__విశ్వ సంవాద కేంద్రము

27, ఆగస్టు 2020, గురువారం

నిరంకుశ రాక్షస ముస్లిం పాలకులు ధ్వంసం చేసిన విద్యా పీఠాలు - List of Vedic Academies destroyed by tyrannical demonic Muslim rulers

నిరంకుశ రాక్షస ముస్లిం పాలకులు ధ్వంసం చేసిన విద్యా పీఠాలు - List of Vedic Academies destroyed by tyrannical demonic Muslim rulers

నిరంకుశ రాక్షస ముస్లిం పాలకులు ధ్వంసం చేసిన విద్యా పీఠాలు

మన  దేశానికి  అంతర్జాతీయంగా ఖ్యాతి గుర్తింపు వచ్చాయి అంటే కారణం బాలీవుడ్  షారుఖ్ సల్మాన్  అమీర్, నసీరుద్దీన్ షా   తాజ్-మహల్,  ఆఫ్కోర్స్  మన  తేజో-మహల్ కుతుబ్. మీనార్లు  ఫలక్  నామా పాలేస్, జామా మసీదులు కాదు. మన  సంస్కృతి, కళలు, హైందవ సాంప్రదాయాలు, అద్భుత నిర్మాణ శాస్త్రానికి ప్రామాణికమైన ఆలయాలు, సిరి సంపదలు. ఆందుకే మన భారతాన్ని రత్న గర్భ అన్నారు.

వేద విజ్ఞానం అనగా ఆయుర్వేదం ఖగోళశాస్త్రం జ్యోతిష్యశాస్త్రం వేదగణితం నిర్మాణ  వైద్యశాస్త్రాల తో పరిపూర్ణంగా నిండి వున్న భారతావనిలో విద్యను అభ్యసించడానికి  ప్రపంచం  నలుమూలల నించి విద్యార్దులు వచ్చేవారు.

ఖ్యాతి గాంచిన 10 విశ్వ  విద్యాలయాలు: 
 •  1.విక్రమశిల  
 •  2.సోమపుర  
 •  3.ఒడంత పురి 
 •  4.జగద్దల  
 •  5.నలంద
 •  6.తక్ష శిల
 •  7.పుష్పగిరి  
 •  8.వల్లభి  
 •  9.విక్రమపుర  
 • 10.తెల్హార  
అప్పటి నిరంకుశ ఇస్లాం పాలకలు మన  సొమ్ము. మన దేశాన్ని కొల్ల గొట్టి మన జ్ఞానాన్ని చూసి. కుళ్ళుకుని అన్యాయంగా విశ్వ విద్యాలయాల  మీద ప్రపంచం నలుమూలల నించి వచ్చిన పడి విద్యార్ధులను తలమానికంగా నిలిచిన గురువులను దారుణంగా చంపి భవనాలను కాల్చి కూలగొట్టి ధ్వంసం చేసారు.

ప్రపంచ  ప్రఖ్యాతి  గాంచిన నలంద విశ్వ విద్యాలయ గ్రంధాలయం ధర్మగుంజ్ 9వేల  మిలియన్ల కు పైగా ఆయుర్వేద సకల శాస్త్రాల తాళపత్ర గ్రంధాల  తో  నిండి  ఉండేది మొహమ్మద్ బిన్ భక్తియార్ ఖిల్జీ అనే నిరంకుశ ముస్లిం పాలక ముండా కొడుకు తోటి తురక  ముశ్కరులతో దాడి చేసి విద్యార్ధులను అధ్యాయపక ఆచార్య దేవుళ్ళ ను దారుణంగా చంపి  భవనాలను సమూలంగా నాశనం చేసి శ్మశాన వాటికను మరిపించాడు.

హిందూ ధర్మానికి ప్రతీక అయిన ధర్మగుంజ్ గ్రంధాలయం వారం రొజుల పాటు తగల  బడుతునే ఉంది.

జైన  మహావీరుడు నలంద గురించి చాలా  గొప్పగా  చెప్పాడు అర్ధ శాస్త్రాన్ని రచించిన చాణక్యుడు, నలందలో విద్యను అభ్యసించాడు. ఎందరో  బౌద్ధులు ఈ విశ్వ విద్యాలయాలలోనే  విద్యను అభ్యసించారు ఇది మన గొప్పతనం.

జై  హింద్  జై  భారత్

21, ఆగస్టు 2020, శుక్రవారం

భారత దేశ విభజన విషాద గాథ, హిందూ, సిక్కుల పై హత్యాకాండ - Tragedy of Partition in India, Massacre of Hindus and Sikhs


– – హెచ్. వి. శేషాద్రి
1703-1762 కాలంలో `షా వహియుల్లా దెహ్లవి’ భారతలో వహాబీ ఉద్యమం ప్రారంభించి, ప్రపంచంలో ముస్లిములు వేరే ప్రత్యేక సముదాయమని, భారత ముస్లిములు అందులో భాగమని మతబోధ మొదలు పెట్టాడు. అతని కొడుకు `షా అబ్దుల్ అజీజ్’(1746-1822) భారత్ ను `దార్-ఉల్-హర్బ్’ అని ప్రకటించాడు.అతను 80,000 వహాబీ సైన్యాన్ని సృష్టించి, సిక్ఖులపై దాడి చేసాడు; సిక్ఖుల చేతిలో ఓడిపోయి,బ్రిటిషువారిపై దాడికి దిగారు. బ్రిటిషువారు అప్పటినుంచి వ్యూహాత్మకంగా ముస్లిములను లోబరుచుకుని, తమవైపు తిప్పుకోసాగారు. బ్రిటిషువారి విశ్వాసపాత్రుడైన `సర్ సయెద్ అహ్మద్ ఖాన్’ 1875లో అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయo ప్రారంభించాడు.  అతను హిందువులను నమ్మించడానికి 1884లో, హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు అందరూ హిందూదేశంలో భాగమని ప్రకటించాడు.అతనే 1888సంవత్సరానికల్లా, హిందువులు ముస్లిములు కలిసి బ్రతకలేరని,ఒకరు ఇంకొకరిపై విజయo సాధించాలని అన్నాడు.

1904లో బెంగాల్ విభజన, పధకం ప్రకారం ప్రారంభమై, 1905లో విభజన జరిగింది. సర్ హెన్రీ కాటన్ “భారత ఐక్యతను చెడగొట్టడమే విభజన ప్రధాన ఉద్దేశం” అన్నాడు. నవాబ్ సలీముల్లాఖాన్ కి  రూ.1లక్ష లంచంగా ఇచ్చారు, కాని నవాబు తమ్ముడు ఖ్వాజా అతికుల్లా, ముస్లిము సముదాయం విభజనకి వ్యతిరేకమని ప్రకటించాడు.

బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా `వందేమాతరం’ ఉద్యమం విస్తరించింది. 16అక్టోబర్ 1905 తేదీన, 50000 మంది ప్రజలు గంగానది తీరాన రక్షాబంధనం కార్యక్రమంలో పాల్గొన్నారు. లాల్-బాల్-పాల్ త్రిమూర్తులుగా ఉద్యమాన్ని నిర్వహించారు, రవీంద్రనాథ్ టాగోర్, ఇతర నాయకులు ముందు నడిచారు. `వందేమాతరం’ మంత్రమై దేశాన్ని ఉత్తేజపరిచింది, ప్రజల్ని మేల్కొలిపింది.

కులం-మతం ప్రభావం ప్రజల్లో తగ్గుతోందని గమనించి, మింటో-మోర్లీలు 1906లో `ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక’ సిద్ధం చేసారు.

ముస్లిం లీగ్ స్థాపన

30 డిసెంబర్1906 తేదిన, ఆగాఖాన్ శాశ్వత అధ్యక్షతన, నవాబ్ సలీముల్లాఖాన్ నాయకత్వాన, `ముస్లిం లీగ్’ ప్రారంభమైంది. ఆగాఖాన్ షియా ఇమామ్ లలో, 48వ తరం వాడు.
ముస్లిం లీగ్ ముఖ్యోద్దేశాలు:
 • అ. బ్రిటిషువారి పట్ల అమితమైన విశ్వాసం
 • ఆ. ముస్లిముల రాజకీయ హక్కుల పరిరక్షణ
 • ఇ. పై రెండు ఉద్దేశాలకి లోబడి, ఇతర వర్గాలతో సఖ్యత.
అయితే పై ఉద్దేశాలకి సంబంధం లేకుండా, `లాల్ ఇష్తెహార్’ కరపత్రం సభ్యులకి పంచబడింది. దానిలో “ముస్లిములారా మేలుకోండి, హిందువులతో కలిసి ఒకే స్కూల్లో చదవకండి, హిందువుల దుకాణాల్లో ఏమీ కొనకండి, హిందువుల చేతులతో తయారైన ఏ వస్తువు ముట్టుకోకండి, హిందువులనిపనిలో పెట్టుకోకండి, హిందువుల కింద పనిచేయకండి. మీరు జ్ఞ్యానం పొందితే, హిందువులను నరకానికి (జెహన్నుం)పంపవచ్చు. మీ సంపద దోచుకుని హిందువులు ధనవంతులయారు. మీరు వివేకవంతులైతే, హిందువులు తిండిలేక మాడి, త్వరలో ముస్లిములు అవుతారు”

నేటి బంగ్లాదేశ్ లోని కొమిల్లా ఊర్లో, 4మార్చ్ తేదీన, మతఘర్షణలు, బలాత్కారాలు, దోపిడీ మొదలయ్యాయి. లాల్-బాల్-పాల్ నేతృత్వంలోని వందేమాతరం ఉద్యమ విజయంతో, బ్రిటీషు ప్రభుత్వం వెనకడుగు వేసి, బెంగాల్ విభజన రద్దు చేయక తప్పలేదు. ముస్లింలీగ్ దిగ్బ్రమ చెందింది. ఆగాఖాన్ రికార్డు ప్రకారం,మహమ్మద్ అలీ జిన్నా అనే లాయరు `ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక’ను వ్యతిరేకించాడు.

ఈ దశలో భారత స్వాతంత్ర్యోద్యమo ప్రపంచవ్యాప్తమవుతోంది. శ్యాంజీ కృష్ణవర్మ, లాలా హర్దయాళ్, రాశ్ బేహారి బోస్, వీర్ సావర్కర్, మేడం కామా, ఢిoగ్రా మొదలైన భారతీయ ఉద్యమ నాయకులు, భారత స్వేచ్చాస్ఫూర్తిని ప్రపంచమంతా వినిపించారు. 1910లో ఖుదీరాంబోస్ అనే 18సం. కుర్రవాడు, బ్రిటిష్ అధికారి కింగ్స్ ఫోర్డ్ మీద బాంబు విసిరాడు. అతని తెగువకి దేశం నివ్వెరపోయింది.

ముస్లిం వేర్పాటువాద ఖండన:

స్నేహితులు, కవులు, విప్లవకారులు బిస్మిల్- అష్ఫాక్ లను ఒకే రోజు వేర్వేరు జైళ్లలో ఉరితీశారు.  తిలక్ `గణపతి ఉత్సవ మండళ్ళు, శివాజీ జయంతి ఉత్సవాలు” ఏర్పాటుకు కాజీ సైఫుద్దీన్ మద్దతు పలికాడు. `టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక శివాజీ ముస్లిం వ్యతిరేకి అని ప్రకటించింది. ముల్లా-మౌల్వీల తీరుకు వ్యతిరేకంగా మరికొంతమంది ముస్లిములు ముందుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ముస్లిం - సంతుష్టీకరణ వైఖరి:

1888లోనే హిందువులు లేక ముస్లిములు వ్యతిరేకించే ఏ విధానాన్నికూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టదని అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ ప్రకటించాడు. కాంగ్రెస్ 1899నుంచే ముస్లిములకి ఉచిత టికెట్లు ఇచ్చేవారని స్వామీ శ్రద్ధానంద చెప్పారు.

1916లో జరిగిన లక్నో-ఒప్పందం ప్రకారం “ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక”ను తిలక్ వంటి రాజకీయ ఉద్ధండులు కూడా సమర్థించారు.  అప్పటి జాతీయ నాయకులలో మదన్ మోహన్ మాలవీయ ఒక్కరే వ్యతిరేకించారు.

1919 `ఖిలాఫత్ ఉద్యమం’ టర్కీలో `కెమాల్ పాషా’ను తిరిగి ఖలిఫాను చేయడానికి ఇక్కడ భారత్ లో ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది. ముస్లిం దేశాలలో ఉదారవాద సంస్కరణలు జరగాలని చెప్పిన`జమాలుద్దీన్ ఆఫ్ఘాని’కి కేమాల్ అనుచరుడు. ఈ సంగతి తెలియక, కాంగ్రెస్ పార్టీ `ఖిలాఫత్ ఉద్యమం’ లో చేరాలని, ముస్లింలీగ్ పట్టుబట్టింది. గాంధీగారు ఖిలాఫత్ కి మద్దతునిస్తూ `సహాయ నిరాకరణోద్యమాన్ని’ ప్రారంభించారు. తిలక్ లాంటి నాయకుడు కూడా దీనికి సహకరించారు.స్వామీ శ్రద్ధానంద జామామస్జిద్ నుంచి ప్రసంగించారు. ఆగాఖాన్, ఆమిర్ అలీ, కెమాల్ పాషాను కలిసినప్పుడు ఆయన “ఇస్లాం పరాజితులైన వారి మతం” అని, టర్కీని ఇస్లామిక్ మతరాజ్యంగా కాక,  `లౌకిక’ దేశంగా ప్రకటించారు!

మొదట్లో ముల్లాలు, మౌల్వీలు పెద్ద సంఖ్యలో గాంధీగారికి మద్దతిచ్చారు. ఇంత పెద్దసంఖ్యలో ముల్లాలు రాజకీయాల్లో చేరడంపై కొంచెం బెదిరిన జిన్నా, గాంధీగారి ఈ చర్యని వ్యతిరేకించడం ఆసక్తికరం.

ఖిలాఫత్ అనంతర పరిణామాలు

కేరళ మోప్లా ప్రాంతంలో, ముస్లింలు హిందువుల మీద పెద్దఎత్తున దాడులు, విధ్వంసం చేసారు. `సర్వెంట్స్ అఫ్ ఇండియా’ సంస్థ గణాంకాల ప్రకారం,1500మందిని ఊచకోత కోశారు, 20000మందిని మతమార్పిడి చేసారు, 1లక్షమంది ఇళ్ళనుంచి తరిమేయబడ్డారు. గర్భవతులు, ఆవులను కూడా వదిలిపెట్టలేదు. హిందూ, సిక్కు మగవాళ్ళను హత్యచేసి, ఆడవారిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. గాంధీగారిని `కాఫిర్’ అని ప్రకటించారు.

ఈ కాలం గురించి స్వామీ శ్రద్ధానంద ఇలా వ్రాసారు “జాతీయవాద ముస్లిములు కూడా `మోప్లా’కు మద్దతిచ్చారు.  గాంధీగారు `ముస్లిములు మత-పరాయణులు, ఇస్లాం మీద వారి అవగాహన ప్రకారం వారు ప్రవర్తించారు’ అన్నారు. `అనిబిసెంట్’ గాంధీగారిని తప్పుబట్టారు. తరువాత కాంగ్రెస్ ఖిలాఫత్ కి దూరంగా జరిగింది. అయితే మార్క్సిస్టు చరిత్రకారులు మాత్రం `మోప్లా’ని `జాతీయవాద’ ఉద్యమంగా పేర్కొనగా, కేరళ ప్రభుత్వం 1971లో వారిని `స్వాతంత్ర్య యోధులు’గా గుర్తించింది”.

ఒకప్పటి `స్వరాజ్ పార్టీ’ వ్యక్తి `సుహ్రావర్ది’ 1925లో ఇలా వ్రాసాడు – `ప్రతి సంవత్సరం ఇస్లాం వేలాదిమంది హిందువులని నామరూపాలు లేకుండా చేస్తుంది. హజ్ యాత్రకి మక్కా వెళ్ళినవారు స్వచ్చంగా తిరిగివచ్చి, అరేబియన్లలాగా జీవిస్తారు. వారికి మిగతా హిందువులకి చాలా వ్యత్యాసం అప్పుడు కనిపిస్తుంది’.

పునరాగమనం –`ఘర్ వాపసి’:

ఇస్లామిక్ మతమార్పిడులు అరికట్టలేకపోతే, హిందువుల మనుగడ ఉండదని స్వామీ శ్రద్ధానంద గ్రహించారు. 18000 ముస్లిములను 1923లో ఆయన హిందూమతంలోకి తిరిగి రప్పించారు. `తబ్లిగ్’ ఆచరించే ముస్లిములను కాంగ్రెస్ ప్రోత్సహిస్తూ, అదే సమయంలో`శుద్ధి ఉద్యమం’లోని హిందువులను నిషిద్ధంగా పరిగణించేదని ఆయన అర్ధం చేసుకున్నారు. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి 1926లో స్వామీజీని హత్య చేసాడు. ఒకరిపై విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళే నేరస్థులని చెప్తూ, గాంధీగారు రషీద్ కి మద్దతు ప్రకటించి, `సోదరుడు’ అని సంబోధించి, కాంగ్రెస్ నాయకుడు లాయరు `అసఫ్ అలీ’కి ఈ కేసును వాదించమని అప్పచెప్పారు. భగత్ సింగ్ జీవితం కాపాడమనే అభ్యర్ధనకి గాంధీగారు సంతకం పెట్టడానికి నిరాకరించారని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, గురుగోవింద్ సింగ్ మొదలైన వారిని `దారితప్పిన దేశభక్తులు’ అన్న గాంధీగారు, రషీద్ ని `సోదరుడు’ అని పేర్కొన్నారు.

1924లో ప్రతి హిందూ పండుగ మీద దాడి జరిగింది; `యంగ్ ఇండియా’ పత్రికలో వ్రాస్తూ గాంధీగారు ఇలా అన్నారు – “నా అనుభవంలో, సాధారణంగా ముస్లింలు ‘రౌడీల’ లాగా ప్రవర్తిస్తారు, సాధారణ హిందువులు `పిరికివారు’. హిందువులు తమ పిరికితనానికి ముస్లిములను అనడం ఏమి న్యాయం? పిరికివాళ్ళున్న చోట రౌడీలు పుట్టుకొస్తారు.”

కోహాట్ లో హిందువుల ఊచకోత

NWFP ప్రాంతం- 5%మాత్రమే హిందూ జనాభా ఉన్న ‘కోహాట్’ అనే చిన్న ఊరులో 150మంది హిందువులను ఊచకోత కోశారు. మిగిలిన వారు కట్టుబట్టలతో 320కి.మీ దూరంలో ఉన్న రావల్పిండి పారిపోయారు. హిందూ-ముస్లిముల సఖ్యత సాధించలేక, గాంధీగారు 21 రోజులు నిరాహారదీక్ష చేసారు. మహదేవ్ దేశాయిగారు దీక్ష ఎందుకు అని అడగగా “హిందువులు నన్ను అపార్థం చేసుకోవచ్చు,  ముస్లిం గూండాలవల్ల హిందూ స్త్రీలు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. హిందువులని సహనంతో ఉండమని నేనెలా అనగలను? నా మాట ఎవరు వింటారు? అయినా నేను ఇప్పుడు కూడా మరణానికి సిద్ధపడండి కాని, ఎవరినీ చంపవద్దనే హిందువులకి చెపుతాను” అన్నారు.

1924 ఏప్రిల్ 18 న రవీంద్రనాథ్ టాగోర్, `టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వ్రాసారు “ముస్లిములు వారి దేశభక్తిని ఒక దేశానికి పరిమితం చేసుకోలేరు.”

1924లో లాలా లాజపత్ రాయ్, సిఆర్ దాస్ కి లేఖ వ్రాస్తూ అన్నారు, “7కోట్ల భారతీయ ముస్లిములంటే కాదు భయం, కానీ 7కోట్లు+సాయుధులైన ఆఫ్ఘానిస్తాన్, మధ్య ఆసియా, అరేబియా, మెసొపొటేమియా, టర్కీ అన్నీ కలిపితే వారిని ఎదుర్కోలేము. హిందూ-ముస్లిం ఐక్యత మన కోరిక, ఆవశ్యకత. ముస్లిం నాయకులను నమ్మాలనే  ఉంది, కానీ ఖొరాన్, హాదిస్ ల ఆదేశాలను ఈ నాయకులు పాటిస్తారు.మీ మేధస్సు, వివేకం దీనికి పరిష్కారం చూపిస్తుందని ఆశిస్తున్నాను.”

పెరుగుతున్న కోరికలు/డిమాండ్లు: 4 నుంచి 14 అంశాలు; విభజన ప్రణాళిక
 • అ. ముంబై నుంచి సింద్ ని వేరు చేయడం
 • ఆ. NWFP, బలూచిస్తాన్ లను పూర్తి స్థాయి గవర్నర్ల-ప్రావిన్సులను చేయడం
 • ఇ.  పంజాబ్, బెంగాల్లలో అనుపాత (జనాభాకి అనుగుణంగా) ప్రాతినిధ్యం
 • ఈ. కేంద్ర శాసనసభలో 1/3 ముస్లిములు
 • ఉ.  + 14 ఇతర అంశాలు
1930లో కాంగ్రెస్ `పూర్ణ స్వరాజ్యం’ తీర్మానం చేసింది. అదే సంవత్సరం, ముస్లింలీగ్ అధ్యక్షుడిగా `ఇక్బాల్’ దేశవిభజన గురించి ఒత్తిడి తెచ్చాడు.

“ప్రత్యేక నియోజకవర్గం” అవార్డు- 1932-బ్రిటిష్ ప్రధాని `రామ్సే మెక్ డొనాల్డ్ ’

సిక్ఖులు, ముస్లిములు, క్రిస్టియన్లు, యూరోపియన్లు, అంగ్లోలు, అణగారిన వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించారు. అయితే హిందువులు `అల్పసంఖ్యాకులు’గా ఉన్న ప్రదేశాల్లో హిందువులకి మాత్రం మైనారిటీ హక్కులు లేవు. దీనిని డా. అంబేద్కర్ సమర్ధించగా, హిందూ సమాజాన్ని రక్షించడానికి గాంధీగారు వ్యతిరేకించారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధికారికంగా ఏ వ్యాఖ్యానమూ చేయలేదు. కాంగ్రెస్ వైఖరికి కోపగించి, పండిత్ మాలవీయ, భాయి పరమానంద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. అయితే 1937లో అన్ని ప్రాదేశిక (Provincial) ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, లీగ్ ఓడిపోయింది.1934లో భారత్ కి తిరిగివచ్చిన జిన్నాపై ఈ ఎన్నికలు ఎంతో ప్రభావం చూపాయి, లీగ్ పూర్తిగా వేర్పాటువాదం మొదలుపెట్టింది.

`హిందూమహాసభ’ స్థాపించిన వీర్ సావర్కర్ 1937లో “భారత్ లో హిందూ-ముస్లిములు ఒకే దేశoలో పక్కపక్కనే నివసిస్తున్న భిన్న జాతులు. ఇవి రెండూ ఒకటే అనుకోవడానికి లేదు” అన్నారు.  ఇతర జాతీయవాద నాయకులు తెల్లబోయారు. హిందూ భారత్- ముస్లిం భారత్ అని రెండు ఉండడానికి వీల్లేదు. భారత్ ఒకటే, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్  అని వేరువేరుగా ఉండవు అని సావర్కర్ గట్టిగా నమ్మారు.

జాతీయ చిహ్నాలకు ముప్పు

 • 1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశంలోనే, `వందేమాతరo’ గేయాలాపనకి అధ్యక్షుడు మౌలానా మొహమ్మద్ అలీ అభ్యంతరం చెప్పినా, విష్ణు దిగంబర్ పాలుస్కర్ పాట ఆపలేదు. 1922లోనే `సారే జహాన్ సె అచ్చా’ గీతాన్ని కాంగ్రెస్ ప్రత్యామ్నాయ గీతంగా ఆమోదించింది.  1937కల్లా వందేమాతరం గేయం కుదించబడింది.
 • 1931 జాతీయపతాక కమిటీ – పటేల్, మౌలానా ఆజాద్, నెహ్రు, తారాసింగ్, కలేల్కర్, డా.హర్దికర్, డా.పట్టాభి సీతారామయ్యల `పతాక’ కమిటీ, మధ్యలో నీలంరంగు చక్రంతో కాషాయ జెండాను ఆమోదించింది. అయినా తరువాత త్రివర్ణ పతాకాన్ని ఎంచుకున్నారు.
 • 1934లో భూషణ్ గారి `శివభవాని’ నిషేధించబడింది, ప్రసిద్ధ `రఘుపతి రాఘవ రాజారాం’ భజనలో `ఈశ్వర్ అల్లా తేరే నాం’ అని మార్చి పాడటం మొదలుపెట్టారు.
 • గోవధ నిరాటంకంగా కొనసాగింది. 1938లో జిన్నాకు లేఖ వ్రాస్తూ, ముస్లిముల హక్కులకు కాంగ్రెస్ ఏ విధమైన భంగం కలిగించదని నెహ్రూ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ రాజీనామా- లీగ్ ప్రవేశం
22డిసెంబర్ 1939- దేశనాయకులను మాటమాత్రం సంప్రదించకుండా, భారతదేశాన్ని రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొనేలా చేయడంపై నిరసనతో ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ రాజీనామా చేసింది. ముస్లింలీగ్ వెంటనే ఆ పదవులన్నిటినీ తమ మనుషులతో నింపేసింది. పెద్దసంఖ్యలోముస్లిములను అక్కడికి తరలించి, అస్సాం రాష్ట్రంలో ముస్లింలను అధికసంఖ్యాకులుగా చేసి, రాష్ట్ర జనాభా నిష్పత్తినే మార్చేసింది.

భారతదేశ విభజన చేసి, పాకిస్తాన్ ఏర్పరచాలని అప్పుడే ముస్లింలీగ్ వినతిపత్రం సమర్పించింది. ఈశాన్యం, తూర్పులో, ముస్లిము `రాష్ట్రాలు’ ఏర్పరచాలని కోరి, టైపింగ్ పొరపాటు దొర్లిందని చెప్పి, తరువాత పదాన్ని `రాష్ట్రం’ అని మార్పు చేసారు.

వీర్ సావర్కర్ పిలుపు- “సుశిక్షితులైన సైనికులుగా హిందువులు మారాలి. ప్రపంచమంతా కాగితపు తీర్మానాలు పరిచినా, స్వాతంత్ర్యం నీ దగ్గరకు నడిచిరాదు. భుజాల మీద తుపాకీలతో తీర్మానాలు చేస్తే, నువ్వు సాధిస్తావు.”

1942, క్రిప్స్ మిషన్ – హైదరాబాద్ `ముస్లిం రాజ్యం’లో కలుస్తుందని క్రిప్స్ హామీ ఇచ్చాడు. కాంగ్రెస్ `క్విట్ ఇండియా(భారత్ విడిచిపెట్టు) ఉద్యమానికి పిలుపు నిచ్చింది. జాతీయ విప్లవశక్తులు సరైన పద్ధతిలో నిర్వహించలేక ఉద్యమo నీరుగారిపోయింది. (JP)

బ్రిటిష్ – ముస్లింలీగ్ - కమ్యూనిస్టుల బంధం:

మొదట్లో హిట్లర్-స్టాలిన్ ప్రపంచయుద్ధంలో కలిసినప్పుడు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ బ్రిటిషు-వ్యతిరేకతను సమర్థించారు, తరువాత 1941లో జర్మనీ రష్యామీద దాడి చేసినప్పుడు, రష్యా-బ్రిటన్ యుద్ధంలో ఒకే పక్షం అయిన తరువాత, భారత్ లో కమ్యూనిస్టులు-ముస్లింలీగ్ దగ్గరయ్యారు.

1944 – 19 రోజుల గాంధీ-జిన్నా చర్చలు

జిన్నాతో చర్చలు చేయవద్దని శ్యామప్రసాద్ ముఖర్జీ గాంధీగారిని కోరారు. ద్విజాతీయ (రెండు దేశాల) సిద్ధాంతాన్ని గాంధి వ్యతిరేకించారు. “మతం మారిన వర్గం, వారి తర్వాతి తరాల వారు, వారి పూర్వీకులను కాదని తాము వేరే జాతి అని చెప్పుకోవడం చరిత్రలో ఎక్కడా లేదు” అన్నారు. జిన్నాని `కైద్-ఎ-ఆజం’ అని గాంధి సంబోధిస్తే, జిన్నా `మిస్టర్ గాంధి’ అనేవాడు. జిన్నాతో చర్చలు జరిపి గాంధీగారు జిన్నాకి ఒక స్థాయిని కల్పించారు.

1945-46 ఎన్నికలు

లీగ్ పాకిస్తాన్ కోసం కోరిన 5 ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో(provinces)- బలూచిస్తాన్, పంజాబ్, NWFP, సింద్, బెంగాల్ లలో – కేవలం సింద్ మరియు బెంగాల్ లు రెండు మాత్రమే లీగ్ గెలిచింది. బలహీనపడుతున్నామనే అనుమానం రావడంతో ముస్లింలీగ్ 16ఆగస్ట్ 1946 తేదిన `ప్రత్యక్షచర్య’కు పిలుపునిచ్చింది.

16 ఆగస్ట్ 1946 – ప్రత్యక్షచర్య 

జిన్నా హిందువులమీద జిహాద్ ప్రకటించాడు. సింద్, బెంగాల్ ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో, 16ఆగస్ట్ సెలవు ప్రకటించి మరీ, జిహాదీ మూకలు హిందువులను దొరికినవారిని దొరికినట్టే ఊచకోతకి గురిచేసారు. ఈ రాష్ట్రాల్లో, 70%పొలీసులు ముస్లిములైనందువల్ల, వారు ఆ మూకలతో కలిసిపోయారు. బెంగాల్లో ప్రధాని సుహ్రావర్ది పాల్గొన్న సమావేశంలో, వక్తలందరూ హిందువులపై జిహాద్ చేయమని పిలుపునిచ్చారు. హిందువులు ఎదురుతిరగగానే, సైన్యాన్ని రప్పించారు. ఒక్క కలకత్తా మహానగరంలోనే 10000 స్త్రీపురుషులని చంపేశారు, 15000మంది గాయపడ్డారు, 1లక్షకిపైగా ప్రజలు నిర్వాసితులయారు.

తరువాత నౌఖలిలో మారణకాండ మొదలు పెట్టారు. ఒక విదేశీ వనిత మిస్ మ్యురల్ లెస్టర్ 6నవంబర్1946 ఒక క్యాంపు నుంచి వ్రాసింది, “స్త్రీలు తమ భర్తలు హత్యచేయబడటం చూడడమే కాక, ఆ స్త్రీలనే బలవంతంగా మతమార్పిడి చేసి, వారి భర్తలను చంపినవారితోనే వారికి పెళ్లిళ్లు చేసారు. ముల్లాలు, మౌల్వీలు జిహాదీలతో పాటు ఉండి, మతమార్పిడిలు చేయించారు”. సుచేత, ఆచార్య కృపలానీలు గవర్నర్ ను కలిసి సామూహిక హత్యలు, మతమార్పిడుల గురించి చెప్పగా, ముస్లిముల కన్నా హిందూ స్త్రీలు అందంగా ఉంటారు కాబట్టి అది సహజమే అన్నాడు.

ఇట్లా ధ్వంసమైన ప్రదేశాలకు మొదట చేరుకున్నవారు శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆయన హిందువుల రక్షణ కోసం పాటుపడ్డారు. అల్లర్లు బెంగాల్ నుంచి బిహార్ కు పాకాయి, అయితే వ్యత్యాసం ఏమిటoటే, బెంగాల్ ప్రభుత్వం జిహాదీలకు తోడ్పడగా, బిహార్లో అలా జరగలేదు. లీగ్ `ప్రత్యక్షచర్య’ కాశ్మీరుకి, NWFPకి చేరుకుంది. ఖాల్సా అనే గ్రామంలో, సుదీర్ఘ పోరాటం తరువాత, హిందూ-సిక్ఖు పురుషులందరూ హత్యకు గురికాగా, శ్రీమతి లాజవంతి ముందు నడవగా తమ మానరక్షణకై 74మంది స్త్రీలు బావిలో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు.

చర్చిల్ - జిన్నా కూటమి

చర్చిల్-జిన్నాలు మారుపేర్లతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు, అవి1982లో బయటపడ్డాయి. ఇంగ్లాండ్ రాణి, రాజు పాకిస్తాన్ ఏర్పాటుకి సుముఖంగానే ఉన్నారని తన ఇంగ్లాండ్ యాత్రలో జిన్నా గ్రహించాడు.

22 మార్చ్ 1947, మౌంట్.బాటన్ భారత్ ఆగమనం

గాంధీగారు మౌంట్ బాటన్ తో తమ మొదటి సమావేశంలోనే దేశవిభజన వ్యతిరేకించారు. కాబినెట్ రద్దు చేసి, జిన్నా పూర్తి ముస్లిం సభ్యులతో తన సొంత కాబినెట్ ఏర్పరచుకోవచ్చని గాంధీ ప్రతిపాదించారు. కేంద్రంలో జరుగుతున్న సంఘటనలు గాంధీగారికి తెలియడంలేదని నెహ్రూ అన్నాడు. తన ప్రతిపాదనకు అంగీకారం కుదరట్లేదు కాబట్టి, తాను తప్పుకుంటానని, కాంగ్రెస్ CWCయే తదుపరి చర్చలు చేస్తుందని వైస్రాయ్ కి గాంధి లేఖ వ్రాసారు.

స్పష్టమైన విభజనతో రెండు  వేర్వేరు దేశాలు ఏర్పాటుకి తాను సుముఖమేనని సర్దార్ పటేల్ చెప్పారు, నెహ్రూ, రాజేంద్రప్రసాద్ విభజనకి అంగీకారం తెలిపారు. ముస్లిముల ప్రయోజనం దృష్ట్యా గాంధీగారి ప్రతిపాదనే సరైనదని మౌలానా అన్నారు.

శ్యామప్రసాద్ ముఖర్జీ పశ్చిమబెంగాల్, తూర్పు పంజాబ్ భారత్ లో ఉంచడానికి, హిందువులను జాగృతపరచడానికి ఎంతో ప్రయాసపడ్డారు. ముస్లింలీగ్ లాహోర్ తీర్మానానికి అనుగుణంగానే ఈ సూచన ఉందని రాజేంద్రప్రసాద్ జిన్నాకి గుర్తు చేసారు. ఇంతలోనే, తూర్పు-పశ్చిమ పాకిస్తాన్ ను కలుపుతూ, 800మైళ్ళ కారిడార్/దారి ఉండాలని జిన్నా కొత్త డిమాండ్ లేవనెత్తాడు.

వి.పి. మీనన్ విభజనకి ముసాయిదా ప్రణాళిక తయారు చేసారు. కొద్దిరోజులముందే గాంధీగారు వైస్రాయ్ మౌంట్ బాటన్ తో, “కాంగ్రెస్ నాతో లేకపోవచ్చు, కానీ భారత ప్రజలు నాతో ఉన్నారు” అన్నారు. తరువాత ఆయనే ఒక బహిరంగ సభలో, “వైస్రాయ్ కి విభజన ఇష్టంలేదు, కానీ హిందూ-ముస్లిములు కలిసి జీవించలేకపోతున్నారు కాబట్టి, తప్పనిససరై ఒప్పుకుంటున్నారు” అన్నారు. “నన్ను ముక్కలు చేసి తరువాత దేశాన్ని ముక్కలు చేయండి” అన్న ఆయన ఆ సంగతి గుర్తు చేస్తే, “ప్రజాభిప్రాయం నాకు వ్యతిరేకంగా ఉంటే, నేను బలవంతంగా దాన్ని మార్చగలనా?” అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా ఆజాద్, విభజన తాత్కాలికమే అనే ఆశతో, విభజన తీర్మానం చేస్తున్నానని అన్నారు. పురుషోత్తం దాస్ టాండన్ చివరిదాకా కూడా, “ఇంకా కొంతకాలం బ్రిటిష్ పాలన ఉంటే నష్టమేమీ లేదు, కాని మన లక్ష్యమైన అఖండ భారత్ ను మనం పోగొట్టుకోలేము. అవసరం వస్తే బ్రిటిషువారితోపాటు, లీగ్ తో కూడా పోరాడుదాము, దేశాన్ని రక్షించుకుందాము” అని కరతాళధ్వనుల మధ్య అన్నారు. కానీ గాంధీగారు, విభజన వైపే మొగ్గు చూపారు. గాంధీగారు తన ప్రసంగంలో “సమయముంటే నేను మాత్రం ఒప్పుకుంటానా? వేరే ప్రత్యామ్నాయ నాయకత్వం లేనప్పుడు, ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వాన్ని సవాలుచేసి, ప్రజలకు కాంగ్రెస్ పైన ఉన్న నమ్మకాన్ని చెడగొట్టలేను. ఈ రోజు నాకా శక్తి లేదు, ఉంటే తిరుగుబాటు చేసేవాడిని” అన్నారు. అయితే నెహ్రు `మోస్లి’తో అన్నమాట మనం గుర్తు తెచ్చుకోవాలి, `గాంధీగారు చెప్పిఉంటే, పోరాడుతూనే ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం.’

త్వరిత నిర్ణయం వెనుక కారణం – తిరుగుబాటు భయం

దేశవిభజన జూన్ 1948 నుంచి ఆగస్ట్1947కి, అంటే ఏకంగా పది నెలలు ముందుకి జరిపారు. దాదాపు భారతీయ అధికారులందరూ విభజనకి వ్యతిరేకులే. భారతీయ నావికాదళంలో జరిగిన తిరుగుబాటుతో, దేశంలో ఉద్రేకపూరితమైన వాతావరణం ఉంది. మోస్లీ వ్రాసారు – “మే1947లో భారతవిభజన ప్రకటించి, జూన్ దాకా సైన్యవిభజన మాట ఎత్తలేదు.  జూన్ చివరిదాకా `సరిహద్దు కమిషన్’ను ఏర్పాటు చేయలేదు. స్వాతంత్ర్యం వచ్చిన రెండు రోజులు తర్వాత దాకా, ప్రజలు ఎటువైపు ఉంటారో వారికి తెలియనియ్యకుండా అంధకారంలో ఉంచారు.”

రాడ్ క్లిఫ్ సరిహద్దు కమిషన్

17ఆగస్ట్ దాకా తమ ఉత్తర్వులని ఇవ్వకుండా పొడిగించి, సమస్యను మరింత జటిలం చేసింది ప్రభుత్వం. సిరిల్ రాడ్ క్లిఫ్ తూర్పు-పశ్చిమ దిక్కులు రెండువైపులా సరిహద్దు కమిషన్ ఏక అధ్యక్షుడు. ఒకే సభ్యుడున్న కమిషన్ కి ఒప్పుకుని కాంగ్రెస్ మళ్ళీ పొరపాటు చేసింది. కమిషన్ లో ఇతర సభ్యులు ఎవరనేది కూడా గోప్యంగా ఉంచారు. ముస్లింలీగ్, నగరాల్లోని ముస్లిముల సంఖ్య గురించి తప్పుడు లెక్ఖలు చూపించింది. అసలుకంటే సంఖ్య ఎక్కువచేసి చూపింది. పంజాబ్ కమిషన్ సభ్యులు ఎం.సి.మహాజన్, తేజ్ సింగ్ `లాహోర్’ నగరం భారతదేశoలోనే ఉంటుందని ఎంత ధీమాగా ఉన్నారంటే, వారు స్వయంగా కూడా భారత్ కి వలసవచ్చే ఏర్పాట్ల చేసుకోలేదు. ముస్లిములు 25% మాత్రమే ఉన్న లాహోర్ పాకిస్తాన్ కి ఇచ్చేసారు. సాగునీటి కాలువల వ్యవస్థ, చాలా సారవంతమైన పంటభూములు, చారిత్రక సిక్ఖు గురుద్వారాలు ఉన్న మహాపట్టణం లాహోరును పాకిస్తాన్ కు బహుమతిగా ఇచ్చేసారు. ఒక్క దెబ్బతో 40%ప్రజలు నిర్వాసితులు అయ్యారు. హిందువులకి రూ.4000కోట్ల నష్టం జరిగితే, ముస్లిములు ఏమాత్రం నష్టపోలేదు. ఇదే విషాద కధ చిట్టగాంగ్ హిల్స్ కూడా జరిగింది, హిందువులు అత్యధిక సంఖ్యలో ఉన్న చిట్టగాంగ్, తూర్పు పాకిస్తాన్ కు ఇచ్చేసారు.  19%జనాభా నిష్పత్తి ఉంటే 23% భూభాగం పాకిస్తాన్ కు లభించింది.

మహాప్రళయం

 “ఎటువంటి రక్తపాతం, అల్లర్లు ఉండవని నేను హామీ ఇస్తున్నాను, నేను సైనికుణ్ణి, సామాన్య పౌరుణ్ణి కాదు”అంటూ మౌంట్ బాటన్  ప్రగల్భాలు పలికాడు. భారతచరిత్రలో ఎన్నడూ ఎవరూ చూడని మహాప్రళయం సంభవించింది. కాంగ్రెస్ నిరాకరించిన జనాభా బదలాయింపు మొదలైంది. జనం కుటుంబాలతో మూటాముల్లె సర్దుకుని ఎడ్లబండ్లలో, కాలినడకన ప్రయాణమై వస్తుంటే, వేలాది మందిని చంపేసి, దోపిడీ చేసారు.  ప్రపంచచరిత్రలో అంతకుముందు కనీవినీ ఎరుగని అతిపెద్ద జనాభా మార్పిడి ఇది. రాజధాని ఢిల్లీలో అతి ప్రమాదకర పరిస్థితి ఉత్పన్నమౌతోంది. ఢిల్లీలో ప్రతి 4వ వ్యక్తి, పాకిస్తాన్ నుంచి భారతానికి  వచ్చిన హిందూ లేక సిక్ఖు కాందిశీకుడే. అలా దిక్కులేనివాళ్లైన వారు ముస్లిముల మీద, కాంగ్రెస్ మీద ఆగ్రహంగా ఉన్నారు.

వారి సహాయానికి ఆర్ఎస్ఎస్

పోలీసుల్లో ఎక్కువ శాతం ముస్లిములే. ‘హిందూ అధికారులను హత్యచేసి, పాకిస్తాన్ జెండాను ఢిల్లీ ఎర్రకోట మీద 10సెప్టెంబర్1947నఎగరవేసే కుట్ర గురించి ఆర్ఎస్ఎస్ యువకార్యకర్తలు పటేల్, నెహ్రులకు సమయానికి హెచ్చరించగలిగారని నాకు తెలిసింది’ అని భారతరత్న భగవాన్ దాస్  చెప్పారు. లక్షలాది హిందువులను చంపి, మిగతావాళ్ళ మతంమార్చాలని కుట్ర జరిగింది. రూ.55కోట్లు అదనంగా పాకిస్తాన్ కు ఇవ్వాలని పట్టుబట్టి గాంధీగారు నిరాహారదీక్ష మొదలుపెట్టారు.

ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చూపిన ధైర్యం, సేవాతత్పరత గురించి ఏ.ఎన్.బాలి ఇలా అన్నారు – “పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి కాందిశీకుడు, భారతలో ఎక్కడున్నా, ఆర్ఎస్ఎస్ వారికి ఎల్లప్పుడూ ఋణపడిఉంటారు. కాందిశీకులను అందరూ దిక్కులేనివారిలా వదిలేస్తే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రం ఎనలేని సహాయం చేశారు.”

విలీనం - సమీకృతం

600 రాజ్యాలు భారతరాజ్యంలో విలీనమయ్యాయి. కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలపమని మౌంట్ బాటన్, మహారాజా హరిసింగ్ కి చెప్పినా, 1947 అక్టోబర్ 17న గురూజీ గోల్వాల్కర్ కాశ్మీరును భారత్ లో విలీనం చేయమని మహారాజుని ఒప్పించారు. అక్టోబర్ 23న, జనరల్ అక్బర్ ఖాన్ సేన ముందుండి నడిపించగా, పాకిస్తాన్ తెగలు కాశ్మీరును ఆక్రమించాయి. బ్రిటిష్ సైన్యాధికారులు, మహారాజా హరిసింగ్ కు ఎదురు తిరిగి, గిల్గిట్ పర్వత ప్రాంతాన్ని పాకిస్తాన్ కు అప్పజెప్పారు. భారతీయ వాయుసేన విమానాలు దిగడానికి వీలుగా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు సమయానికి శ్రీనగర్ విమానాశ్రయంలో మంచును తొలగించారు. నవంబర్ 21న, కాశ్మీర్ అంశాన్ని నెహ్రు ఐక్యరాజ్యసమితి (UN)కి తీసుకెళ్ళారు.

హైదరాబాద్

రజాకార్ నాయకుడు కాసిం రిజ్వీ, భారతదేశానికి- హిందువులకి వ్యతిరేకంగా విషపూరిత ప్రచారం చేసాడు. 2లక్షల రజాకార్లు, 40,000 హైదరాబాద్ రాజ్య సైన్యంలో ఉన్నవారు కలిసి దాడికి దిగారు. రజాకార్లు కమ్యూనిష్టులలో కూడా కలిసిపోయారు.  హైదరాబాద్ లోకి ప్రవేశించిన భారతీయ సేన జరిపిన `ఆపరేషన్ పోలో’ కేవలం 108గంటల్లో ముగిసింది.

ఉదయపూర్ మహారాజు వ్యక్తిత్వం

పశ్చిమాన జోధపుర్, తూర్పున ఇందోర్, భోపాల్ రాజ్యాలున్న ఉదయపూర్ రాజ్యం పాకిస్తాన్ లో కలిస్తే తప్ప  పాకిస్తాన్లో కలవాలన్న భోపాల్ నవాబు కోరిక తీరదు. ఉదయపూర్ రాజు, “నా పూర్వీకులే నా భవిత నిర్ణయించారు. వారే మెచ్చుకోలుకి లొంగిపోయి ఉంటే, హైదరాబాద్ అంత పెద్ద రాజ్యం మాకుండేది. వాళ్ళు లొంగలేదు, నేనూ అంతే; నేను భారత దేశంలోనే ఉంటాను” అన్నారు.

దేశ విభజన నిజంగా అనివార్యమా?
నావికాదళ తిరుగుబాటు మరియు భారత సైన్య విచారణల(INA)వల్ల, భారత సైన్యంలో, భారత అనుకూల స్పందన బాగా పెరిగింది.  ఇవన్నీ సర్వసైన్యాధికారి CIC క్లాడ్ ఆచిన్లెక్ ను పెద్ద సంశయంలో నేట్టేసాయి.
 • ➣ బ్రిటిష్ పార్లమెంట్`హౌస్ అఫ్ కామన్స్’లో స్టాఫోర్డ్ క్రిప్స్ మాట్లాడుతూ, “భారత్ వదిలిరాకపోతే, ప్రత్యామ్నాయంగా భారీ సంఖ్యలో సైన్యాన్ని, పాలనా యంత్రాంగాన్ని పెంచాలి. బ్రిటిష్ జాతీయ విధానం మరియు అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా అది రాజకీయంగా సులభం కాదు.”
 • ➣ INA విచారణలు,నావికాదళ తిరుగుబాటు వల్ల, భారత సైన్యంలో జాతీయ భావాల స్పందన బాగా పెరగడంతో, బ్రిటిషువారు ఏమవుతుందో అని భయభ్రాంతులయారు. ఏదేమైనా దేశాన్ని విభజించి వదిలి వెళ్లిపోవాలనే నిశ్చయానికొచ్చారు.
 • ➣ వైస్రాయ్ గా భారత్ రావడానికి ఎలా ఒప్పుకున్నాడో మౌంట్.బాట్టెన్ వివరిస్తూ, “భారతలో మనపని అయిపొయింది. అక్కడి పరిస్థితి గందరగోళంగా అధ్వాన్నంగా ఉంది, నువ్వు వెళ్లి అన్నీ ఒక కొలిక్కి తేవాలి” అని ప్రధాని చర్చిల్ అన్నారని చెప్పాడు.
 • ➣ ముస్లింలీగ్ కూడా బలహీనంగానే ఉండేది. ఢిల్లీ ముస్లిములు పటేల్ గారితో “మీరు లీగ్ కి వ్యతిరేకంగా ధృడంగా నిలబడండి, మీ వెనుక మేముంటాము, లీగ్ మరింత బలహీనపడుతుంది.ముస్లిములు కాంగ్రెస్ వైపే వస్తారు” అని చెప్పేవారు. ఎందుకంటే ముస్లింలీగ్లో మొదటినుంచి అష్రఫీలు బలంగా ఉండేవారు, వారికి నిమ్నవర్గాల స్థానిక ముస్లిములపట్ల చిన్నచూపు ఉండేది.
 • ➣ 1949 న్యుయోర్క్ నగరంలో నెహ్రూ ఒప్పుకున్నారు, “విభజనానంతర భయంకర పరిణామాలు తెలిసుంటే, విభజన అంగీకరించేవాళ్ళం కాదు.” కాంగ్రెస్ నాయకత్వం అప్పటికే పోరాటాలతో అలసిపోయింది. ముస్లిముల మధ్యనున్న విభేదాలను ఎలా రాజకీయంగా ఉపయోగించుకోవాలో కాంగ్రెస్ కి తెలియలేదు. గాంధేయ పద్ధతులు  బ్రిటిషువారితో కొంత సత్ఫలితాలనే ఇచ్చినా, ముస్లిం వేర్పాటువాదుల హిందూ-వ్యతిరేక క్రూర పైశాచిక దాడులముందు పనిచేయలేదు.

ఎందుకు మనం ఓడిపోయాము?
 • 1. కాంగ్రెస్ లో సైద్ధాంతిక బలం లేకపోవడం. జాతీయవాదభావం లేక, దేశం అంటే కేవలం భౌగోళిక ప్రాంతాలు, రాజకీయాలు మాత్రమే అనుకోవడం ప్రధాన కారణం.
 • 2. జాతీయ నిబద్ధత లేకపోవడం- స్వాతంత్ర్యం -స్వరాజ్యం ఎందుకు అనే విషయం మర్చిపోయారు. స్వాతంత్ర్య సమర స్ఫూర్తి, ఆదార్శాలు, ఆకాంక్షలు అన్నీ గాలికొదిలేశారు.
 • 3. అన్నదమ్ములమధ్య విబేధాలు, విభజన లాగా చూసారు. కానీ తల్లిని ముక్కలు చేస్తారా?
 • 4. జాతీయ సమైక్యత, సమగ్రతల కన్నా, ముస్లిం సంతుష్టీకరణ ఎక్కువైంది. హిందూ-ముస్లిం ఐక్యత లేకపోతే స్వాతంత్ర్యం అఖర్లేదు అన్నారు. దానికి బదులుగా, `మీరు మాతో కలిస్తే, మీతో పాటు; మీరు మాతో కలవకపోతే, మీరు లేకున్నా మేము ముందుకి వెళ్తాము; మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తే, మిమ్మల్ని దాటుకుని వెళ్తాము’ అనే విధానం ఉండాల్సింది.
 • 5. ప్రఖ్యాత చరిత్రకారుడు `అర్నాల్డ్ టోయన్బీ’, “అసలు పాకిస్తాన్ ఏంటి? భారతదేశాన్ని పూర్తిగా పరాజితను చేయాలన్న 1200సంవత్సరాల ముస్లిముల కలను మొదటిసారి 20వ శతాబ్దంలో సాధించారు” అన్నారు.
 • 6. శరత్ చంద్ర చటర్జీ ఇలా వ్రాసారు – “అమెరికన్లు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు, సగంపైగా ప్రజలు బ్రిటిషువారితోనే ఉన్నారు. ఐరిష్ పోరాటంలో, నిజానికి ఎంతమంది పోరాటంలో పాల్గొన్నారు? ఎంతమంది ఏ పోరాటంలో ఉన్నారని సంఖ్య లెక్కపెట్టుకోవడంకాదు, ఆ ధ్యేయసాధనకై చేసిన తపస్సు, దాని తేజస్సు-తీక్షణతలపై తప్పొప్పుల నిర్ణయం జరుగుతుంది. ‘హిందూ-ముస్లిం ఐక్యత లేకుండా, స్వరాజ్యం లేదు అనడం’ హిందువులకి ఘోర అవమానం”.
 • 7. డా. రామమనోహర్ లోహియా ఇలా అంటారు, “క్షీణించిన కాంగ్రెస్ నాయకత్వం, భయంకరమైన మతఘర్షణలు, విభజనకు కారణమైనాయి. యువ నాయకత్వం ఉంటె దేశవిభజన జరిగి ఉండేది కాదు. ఆ సమయంలో ఏ ఒక్క నాయకుడు జైల్లో లేడు. విభజన కాలంలో నేను ఏమీ చేయలేదని చాలా బాధపడుతున్నాను.”
 • 8. 1960లో లియోనార్డ్ మోస్లితో మాట్లాడుతూ నెహ్రూ ఇలా అన్నారు – “ మేము అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాము, అలసిపోయాము. మళ్ళి జైలుకి వెళ్ళే ఓపికలేదు. మాకు అఖండ అవిభాజిత భారతం కావాలని అడిగితే, జైలుకి వెళ్ళేవాళ్లము.” (లియోనార్డ్ మోస్లి `ది బ్రిటిష్ రాజ్’ నుంచి).
(భారత విభజనకి దారితీసిన ఘటనల సంక్షిప్త చరిత్ర ఇది.  హెచ్. వి. శేషాద్రిగారి ఇంగ్లీషు గ్రంథం `Tragic Story of Partition’ ఆధారం. )

అనువాదం: ప్రదక్షిణ, విశ్వ సంవాద కేంద్రము