"కరసేవకుల దహనం' - చరిత్రలో ముసురువలేని మతరక్కసి జడలిప్పి నాట్యమాడిన రోజు - Godhra Train Burning

0
"కరసేవకుల దహనం' - చరిత్రలో ముసురువలేని మతరక్కసి జడలిప్పి నాట్యమాడిన రోజు - Godhra Train Burning

మతరక్కసి జడలిప్పి నాట్యమాడిన రోజు :-
అది దేశమంతా దాదాపు దూరదర్శన్ చూసే రోజులు.. ఆ రోజు ఫిబ్రవరి-27,2002 దేశం నలుమూలల నుండి అయోధ్య చేరిన కరసేవకులు VHP అనుబంధ సంస్ధలు నిర్వహించిన ''పూర్ణాహుతి మహాయజ్ఞం'' అనే కార్యక్రమాన్ని ముగించుకుని 1700 మంది అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్సప్రెస్ లో ప్రయాణిస్తున్నారు.!!

సమయం ఉదయం 7:43 అప్పటికే రైలు గోద్రా స్టేషన్ దాటింది.. ఉన్నపళంగా రైలు అత్యవసర చైన్ అనేకసార్లు లాగబడి రైలు ఆగిపోయింది.. అంతే దాదాపు 1540 మంది ముస్లింలు రైలుపై మొదట రాళ్లు రువ్వి గాయపరిచారు,ఆ తరువాత ముందుగానే సిద్ధంచేసి ఉంచబడిన 146 లీటర్ల (అధికారికంగా సాక్ష్యాలతో నిరూపితం అయ్యింది మాత్రమే) పెట్రోలుతో రైలుపై విరుచుకుపడ్డారు.. S-6 కోచ్ అందుకు వేదిక అయ్యింది.. అంతే 27 మంది మహిళలు 10 మంది పసిపిల్లలతో సహా 59 మందిని సజీవదహనం చేశారు.. 48 మంది అత్యంత క్రూరంగా,కోలుకోలేని విధంగా గాయపడ్డారు.!! 

విషయం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి బయలుదేరింది.. ఆ గుర్తుతెలియని(ఇస్లాం) గుంపు అగ్నిమాపక వాహనాన్ని,సిబ్బందిని అడ్డుకుంది..అగ్నిమాపక  సిబ్బందిని కాపాడటానికి వెళ్లిన పోలీసులను కూడా విచక్షణ రహితంగా గాయపరిచారు, ఈ దుర్ఘటనకు గోద్రాలోని ముస్లిం మతాధికారి మౌల్వి హుస్సేన్ హాజీ ఇబ్రహీం ఉమర్జీ,ననుమియన్ అనే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారిని,హాజీ బిలాల్ అనే గోద్రా పట్టణ కౌన్సిలర్ (కాంగ్రెస్ కార్యకర్త),ముస్లిం రాడికల్ గ్రూప్ హర్కత్-ఉల్ జెహాద్-ఇ-ఇస్లామికి కమాండర్..,గోద్రా మునిసిపాలిటీ అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్ కలోటా., ప్రధాన నిందితుడుగా పరిగణించబడ్డ హుస్సేన్ సులేమాన్ మొహమ్మద్‌ మరియు ఇంకొంత మంది ఉగ్రవాద మూకల్లోని కీలకసభ్యులు ఈ ఆపరేషన్ వెనుక సూత్రధారులు..
   సంవత్సరాల పాటు జరిగిన అనేక విచారణలు,కమిటీలు,కోర్టుల తీర్పుల అనంతరం 107 మందిపై అభియోగాలు మోపి అరెస్టు చేసి, 31 మందిని దోషులుగా తేల్చి 63 మందిని నిర్దోషులుగా తేల్చి 11 మందికి మరణశిక్ష వేసి ఆ తర్వాత దాన్నికూడా జీవితఖైదుగా మార్చి 31 మందిని జీవితఖైదు చేశాయి న్యాయస్థానాలు.. అయినప్పటికీ ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందువులకి ఎటువంటి న్యాయం చేయలేకపోయాయి మన చట్టాలు,న్యాయస్థానాలు..

ఈ ఘటన అంతటిని అప్పుడప్పుడే ఏర్పడ్డ నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని అబాసపాలు చేయడానికి కాంగీ,కమ్మీలు వాడినప్పటికీ.. వాటిని ఎదిరించి తదుపరి ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. అడ్డుకోలేని శక్తిగా మారి ప్రధాని పీఠాన్ని అధిష్టించాడు.. గోద్రా అల్లర్లకు అత్యంత హేయంగా అవమానించబడిన,అనుమానించబడిన వ్యక్తి  ఎవరైనా ఉన్నారంటే అది మోడీ గారే..

ప్రాణాలు కోల్పోయిన 59 మందికి సంతాపం వ్యక్తం చేస్తూ.. హిందువులపై  జరిగిన ఆ కీచక పర్వాన్ని గుర్తుచేస్కుని బాధను దిగమింగుతూ.. హిందువులపై వారి సొంతగడ్డపై జరుగుతున్న దాడులని పసిగట్టి మేల్కోవాలని హెచ్చరిస్తూ... 

జై హింద్....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top