ధీరవనిత "రాణి దుర్గావతి" - Rani Durgavati

0
ధీరవనిత "రాణి దుర్గావతి" - Rani Durgavati
ధీరవనిత "రాణి దుర్గావతి" - Rani Durgavati
రాణి దుర్గావతి 1550 నుండి 1564 వరకు గోండ్‌వానా  రాజ్యమును పరిపాలించింది. ఆమె ప్రఖ్యాతిగాంచిన ఛండేల రాజవంశమునకు చెందిన కీరట్‌రాయ్‌ అనే రాజుకు జన్మించింది. ఆమెకు తన రాజ్యమును సంరక్షిస్తూ అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఎక్కువ. ఆమె. వ్యక్తిత్వంలో సౌందర్యము, రాజసము, అద్భుత విజయములు, నిస్వార్ధ వీరత్వము కలగలిసి ఉన్నాయి. ఆమె తన రాజ్యముపై మాళ్వరాజు బాజ్‌ బహద్దూర్‌ చేసిన దాడిని వీరోచితంగా ఎదుర్శొని, మొగలు చక్రవర్తుల సార్వభౌమత్వమునకు ఎదురొడ్డి నిలిచింది.

అబుల్‌ ఫజల్‌ 'అక్చర్‌నామా'లో దుర్గావతి దేవిని గురించి ఇలా వ్రాశారు. “దూరదృష్టితో ఆమె చాలా గొప్పపనులు చేసింది. బాజ్‌ బహద్దూర్‌ మరియు మియాన్స్‌తో చాలా సార్లు యుద్ధం చేసి గెలిచింది. ఆమెకు 20,000 అశ్విక దళం, 1000 ఏనుగులు ఉండేవి. _ తుపాకీ _ ఉపయోగించడంలోనూ, _ బాణము వేయడములోనూ ఆమె అత్యంత ప్రతిభావంతురాలు. ఏదైనా క్రూర జంతువు జనసామన్యంలోకి అడుగుపెట్టిందని వింటే చాలు, ఆ జంతువును తుపాకీతో వేటాడి చంపిగాని నిద్రపోయేది కాదు”.

అక్బర్‌ ఆజ్ఞతో తనతో పోరాడవచ్చిన ఆసఫ్‌ ఖాన్‌తో ఆమె ముఖాముఖి తలపడింది. ఒక సైన్యాధిపతి 'అంతటివారితో తలపడగలమా' అని రాణిని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా ఆమె “యుద్ధము చేయలేదన్న అవమానము కన్నా గౌరవముతో, పరాక్రమముతో చనిపోవుట మేలు. ఆ చక్రవర్తే నిజాయితీ పరుడై వచ్చి ఉంటే నేను ఆతనితో యుద్ధము విషయము మాట్లాడేదాన్ని కానీ అతడికి నా సంగతేం తెలుసు? యుద్ధములో వీరమరణమే మేలు” అని కవచం తొడిగి, ఏనుగునెక్కి ధనుర్భాణాలు ప్రక్కన పెట్టుకొని, ఒక పెద్ద బల్లెము చేత ధరించి సైన్యము ముందు నిలిచి యుద్ధానికి బయలుదేరింది. స్వాతంత్ర్యము నందు అనురక్తి, రాణీ దుర్గావతి స్ఫూర్తి ప్రతీ హృదయాన్ని సాహసవంతం చేశాయి.

ఆమె సేనలు రెండుసార్లు మొగలాయి సేనలను చిత్తుగా ఓడించాయి. ఆమె సంపూర్ణముగా మొగలులను నిర్జించడానికి ఆనాడు రాత్రి కూడా యుద్ధం చేద్దామన్నది. కానీ ఆమె సైన్యాధిపతులు అందుకు ఒప్పుకోలేదు. మరుసటిరోజు యుద్ధములో ఆమె పుత్రుడు వీరనారాయణుడు తీవ్రంగా గాయపడ్డాడు. అది చూసి చాలామంది సైనికులు భయంతో పారిపోగా కేవలం 800 మంది మిగిలారు. కానీ సాహసి, నిర్భయురాలైన దుర్గావతి ఏనుగునెక్కి ధైర్యంగా యుద్ధం చేసింది. చివరకు రెండు బాణాలు ఆమెను తీవ్రముగా గాయపరచాయి. ఆమె సైన్యాధిపతులలో ఒకరు ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా ఆమె “ఇన్ని రోజులు నేను రాళ్ళుసైతం పలికిన రణనినాదం యుద్ధములో ఓడించబడ్డాను. కానీ భగవంతుని దయవలన నా పేరు ప్రతిష్టలకు ఓటమి రాకూడదు. నేను విరోధులకు దొరకకూడద”ని చెప్పి తన చేతనున్న పిడిబాకుతో పొడుచుకొని చనిపోయింది. అలా ఆమె అంతము గౌరవప్రదమై వీరోచితమైనది.

ఆ ప్రాంతంలో అధికారిగా పనిచేసే స్లీమెన్‌ అను ఆంగ్లేయుడు ఈ క్రింది మాటలను తన పుస్తకం "Recollections of an Indian Officials " లో ఇలా వ్రాసుకొన్నాడు.
    “ఆమె చనిపోయిన చోట ఆమె సమాధి మరియు రెండు పెద్దగుండ్రటి రాళ్ళు ఉన్నాయి. ఆమె విజయదుందుఖిలు రాళ్ళైపోయి రాత్రివేళ భేరీ నినాదములు చేస్తూ ఆమె చుట్టూ ఉన్న వేల
సమాధులలోగల సైనికులను పిలుస్తున్నాయని అక్కడి. వారి నమ్మకం.

“ఆ దారిలో వెళ్ళే బాటసారులు, ఆ ప్రాంతములో దొరికే సృటికాలను ఆమె సమాధిపై వారి కృతజ్ఞతా చిహ్నంగా ఉంచేవారు. ఆమె చరిత్రను విన్న నేను నా వంతు కృతజ్ఞతగా ఒక మంచి స్ఫటిక శిలా రూపాన్ని ఉంచాను”. దుర్గావతి మానవ స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి పోయిన ఒక వీర, ధీరవనిత.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top