నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label స్త్రీ శక్తి. Show all posts
Showing posts with label స్త్రీ శక్తి. Show all posts

Thursday, October 29, 2020

సోదరి నివేదిత - Sister Niveditha

సోదరి నివేదిత - Sister Niveditha

 డా. నివేదితా రఘునాథ్ భిడే
నిజంగా శివుడిని అర్చించాలంటే మనం శివుడు కావాలి – శివో భూత్వా శివం యజేత్. అలాగే ఈ భరత భూమిని ఆరాధించేందుకు సోదరి నివేదిత తానే భారతమాత అయింది. భారతిని సంపూర్ణంగా అర్ధంచేసుకుంది.

 స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు తెలిసినవారు, స్నేహితులు ఎవరు లేరు. చేతిలో తగినంత డబ్బు కూడా లేదు. ఇక ఆయన ఎవరో కూడా అక్కడివారికి తెలియదు. హిందూధర్మ జ్ఞానం, అనుభవం మాత్రమే ఆయనకు ఉన్నాయి. 1893లో చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూ ధర్మాన్ని గురించి చేసిన ఉపన్యాసం తరువాత ఆయకు గుర్తింపువచ్చింది. అనేకమంది శిష్యులు, అనుచరులు ఏర్పడ్డారు. ఆ తరువాత ఆయన భారత్ కు విశ్వవిఖ్యాతి పొందిన స్వామి గా తిరిగివచ్చారు. ఆయనతో పాటు అనేకమంది విదేశీ శిష్యులు కూడా వచ్చారు. ఈ విదేశీ అనుచరులు, పేరుప్రతిష్టలు భారతీయులపై మానసికమైన ఎంతో ప్రభావాన్ని చూపాయి. హిందూ ధర్మపు ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని వాళ్ళు తిరిగి గుర్తించడమేకాక వారిలో స్వాభిమానం కలిగింది. ఇలా స్వామి వివేకానంద హిందూ ధర్మపు గొప్పదనం తెలియజేస్తూ విదేశాలలో సాగించిన జైత్రయాత్రల సారాంశమే సోదరి నివేదిత.
     భారత దేశాన్ని పూర్తిగా దోచుకుని, అన్ని రకాలుగా పతనావస్థకు తెచ్చిన జాతిలోనే మార్గరేట్ నోబుల్ (నివేదిత పూర్వాశ్రమంలో పేరు) జన్మించింది. కానీ నివేదితగా ఆమె ఈ దేశాన్ని మనలాగానే  ప్రేమించింది, ఇక్కడ ప్రజలకు సేవ చేసింది, ఇక్కడి ఉన్నతమైన అధ్యాత్మిక సంప్రదాయాన్ని అనుసరించింది. భారతీయ జీవనంలో సర్వత్ర ఆమె సౌందర్యాన్ని దర్శించింది.
ఒక బ్రిటిష్ మహిళ భారతీయ జీవనపు సౌందర్యాన్ని, ప్రత్యేకతను ఎలా చూడగలిగింది? అందుకు ఆమె తనను తాను ఎంతో మార్చుకోవలసి వచ్చింది. వేదాంత సత్యం, సర్వత్ర నిండిఉన్న పరమాత్మను గురించి  తెలుసుకున్న తరువాత భారత్ కు రావాలని, అక్కడ ప్రజలకు సేవ చేయాలని ఆమె నిశ్చయించుకుంది. సన్యాస దీక్ష తీసుకుని `నివేదిత’(సమర్పింపబడినది)గా మారింది. పేరు మార్చుకున్నంత మాత్రాన అప్పటి వరకు మార్గరేట్ నోబుల్ గా ఏర్పరచుకున్న అభిప్రాయాలూ, భావాలు ఒక్కసారిగా మాయమైపోవు కదా. ఆమెకు ఉన్న ఈ అభిప్రాయాలూ, భావాలను స్వామి వివేకానంద తన మాటల్లో తీవ్రంగా ఖండించేవారు. కొత్త దేశంలో, ఇతరులెవరు తెలియని చోట స్వామీజీ మాత్రమే ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా తన అభిప్రాయాలను తీవ్రంగా తప్పుపడుతుంటే ఆమెకు ఎలా ఉండి ఉంటుంది? అప్పుడు ఆమె ఎంతో తీవ్రమైన భావోద్వేగాలకు గురయ్యేది. అయినా  ఒక్కసారి కూడా తాను గురువుగా అంగీకరించిన స్వామి వివేకానంద పైన కానీ, తాను నమ్మిన తత్వం పైన కానీ నివేదితకు సందేహం రాలేదు. తిరిగి వెళ్లిపోదామనే ఆలోచన రాలేదు. “నేను ఎప్పటికైనా నా గురువు చెపుతున్నదానిని అర్ధం చేసుకోగలనా’’ అన్నదే ఆమె ఆలోచన.  లక్ష్యశుద్ది, అవిశ్రాంతమైన కృషి ఆమెను పూర్తిగా మార్చివేశాయి. ఆమె భారతీయ జీవనంలో కలిసిపోయింది. పూర్తి సమర్పణ భావంతో భారతిని సేవించింది. శివుడిని నిజంగా కొలవాలంటే మనం శివుడు కావాలి – శివో భూత్వా శివం యజేత్. అలాగే నివేదిత భరత మాతలో ఏకమైంది. భారత దేశాన్ని పూర్తిగా అర్ధం చేసుకుంది. ఎన్ని దోషాలున్న భారతీయులను ప్రేమించింది.
సిస్టర్ నివేదితో స్వామి వివేకానంద చిత్రం
సిస్టర్ నివేదితో స్వామి వివేకానంద చిత్రం 

సంపూర్ణమైన మార్పు
భారతీయ ఆత్మ, తత్వాన్ని ఆకళింపుచేసుకునేందుకు నివేదిత తనను తాను మార్చుకున్న తీరు మెకాలే మానస పుత్రులైన భారతీయులకు పెద్ద పాఠం. బ్రిటిష్ వారసత్వం పట్ల ఎంతో గర్వాన్ని కలిగి ఉన్న ఒక మహిళ (భారత్ గురించి) తన దురభిప్రాయాలను, అపోహలను, పాశ్చాత్య ధోరణిని పూర్తిగా పక్కనపెట్టి భారతీయ సంస్కృతి, సమాజాన్ని అర్ధంచేసుకుని, భారత దేశపు భక్తురాలిగా, నిజమైన భారతీయురాలిగా మారగలిగిందంటే , అలా మనం ఎందుకు చేయలేము? మెకాలే మానసపుత్రులమైన మనం కూడా అలా మన అపోహలు, దురభిప్రాయాలను పూర్తిగా వదిలిపెట్టి నిజమైన భారతీయులుగా మారవచ్చును. భారతీయ తత్వాన్ని ఆమె అర్ధం చేసుకోగలిగినప్పుడు మనం మాత్రమే అందుకు అర్ధం చేసుకోలేము? ఎవరైనా తమ మాతృభూమికి సేవ చేయాలనుకుంటే తమను తాము మార్చుకోవాలి, భగవంతుని కృపను పొందాలి. సోదరి నివేదిత ఈ సమాజాన్ని సేవించాలనుకునేవారందరికి ఒక స్ఫూర్తి.
     సోదరి నివేదిత ఇక్కడి సమాజం, ప్రజలతో మమేకమయ్యింది. తాను అర్ధంచేసుకున్న, అనుభూతి చెందిన ఏకాత్మ భావన ఆమె జీవితం, చర్యలు, మాటలలో ప్రతిఫలించింది. నా దేశం, నా ప్రజలు అనే ఈ సమాజాన్ని సంబోధించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలో పనిచేసేందుకు వెళ్ళేవాళ్లు `ఈ సమాజం’, `ఇక్కడి ప్రజలు’ అనే మాటలు మాట్లాడుతుంటారు. వారిని `నాగరికులను చేయడానికి’, `అభివృద్ధి చేయడానికి’ అక్కడికి వెళ్ళమని చెపుతుంటారు. తమ అభిప్రాయాలూ, భావాలను సాధారణ జనంపై రుద్దెందుకు ప్రయత్నిస్తారు. తన విదేశీ శిష్యులు అలా వ్యవహరించకూడని స్వామి వివేకానంద అనుకున్నారు. భారత్ ఎలా ఉందో, ఎలాంటిదో అలాగే దానిని అంగీకరించగలగాలని, గౌరవించగలగాలని ఆయన భావించారు. భారత్ నుండి నేర్చుకోవాలని వాళ్ళకు చెప్పారు. వివేకానందుని ఈ సందేశాన్ని సోదరి నివేదిత ఎంతగా జీర్ణించుకున్నదంటే స్వతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్ర పాల్ ఒకసారి “నివేదిత ఇక్కడకు బోధకురాలిగా రాలేదు, ఒక శిష్యురాలిగా, అన్వేషకురాలిగా వచ్చింది.  ఈ భారత దేశాన్ని మనం ప్రేమించినదానికంటే అధికంగా ఆమె ఇష్టపడింది’’ అని అన్నారు.
      వేదాంతాన్ని ఆకళింపుచేసుకున్న తరువాత సోదరి నివేదిత ఇలా రాయగలిగింది -“ప్రపంచంలో కనిపించే వివిధత్వం, దాని వెనుక ఉన్న ఏకత్వం ఒకే సత్యానికి చెందినవైతే అప్పుడు కేవలం వివిధ పూజా పద్దతులేకాదు, అన్ని రకాల పనులు, అన్ని సృజనాత్మక పద్దతులు కూడా సాక్షాత్కారానికి మార్గాలే. అప్పుడు ఇహము, పరము అనే తేడా ఏమి ఉండదు. పనిచేయడమే ప్రార్ధించడం అవుతుంది. త్యాగమే   విజయం అవుతుంది. అప్పుడు జీవితమే మతం.’’ ఇదీ స్వామి వివేకానంద ఆమెకు బోధించిన మార్గం. అందుకనే ఆయన గురించి ఇలా రాసింది -“ఈ తత్వమే స్వామి వివేకానందను అద్భుతమైన కర్మ ప్రబోధకుడిగా చేసింది. జ్ఞాన, భక్తి యోగాలను ఆయన బోధించారు. ఆయన ప్రకారం పని, అధ్యయనం, పొలం మొదలైన కర్మ క్షేత్రాలన్నీ భగవంతుని సాక్షాత్కారం పొందగలిగిన స్థానాలే. మానవ సేవకు, మాధవ సేవకు తేడా లేదు. నీతికి, ఆధ్యాత్మికతకు తేడా లేదు. ఈ మూల విశ్వాసం నుండే ఆయన చెప్పిన సకల విషయాలు వచ్చాయి.’’ ‘’కళలు, విజ్ఞాన శాస్త్రం, మతం ఒకే పరమ సత్యపు మూడు విభిన్న వ్యక్తీకరణలు. కానీ దీనిని అర్ధం చేసుకోవాలంటే మనకు అద్వైత సిద్దాంతం తెలియాలి.’’ నివేదితకు వేదాంతం అంటే ప్రత్యక్ష కార్య పద్దతి. అందుకనే ఆమె ఆధ్యాత్మికత వివిధ రంగాల్లో ఆమె నిర్వహించిన కార్యాల ద్వారా వ్యక్తమయింది.
     స్వామి వివేకానందలోని జాజ్వల్యమానమైన ఆదర్శం సోదరి నివేదితకు లభించింది. భారత దేశం పట్ల ఆమెకు గల ప్రేమాభిమానాలు ఎంత తీవ్రమైనవంటే యోగి అరవిందులు ఆమెను అగ్నిశిఖ అని అభివర్ణించారు. జాతీయ జీవనంలో ఆ అగ్ని స్పృశించని రంగం లేదు. భారత దేశపు అభ్యున్నతి, భారతీయ ఆత్మను జాగృతం చేయడం అనే రెండు లక్ష్యాలతోనే ఆమె పనిచేసింది.

నూతన విద్యా దృక్పధం
“విద్యారంగంలో పనిచేసే వారంతా స్వామి వివేకానందుని లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి’’ అని నివేదిత కోరుకుంది. అది ఎలా జరుగుతుందో ఆమె ఇలా వివరించింది -“పిల్లవాడికి మంచి చేయడంతో పాటు జన – దేశ – ధర్మాలకు మేలు చేసేదిగా ఉండాలని విద్యావేత్తలు గ్రహించాలి. ఈ ప్రధాన అంశం ఆధారంగా రూపొందిందిన విద్య, శిక్షణలో ఎలాంటి స్వార్ధభావన, బలహీనతకు ఆస్కారం ఉండదు. భారత దేశంలో విద్యను జాతీయం చేయడమేకాదు, జాతి నిర్మాణ కారకమైనదిగా తీర్చిదిద్దాల్సిఉంది. 
     మన పిల్లల మనసుల్లో జాతి, దేశం అనే భావాలను నింపాలి. వాళ్ళ ఆలోచన కుటుంబ పరిధిని దాటి విస్తరించాలి. భారత దేశం కోసం త్యాగాలు చేయగలగాలి. భక్తిపూర్వకంగా ఈ దేశాన్ని కొలవగలగాలి. ఈ దేశాన్ని అధ్యయనం చేయాలి. ఈ దేశమే లక్ష్యం కావాలి. భారతి కోసమే భారతం. ఇదే వారి ఊపిరి కావాలి.
    … మహాపురుషులు పుడతారన్నది తప్పు. అలాంటివాళ్లు పుట్టరు. తయారవుతారు. ఒక గొప్ప ఆలోచన నుండి రూపొందుతారు. సర్వమానవాళిలో హృదయాంతరాళాల్లో  నిండిఉన్నది త్యాగభావనే. దీనిని మించిన లోతైన భావన ఏది లేదు. ఈ విషయాన్ని గుర్తిద్దాం …దీనినే దేశం పట్ల ప్రేమగా మలుద్దాం…ఈ విశ్వం పదార్ధంతో ఏర్పడినది కాదు. మేధస్సువల్ల ఏర్పడినది. 700 మిలియన్ ప్రజల తీవ్రమైన ఆకాంక్షను అడ్డుకోగలిగిన శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉందా… అంతా తీవ్రమైన ఆకాంక్షను కలిగించడం ఎలా..అందుకు జాతీయ విద్యావిధానమే మార్గం. మన మహాపురుషుల జీవితాలు మనకు ఆదర్శం కావాలి. అవే మన ఆలోచన కావాలి. భారత దేశ చరిత్ర చుట్టూనే మిగిలిన చరిత్రలు తిరగాలి. ‘’ ఈ ఆలోచనలు, ఆదర్శాల ఆధారంగానే సోదరి నివేదిత ఆడపిల్లలకోసం పాఠశాల నిర్వహించింది. అందుకనే ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగోర్ శాంతినికేతన్ ప్రారంభించినప్పుడు అక్కడ ఉపాద్యాయురాళ్లుగా పనిచేసినవారు ఎక్కువగా సోదరి నివేదిత పాఠశాల పూర్వ విద్యార్ధులే కావడంలో ఆశ్చర్యం ఏమి లేదు.

భారతీయ మహిళ
భారతీయ మహిళ గుణగణాలు సోదరి నివేదితను ముగ్ధురాలిని చేశాయి. కలకత్తా వీధుల్లో తిరుగుతూ, పనిచేస్తున్నప్పుడు ఆమెకు ఎన్నో విషయాలు తెలిసాయి. వాటి గురించి ఆమె ఇలా అంటారు -“భారతీయ మహిళకు లభిస్తున్న శిక్షణ ఎలాంటిది? ఎంత ప్రత్యేకమైనది? ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి పద్దతి కనిపించదు. భారతీయ జీవనపు గొప్పదనం ఎందులోనైనా ఉన్నదంటే అది ప్రధానంగా సామాజిక వ్యవస్థలో మహిళలకు ఇచ్చిన గొప్ప స్థానంలో ఉంది. 
     భారతీయ మహిళలు అజ్ఞానులు, అణచివేయబడినవారని కొందరు అంటూ ఉంటారు. అలాంటివారందరికి ఒకటే సమాధానం – భారతీయ మహిళ ఎప్పుడు అణచివేతకు గురికాలేదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఘోరాలు ఇక్కడ కంటే మిగతా దేశాలలో చాలా తీవ్రంగా, పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇక మహిళలకు ఇక్కడ లభిస్తున్న సామాజిక గుర్తింపు, సంతోషం, వారి ఉన్నతమైన వ్యక్తిత్వం భారతీయ జీవనపు అత్యంత విలువైన అంశాలు. ఇక ఇక్కడ మహిళలు అజ్ఞానులనే వాదన మరింత అర్ధరహితమైనది. ఆధునికుల దృష్టిలో వాళ్ళు అజ్ఞానులు కావచ్చును. ఎందుకంటే వారిలో కొద్దిమందే రాయగలరు, చదవగలరు. అంతమాత్రాన వారిని నిరక్షరకుక్షులు, అజ్ఞానులు అనగలమా? నిజంగానే వాళ్ళు అలాంటివారైతే మన తల్లులు, బామ్మలు తమ పిల్లలకు చెప్పే రామాయణ భారతాలు, పురాణ కధలు సాహిత్యం కాదా? కేవలం యూరోపియన్ నవలలు, స్ట్రాండ్ పత్రిక మాత్రమే సాహిత్యమా? అలాగని ఎవరైనా అనగలరా? వ్రాయగలగడమే సంస్కృతి కాదు. అది సంస్కృతిలో ఒక భాగం మాత్రమే. ఈ `అక్షరాస్యత’ యుగం ప్రారంభం కావడానికి చాలాకాలం ముందే గొప్ప సాహిత్యం వచ్చింది. భారతీయ జీవనంలో మహిళల పాత్ర గురించి తెలిసిన ఎవరైనా వారికి ఇళ్ళలో లభించే విద్య, గౌరవం, వారి సున్నితత్వం, శుభ్రత, పొదుపరితనం, మత శిక్షణ, సాంస్కృతిక సంస్కారాలు తప్పక గుర్తిస్తారు. ఆ మహిళలు ఒక్క ముక్క చదవలేకపోయిన, రాయలేకపోయినా వారిపై అజ్ఞానులు, అవిద్యావతులు అని విమర్శలు చేస్తున్న వారికంటే చాలా విద్యావంతులే. ‘’

జాతి పునర్ నిర్మాణానికి మార్గదర్శి
సోదరి నివేదిత రచనల్లో భారతీయ వివేకం, సంప్రదాయం కనిపిస్తాయి. భారత్ పట్ల ప్రగాఢమైన ప్రేమ, గౌరవం కనిపిస్తాయి. అలాగే ఆ రచనలు ఆమె చురుకైన బుద్ధికి, భాష నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. ఆమె వ్యక్తం చేసిన భావాలు ఎంత లోతైనవి, ప్రగాఢమైనవంటే వాటిని ఇతర భాషలలోకి అనువదించడం కష్టం. అందుకనే కాబోలు ఆమె చాలా రచనలు ఇప్పటికీ అనువదింపబడలేదు. ఆ సాహిత్యం చరిత్రాత్మకమైనదే కాదు జాతి నిర్మాణంలో మార్గదర్శకమైనది కూడా. ఉదాహరణకు, ఇతర జాతులతో పోలుస్తూ హిందూ జాతి సాగించిన యాత్ర, ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని గురించి ఇలా రాసింది – “నిజమైన జాతీయ భావం నింపుకున్నవారు, ఈ జాతి ఎదుర్కొంటున్న సమస్యల గురించి చింతించేవారికి ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదేమిటంటే, ఈ జాతి గతంలో ఎప్పుడైనా ఇంత గొప్ప కలలు కన్నదా? ఇంత గొప్ప ఆలోచనలు చేసిందా? ఇంత సౌమ్యంగా, పవిత్రంగా ఉన్నదా? ఎలాంటి తప్పటడుగులు వేయకుండా కొత్త మార్గాలను అన్వేషించిందా? మొదలైన ఇలాంటి ప్రశ్నలన్నిటికి హిందువులు మాత్రమే `అవును’ అని గట్టిగా సమాధానం చెప్పగలరు.’’ ఆమె దాదాపు 20 పత్రికల్లో తరచూ వ్యాసాలు రాస్తూండేది. ఆ వ్యాసాలన్నిటి ప్రధాన విషయం ఎప్పుడూ `భారతదేశమే’. భారతీయురాలిగా ఆమె మారిన అద్భుత వైనం మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని, రచనలను నేడు ఆంతా, ముఖ్యంగా ఆంగ్ల విద్యావంతులు, తప్పక అధ్యయనం చేయాలి. అప్పుడే మన దేశపు గొప్పదనం, ప్రత్యేకతలు అర్ధమవుతాయి.

పాశ్చాత్య అనుకరణ ఎందుకు?
ప్లేగు, వరదలు మొదలైన ఉత్పాతాలు కలిగినప్పుడు, స్వతంత్ర పోరాటంలో సోదరి నివేదిత సమాజంతో పాటు మమేకమై పనిచేశారు. జాతీయ జీవనపు అన్ని రంగాలలో సాంస్కృతిక విలువల పునర్ స్థాపన, జాతీయ భావాన్ని పెంపొందించడం కోసమే ఆమె పనిచేశారు. “భారత దేశపు జాతీయ కళ పుట్టుకే నా అత్యంత ప్రియమైన కల’’ అని ఆమె అన్నారు. విద్యార్థులు పాశ్చాత్య అంశాల ఆధారంగా కళాప్రదర్శనలు ఇవ్వడం ఆమె అంగీకరించలేదు. భారతదేశానికి ఇంత ప్రాచీనమైన, విస్తృతమైన కళా రూపాలు ఉండగా పాశ్చాత్య కళా రూపాలను అనుకరించడం, అక్కడి విషయాలను ప్రదర్శన అంశంగా తీసుకోవడం ఎందుకని ఆమె ప్రశ్నించేవారు. అబనీంద్రనాథ్ ఠాగోర్, నందలాల్ బోస్ వంటి యువ చిత్రకారులు భారతీయ అంశాలను తమ చిత్రాలకు ప్రధాన విషయాలుగా తీసుకునేట్లు ఆమె ప్రోత్సహించారు. బాగ్ బజార్ లో పురాతన ఇల్లు, పాడుపడిపోయిన దేవాలయాలలోని నిర్మాణ నైపుణ్యం, అందాన్ని ఆమె చూసేవారుకానీ ఈ దేశంలో పాశ్చాత్య శైలిలో అధునాతన భవనాల నిర్మాణాన్ని అంగీకరించేవారుకారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో కూడా భారతీయులు చేయగలిగినది ఎంతో ఉందని ఆమె అనేవారు. డా. జగదీష్ చంద్ర బోస్ ఆవిష్కారాలు ప్రపంచానికి తెలియకుండా బ్రిటిష్ వాళ్ళు అడ్డుకున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు లేకపోతే భారతీయ శాస్త్రవేత్తలు ఎంత ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలరని ఆమె భావించారు. డా. జగదీష్ చంద్ర బోస్ కు సహాయపడేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆవిష్కారాలను ప్రపంచానికి తెలియచెప్పడానికి ఆయన ఆరు పుస్తకాలు ప్రచురితమవడానికి సహాయసహకారాలు అందించారు. స్వయంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి జగదీష్ చంద్ర బోస్ కార్యానికి నిధుల కొరత లేకుండా చూశారు.
    విప్లవకారులు జైలుకి వెళ్లినప్పుడు, విదేశాలలో తలదాచుకున్నప్పుడు వారి కుటుంబాల పోషణ భారాన్ని ఆమె వహించారు. ఇలా ఆమె జాతీయ జీవనంలో అన్ని విషయాలలో తనవంతు పాత్ర నిర్వహించారు.

నిరాశ, నిస్పృహలకు ఆమె మనసులో స్థానం లేదు
అవసరమనుకున్నప్పుడు సోదరి నివేదిత రామకృష్ణ మిషన్ కు రాజీనామా చేసి స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల సందేశాలను ప్రచారం చేయడానికి రామకృష్ణ మిషన్ అవసరం. కానీ జాతీయ భావాన్ని పెంపొందించడం ద్వారా ప్రజలను స్వతంత్ర ఉద్యమానికి సమాయత్తం చేయడం అప్పటి తక్షణ అవసరం. కనుక సోదరి నివేదిత ఆ పనికి పూనుకున్నారు. రామకృష్ణ మిషన్ నుండి రాజీనామా చేసినా ఆ సంస్థతో ఆమె చివరివరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రామకృష్ణ – వివేకానంద భావ ఉద్యమంలో తాను కూడా ఒక భాగమని ఆమె చెప్పేవారు. ఎప్పుడు అనారోగ్యం బారిన పడిన రామకృష్ణ మిషన్ కు వెళ్ళేవారు. బుల్ అనే మహిళ తన అవసాన దశలో తన యావదాస్తిని సోదరి నివేదితకు దానం చేస్తే, ఆ ఆస్తిని నివేదిత రామకృష్ణా మిషన్ కు రాసిచ్చేశారు. అలాగే తన గ్రంధాలయాన్ని సోదరి క్రిస్టీన్ గ్రీన్ స్టీడెల్ నడుపుతున్న పాఠశాలకు ఇచ్చేశారు. ఆమె మనసులో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి మొదలైన నకారాత్మక భావాలకు చోటులేదు. భారత దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరితో పనిచేశారు. కానీ దేశ ప్రయోజనాలకు ఉపయోగపడదని అనుకున్నప్పుడు కొందరికి దూరమయ్యారు కూడా. దేనికైనా దేశ ప్రయోజనమే గీటు రాయి.
ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు శ్రీ. హేమచంద్ర ఘోష్ స్వామి వివేకానంద, సోదరి నివేదితల గురించి తన జ్ఞాపకాలను స్వామి పూర్ణాత్మానందకు తెలియజేశారు. ఆ సంభాషణలు బెంగాలీ భాషలో పుస్తకంగా వెలువడ్డాయి. దానిని ప్రొ. కపిల చటర్జీ ఆంగ్లంలోకి అనువదించారు. 
      `ఐ యామ్ ఇండియా’ అనే శీర్షిక కలిగిన ఆ పుస్తకంలో హేమచంద్ర ఘోష్ ఇలా రాశారు -“స్వామి వివేకానంద ప్రజ్వలింపచేసిన దేశభక్తి భావనను సోదరి నివేదిత అందిపుచ్చుకున్నారన్నది నిజం. అంతేకాదు ఆమె ఆ జ్వాలను దేశంలోని నలుమూలలకు వ్యాపింప చేశారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన సోదరి నివేదిత తన స్పూర్తివంతమైన ప్రసంగాలు, నినాదాలతో స్వామీజీ ఆదర్శాలు, దేశభక్తి బావనను ప్రజలలో ప్రచారం చేసేవారు. దానితో పాటు సంస్కృతి, భారత దేశ వైభవం, ఆదర్శాలను కూడా ఆమె ప్రజలకు తెలియచెప్పేవారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం స్వామి వివేకానందకు సోదరి నివేదిత సన్నిహిత్యం వల్ల మరింత అబ్బిందని చెప్పవచ్చును. నేను స్వామీజీతో ఉన్నది చాలా తక్కువ కాలం. కానీ సోదరి నివేదితను ఎక్కువ కాలం చూసే భాగ్యం కలిగింది. ఆమె ద్వారా మనకు స్వామీజీ, అలాగే భారత దేశం మరింత బాగా అర్ధమవుతాయి. స్వామి వివేకానంద సందేశాన్ని ప్రచారం చేయడంలో సోదరి నివేదిత రెండు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒకటి పరమశివుడు, రెండు, భగీరథుడు. ఝంఝామారుతం వంటి తీవ్రమైన స్వామీజీ సందేశాన్ని తనలో ఇముడ్చుకోవడమే కాక ఆ మహా ప్రవాహానికి భగీరథుడిలా ఒక దిశను చూపించింది.’’

సోదరి నివేదితతో శారద మాత
సోదరి నివేదితతో శారద మాత
భారతదేశంపట్ల అపరిమితమైన ప్రేమ
రాజకీయాలు, విద్య, కళలు, సాహిత్యం, సమాజ శాస్త్రం, ఆధ్యాత్మికత ఇలా అన్ని రంగాలలో సోదరి నివేదితకు భారతదేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమాభిమానాలు ప్రకటితమయ్యాయి. ఆమెది బహుముఖీయమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం. ఆమె విప్లవకారిణి, అలాగే యోగిని కూడా. ఆమె విద్యావేత్త, కళా విమర్శకురాలు. రచయిత, ప్రజలకు సేవచేసిన సంఘసేవకురాలు. శారదా మాత పాదాలవద్ద కూర్చున్నప్పుడు ఆమె శిష్యురాలు. అలాగే రవీంద్రనాథ్ ఠాగోర్ వర్ణించినట్లు ఆమే లోకమాత, సోదరి  కూడా.   “ఓ నా భాగ్యమా! భోగభాగ్యాలు కోల్పోయి, వివేకం భ్రష్టమై, పతనమై, పరాజితమై, కలహాలు, కుత్సితాలలో కూరుకుపోయిన ఈ దేశ ప్రజానీకాన్ని ఎవరైనా సంపూర్ణమైన మనస్సుతో ప్రేమించగలిగితే అప్పుడు ఈ దేశం తిరిగి నిలబడుతుంది.’’ అని స్వామి వివేకానంద ఒకసారి అన్నారు. స్వామీజీ కోరుకున్న భాగ్యమే సోదరి నివేదిత. ఆమె భారతీయులను వారి దోషాలతోపాటు మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఆమె 150వ జయంతి సందర్భంగా  ఆమె జీవితాన్ని, జీవన కార్యాన్ని అర్ధం చేసుకుందాం. ఆమెలాగానే మనమూ ఈ దేశాన్ని, ప్రజానీకాన్ని ప్రేమిద్దాం. భారత మాత కార్యం చేయడంలో సోదరి నివేదిత జీవితం మనకు స్ఫూర్తిని కలిగించుగాక.

ఆర్గనైజర్ సౌజన్యంతో…
(రచయిత వివేకానంద కేంద్ర ఉపాధ్యక్షులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత)

Friday, July 10, 2020

రాణి అబ్బాక్కా దేవి - భారతదేశ మొదటి స్వాతంత్య్ర పోరాట యోధురాలు - Tuluva RANI ABBAKKA DEVI

మహారాణి అబ్బక్క

అది 1555 సంవత్సరం పోర్చుగీస్ వాళ్ళు వలసరాజ్యాల స్థాపనలో తిరుగులేకుండా ఉన్నారు. మనదేశంలోని కాలికట్ వశపరుచుకొని జామోరిన్స్ను నాశనం చేశారు. బీజాపూర్ సుల్తాన్ను ఓడించారు.గుజరాత్ సుల్తాన్ని ఓడించి డామన్ ను తీసుకొని, మైలాపూర్ లో ఒక కాలనీని స్థాపించారు, బొంబాయిని స్వాధీనం చేసుకున్నారు మరియు గోవాను వారి ప్రధాన కార్యాలయంగా మార్చారు. గోవలో చర్చిని నిర్మించడానికి పురాతన కపలీశ్వర ఆలయాన్ని కూడా నాశనం చేశారు. వారి తదుపరి లక్ష్యం, మంగుళూరులో ఉన్న ఓడరేవు.
30 ఏళ్ల యువతి రాణి అబ్బక్క చౌతా
30 ఏళ్ల యువతి రాణి అబ్బక్క చౌతా
మంగుళూరుకు దక్షిణాన కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉల్లాల్ అనే చిన్న సంస్థానం దాన్ని పారిపాలించేది 30 ఏళ్ల యువతి రాణి అబ్బక్క చౌతా. మొదటిలో పోర్చుగీస్ వాళ్ళు రాణి అబ్బక్కని తేలికగా తీసుకొని, ఆమె సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని వారిలో కలుపుకోవాలని అలాగే ఆమెని బంధించి గోవాకు తీసుకురావడానికి కొన్ని పడవలు మరియు సైనికులను పంపారు - ఆ పడవలు తిరిగి రాలేదు.

వారికి ఏమి జరిగిందో అర్ధంకాలేదు ఇప్పటి వరకు వారు దాడి చేసిన ప్రతి రాజ్యం వాళ్ళకి దాసోహం అన్నవి కానీ మొదటిసారి పరాజయం అందులోని స్త్రీ చేతిలో , ఈసారి కోపంతో భారీ నౌకలను పంపారు, చాలా ప్రసిద్ధ అడ్మిరల్ డోమ్ అల్వారో డా సిల్వీరా నాయకత్వంలో అడ్మిరల్ త్వరలోనే గోవా తిరిగి వచ్చాడు, తీవ్రంగా గాయపడ్డాడు మరియు ఖాళీ చేతులతో ఓడిపోయి ఆ తరువాత, మరొక పోర్చుగీస్ నౌకాదళం పంపబడింది - అనేక పోర్చుగీస్ సైనికులు ఆచూకీ లేదు...కొద్దిమంది మాత్రమే గాయాలతో వెనుకకు వచ్చారు.

ఇంకా పోర్చుగీస్ వాళ్ళు ముందుగా మంగళూరుని ఆక్రమించుకొని అక్కడనుండి రాణి అబ్బక్క మీద యుద్ధం చెయ్యాలని ప్రణాళిక వేసుకున్నారు. పోర్చుగీస్ జనరల్ జోనో పీక్సోటో ఆధ్వర్యంలో భారీ సైన్యం మంగుళూరును విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.

తరువాత ఆ అనుభవజ్ఞుడు అయిన పోర్చుగీస్ జనరల్ ఉల్లాల్‌కు పంపబడ్డాడు. అతని ఉద్దేశం ఉల్లాల్‌ను లొంగదీసుకుని, అబ్బాక్కా చౌతాను బంధించడం. పోర్చుగీసువారు ఉల్లాల్‌కు చేరుకున్నారు అది నిర్జనమైపోయి ఖాళీగా కనబడింది..వారు ఊరు మొత్తం వెతికారు రాణి అబ్బాక్క ఎక్కడా కనిపించలేదు.
రాణి అబ్బక్క
రాణి అబ్బక్క
సైన్యం కానీ రాణి అబ్బక్క కనిపించపోవటంతో విశ్రాంతి తీసుకున్నారు ......ఇంకా మేమే గెలిచాము రాజ్యం సొంతం అయింది అని అనుకుంటునంతలో రాణి అబ్బక్క చౌతా ఆమె ఎంచుకున్న 200 మంది సైనికులతో దాడి చేసింది - ఒక్కసారిగా మీదపడటంతో ఊహించని పరిణామానికి పోర్చుగీసువారు పోరాటం చెయ్యకుండానే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో జనరల్ జోనో పీక్సోటో చనిపోయాడు,70 మంది.పోర్చుగీస్ సైనికులు బందీలుగా పట్టుబడ్డారు.

రాణి అబ్బాక్కా చౌతా పెద్ద ఎత్తున దురాక్రమణదారులను ఓడించి, ఒక జనరల్‌ను చంపి, యోధులను బంధించి, ఆమె రాజ్యాన్ని రక్షించుకున్నారు.... చాలు నా రాజ్యాన్ని కాపాడుకున్న అని విశ్రాంతి తీసుకోలేదు రాణి అబ్బాక్కా చౌతా, అదే రాత్రి తన మనుష్యులతో కలిసి మంగుళూరు వైపు ప్రయాణించి, మంగుళూరు కోటను ముట్టడించింది - తెలివిని ఉపయోగించి పోర్చుగీస్ జనరల్ లలో ముఖ్యమైన శక్తివంతమైన చీఫ్ అడ్మిరల్ మస్కారెన్హాస్ను హత్య చేసి, పోర్చుగీస్ సైన్యాన్ని మంగుళూరు నుండి వెళ్లేలా చేసింది.
రాణి అబ్బాక్కా చౌతా పెద్ద ఎత్తున దురాక్రమణదారులను ఓడించింది !
రాణి అబ్బాక్కా చౌతా పెద్ద ఎత్తున దురాక్రమణదారులను ఓడించింది !
ఆమె అంతటితో ఆగలేదు, మంగుళూరుకు ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందపుర వద్ద పోర్చుగీస్ స్థావరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది.

పోర్చుగీస్ వారికి ఇంకా రాణి అబ్బక్క ని ఎదుర్కోవటం కష్టం అనిపించి, చివరకు అబ్బాక్కా చౌతా యొక్క భర్తను ప్రలోభపెట్టి ఒప్పించి, డబ్బు కోసం ద్రోహం చేయమని చెపుతారు ( ఇక్కడ ఒక్క విషయం కొన్ని కారణాల వలన రాణి అబ్బక్క తన భర్తకి విడిపెట్టి ఆమె పిల్లలతో కలిసి రాజ్యపాలన చేస్తున్నది). ఆ అమ్ముడుపోయిన భర్త ఆమెను బందించేలా పోర్చుగీస్ వాళ్ళకి సాయం చేస్తాడు, రాణి అబ్బక్క బందించబడి ఖైదు చేయబడుతుంది...అక్కడ ఆమె మళ్లీ తిరుగుబాటు చేసి తప్పించుకునే ప్రయత్నంలో చంపబడింది.

1857 లో భారత స్వాతంత్ర్య మొదటి యుద్ధానికి 300 సంవత్సరాల ముందు అబ్బక్కా చౌతా పోర్చుగీసులకు వ్యతిరేకంగా పోరాడింది...

భారతీయులము అయిన మనం ఆమెకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలిపాము ఏ విధంగా గౌరవించం ? ఆమెను మరిచిపోయాం.

ఆమె తెలియది ఆమె పేరు మనకి తెలియదు ఇంకా మన పిల్లలకు ఎమ్ తెలియచేస్తాం....అనే సాహస కథలను పిల్లలకు ఎవ్వరు చెపుతారు.

ఆమె పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది ప్రభుత్వం..ఆమె పేరుని ఒక షిప్ కి పెట్టి 2 విగ్రహాలను నిర్మించాము - భారతీయులు ప్రతి ఒక్కరు గొప్పగా గర్వముగా చెప్పుకోవాల్సిన ఆమె ఎవ్వరికి తెలుసు ఎక్కడో 2 విగ్రహాలు పెడితే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసిజిఎస్ రాణి అబ్బాక్కా హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించిన ఐదు ఇన్షోర్ పెట్రోలింగ్ ఓడల్లో మొదటిది అబ్బాక్కా మహాదేవి పేరు.

ఆమె యూరోపియన్ లేదా అమెరికన్ అయి ఉంటే, మన పాఠ్య పుస్తకాలలో ఆమె గురించి ఒక అధ్యాయం చదవవలసి ఉండేది....ఆమె పేరుతో ఒక రోజు ఉండేది. ప్రపంచంలోనే ఎక్కువ గొప్ప వ్యక్తులను కలిగి ఉంది మన భారతదేశం... కానీ మనం గుర్తించడం లేదు.

__ధర్మధ్వజం

Saturday, June 6, 2020

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ లక్ష్మీబాయి - Veera Jhansi Lakshmi Bhai


భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ లక్ష్మీబాయి - Veera Jhansi Lakshmi Bhai
క చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్న వీర వనిత ఝాన్సీ లక్ష్మి బాయి. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రధమ స్వాతంత్ర్య శంఖారావం చేసిన వీర నారి. యుద్ధ రంగంలో అపర కాళిలా విజృంభించి శత్రు సైనికులను చీల్చి చెండాడిన ధీశాలి.

ఆంగ్లేయ సింహాసనాలను అల్లల్లాడించిన పరాక్రమము, దేశభక్తి కలబోసి రూపొందిన ఆమె జీవితాన్ని గురించి కొంత తెలుసుకుందాం. 1835 నవంబర్ 19 న ఝాన్సీ లక్ష్మి జన్మించింది. 1842లో ఝాన్సీ రాజు గంగాధర రావుతో వివాహం జరిగింది. దాంతో ఒక పేద బ్రాహ్మణ బాలిక ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా మారిపోయింది. ఝాన్సీ ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా కేంద్ర పట్టణం.

 1851 వ సంవత్సరంలో మహారాణి లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. రాణి దురదృష్ట వశాత్తు మూడు నెలల లోపునే ఆ బాలుడు చనిపోయాడు. ఆనందరావు అనే బాలుడిని దత్తత చేసుకున్నారు. తర్వాత గంగాధరరావు కూడా కాలం చేశాడు. రాజ్యపు బాధ్యత లక్ష్మీబాయిపై పడింది. దత్తత ద్వారా వారసుడిని ఎంపిక చేసుకునే అధికారం గంగాధరరవుకి, లక్ష్మీబాయికి లేదంటూ బ్రిటిష్ ప్రభుత్వం, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చెయ్యాలని నిశ్చయించింది. కానీ రాణీ లక్ష్మీబాయి అందుకు తిరస్కరించింది.

 రాణి దినచర్యలో మార్పు వచ్చింది. గుర్రపు స్వారీ చేసేది, తుపాకీ, ఖడ్గం, బల్లెం ప్రయోగించడం నేర్చుకునేది. “అత్యాచారాలు, అన్యాయాలను మౌనంగా సహించేవారు మరణించిన వారితో సమానం. న్యాయాన్ని గౌరవించడమే నీతి. అన్యాయం ముందు తల వంచడం పిరికితనమే” అనేది.  స్వాతంత్ర్య వీరుడు తాంత్యాతోపెతో బ్రిటీషు వారిని ఎదిరించే విషయమై ఝాన్సీ లక్ష్మి నిరంతరం రహస్య మంతనాలు జరిపింది. 1857 ఏడు మే 31వ తేది ఆదివారం దేశమంతటా ప్రజలు ఒకేసారి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చెయ్యాలని నిర్ణయం జరిగింది. 19,20 నెలల పాటు పోరాటం సాగుతూనే వుంది.  అయితే ఈ పోరాటం విషయం కొన్ని కారణాల వల్ల ముందుగానే పసిగట్టిన ఆంగ్లేయ ప్రభుత్వం ఆ మహా ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అణచివేయడంతో మూకుమ్మడి పోరాటం ద్వారా బ్రిటిష్ వారికి ఊపిరి సలపకుండా చేసి దేశం నుంచి తరిమివెయ్యాలనే దేశ భక్తుల ప్రయత్నం విఫలమైంది. బానిసత్వంలో  మ్రగ్గుతున్న జాతి తన స్వాతంత్ర్యం కోసం చేసే పోరాటంలో ఎన్ని సార్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చినా తన ప్రయత్నాలు మానుకోవలసిన పని లేదు. సజీవ సమాజ లక్షణం పోరాడుతూనే ఉండడం. అదే ఒక రకంగా గొప్ప గౌరవప్రదమైన విషయం.
భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ లక్ష్మి
భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ లక్ష్మి
1858 మార్చ్ 23న బ్రిటీష్ సైన్యాధికారి సర్ రోజ్ ఝాన్సీపై యుద్ధం ప్రకటించాడు. 10,12 రోజుల వరకూ చిన్న రాజ్యమైన ఝాన్సీ గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ వచ్చింది. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడం రాణి గమనించింది. ఝాన్సీ నుండి బయటకు దూసుకుపోయింది. అక్కడి నుండి కాల్పికి చేరి తాంత్యా తోపె, రావు సాహెబ్ లను కలుసుకుంది.

కాల్పీలో కూడా రాణి సైన్యాన్ని సమీకరించింది. రోజ్ తన సైన్యంతో కాల్పీని ముట్టడించాడు. ఓటమి తప్పదని రాణికి అర్ధమైంది. వెంటనే రావు సాహెబ్, తాంత్యా తోపె మరి కొందరు యోధులు రాణితో కలిసి గ్వాలియర్ కోటని వశ పరచుకొన్నారు. తెల్ల వారు ఝామున గ్వాలియర్ కోటను ముట్టడించారు. రాణి పురుష వేషం ధరించి యుద్ధానికి సిద్ధమైంది.

రాణి వద్ద సైన్యం సంఖ్యా పరంగా తక్కువే ఉన్నప్పటికీ సర్దారుల అసాధారణ సాహసం, యుద్ధ వ్యూహం, రాణి పరాక్రమం కారణంగా ఆ రోజు ఆంగ్లేయ సైన్యం భారీగా దెబ్బ తింది. మరునాడు కొందరు సైనికులు ఆంగ్లేయులతో చేయి కలిపారు. రాణి లక్ష్మీ బాయి తన సర్దారులతో  “నేడు యుద్ధానికి చివరి రోజేమోననిపిస్తోంది. ఒకవేళ నేను మరణిస్తే నా కుమారుడు ఆనంద రావు జీవితాన్ని నా జీవితం కంటే విలువైనదిగా పరిగణించాలి.అతనిని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యాలి.” అంది. “నేను మరణించిన తర్వాత నా శవం విధర్మీయుల చేతుల్లో పడరాదు”. అని కూడా ఆమె కోరింది.

రోజ్ వద్ద సైనిక శక్తి అధికంగా వుంది. విప్లవకారుల సైన్యం వారి ముందు నాశనమైపోయింది. రాణికి తప్పించుకుని పోవడం మినహా మరొక మార్గం కనిపించటం లేదు. ఆమె ముందుకి దూకింది. ఆంగ్లేయుల సైన్యం ఆమెను చుట్టుముట్టింది. రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి.రాణి చెయ్యి ఒకటి తెగి పడింది. కడుపులో నుంచి రక్తం కారుతోంది. ఒళ్లంతా గాయాలయ్యాయి. కళ్ళు బైర్లు క్రమ్ముతున్నాయి. ఆమె దురవస్థని చూచి ఆమె అంగ రక్షకుడైన కుల్ మొహమ్మద్ కూడా విలపించసాగాడు. రాణిని భుజానికి ఎత్తుకుని గంగాదాస్ ఆశ్రమం వైపుకి పరుగు తీశాడు.

ఆ రోజు జూన్ 28, 1858. చుట్టూ చిమ్మ చీకటి. ఆ చీకట్లోనే బాబా గంగాదాస్ రక్తసిక్తమైన రాణి ముఖాన్ని గుర్తు పట్టాడు. చల్లని నీటితో ఆమె ముఖాన్ని కడిగాడు. గంగా జలం త్రాగించాడు. రాణికి కొద్దిగా స్పృహ వచ్చింది. వణుకుతున్న కంఠంతో ఒక్క సారి “హర హర మహాదేవ్” అని మాత్రం అంది. ఆ తర్వాత ఆమె శరీరం తిరిగి చైతన్యాన్ని కోల్పోయింది. కొద్ది సేపటి తర్వాత అతి కష్టం మీద మళ్ళీ ఆమె కన్నులు తెరిచింది. బాల్యంలో తాను నేర్చుకున్న భగవద్గీత శ్లోకాలను నెమ్మదిగా ఉచ్ఛరించింది. ఆమె కంఠస్వరం  అంతకంతకూ క్షీణించ సాగింది. ” ఓ కృష్ణా నీ ముందు నేను ప్రణమిల్లుతున్నాను.” ఇవే ఆమె చివరి మాటలు. ఝాన్సీ రాజ్యపు భాగ్య రేఖ అంతరించింది.

బాబా గంగా దాస్ ఇలా అన్నాడు. “వెలుతురుకు అంతం లేదు. ప్రతి కణంలోనూ అది దాగి వుంటుంది. తగిన సమయంలో అది తిరిగి ప్రకాశిస్తుంది. రాణి పార్ధివ శరీరం అక్కడే అగ్ని జ్వాలలకు ఆహుతి చెయ్యబడింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కేవలం భారత దేశానికే కాక మొత్తం ప్రపంచంలోని మహిళా లోకానికే వన్నె తెచ్చిన వీర నారీమణి. అమెది పవిత్ర జీవితం. పరిపూర్ణ నారీత్వం. సాహసం, అమర దేశభక్తి, బలిదానాల ఉత్తేజ గాథే ఆమె జీవితం.

ఆదర్శ పత్నిగా వ్యవహరించింది. భర్త మరణంతో జీవితం మీద విరక్తి కలిగినా తన కర్తవ్యాన్ని మాత్రం ఆమె విస్మరించలేదు. ఆమె నిష్టావంతురాలైన హిందువు. మిగిలిన మతాల విషయంలో పూర్తి సహిష్ణుత కలిగివుండేది. ఆమె ఏ యుద్ధానికి బయలుదేరినా హిందువులతోబాటు, ముస్లిములు కూడా ఆమె సైన్యం ముందుండేవారు. రాణితో అనేక సార్లు యుద్ధంలో ఓడిపోయి చివరికి ఆమెను ఓడించిన సర్ రోజ్ రాణి లక్ష్మీబాయి గొప్పతనాన్ని గురించి ఇలా అన్నాడు. “విప్లవకారులదరిలో అత్యంత సాహసి, అందరికంటే గొప్ప సేనాపతి రాణి లక్ష్మీబాయి.” అని కొనియాడాడు.

ఝాన్సీ లక్ష్మీబాయి భారత దేశం గాఢ అంధకారంలో ఉన్నప్పుడు ఒక మెరుపులా ప్రకాశించి మాయమైన వీర వనిత. ధైర్య సాహసాలు, సంఘటనా కౌశలం, దేశ భక్తిని ప్రదర్శించి అమరురాలైన ఝాన్సీ లక్ష్మీబాయి కోట్లాది భారతీయుల హృదయాలలో నిత్యమూ ప్రేరణా జ్యోతులను వెలిగించే అమర జ్యోతి.

__ విశ్వ సంవాద కేంద్రము

Friday, April 10, 2020

దుర్గతి నాశిని శ్రీ దుర్గా - Durgati Naashini Shri Durga

దుర్గతి నాశిని శ్రీ దుర్గా
దుర్గతి నాశిని శ్రీ దుర్గా
దుర్గా దుర్గతి నాశిని అని అమ్మను స్తుతించటం లో ఒక అంతరార్ధం తెలుసుకుందాం. దుర్గం అంటే శరీరం . ఈశరీరంలో ఉండే శక్తే దుర్గ . అదే ప్రాణశక్తి . ప్రాణం ఉంటేనే దేహం ఉన్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం వలన మాత్రమే విశ్వమంతా నిలచి ఉంది.

దుర్గాదేవి దశభుజాలు, పంచప్రాణ, పంచోపప్రాణాలు దశప్రాణాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం. దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది.. అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక. క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం. ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకు చేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే. మనలో అట్టి దుర్గాతత్వాన్నిపెంపొందించుకోవటమే ప్రాణాయామం ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం.

ఇక దుర్గ పక్కన ఉండే లక్ష్మీదేవి ధనశక్తి. ఆశక్తిఉండాలి కానీ దివాంధం గుడ్లగూబలా కన్నూమిన్నూకానని స్థితి పనికిరాదు. దాని సూచిస్తూ లక్ష్మీదేవి గుడ్లగూబను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరో పక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక .అది అత్యవసరం. అసత్ జ్ఞానం వీడి సత్ జ్ఞానంతో ఉండాలనే దానికి సంకేతం ఆవిడ వాహనం హంస. అది నీటిని వీడి పాలనుమాత్రమే స్వీకరిస్తుంది. ఇంకో పక్కనుండే కుమారస్వామి దేవసేనాని ,ఆయనవీరత్వానికి ప్రతీక. అట్టివీరత్వంతో ఆత్మరాజ్యస్థాపన చేయాలి. నెమలి లైంగిక సంబంధంలేని బ్రహ్మచర్యానికి గుర్తు .అట్టి బ్రహ్మచర్యమందుండుటచే నెమలికన్నువంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది. ఇట్టి సాధనలో సిద్ది గణపతి స్థానం.

అకారణంగా అన్నింటినీ నాశనం చేసే లక్షణం ఎలుకది . సిధ్ధికి భంగం కలుగకుండా ఉండాలంటే  ఆఎలుకను అదుపులో ఉంచుకోవాలి . ఆన్నింటికీ అధిష్టాతగా ఉన్న శివుడు త్యాగమునకు, అద్వైతస్థితికి ప్రతీక కాగా ఆయన చేతిలో డమరుకం ప్రణవనాదం. త్రిసూలం సత్వరజస్తమోగుణాలకు గుర్తు, వృషము అంటే ధర్మం. అదే ఆయన వాహనమైన నంది. అది నాలుగు కాళ్లపై ఉంటుంది .ఇలా పరివార సహితంగా దుర్గాతత్వం మానవునకు మార్గదర్శకమై జీవితగమ్యాన్ని సూచిస్తుంది.

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

Wednesday, December 25, 2019

అష్టాదశ శక్తి పీఠాలు - Ashtadasa Shakti Phiitaluఅష్టాదశ శక్తి పీఠాలు - Ashtadasa Shakti Phiitalu
అష్టాదశ శక్తి పీఠాలు

అఖిల జగత్తుకు మూలదేవతగా జగన్మాతను ఆరాధించడం మన సంప్రదాయం. 
  • మహేశ్వరి, 
  •  మహాకాళి
  •  మహాలక్ష్మి, 
  • 卍 మహా సరస్వతి. 
ఇలా ఒక్కొక్క రూపం ఒక్కో శక్తి కేంద్రమై ఈ విశ్వాన్ని కాపాడుతున్నాయి. 
అష్టాదశ శక్తి పీఠాలతోపాటు అష్టోత్తర శత శక్తి పీఠాలతో భారతావని అణువణువూ మహా శక్తి కేంద్రమై విరాజిల్లుతోంది. 
శక్తి పీఠాలు ఆకారాది క్షకారాంత వర్ణమాలలోని ఒక్కో అక్షరానికి శక్తి స్థానమైన ప్రతీకలు. దీనివల్లే ప్రతి అక్షరం శక్తి సంపుటితమై మహా మంత్రమవుతోంది. శక్తి పీఠాలలో ప్రధానమైన అష్టాదశ పీఠాల ఆవిర్భావ విశేషాలు…

బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడింది. దీంతో దక్షుడు శివద్వేషిగా మారాడు.

శివుడిని అవమానించడం కోసం యజ్ఞం తలపెట్టాడు. అల్లుడు పరమేశ్వరుడు, కూతురు శక్తిని ఆహ్వానించకపోయినా స్త్రీ సహజమైన కుతూహలంతో ఆమె దక్షయజ్ఞానికి వెళ్ళింది. అక్కడ అవమానింపబడి యోగాగ్ని సృష్టించుకుని అందులో ఆహుతైంది. విషయం తెలిసిన శంకరుడు ఆగ్రహంతో శివ తాండవం చేశాడు. శివ జటాజూటం నుంచి వీరభద్రుడు ఆవిర్భవించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. పరమేశ్వరుడు దాక్షాయాణి మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయతాండవం చేయసాగాడు. బ్రహ్మాది దేవతలు భయంతో కంపించి విష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించారు. సతీదేవి శరీరం శంకరుడి భుజాన ఉన్నంత కాలం ఆయన రౌద్రం తగ్గదని భావించి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగల్ని ఖండఖండాలుగా చేశాడు.

సతీదేవి శరీర భాగాలు భారతదేశం అంతటా అక్కడక్కడా పడ్డాయి. ఆ శరీరం మొత్తం ఖండించడంతో పరమేశ్వరుడు క్రమంగా క్రోధం వదలి శాంత స్థితిలోకి చేరుకున్నాడు. ఆ ఖండాలు, ఆభరణాలు పడిన చోటల్లా ఒక శక్తి క్షేత్రంగా వెలసింది. అవే 108 శక్తి పీఠాలుగా గుర్తింపు పొందాయి. వాటిలో ప్రధానమైనవి పద్దెనిమిది శక్తి పీఠాలు.


1. శ్రీ శాంకరీదేవి – శ్రీలంక
శ్రీ శాంకరీదేవి – శ్రీలంక
ఇక్కడ సతీదేవి కాలి గజ్జెలు పడ్డాయి. శ్రీలంకలోని ట్రింకోమలిలో ఈ శక్తి పీఠం ఉంది. రావణాసురుడు శివభక్తుడు కావడం వల్ల పార్వతీదేవి లంకలో శ్రీ శాంకరీదేవిగా వెలసిందని ఐతిహ్యం.

2. శ్రీ కామాక్షీదేవి – కాంచీపురం
kanchi kamakshi devi
ఇక్కడ సతీదేవి వీపు భాగం పడింది. దేవతల విన్నపం మేరకు లోక కళ్యాణం కోసం దేవి బంధకాసురుడిని సంహరించి తన ఉగ్రరూపాన్ని మార్చుకుని కామాక్షిదేవిగా మారినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం తమిళనాడు రాజధాని చెన్నైకి 76 కి.మీ. దూరంలో ఉంది.

3. శ్రీ శృంఖలాదేవి – ప్రద్యుమ్నమ్

ఈ క్షేత్రంలో సతీదేవి ఉదరం పడింది. త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని సృష్టించినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం ప్రశ్చిమబంగలోని హుగ్లీ జిల్లా ప్రద్యుమ్నంలో ఉందీ. కోల్ కతాకు 135 కి.మీ. దూరంలో గల గంగాసాగర్ క్షేత్రం గొప్ప శక్తిపీఠంగా పేరొందింది.

4. శ్రీ చాముండేశ్వరి – మైసూరు
chamundeshwari devi mysore
ఇక్కడ సతీదేవి తలా వెంట్రుకలు పడ్డాయి. త్రిమూర్తులు సహా సకల దేవతల అంశంతో వారివారి అస్త్రాలతో జన్మించి మహిషాసురుని వధించిన దేవియే శ్రీ చాముండేశ్వరి దేవి. ఈ శక్తి పీఠం కర్ణాటకలోని మైసూరు నగరానికి 13 కి.మీ. దూరంలో ఉంది.

5. శ్రీ జోగులాంబ – అలంపురం
jogulamba devi alampur mp
సతీదేవి పైవరుస దంతాలు పడిన క్షేత్రమిది. ఈశ్వర ప్రసాది అయిన ఒక యువకుడు ఇక్కడ ఆలయ నిర్మాణం చేస్తుండగా ఆ ప్రాంత పాలకుడైన విలసద్రాజు ఆ యువకుడిని వధించాడు. ఫలితంగా రాజ్యం పోయి తిండిలేక సంచరిస్తున్న సమయంలో కనువిప్పు కలిగి జోగులాంబదేవి ఆలయం నిర్మించినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపూర్ రైల్వే స్టేషన్ నుంచి 9 కి.మీ. దూరంలో ఉంది.

6. శ్రీ భ్రమరాంబదేవి – శ్రీశైలం
srisaila bramarambika
ఇక్కడ సతీదేవి మెడ భాగం పడింది. దేవతల, ఋషుల ప్రార్థనలకు మెచ్చి జగన్మాత ఝంకారం చేస్తూ ఉన్న భ్రమరాలతో వచ్చి అరుణాసురుని సంహరించింది. శ్రీ భ్రమరాంబాదేవిగా శ్రీశైలంలో కొలువుదీరినట్లు స్థల పురాణం. ఈ శక్తి పీఠం కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంది. ఈ క్షేత్రం కర్నూలు నుంచి 179 కి.మీ., హైదరాబాద్ నుంచి 218 కి.మీ. దూరంలో ఉంది.

7. శ్రీ మహాలక్ష్మి – కొల్హాపూర్
kolhapur mahalakshmi
ఈ క్షేత్రంలో సతీదేవి మూడు కళ్ళు పడ్డాయి. దేవతలందరూ మహాలక్ష్మిని ప్రార్థించగా వారి కోరిక మేరకు కాల్హుడిని సంహరించి ఈ క్షేత్రంలో కొలువైంది. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుంది అని ఆర్యోక్తి. ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రంలో ఉంది. ఈ శక్తి పీఠం హైదరాబాదుకు 540 కి.మీ. దూరంలో ఉంది.

8. శ్రీ ఏకవీరాదేవి – మహుర్వం
ekaveera devi nanded
సతీదేవి కుడి చేయి ఈ ప్రాంతంలో పడింది. తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తల్లి, సోదరుల తలలు నరికేశాడు. తల్లి శిరస్సు పడిన ప్రాంతమే ఈ క్షేత్రం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి 42 కి.మీ. దూరంలో ఉంది.

9. శ్రీ మహాకాళి – ఉజ్జయిని
ujjaini mahankali temple madhya pradesh
ఈ క్షేత్రంలో సతీదేవి పైపెదవి పడినట్లు చెబుతారు. త్రిపురాసురులను సంహరించడానికి శివుడు, పార్వతీదేవి మహాకాళిగా యుద్ధానికి సంసిద్ధమయ్యారు. పంచభూతాలు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడికి అస్త్రాలుగా సహాయపడ్డాయి. పరమేశ్వరుడు, మహాకాళి రాక్షసుణ్ణి సంహరించి విజయం సాధించిన ప్రాంతమే ఉజ్జయిని. ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉంది. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు 55 కి.మీ. దూరంలోని క్షిప్రానదీ తీరంలో వెలిసింది.

10. శ్రీ పురుహూతీకా దేవి – పిఠాపురం
ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడింది. గయాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి త్రిమూర్తులు గయుని దేహమే యజ్ఞానికి సరైన స్థలంగా భావించారు. ముని అజ్ఞానుసారం యజ్ఞం చేస్తూ పార్వతీదేవి సహాయంతో గయాసురుణ్ణి సంహరించిన ప్రాంతమే పిఠాపురం. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి 18 కి.మీ. దూరంలో ఉంది.

11. శ్రీ గిరిజాదేవి (బిరాజ దేవి) – ఒడిశా
girija devi odisha
ఇక్కడ సతీదేవి నాభి భాగం పడింది. లోకంలో శాంతి నశించి అశాంతిమయమైన సమయంలో లోకశాంతి కోసం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం నుంచి గిరిజా దేవి ఉద్భవించింది. లోకంలో శాంతిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతంలో కొలువైనట్లు పురాణ కథనం. ఈ శక్తిపీఠం ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు 113 కి.మీ. దూరంలో ఉంది.

12. శ్రీ మాణిక్యాదేవి – ద్రాక్షారామం
draksharama manikya devi
ఈ క్షేత్రంలో సతీదేవి కణత భాగం పడింది. శివపార్వతుల తనయుడు కుమారస్వామి ఈ ప్రాంతంలోనే తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడిలోని ఆత్మలింగం ముక్కలు కాగా ఏర్పడిన పంచారామాల్లో ఒకటి. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 33 కి.మీ. దూరంలో ఉంది.

13. శ్రీ కామరూపాదేవి – హరిక్షేత్రం
kamarupa devi assam
ఈ క్షేత్రంలో సతీదేవి యోని భాగం పడింది. ఈ శక్తిపీఠం అసోం రాజధాని గౌహతికి 7 కి.మీ దూరంలో ఉంది. బ్రహ్మపుత్రానదీ తీరంలో ఈ క్షేత్రంలో ఏటా ఆషాడమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. కాముడికి మళ్ళీ రూపం వచ్చిన ప్రాంతం కాబట్టి కామాఖ్య క్షేత్రమని, కాపారూప క్షేత్రమని అంటారు. ఇక్కడి నీలాంచల పర్వతం విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి హరిక్షేత్రమని కూడా పిలుస్తారు.

14. శ్రీ మాధవేశ్వరి – ప్రయాగ
ఈ క్షేత్రంలో సతీదేవి చేతి ఉంగరం వేలు పడింది. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతం పంపకానికి శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారమే శక్తి స్వరూపిణిగా ఇక్కడ కొలువుదీరినట్లు స్థలపురాణం. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదుకు 6 కి.మీ. దూరంలో ఉంది.

15. శ్రీ వైష్ణవీ దేవి – జ్వాలా క్షేత్రం
vaishnavi temple jammu
సతీదేవి శిరస్సు పడింది ఈ క్షేత్రంలోనే. అమ్మ త్రిమూర్తి స్వరూపిణిగా కొలువుదీరిన క్షేత్రం జ్వాలాక్షేత్రం. అమ్మవారు ఇక్కడ వైష్ణవీదేవిగా దర్శనమిస్తుంది. ఈ శక్తిపీఠం కాశ్మీర్ లోని జమ్మూ నగరానికి 60 కి.మీ. దూరంలో ఉంది.

16. శ్రీ మాంగల్యాదేవి – గయ
maa mangla gauri mandir gaya bihar
ఇక్కడ సతీదేవి వక్షోజం పడినట్లు చెబుతారు. పిండప్రదానాలకు, పితృదేవతలకు పూజలకు పేరొందిన ప్రాంతమే గయా క్షేత్రం. ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమైన ప్రయాగ క్షేత్రంలో సమానమై ఫలం అందిస్తోంది. ఈ శక్తిపీఠం బిహార్ రాజధాని పాట్నా నగరానికి 74 కి.మీ. దూరంలో ఉంది.

17. శ్రీ విశాలాక్షి – వారణాసి
vishalakshi varanasi
ఇక్కడ సతీదేవి మణికర్ణిక పడింది. అమ్మలగన్నయమ్మ అశేష భక్తులపై తన కృపాకటాక్షాలు ప్రసరించే క్షేత్రమే వారణాసి. కాశీక్షేత్రం, వేద విద్యలకు నిలయం, అక్కడ నిరంతరం శిష్యగణంతో వ్యాసమహర్షి విశేశ్వర, అన్నపూర్ణాంబికలను ఆరాధించేవాడు. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది. ఇది అలహాబాద్ కు 131 కి.మీ. దూరంలో ఉంది.

18. శ్రీ సరస్వతీ దేవి – కాశ్మీర్
saraswati kashmir
కపటంతో పార్వతీదేవి ఇంటిని సొంతం చేసుకున్న రావణాసురునిపై కోపగించుకున్న పార్వదేవిని బుజ్జగిస్తున్న సరస్వతిని ఇక్కడే కొలువై ఉండమని చెప్పిన ప్రాంతమే కాశ్మీర్ క్షేత్రం. ఈ క్షేత్రంలో సతీదేవి దక్షిణ హస్తం పడినట్లు చెబుతారు. ఈ శక్తిపీఠం కాశ్మీర్ లోని శ్రీనగర్ కు 10 కి.మీ. దూరంలో ఉంది. ఒక్కప్పుడు ఇక్కడ ఉన్న శక్తి పీఠాన్ని వైదికులపై దాడి లో భాగంగా తురకలు ఈ ఆలయాన్ని కూల్చివేశారు.

అష్టాదశ శక్తిపీఠాలు దర్శించినా, స్మరించినా, జగములనేలే జగదంబ కరుణాకటాక్ష వీక్షణాలతో సకల శుభాలు కలిగి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు పొందుతారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

రచన: నాగవరపు రవీంద్ర

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com