కేరళ దేవస్థానం పాఠశాలల్లో అరబిక్ ఉపాధ్యాయులు | Kerala: Devaswom Board to appoint Arabic teachers in schools under its management!


క్షిణ కేరళలో దేవాలయ నిర్వహణకు చేసే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్  తమకు చెందిన పాఠశాలల్లో అరబిక్ ఉపాధ్యాయులను నియమించనుంది  ఈ మేరకు బోర్డు ఇప్పటికే ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితా ప్రకారం బోర్డు తన వివిధ పాఠశాలల్లో అరబిక్ బోధించడానికి నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసింది. జాబితాలో ఉన్న నలుగురు ముస్లింలే… వారు షమీరా, బుషారా బేగం, ముబాష్, మరియు సమయ్య మహమ్మద్  లు ఉన్నారు.

అరబిక్ తో పాటు గణితం సంగీతం  సాంఘిక శాస్త్రం, హిందీ వంటి సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయుల ఖాళీలను  బోర్డు భర్తీ చేసింది. అయితే ఇందులో సంస్కృత ఉపాధ్యాయులను నియమించక పోవడం గమనార్హం.

ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు 1950లో ట్రావెన్కోర్ కొచ్చిన్ హిందూ మత సంస్థల లోని చట్టం(15) ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. కేరళలోని ట్రావెన్కోర్ ల పరిపాలనా సమయంలో అప్పుడు ఉన్న 1248 దేవాలయాల నిర్వహణ బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు. 1949 వరకు ఈ దేవాలయాలన్నీ ట్రావెన్కోర్ పరిపాలిస్తున్న రాచరిక రాజుల అధీనంలో ఉండేవి.

ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ సిపిఎం  రాష్టం లోని 5 దేవస్వమ్ బోర్డులపై పెత్తనం చెలాయిస్తూ, దేవాలయాల నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలను హిందువులకు అందకుండా ప్రయత్నాలు చేస్తోంది.

అయితే గతేడాది 2019లో కేరళ అసెంబ్లీ ఒక వివాదాస్పదమైన బిల్లును ప్రవేశపెట్టింది.  మదర్సా టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ 2019 బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మదర్స ఉపాధ్యాయులకు వచ్చే పించన్ రూ.1500 లను 7500 లకు పెంచింది.  ఈ బిల్లును మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కెటి జలిల్ ప్రవేశపెట్టారు. మదర్సా ఉపాధ్యాయుల పరిస్థితులను మెరుగు పరచడం మరియు వారి కుటుంబాలను ఆదుకునే దిశగా ఈ చట్టాన్ని రూపొందించిన ట్టు వారు పేర్కొన్నారు.

దీన్ని బట్టి చూస్తే అధికారం లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు నియమిస్తూ… మరోవైపు ఇతర మతస్తులకు జీతాలను పెంచడం వంటివి చూస్తే ఆ రాష్ట్రంలో హిందువుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అర్థం చేసుకోవచ్చు.

మూలము : ఆర్గనైజర్ - విశ్వ సంవాద కేంద్రము 
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top