సంగీతం - విజ్ఞానం - Sangeetam

సంగీతంలో విజ్ఞానం ఉంది. అందులో ఆనందం ఉంది. సంగీతం పైన ప్రతి ఒకరికి ఆసక్తి ఉంటుంది.ఇది మన విద్య.సంగీతం మన భవిష్యత్ సంపద.వజ్రం కంటే విలువైనది.దానిని మనమే కాపాడాలి.

సంగీతం అంటే??
ఓంకారం ఆది ప్రణవ నాదం. భాష పుట్టుకకు ఓంకారం మూలం. సమస్త విద్యలు ఓంకారావిర్భవితాలే. ఓంకారం నుంచే సంగీతం ఆవిర్భవించింది.

సామవేదం:
సామం అనగా మధురమైనది, వేదం అనగా జ్ఞానం.యాగాలలో దేవత (శక్తి స్వరూపాలు) గొప్పదనాన్ని మధురంగా కీర్తించేది సామవేదం. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ.పూ 1000 వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ప్రాముఖ్యతలో, పవిత్రతలో, సాహిత్య విలువల్లో ఋగ్వేదం తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది.

గమనిక: పవిత్రభావాలతో, జ్ఞానవాక్యాలతో దైవ కీర్తన జరుపుతూ మనోల్లాసాన్ని పొందే పద+ఆవృత విదానం సంగీతం!!!

సంగీతం ఉత్తేజాన్నిస్తుంది. మానసిక జ్ఞానాన్ని ప్రసాదించే భారతీయ సంగీతం నేర్చుకోవటానికి, పిల్లలకు నేర్పించటానికి ప్రయత్నించండి.

ఈ పేజి యందు శక్తి అను పదం విజ్ఞానానికి సంభందించినది. మనం విజ్ఞానాన్ని దేవతా స్వరూపంలో పూజించాము. భక్తి మార్గంలో నడిచి శాంత స్వభావులం ఐయ్యాము. ఈ శక్తి వేల కోట్ల రూపాలలో ఉంది వాటిననింటిని మదురమైన జ్ఞాన వాక్కులతో కీర్తించే వేదాంశం సామవేదం. సామవేదంలోని అంశం సంగీతం.

భారతీయ సంగీతవిద్యలో రెండు ముఖ్య విభాగాలు.
 • ఒకటి కర్ణాటక సంగీతం.
 • రెండవది హిందుస్తానీ సంగీతం.
 • గాత్రం, వాద్యం సంగీతంలో విభాగాలు.
గాత్రం సంగీతంలో అతి ముఖ్యమైనది, వాద్యం గాత్రానికి సహాయం చేస్తుంది.
 • పిల్లన గ్రోవి(flute).
 • నాద స్వరం.
 • వాయులీనం(violin)
 • వీణ.
 • మృదంగం.
 • తబలా.
 • సితార్.
 • శంఖము.
 • ఢమరుకము.
ఇందులో ఏది తక్కువని అనుకున్న మనల్ని మనం తక్కువ అనుకున్నట్లే.ఈ విద్య నేర్చుకుంటే తెలుస్తుంది ఈ విద్య గొప్పదనం.

సంకలనం: కోటేశ్వర్
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top