అయోధ్య వివాదం: కీలక ఘట్టాలు (1528-2020) - Ayodhya Kilaka Ghattalu

 ఎల్.కె. అడ్వాణీ రథయాత్ర
 ఎల్.కె. అడ్వాణీ రథయాత్ర
 • ➣ 1528: మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ మీర్ బకి బాబ్రీ మసీదును నిర్మించారు.
 • ➣ 1885: బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా ఫైజాబాద్ కోర్టులో మహంత్ రఘుబీర్‌దాస్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత.
 • ➣ డిసెంబర్ 22-23, 1949: బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షం. హిందువులు దీనిని స్వయంభువుగా భావించారు. పూజలకు ప్రయత్నించడం ప్రారంభించారు. విగ్రహాలను తీసుకుని వచ్చి అక్కడ పెట్టారని కొందరి ఆరోపణ.
 • ➣ 1950: విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతివ్వాలని ఫైజాబాద్ కోర్టును కోరిన గోపాల్వి శారద, పరమహంస రామచంద్రదాస్.
 • ➣ 1959: వివాదాన్పద స్థలాన్ని తమ అధీనం చేయాలని కేసు వేసిన నిర్మోహీ అఖాడా.
 • ➣ 1961: బాబ్రీ మసీదులోని విగ్రహాలను తొలగించడంతోపాటు వివాదాస్పద స్థలం తమకు చెందినదిగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించిన యూపీ సెంట్రల్ సున్నీ వక్స్ బోర్డు.
 • ➣ 1984: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించిన విశ్వ హిందూ పరిషత్.
 • ➣ ఫిబ్రవరి 1, 1986: రామ్‌లల్లా విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిస్తూ ఫైజాబాద్ సెషన్స్ కోర్టు తీర్పు, నిరసన తెలిపేందుకు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటు.
 • ➣ ఆగస్టు 14, 1989: అలహాబాద్ హైకోర్టుకు స్థల వివాదం. వివాదాస్పద స్థలానికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం.
 • ➣ నవంబర్ 9, 1989: వివాదాన్పద రామజన్మభూమి స్థలం సమీపంలో శిలాన్యాస్ నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్ కు అనుమతిస్తూ అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వ నిర్ణయం.
 • ➣ సెప్టెంబర్ 1990: భవ్య రామమందిర నిర్మాణం లక్ష్యంగా గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి భారతీయ జనతా పార్టీ నేత ఎల్.కె. అడ్వాణీ రథయాత్ర ప్రారంభం. 
 • ➣ డిసెంబర్ 6, 1992: కరసేవకుల చేతుల్లో నేలమట్టమైన బాబ్రీ మసీదు. చెలరేగిన హింస.
 • డిసెంబర్ 16, 1992 : బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై విచారణకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు.
 • ➣ 1993: రామజన్మభూమి తాలూకూ వివాదాస్పద స్థలంతోపాటు పరిసరాల్లోని సుమారు 67 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న పి.వి.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం. 
 • ➣ 1994: స్థలస్వాధీనానికి సుప్రీంకోర్టు సమర్థింపు. ఇస్లాం మతంలో మసీదు ఒక భాగం కాదంటూ డాక్టర్ ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వ్యాఖ్య. 
 • ➣ ఏప్రిల్ 2002: వివాదాస్పద రామజన్మభూమి స్థల యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టులో విచారణ ప్రారంభం. 
 • ➣ మార్చి 2003: కేంద్రం స్వాధీనం చేసుకున్న భూమిలో మతపరమైన కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నిషేధం. 
 • ➣ 2005: వివాదాన్పద స్టలం పై పేలుడు పదార్ధాలు నిండిన జీపుతో ఉగ్రవాదుల దాడి. ఎదురు కాల్పుల్లో అందరూ హతం. 
 • ➣ 2009: ప్రభుత్వానికి జస్టిస్ లిబర్హాన్ కమిషన్ నివేదిక.
 • ➣ సెప్టెంబర్ 30, 2010: సున్నీ వక్స్ బోర్డ్, రామ్ లల్లా, నిర్మోహి అఖాడాకు సమానంగా స్థలాన్ని విభజించాలని అలహాబాద్ హైకోర్టు త్రినభ్య ధర్మాసనం ఆదేశం. 
 • ➣ మే, 2011: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం. 
 • ➣ మార్చి, 2017: అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జె.ఎస్. ఖేహర్ సూచన. 
 • ➣ ఆగస్టు, 2017: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన త్రినభ్య బెంచ్ విచారణ ప్రారంభం. 
 • ➣ సెప్టెంబర్, 2018 : 1994 నాటి ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును పునఃపరిశీలించాలన్న పిటిషనర్ల అప్పీళ్లపై విచారించిన సుప్రీంకోర్టు. విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించరాదంటూ 2:1 తేడాతో న్యాయమూర్తుల తీర్మానం. 
 • ➣ జనవరి 8, 2019 : అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ పై ధర్మాసనం ఏర్పాటు. చీఫ్ జస్టిస్ రంజన్ గాగోయ్ నేతృత్వంలో జన్టిన్ ఎన్.ఎ. బొట్టే, జనస్టిన్ ఎస్.వి.రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డి.వై చంద్రచూడ్‌లతో ధర్మాసనం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించిన చీఫ్ కి జస్టిస్
 • ➣ జనవరి 10, 2019: విచారణ బెంచ్‌లో తాను ఉండరాదని జస్టిస్ యు.యు. లలిత్ నిర్ణయం. దీంతో బెంచ్ పునర్వ్యవస్థీకరణ. జస్టిస్ ఎస్.వి. రమణ, జస్టిస్ యు.యు.లలిత్ స్థానంలోకి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్. 
 • ➣ మార్చి 8, 2019: కోర్టు పర్యవేక్షణలో ఉండే మధ్యవర్తిత్వ కమిటీకి వివాదాస్పద అంశం.
 • ➣ అక్టోబర్ 2019: నమన్య సామరస్య పరిష్కారంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూరి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ. ఖలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ విఫలం. నివేదిక సమర్పణ. 
 • ➣ ఆగస్టు 6, 2019: రోజుూవారీ విచారణ చేపట్టిన ధర్మాసనం. 
 • ➣ అక్టోబర్ 16, 2019: తుది తీర్పు రిజర్వ్. 
 • ➣ నవంబర్ 9, 2019: వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం తీర్పు.
 • ➣ ఫిబ్రవరి 5, 2020: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 15 మంది సభ్యులతో పార్లమెంట్లో ట్రస్ట్ ను ప్రకటించిన ప్రధాని మోదీ.
 • ➣ ఫిబ్రవరి 19, 2020: శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు.
 • ➣ ఆగస్టు 5, 2020: రామజన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమిపూజ. 

__జాగృతి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top