ఈరోజే సుందరమైన అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ - The beautiful Ayodhya Rama Mandir Bhoomi Pojan

రోజు జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.

ప్రధాని నరేంద్ర మోదీ మఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. మూడు అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. ముందుగా అనుకున్న నమూనా కంటే ఆలయం ఎత్తు 20 అడుగులు పెంచినట్లు శిల్పులు తెలిపారు.

ఆలయ సముదాయంలో ఒకే సారి లక్ష మంది భక్తులు సమావేశం కావచ్చని అంచనా. రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఆలయం ఉత్తర భారత దేశంలోని నాగర శైలిలో ఉండనుంది. నమూనా ఆకృతుల ప్రకారం మొత్తం ఐదు గుమ్మటాలు ఉంటాయి. అలానే గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ఆలయం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు మూడేళ్ల సమయం పడుతుందని శిల్పులు తెలిపారు.

ప్రముఖ ఆలయ శిల్పి చంద్రకాంత్‌ సోమ్‌పుర ఆలయాన్ని డిజైన్‌ చేశారు. రామ మందిర నమూనాల కోసం 30 ఏళ్ళ క్రితమే తనను సంప్రదించినట్లు సోమ్‌పుర తెలిపారు. అయితే అప్పట్లో రూపొందించిన ఆకృతిలో ప్రస్తుత శైలికి తగినట్లుగా కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు. దేశంలో సోమ్‌నాథ్‌, అక్షర్‌థామ్‌ వంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులను వీరి కుటుంబమే రూపొందించారు.
రామాలయ నమూనా చిత్రం
రామాలయ నమూనా చిత్రం 

అయోధ్య రామ మందిర పోరాటం ఒక జాతీయ సాంస్కృతిక పోరాటం,భారత దేశ సాంసృతిక గుర్తు:
 • 🟔 ఈరోజు (5-08-2020) అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం కొరకు భూమిపూజ.
 • 🟔 జై శ్రీ రామ్ నినాదాలు మారుమ్రోగాలి, దేశ సంస్కృతి, కి ప్రతిబింబం ఈ అయోధ్య రామమందిరం.
 • 🟔 యావత్ హిందూ సమాజానికి పర్వదినము.
 • 🟔 అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలి.
 • 🟔 ఈరోజు ప్రతి ఇంటిముందు వీలైనంత వరకు గోమయంతో కళ్ళాపి చల్లుకోవాలి. సంక్రాంతి పండుగ సందర్భంలో మాదిరిగా రంగురంగుల రంగవల్లులను వేసుకోవాలి.
 • 🟔 అన్ని గుమ్మాలకు మామిడి తోరణాలను కట్టుకోవాలి.
 • 🟔 మీ వాట్సప్,ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ ,స్టేటస్ లు రాముడి తో నిండిపోవలి....
 • 🟔 ఇంటిపైన కాషాయధ్వజాన్ని ఎగురవేయాలి.
 • 🟔 తలస్నానమాచరించాలి. కుటుంబసభ్యులంతా కలిసి శ్రీరాముడి పూజ చేయాలి.. హనుమాన్ చాలీసా పఠించాలి.రోజంతా " శ్రీరామ జయరామ జయజయ రామ " మంత్రాన్ని మనసులో జపిస్తూనే ఉండాలి.
 • 🟔 మిరియాలు,శొంఠి, శుద్ధమైన బెల్లం మొదలైన పదార్థాలతో పానకాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదన చేయాలి. శ్రీరాముడికి ఇష్టమైన ఈ పానకాన్ని అందరూ సేవించాలి.
 • 🟔 ఉదయం సుమారుగా 10-30ల నుండి దూరదర్శన్ లో కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని పూర్తయ్యే వరకు వీక్షించాలి.
 • 🟔 సూర్యాస్తమయం తరువాత దీపావళి రోజున వెలిగించినట్టుగా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించండి ( నువ్వుల నూనె లభ్యం కాకపోతే ఏదైనా శుభ కార్యానికి వాడే నూనెను ఉపయోగించవచ్చు).
రామాలయ నమూనా చిత్రం 
మన తండ్రి రాముని ఆలయ నిర్మాణంలో కొన్ని ముఖ్యమైన అంశాలు:

అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరం భూమి పూజ ఆగస్టు 5న జరగనున్న నేపథ్యంలో మందిర నిర్మాణానికి సంబంధించిన వవిశేషాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి.
 • ● ఇనుము వాడకుండా అయోధ్యలో రామాలయం నిర్మాణం!
 • ● ఈ క్రమంలో మందిరంలో మూడు అంతుస్తులు ఉండనున్నట్లు సమాచారం. గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి, రెండవ అంతస్తులుగా  నిర్మాణం జరగనుంది.
 • ● ప్రతిపాదిత రామమందిరాన్ని 10 ఎకరాల స్థలంలో నిర్మిస్తుండగా.. మిగిలిన 57 ఎకరాలను రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయనున్నారు.
 • ● ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న 'శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్'‌ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఆలయ సముదాయంలో నక్షత్ర వాటిక కూడా నిర్మించనున్నారు.
 • ● ఒక్కో నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 27 మొక్కలను నాటనున్నారు.
 • ● నక్షత్ర వాటిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే :- జనాలు తమ పుట్టిన రోజునాడు వారి జన్మ నక్షత్రం ప్రకారం ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్మాణం ఉండనుంది.
 • ఇనుము లేకుండా నిర్మాణం:
 • ● ఆలయ పునాది 15 అడుగుల లోతులో ఉంటుంది. ఇది 8 పొరలను కలిగి ఉంటుంది. ప్రతి పొర 2 అడుగుల వెడల్పు ఉంటుంది.
 • ● పునాది వేదికను సిద్ధం చేయడానికి కాంక్రీట్‌, మోరాంగ్‌ను వాడనున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించడం లేదు.
 • ● అంతేకాక వాల్మీకి రామాయణంలో పేర్కొన్న చెట్లను రామాలయ‌ ప్రాంగణం‌లో నాటనున్నారు. ఈ ప్రాంతానికి వాల్మీకి రామాయణానికి అనుగుణంగా పేరు పెడతారు.
 • ● మందిరం భూమి పూజ తర్వాత రామాలయ‌ ప్రాంగణం‌‌లో శేషవతార్‌ ఆలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ట్రస్ట్‌ ప్రతిపాదించింది.
 • ● మందిర నిర్మాణం ముగిసిన తర్వాత శేషవతార్‌ శాశ్వత నిర్మణాన్ని చేపడతారు.
 • ● రాముడి పుట్టుక నుంచి అవతారం ముగిసేవరకు జరిగిన పలు అంశాలతో ‘రామ్‌ కథా కుంజ్‌ సందర్శకుల చోటు ’‌ నిర్మాణం కూడా జరగనుంది.
 • ● అలానే మందిరం తవ్వకాలలో లభించిన అవశేషాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు.
 • ● దాంతో పాటు గోశాల, ధర్మశాల, ఇతర దేవాలయాల సముదాయాలు కూడా ఇక్కడ నిర్మిస్తారు.
 • ● మందిరం ఎత్తు మరో 20 అడుగులు పెంపు'
 • ● మందిరం భూమి పూజ కోసం రాగి పలకను సిద్ధం చేస్తున్నారు.
 • ● దీని మీద ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనగా ఆలయం పేరు, ప్రదేశం, సమయం ఈ పలకపై సంస్కృతంలో చెక్కుతారు.
 • ● 1988లో ప్రతిపాదించిన అయోధ్య రామ మందిర నిర్మాణం ఎత్తు 161 అడుగులు.
 • ● అయితే ప్రస్తుతం దాన్ని మరో 20 అడుగులు పెంచినట్లు ఆలయ ప్రధాన వాస్తు శిల్పి సి సోంపురా కుమారుడు నిఖిల్‌ సోంపురా తెలిపారు.
 • ● ఆగస్టు 5న జరగనున్న మందిర భూమి పూజ కోసం గంగా, యమున, సరస్వతి నదులు సంగమ క్షేత్రం అయిన త్రివేణి సంగమం నుంచి నీరు, మట్టి తీసుకెళ్లాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సూచించింది.
 • ● రామ్‌ మందిర్‌ ఉద్యమంలో ప్రయాగ్‌రాజ్‌‌కు చెందిన పలువురు సాధువులు ప్రముఖ పాత్ర పోషించినందున.. అయోధ్యలో భూమి పూజ జరిగే రోజున వివిధ మఠాలు, దేవాలయాల్లో వేడుకలు జరుగుతాయని వీహెచ్‌పీ ప్రతినిధి అశ్వని మిశ్రా తెలిపారు.
హిందువులంతా ఇందు భాగం అవ్వండి తోటి హిందువులందరిని ఇందులో భాగం చెయ్యండి. సమాచారాన్ని మీ చుట్టుప్రక్కలవారికి, బంధుమిత్రులకు తెలియజేయండి.

జై శ్రీరామ్

__విశ్వ సంవాద కేంద్రము 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top