జీవాత్మ - Jivatma

జీవాత్మ - Jivatma

- జీవాత్మ -
ఓం నమో పరమాత్మయే నమః
జీవాత్మ:
పరమాత్మ మరియు ఆత్మ అంటే వివరించాను. ఆత్మ (పరమాత్మ) అంటే శాశ్వతమైనది, నిత్యమైనది.

జీవాత్మ అంటే మనిషి పుట్టిన తరువాత శరీరము చేసే కర్మలను అజ్ఞానముతో మరియు అవిద్యతో తనే చేస్తున్నాడు అనుకోని  బందము ఏర్పరచుకొని తన స్వస్వరూపమైన ఆత్మకు బంది అవుతున్నాడు.

అంటే శరీరము చేసే పనులు కర్మానుసారంగా జరుగుతూ వుంటాయి . కానీ మనము వాటిని(కర్మలను) అజ్ఞానముతో, వాటి ఫలితాలను ఆశించి మరల మరల బంధాలను ప్రోగు చేసుకోనుచున్నాము. ఆ విదంగా మనకు మనముగా అవివేకముతో బందీలమవుతున్నాము.

ఈ విదంగా ఏ విదమైన సంబందము లేని నువ్వు(ఆత్మ) ఇక్కడి (ప్రకృతి) బంధాలను(కర్మలను) కలుపుకొని జీవాత్మ గా తయారవుచున్నావు. కాని ఈ జీవాత్మ ఎప్పుడైతే తన స్వస్వరూపమును తెలిసికొని తన హృదయములో సాక్షాత్కరించుకు0టుందో అప్పుడు అది విముక్తి పొంది తన నివాసానికి చేరుకుంటుంది (అదే పరమాత్మ లో ఐక్యం అవుతుంది)   

నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నా భూయ: !
అజో నిత్య: శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ||  (భగవద్గీత 2:20)
భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఎన్నడైనా ఆత్మకు జన్మగాని, మరణముగాని లేదు. జన్మ లేనిది, నిత్యమూ, శాశ్వతము అయిన ఆత్మ శరీరము చంపబడినను చావదు.

దేహినోస్మిన్యథాదేహే, కౌమారంయవ్వనంజరా
తథాదేహాస్తరప్రాప్తి; ధీరస్తతరనముహ్యతి ||   (భగవద్గీత)
జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలి తనము ఏట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. 
అంటే జీవుడు తన స్వస్వరుపమును తెలిసికోనంత వరకు అతను మరల మరల పుడుతుంటాడు . అయితే అది మరల మానవ జన్మే అని మాత్రమూ చెప్పలేము. అందువలన ఇప్పుడు పొందిన మానవ జన్మను సార్ధకపరచుకోవలెను మనము.


కర్మన్యెవాధికారస్తే, మఫాలేషుకదాచనా
మకర్మఫల హేతుర్భు: మాతేసజ్గోస్త్వకర్మణి ||  (భగవద్గీత)
కర్మలను ఆచరించుట యందు నీకు అదికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.
అంటే ఇక్కడ శ్రీ కృష్ణుడు ఎంత బాగా చెప్పాడో చూడండి. కర్మలను ఆచరించండి కానీ వాటి ఫలితాలను మాత్రము నాకు సమర్పించండి. అప్పుడు మీరు బంద విముక్తులవుతారు అని ఎంతో విపులంగా విషదీకరించాడు.

మమైవా0శో జీవలోకే జీవభూత: సనాతన: |
మన:షష్టనీందరియాణి ప్రకృతిస్థాని కర్షతి ||  (భగవద్గీత 15:7)
జీవ జగత్తులోని జీవుడు నిశ్చయముగా శాశ్వతమైన నా అంశ(భాగము). మనస్సుతో కలిపి ఆరు (కర్మ) ఇంద్రియములతో భౌతిక ప్రకృతిలో కష్టపడుచున్నాడు.
అంటే ఇక్కడ జీవుడు (కర్మ మరియు ఆత్మ కలిపి) ప్రకృతిలో తను అజ్ఞానముతో ఆపాదించుకున్న కర్మలను చేయుచున్నాడు.

శ్రోతం చక్షు: స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విసయనుపసేవతే || (భగవద్గీత 15:9)
విని, చూసి, స్పర్స, రుచి, వాసన పొంది మనస్సుతో జీవుడు విసయాన్ని అనుభవిస్తున్నాడు. అంటే ఇక్కడ జీవుడు అన్నిటిని అనుభవిస్తున్నాడు అంతేకాని ఆత్మకు ఇవి అన్నియు ఏమి సంబందము లేదు.

ఉత్క్రామన్తం స్తితం వాపి భుంజానం నా గుణాన్వితమ్ |
విముడా నానుపస్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష: ||  (భగవద్గీత 15:10)
జీవాత్మ శరీరము నందుండి గుణ ప్రభావమున అనుభవించుటగాని, శరీరమును విడుచుటగాని అజ్ఞానులు చూడజాలరు. జ్ఞాని చూడగలడు.


యతంతో యోగినశ్చైనం పశ్య0త్యాత్మన్యవస్తితమ్ |
యతంతో ప్యకృతాత్మనో నైనం పస్యంత్యచేతస: ||  (భగవద్గీత 15:11)
ప్రయత్నించి యోగులు కూడా ఆత్మస్తితులై దీనిని(ఆత్మ) చూడగలరు. ఆత్మానుభూతి లేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించిన దీనిని(ఆత్మ) చూడలేరు.
అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల ఏమిటంటే ఆత్మను ఈ ప్రకృతితో నిర్మితమైనవి(మన కళ్ళు) ఏవియును చూడలేవు. ఆత్మను మన ఈ కళ్ళతో చూడదగినది కాదు . ఆత్మ దర్శనము పొందాలంటే ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రుమద్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబింపజేసి, మనస్సును, బుద్దిని, స్వాదీన మొనర్చుకొని, మొక్షాసక్తుడై యుండునో అట్టివాడు ఆత్మ దర్శనము చేసుకోగలడు(అంటే ద్యానములో కూర్చొని మాత్రమే ఆత్మ దర్శనము చేసుకోగలడు).


ఏషాబ్రాహ్మీస్తితి:పార్థా, నైనాంప్రాప్యవిముహ్యతి
స్తిత్వాస్యామన్తకలేపీ, బ్రహ్మనిర్వాణమ్రుచ్చతీ ||  (భగవద్గీత)
ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాదనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. 

హరే రామ హరే కృష్ణ 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top