రాముడు ఓ కల్పితపాత్ర: "రామాయణం కారణంగానే రాముడు ఉన్నాడు", కాంగ్రెస్ ఎంపి కుమార్ కేట్కర్ వ్యాఖ్యలు - "Ram exists because of Ramayan”: Congress MP Kumar Ketkar hints that Lord Ram is fictional

రాముడి ఉనికిని పలు సందర్భాల్లో ప్రశ్నించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దాని నాయకులు కోట్ల మంది హిందువుల మనోభావాలను అవమానపరిచారు.

ఆగస్టు 5 న భూమి పూజ‌కు ముందు జీ న్యూస్ అయోధ్య, రామ్ మందిరాలపై చర్చ నిర్వహించింది. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు కుమార్ కేట్కర్ శ్రీ రాముడు పుట్టుక చారిత్రక అబద్దమని, అప్పటి సాహిత్య రచయితల సృష్టి అని రామాయణం ఒక కథ మాత్రమేనని ఈ కాంగ్రెస్ నాయకుడు వాదించాడు.

శ్రీ రాముడి ఉనికిని ప్రశ్నించారు కుమార్ కేట్కర్:
సుమారు 19 నిమిషాల ఈ చర్చలో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భగవాన్ రాముడి ఉనికిని నమ్ముతున్నారా? జీ న్యూస్ అడిగిన ప్రశ్నకు.

అజ్ఞానంతో నిండిన ఈ కాంగ్రెస్ నాయకుడు, "రామాయణం కారణంగానే రాముడు ఉన్నాడు", అని వ్యాఖ్యానించాడు. అయితే, రాముడు ఒక చరిత్ర లేదా సాహిత్యం యొక్క సృష్టా అనే దానిపై ఇంకా తాము ఒక నిర్ధారణకు రాలేదని.  వాల్మీకి ఒక గొప్ప ఇతిహాసం రాశాడు దాని ప్రభావం భారతదేశంతో పాటు విదేశాలలో కూడా ఉంది. కానీ, అతను చరిత్రలో ఉన్నాడో లేదో నాకు తెలియదు. " అని వ్యాఖ్యానించాడు.

అల్లాహ్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం ఉందా?  కుమార్ కేత్కర్ ను ప్రశ్నించిన సంబిత్ పత్రా..
హిందువుల మత మనోభావాలను దెబ్బతీసినందుకు బిజెపి నాయకుడు సంబిత్ పత్రా అతనిపై నిందలు వేశారు మరియు అల్లాహ్ ఉనికిని ఇదే తరహాలో ఖండించారు.

ఇదే చర్చలో పాల్గొన్న బిజెపి నాయకుడు సంబిత్ పత్రా, హిందువుల మత మనోభావాలను దెబ్బతీసిన కుమార్ కేత్కర్ వ్యాఖ్యలను ఖండిస్తూ, అల్లాహ్ ఉనికిని ఇదే తరహాలో ప్రశ్నించే ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు.

“కాంగ్రెస్ సభ్యుడు ఏమి చెబుతున్నాడు?" రాముడు చరిత్ర లేక సాహిత్య కారుల సృష్టా అని అడుగుతున్నాడు. రామ్ ఉన్నాడని ఆధారాలు చూపించమని ఆయన మాకు చెబుతున్నాడు… మీరు అల్లాహ్ గురించి అదే మాట చెప్పి ఉంటే, మీరు శిరచ్ఛేదం చేయబడేవారు.

2007 లో, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో, "వాల్మీకి రామాయణం మరియు రామ్‌చరిత్మణులు పురాతన భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగమని , అయితే ఇవి నిజంగా జరిగిన చారిత్రక రికార్డులు అని చెప్పలేమని. రామాయణంలో ని పత్రాలు ఉహాజనికంగా ఉన్నాయని, ఆలా పాత్రలను చిత్రీకరించారని, నిజంగా రామాయణ చరిత్ర ఉందొ లేదో చెప్పలేమని, 2007లో యుపిఎ ప్రభుత్వం తలపెట్టిన సేతుసముద్రం ప్రాజెక్టును రద్దు చేయాలన్న హిందువుల డిమాండ్‌పై కోర్టులో ఈ విధంగా అఫిడవిట్ దాఖలు చేశారు.

మూలము: Opindia
అనువాదము: తెలుగు భారత్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top