వెన్నదొంగ అని శ్రీ కృష్ణ భగవానుని ఎందుకు అంటారు? - Vennadona Krishna


వెన్నదొంగ:
మనకందరికీ తెలుసు శ్రీ కృష్ణుడు వెన్నదొంగ అని, నిజంగా శ్రీ కృష్ణుడు దొంగలించిన వెన్న, ఏమి వెన్న,ఒకసారి బాగా ఆధ్యాత్మికముగా ఆలోచించండి. ఎవరి ఇళ్ళలో దొంగలించాడు, నందవ్రజములోని గోపికల, గోపాలుర,ఇళ్ళలోమాత్రమే దొంగలించాడు.

బాహ్యంగాకనిపించే వెన్నా,అంతరంగ మైన వెన్నా, ఏవెన్న?
మానవ శరీరమనే ఇంటిలో హృదయమనే కడవలో భక్తి, ప్రేమ, పూజ, సాధన, అనే దధిని (పెరుగును) మనసనే కవ్వము వేసి బుద్ధి అనే త్రాటిని మనసనే కవ్వమునకు చుట్టి భక్తి, ప్రేమ పూజ, సాధన అనే చేతులతో నిరంతరమూ చెలికితే సంసారము అనే ఆవు నుండి చతుర్విద పురుషార్ధములు అనే సిరలనుండి కోరికలు అనే పాలు (పిండుకొని) పితికి ప్రేమ అనే పాత్రలో పోసి, సాధన అనే పొయ్యి పై ఉంచి అందులో, అరిషడ్వర్గము లనే కర్రలను (పుల్లలను) ఆ పొయ్యి లో పెట్టి, భక్తి అనే నిప్పు రవ్వలతో అరిషడ్వర్గములనే కర్రలను (పుల్లలను) రగిల్చి, పూజ అనే గాలిని ఊదగా, ఉదగా నిరంతర స్మరణ మంటలు పుట్టి, ఆమంటలతో కోరికలు అనే పాలను కాంచగా, కాంచగా అవి బాగా కాగి ఆపాలు బాగా పొంగితే, ఆ పొంగిన పాలను శాంతి అనే ప్రశాంత వాతావరణములో చల్లార్చి విశ్వాసమనే తోడు (సేమిర) వేయగా, అపుడు జ్ఞానము అనే దధి (పెరుగు) తయారవుతుంది. అందులో మనసనే కవ్వమునకు, సాధన అనే దారపుపోగులతో తయారుచేసిన, ఏకాగ్రత అనే త్రాటిని చుట్టి, నిరంతర స్మరణ అనే చేతులతో, జ్ఞానమనే దధిని చిలకగా,చిలకగా వెన్న అనే ఫలము ముగ్ధ మనోహరంగా, ముద్ద గా తేలుతుంది. సాధకుడు ఆ వెన్నను ఆ ఫలమును,భగవంతునకు భక్తిగా సంర్పించాలి. ఈ వెన్ననే శ్రీ కృష్ణుడు దొంగిలించి తృప్తీగా స్వీకరించి వారిని అనుగ్రహించాడు.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top