శ్రీ కృష్ణ జన్మాష్టమి - Sri krishna janmashtami

0

 శ్రీ కృష్ణ జన్మాష్టమి - Sri Krishna Janmashtami

కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి?
 • లేవవలసిన సమయము: ఉదయం 5 గంటలకు
 • శుభ్రపరచవలసినవి: పూజామందిరము, ఇల్లుశుభ్రం చేయాలి.
 • చేయవలసిన అలంకారములు: గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.
 • చేయవలసిన స్నానము: తలస్నానము
 • ధరించవలసిన పటుబట్టలు: పసుపు రంగువి
 • పూజామందిరంలో చేయవలసినవి: పూజకు ఉపయోగపడు వస్తువులు, పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
 • మందిరములో పరచవలసిన వస్త్రము: పసుపు రంగు
 • కలశముపై వస్త్రము రంగు: పసుపు రంగు
 • పూజించవలసిన ఫోటో: శ్రీకృష్ణుడు రాధతో
 • పూజించవలసిన ప్రతిమ: శ్రీకృష్ణుడు
 • పూజించవలసిన దైవము: శ్రీకృష్ణుడు
 • తయారుచేయవలసిన అక్షతలు: పసుపు రంగు
 • పూజకు కావలసిన పువ్వులు: కదంబ పుష్పములు
 • అలంకరణకు వాడవలసిన పూలు: సన్నజాజులతో మాల
 • నివేదన చేయవలసిన నైవేద్యం: పానకం
 • సమర్పించవలసిన పిండివంటలు: వడపప్పు
 • నిషేధించవలసిన పండ్లు: కమలా ఫలములు
 • పారాయణ చేయవలసిన అష్టోత్తరం: శ్రీకృష్ణ అష్టోత్తరము
 • పారాయణ చేయవలసిన స్తోత్రాలు: శ్రీకృష్ణాష్టకం
 • పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు: బాలకృష్ణా స్తోత్రమ్
 • పారాయణ చేయవలసిన సహస్రాలు: శ్రీకృష్ణ సహస్రనామము
 • పారాయణ చేయవలసిన గ్రంథం: శ్రీమద్భాగవతము
 • పారాయణ చేయవలసిన అధ్యాయములు: దశమ, ఏకాదశ స్కంధములు
 • దర్శించవలసిన దేవాలయాలు: శ్రీకృష్ణదేవాలయము
 • దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు: గౌడీయమఠములు
 • చేయవలసిన ధ్యానములు: కృష్ణ ధ్యానశ్లోకములు
 • చేయించవలసిన పూజలు: కృష్ణ అష్టోత్తర పూజ
 • దేవాలయములో చేయించవలసిన పూజాకార్యక్రములు: కృష్ణ సహస్రనామపూజ
 • సేకరించివలసిన పుస్తకములు: భాగవతము
 • సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుచూ అందజేయు పుస్తకములు: శ్రీకృష్ణ నిత్యపూజ.  
 • స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి: శ్రీకృష్ణ నిత్యపూజ
 • దేవాలయమువారు నిర్వహించవలసిన ఉత్సవములు: శ్రీకృష్ణ లీలలు (నాటిక).
 • దేవాలయమువారు నిర్వహించవలసిన ప్రత్యేక పూజలు: శ్రీకృష్ణ చరిత్ర (ఉపన్యాసములు)
 • పర్వదిన తిథి: అష్టమి
 • పర్వదినము యీవారము వస్తే చాలామంచిది: ఆదివారం
 • పర్వదినము రోజున పూజ చేయవలసిన సమయము: మ|| 12గం||
 • వెలిగించవలసిన దీపారాధన కుంది: కంచు దీపం
 • వెలిగించవలసిన దీపారాధనలు: 2
 • వెలిగించవలసిన వత్తుల సంఖ్య: 5
 • వెలిగించవలసిన వత్తులు: దూదితో
 • దీపారాధనకు వాడవలసిన నూనె: కొబ్బరినూనె
 • వెలిగించవలసిన ఆవు నేతితో హారతి: పంచహారతి
 • ధరించవలసిన తోరము: సింధూరము
 • నుదుటన ధరించవలసినది: సింధూరము
 • 108 మార్లు జపించవలసిన మంత్రం: ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
 • జపమునకు వాడవలసిన మాల: తులసి మాల
 • మెడలో ధరించవలసిన మాల: తులసి మాల
 • మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ: శ్రీకృష్ణ
 • చేయవలసిన అభిషేకము: పంచామృతములతో
 • ఏ దిక్కుకు తిరిగి పూజించాలి: తూర్పుదిక్కు
శ్రీముఖనమ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! ( క్రీస్తు పూర్వం 3228సం|| ) 
జయతు జయతు దేవో దేవకీ నందనోయం 
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః 
జయతు జయతు మేఘ శ్యామలః 
కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః|| 
తా|| ఓ దేవకినందనా! ఓ వృష్ణివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ! భూభారనాశ ముకుంద! నీకు సర్వదా జయమగుగాక! 

ఆ బాలకృస్తుడు దినదిన ప్రవర్థమానమగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగనా భక్తులను జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనములో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట! వెన్న జ్ఞానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ ఉంటారు. 

అలాగునే మరో చిన్నారి చేష్టలలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళూతూఉంటే, రాళ్లను విసిరి చిల్లు పెట్టేవాడట, అలా ఆ కుండ మానవశరీరము అనుకుంటే ఆ కుండ లోని నీరు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు. 

ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ, శిష్ఠరక్షణ శిష్ఠరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రధసారధియై అర్జునిలో ఏర్పడిని అజ్ఞాననాంధకారాన్ని తొలగించుటకు " విశ్వరూపాన్ని " చూపించి గీతను బోధించి, తద్వారా మానవళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు వేయి తలలు కలిగిన ఆదిశేషునకే సాధ్యముకాదని చెప్పగా! అట్టి శ్రీకృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన ' గీతామృతం ' మనకు ఆదర్శప్రాయం. 

" గీతాచార్యుడు " కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యాలను తీర్చుకుని చల్లని నీటిలీ " తులసీదళము " లను ఉంచి స్నానమాచరించిన సమస్త పుణ్య తీర్థములలోను స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని, ఆ రోజు సర్వులు వారి వారి గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణ పాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను ఉంచి, రకరకాల పూవులతో గంధాక్షతలతో పూజించి, ధూపదీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థ ప్రసాదములు, దక్షిణ తాంబూలములు సమర్పించుకొనుట ఎంతో మంచిదో చెప్పబడినది. ఇంతేకాక చాలాచోట్ల కృష్ణ పరమాత్మ లీలల్లో ఒక లీలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. 
కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం 
అద్వైవమే విశతు మానసరాజహంసః|| 
ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై 
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ|| 
ఓ కృష్ణా! మరణసమయాన నిన్ను స్మరించుచూ నీలో ఈక్యమవ్వాలని కోరిక ఉన్నది కాని! ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా ' మానస రాజహస 'ను శతృఅబేద్యమైన " నీపాద పద్మ వజ్రపంజర " మందు ఉంచుతున్నాను తండ్రీ...!   ఇట్టి పరమ పుణ్యదినమైన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమినాడు విశేషార్చనలు జరిపించుకుని కృష్ణ భగవానుని ఆశీస్సులతో పునీతులమవుదాము.

సంకలనం: కోటేశ్వర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top