నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, August 23, 2020

నమస్తే అంటున్న దేశాధినేతలు - When Emmanuel Macron, President of France and Angela Merkel, Chancellor of Germany greet each other with Namaste

యూరప్‌లో సంభవించిన తాజా పరిణామాల చర్చకు ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఫ్రాన్స్‌లో నిర్వహించారు. కరోనా వైరస్‌, బెలారస్‌ రాజకీయ అస్థిరత, లెబనాన్‌ పేలుళ్లు, రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యస్థితి తదితర అంశాలను గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వివిధ యూరప్‌ దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫ్రాన్స్‌ అధినేత అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశానికి విచ్చేసిన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కల్‌కు.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారిరువురూ భారతీయ సాంప్రదాయమైన నమస్కారంతో అభివాదం చేసుకోవటం విశేషం. కాగా, ఈ వీడియోను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. దీనిలో ఫ్రెంచి ప్రథమ మహిళ బ్రిగిట్టె మాక్రోన్‌ను కూడా చూడవచ్చు. ఈ కీలక సమావేశంలో చైనా-యూరప్‌ సంబంధాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

_విశ్వ సంవాద కేంద్రము
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com