ఆడవాళ్లు వేసుకునే జడలు, జడ ఆచార ధర్మం - Aadavari Jada, Jadalu

0
ఆడవాళ్లు వేసుకునే జడలు, జడ ఆచార ధర్మం - Aadavari Jada, Jadalu
డవాళ్లు వేసుకునే జడల వల్ల లాభాలు సంప్రదాయాలు చదవండి,ఆడవాళ్లు వేసుకొనే.. కొప్పు, ఒకజడ, రెండుజడలవెనుక, ఆంతర్యమేమిటి,దేనికి సంకేతాలు? మన సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహార  శాస్త్రంలో చెప్పబడినట్టుగా కొన్ని సంకేత రూపముగా. స్త్రీలకు ప్రత్యేక ఆచార కట్టుబాట్లు పెట్టారు.

1. అమ్మాయి రెండు జడలు వేసుకుంటుందీ అంటే (చిన్నపిల్లలు ,యుక్తవయసు బాలికలు ) ఇంకా పెళ్లి కాలేదూ అని అర్ధం. అంటే జీవేశ్వర సంభంధం ఇరువురిగా ఉన్నారు, ఇంకా ఒక్కటిగా కాలేదు, వివాహం కాలేదు అని అర్ధం. స్వేచ్ఛగా విహరిస్తుంది, ఆనందంగా ఉంది అని చెబుతారు.
2. ఏ అమ్మాయైతే ఒక జడ వేసుకుంటుందో ఆమెకు వివాహం జరిగిపోయింది అని భావం. ఇక్కడ రెండు జడలు ఒక్కటి అవడం. ఒక్కటి అవడం అంటే రెండు జడలే ఉంటాయా.. కాదు, మూడుగా త్రివేణీ సంగమంగా (వేణీ అంటే తమిళపాదం లో జడ ) చెబుతారు, మూడు పాయలుగా అల్లుకుని ఉంటేనే ఒక జడ అల్లడానికి వీలవుతుంది.
మూడూ అంటే 1) నేనూ 2) భర్త 3) సంతానం (కావచ్చు, కాకపోవచ్చు ) అనేభావం, అలాగే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతీ, మాయ మొహం అని అర్ధం. సత్వ, రజో, తమో గుణాలుగా ఉంటాయని అర్ధం.
రెండు జడలు బాలిక
రెండు జడలు బాలిక
3. ఒకవేళ జడ ముడిసి కట్టుగా (కొప్పు ) కట్టారో... అంటే వివాహిత స్త్రీ అయ్యి ఉండి, సంతానం కలిగి ఉంది అని అర్ధం. అన్నీ బాధ్యలతో కలిపి గుట్టుగా ముడుచుకుని ఉందనీ అర్ధం ఇలాగ వారి రూపురేఖలలో, ఆహార్యంలో, వేష భూషణలో చూచి మనం తెలుసుకొనవచ్చును. వీళ్ళేమిటీ అని చూడగానే తెలిసిపోతుంది. వేసుకునే జడలను బట్టివారి శారీరక స్థితిని తెలియజేస్తాయి. ఇదంతా కూడా ఆచార ధర్మంలో ఉంది,ఆచారం క్రిందే వస్తాయి.

నాగరికత తెలిసినవాళ్ళు జుట్టు తప్పనిసరి సరియైన పద్దతిలో ఎదో ఒక రకముగా అందముగా తీర్చి దిద్దుకుంటారు. కానీ ఇప్పుడు మోడనైజేషన్ ముసుగులో అభివృద్ధి , ఆధునికత పేరుతో ప్రాశ్చాత్త్యా పోకడలతో విషసంస్కృతిని దిగుమతి చేసుకొని, మన ఆచారాలను మంట గలుపుతున్నారు. చిన్నపిల్లల నుండి పండు ముదుసలి వరకు కొందరు స్త్రీలు వివిధరకాల ఫాషన్ కట్టింగులు చేయించుకుంటున్నారు.

కొందరు మహాతల్లులు చదువులు ఉద్యోగాలవేటలో భాగంగా, జుత్తు విరబోసుకొని శక్తి రూపాలుగా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తిరుగుతున్నారు. ఎక్కడ స్త్రీ జుట్టు ముడవకుండా విరబోసుకొని విహరిస్తుందో వారి వెనుకాల భూత, ప్రేత, పిశాచాలు, పాతకులు లంకిణిలు పూతనలు తిరుగుతాయని. ఇది నిక్కచ్చిగా రాక్షస స్వభావమే ననీ ధర్మ ప్రభోధం.

శాస్త్రం ప్రకారం స్త్రీలు తలంటి బోసుకున్నాక జట్టు ఆరబెట్టుకోవడానికి కూడా కొసరి భాగాన ముడివేసి ఆరబెట్టుకోవాలి. కానీ కొన్ని పురాణగాధల్లోవాళ్ళు చేసిన శబధం మేరకు వారి జుట్టు విరబోసుకున్నట్టు చెబుతారు, రామాయణంలో సీతామాత వల్ల లంకాదహనమే జరిగింది ,
భారతంలో ద్రౌపదీ కారణంగా మహాభారత యుద్ధమే సంభవించింది,అయినా కూడా అది అనర్ధదాయకమే అయ్యింది. ఇవినాకు పెద్దలద్వారా తెలిసిన వివరాలు మాత్రమే తెలుపుతున్నాను.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top