నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
స్త్రీ - తల్లి - భార్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్త్రీ - తల్లి - భార్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2020, శనివారం

వివేకానందుని దృష్టిలో భారతీయ మహిళ - Vivekananda Perspective on Indian Women

వివేకానందుని దృష్టిలో భారతీయ మహిళ - Vivekananda Perspective on Indian Women

హిళల గురించి భారతీయుల, పాశ్చాత్యుల ఆలోచనలో చాలా తేడా ఉంది. వారివారి జీవన విధానాన్ని బట్టి ఈ తేడాలు వచ్చాయి. భారత దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం, ఆమె ఎదుర్కొం టున్న సమస్యల గురించి స్వామి వివేకానంద అనేకసార్లు ప్రస్తావించారు. వారి ఉపన్యాసాల్లో చెప్పిన అనేక ముఖ్య విషయాలను చూద్దాం

ప్రతి దేశంలో స్త్రీ, పురుషులు తెలిసో, తెలియకో ఒక ఆదర్శాన్ని అనుసరిస్తుంటారు. ఆ ఆదర్శం వ్యక్తుల ద్వారానే తెలుస్తుంది. వ్యక్తుల సమూహమే దేశం. దేశం ఒక మ¬న్నతమైన ఆదర్శాన్ని మన ముందుంచుతుంది. కాబట్టి ఏ దేశాన్నైనా అర్థం చేసుకోవాలంటే ఆ దేశపు ఆదర్శం ఏమిటో తెలుసుకోవాలి. ఆ ఆదర్శాన్ని బట్టి ఆ దేశపు జయాపజయాలను అంచనా వేయాలి. అభివృద్ధి, పురోగతి, సుస్థితి, పతనం అనేవి ఆదర్శాన్ని బట్టి నిర్ణయమవుతాయి. ఒక దేశంలో మంచిదని భావించే అంశం మరో దేశంలో మంచి కాక పోవచ్చును. కాబట్టి ఒక దేశస్థుల గుణదోషాలను వేరే దేశపు ప్రమాణాలను బట్టి నిర్ణయించకూడదు.

ఆదర్శ భారతీయ మహిళ సీత

సీతారాములు భారతీయులకు ఆదర్శప్రాయులు. బాలికలు సీతను ఆరాధిస్తారు. పవిత్రురాలు, భక్తురాలు, సహనశీలవతి అయిన సీతాదేవిని అనుసరించాలని ప్రతి భారతీయ మహిళ కోరుకుంటుంది. సీతాదేవి గురించి మాట్లాడు తున్నప్పుడు భారతీయుల, పాశ్చాత్యుల ఆదర్శాల్లో తేడా ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ‘చేతల్లో శక్తిని చూపించాలి’ అని అంటారు పాశ్చాత్యులు. ‘సహనంలో శక్తిని చూపాలి’ అంటారు భారతీ యులు. ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా, ఎంత ఎక్కువ సంపద కూడబెట్టవచ్చో పాశ్చాత్యులు చూపితే, సంపదను ఎంతగా త్యాగం చేయవచ్చో భారతీ యులు చూపారు. సీతాదేవి భారతీయులకు ఎందుకు ఆదర్శం అయింది? ఆమె క్షమాశీలి. పరమసాధ్వి. దుర్భర కష్టాలను కూడా చిరునవ్వుతో భరించింది. తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించింది. కష్ట సమయంలో కూడా భర్త సేవను విడనాడలేదు. అందుకే సీత భారతీయులందరికీ ఆదర్శం. మేమంతా సీతమ్మ బిడ్డలం. భారతీయ మహిళలు అభివృద్ధి సాధించడానికి, శ్రేయస్సు పొందడానికి సీతామార్గాన్ని అనుసరించడంతప్ప మరో మార్గం లేదు.

భారతీయ మహిళకు శుచిత్వమే ఆదర్శం

బుద్ధిబలమే పరమార్థం కాదు. నీతి, ఆత్మదృష్టి అవసరం. భారతీయ మహిళలలో పాండిత్యం, విద్య తక్కువ కావచ్చును కానీ వారిలో పవిత్రత ఎక్కువ. భార్య తప్ప ఇతర మహిళలను తల్లిగా భావిస్తాడు భారతీయుడు. భారతీయ మహిళల్లో ప్రపంచంలో మరెక్కడా కనిపించని శీలం, త్యాగం, దయ, తృప్తి, భక్తి కనిపిస్తాయి. సిగ్గు, మితంగా మాట్లాడటం వంటి లక్షణాలు మహిళలకు శోభనిస్తాయి. ఇవి భారతదేశపు మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పాశ్చాత్య దేశాల్లో స్త్రీ అంటే భార్య గుర్తుకు వస్తుంది. అక్కడ మాతృత్వపు స్థానం కంటే భార్య ¬దా ఎక్కువ. కానీ మన దేశంలో అలా కాదు. ఇక్కడ మాతృత్వానికే విలువ. ‘భారతదేశంలో గృహిణి స్థానం ఏది’ అని మీరు (పాశ్చాత్యులు) ప్రశ్నిస్తారు. ‘అమెరికా కుటుంబంలో తల్లిస్థానం ఏది?’ అని భారతీయులు ప్రశ్నిస్తారు. తల్లి పరమ పూజ్యురాలు. స్త్రీ అనే మాట కేవలం శరీర సంబంధ మైనది కాదు. స్త్రీ అంటే తల్లి. దురాశలను, దుష్కామాలను అణచ గలిగే శక్తి ‘అమ్మ’ అనే మాటకంటే ఇక ఏ పదానికి ఉంది? అందుకని తల్లే భారతీయుల ఆదర్శం.

వ్యక్తిదృష్టి, సంఘదృష్టి

పాశ్చాత్యుల్లో వ్యక్తిదృష్టి ఎక్కువ. భారతీయుల్లో సంఘదృష్టి ఎక్కువ. నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకో వచ్చని, అందుకు ఇతర అడ్డంకులు ఏవీ లేవని పాశ్చాత్యులు భావిస్తారు. వ్యక్తి నచ్చినా వారి కుటుంబం, వారసత్వాన్ని కూడా చూడాలని భారతీ యులు భావిస్తారు. తాగుబోతులు, అనారోగ్య వంతులు, పిచ్చివారి సంతతిని పెళ్ళి చేసుకోరాదని ధర్మశాస్త్రం చెపుతోంది.కానీ మేం పరాజితుల మవడంవల్ల అనేక దేశాల వారు అనేక చట్టాల్ని, నిబంధనల్ని మా తలపై రుద్దారు. అనేక దురా లోచనలు, దురభిప్రాయాలను మాకు అంటగట్టారు.

(స్వామి వివేకానంద సమగ్ర గంథావళినుండి…)

7, ఏప్రిల్ 2020, మంగళవారం

హిందూ వివాహంలో మాంగల్యధారణ, నల్లపూసలు, పగడం, ముత్యం ప్రాముఖ్యత - Hindu Vivaham, Mangalasutramహిందూ వివాహ తంతులో మాంగల్యధారణ మరియు నల్లపూసలు, పగడం, ముత్యం ప్రాముఖ్యత..

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.

మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.
స్త్రీలు మంగళ సూత్రం ధరించడం
స్త్రీలు మంగళ సూత్రం ధరించడం

వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
“ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వతనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రము ధరించును. వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించవచ్చును.
నల్లపూసలు
నల్లపూసలు
మంగళసూత్రంలో పగడం, ముత్యం, నల్లపూసలు ప్రాముఖ్యత"

మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు?
ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు,స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు.

కుజగ్రహ కారకత్వము: అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, ధీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము,రక్తస్రావము, గర్భస్రావము,ఋతుదోషములు మొ!!

ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరు ఎంత పాత్రపోషిస్తారో పరిశీలిద్దాము:
 • ⭄ ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజునకుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.
 • ⭄ భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే
 • ⭄ ముత్యం, పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది.
 • ⭄ ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో నుండే ఎరుపు(కుజుడు), తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను,దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు.
 • ⭄ కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభపలితాలు సమకూర్చగలవు.
 • మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు.
స్త్రీలు నల్లపూసలతాడు
స్త్రీలు నల్లపూసలతాడు
 స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.
 • ⧫ నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా ... పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. 
 • ⧫ వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ 'నలుపు రంగు' ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.
 • ⧫ అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. 
 • ⧫ వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి  నల్లపూసలు చుట్టిస్తారు. 
 • ⧫ ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే 'నీలలోహిత గౌరి' కి పూజలు చేయిస్తారు. 
 • ⧫ ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
 • ⧫ నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.
సంకలనం: భానుమతి అక్కిశెటి

10, ఫిబ్రవరి 2020, సోమవారం

స్త్రీ మోక్షప్రాప్తి - Sthrii Moksha Praapthi

స్త్రీ మోక్షప్రాప్తి - Sthrii Moksha Praapthi
జన్మలో జీవి పాపవుణ్యాలు సమానంగా ఉన్నప్పుడు మానవ జన్మ లభిస్తుంది. ఈ జన్మలో మోక్షసాధనకు కావలసిన మార్గం ఎంచుకోవడం అతని వివేకాన్ని బట్టి డీంటుంది. భగవంతుడు నృష్టించిన జీవి ఏది అయన శక్తి, ఉనికిని గుర్తించలేకపోయాయి.
మనిషి ఒక్కడే భగవంతుని గురించి సమగ్రంగా తెలుసుకొన్నాడు. కనుకే మానవ జన్న ఉత్తమమైంది. 
ఇటువంటి ఉత్తమ జన్మలో తాను నంపాదించిన ధన, సంపదలు, జ్ఞాన వివేకాలు భగవంతుని. వరప్రసాదంగా భావించాలి. మనిషి తనకున్న జ్ఞానం, వివేకంతో మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. అందుకు సులువైన మార్గం నత్యర్యలు చేయడమే. దీనివలన పుణ్యం వస్తుంది. మనసు లగ్నం చేసి భగవంతుని కీర్తిని గుణాన్ని గానం చేయాలి. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసే భగవాన్నామన్మరణ ఉత్తమ ఫలితాలనిస్తాయి. అందుకు నర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు వరవశం చెంది భక్తునికి వశం అవుతాడు. మానవుడు చేసే ప్యకార్యాలే మోక్షసాధనకు మార్గాలుగా మారతాయని వేదాంతులు చెపుతున్నారు.

భారతీయ సంస్కృతిలో స్త్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. అమె నిర్వహించే కార్యం ఉత్తమమయినదిగా కీర్తించబడింది. స్తీ తనవనిని నిష్ణగా అచరించినట్లయితే ఆమెకు ఇంటిలోనే మోక్షం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. అంతేకాదు ఆమె. కోరిన వెంటనే భగవంతుడు కాదనకుండా దర్శవమిస్తాడని వెల్లడవుతుంది. అందుకు కారణం ఆమె గృహ అవనరాలు భర్త, పిల్లల కోసం చేసే నిరంతర సేవ ఇది సమర్పణ భావంతో కూడినది.

స్త్రీ ఇంటి పనిని భగవంతుని కార్యంగా భావిస్తుంది. మిక్కిలి భక్తితో చేస్తుంది, ఇందుకోసం ఆమె ఏమి ఆశించదు. తన కర్తవ్యం. ధర్మంగా అనుకొని నిష్కాను కర్మ చేస్తుంది. ఇంటి వనులు చేస్తూ భగవంతుని అరాధించినట్లయితే స్ట్రీకి గొప్ప యోగులు తపశ్చక్తితో సాధించిన మోక్షం అతి నులభంగా లభిస్తుందని శాస్త్రాలు ఉద్భోద చేస్తున్నాయి.

పురుషుడు పని చేస్తూ అనేక తప్పులు చేస్తుంటాడు. అతను ధన సంపాదన కోసం చేసే తప్పులలో స్త్రీకి భాగం ఉండదు. కానీ భర్త చేసే పుణ్యకార్యంలో స్త్రీకి సగభాగం లభిస్తుందని శాస్త్రం తెలుపుతుంది. పతిలో ఈశ్వరభావం ఎంచుకున్న స్త్రీ ఇహ, పరలోకాలు రెండు వదులుకుంటుంది. భర్త సేవ చేయుట భార్య పరమధర్మమని తలచి తదనుగుణంగా వ్యవహరిస్తుంది.

రామాయణంలో సీతాదేవి పతి సేవ పరమోత్మష్టమైన తపస్సు అని చెప్పింది. పతివ్రతయైన స్త్రీ భగవంతునికి తల్లి కాగలదు. ఒక్క స్త్రీ మాత్రమే భగవంతున్ని పుత్రునిగా పొంది లాలించే శక్తి కల్గి ఉంటుంది. మాత్పత్వ మధురిమను ఆస్వాధించే స్త్రీకి భర్త సేవ వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ది వలన పరమాత్మ సన్నిధి ప్రాప్తిస్తుంది. ఇటువంటి స్రీ ఆలయానికి వెళ్లకుండానే ఆధ్యాత్మిక శక్తిని, తపస్సు చేయకుండానే మోక్షాన్ని పొందుతుందని ధర్మశాస్త్రం చెబుతుంది.

రచన: జాగృతి వారపత్రిక 

12, జనవరి 2020, ఆదివారం

పుష్పావతి (రజస్వల) సంప్రదాయాలు - Pushpavathi
అమ్మాయి పుష్పావతి అయినపుడు చేయవలసిన సంప్రదాయ క్రతువు

ముందుగుగా తూర్పు ముఖం వచ్చునట్లుగా నేలమీద గడ్డిపరచి దానిమీద తెలుపు డిజైను దుప్పటి లేక చీర ఐదుగురు ముత్తైదువులు పట్టుకుని వేయవలెను. కొందరి ఇంట తెలుపు వర్ణ కొత్త చీర సమర్త పెండ్లికూతురుకు కట్టి మొదటి రోజు కూర్చొనపెట్టుదురు. 

ఆ ఐదుగురు అక్షింతలు నాలుగు వైపులా, మధ్యలో ఐదుచోట్ల: 
 • శనగలు, 
 • పండ్లు, 
 • తాంబూలము, 
 • ఎండుకొబ్బరి చిప్ప, 
 • చిమ్మిరి ముద్ద పెట్టాలి. 
పక్కన ఒక చెక్కబొమ్మ పెట్టవలెను. ఆ బొమ్మకు గుడ్డ చుట్టవలెను. అమ్మాయి కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టాలి. అమ్మాయికి ఓణీ వేయవలెను. 5పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు కట్టి ఒకటి రోలుకి, రోకలికి కటాలి. అమ్మాయికి తాంబూలము ఇవ్వవలెను. అమ్మయిని కూర్చోబెట్టి రోలులో 5 చిమ్మిరి ముద్దలు వేసి చిమ్మిరితొక్కి హారతి పట్టవలెను. సమర్తపాట, మంగళ హారతి పాటలు పాడవలెను. రోలులోని చిమ్మిరి, ముందుగ 3 సార్లు అమ్మాయి చేతిలో పెట్టి మిగిలినది సమర్తకాని పిల్లలకు పెట్టుదురు. బొట్టు, గంధము ముందుగా సమర్త పెండ్లికూతురునకు ఇచ్చి, తరువాత ముత్తైదువులకు ఇచ్చెదరు.

మొదట 3 రోజులు పులగము అన్నము (బియ్యములో పెసరపప్పు కలిపి వండవలెను), ఒక మూకుడులో విస్తరాకు లేక వెండి గిన్నె వుంచి సమర్త పెండ్లికూతురునకు, ఆ అన్నము పెట్టెదరు. అన్నములోకి బెల్లము ముక్క లేక పంచదారతో తినవలెను. తరిగినవి తినరాదు. పుల్లలు తుంచుట చేయకూడదు. అరటిపండు ఎవరైనా వలిచి ఇచ్చిన తినవలెను. ఉపనయనము సమయములో వాడిన మూకుడులో అన్నము పెట్టిన ఏదైనా దోషము ఉన్న పోవును. వరుస స్నానము 4, 7, 9, 11 రోజులలో చేయించెదరు. 4వ రోజు భోజనములో అట్లు వడ్డించాలి, పాలరసము చేయాలి. వరస స్నానము 4సార్లు, మాములుగా బంతిలో భోజనము చేయవచ్చును. 4 రోజుల తరువాత కొబ్బరి పొడుము, అప్పడము, వడియముతోనే భోజనము పెట్టవలెను. తినలేనిచో పాలు, మజ్జిగ పలుచగ చేసి అన్నములో పోయవలెను.

పధ్యము: 
వంకాయ, గోంగూర, తరిగినవి. అరిశె, జున్ను, అట్టు తినకూడదు. చిమ్మిరి ముద్దలు, వేరే ఏ స్వీటు అయినా తినవచ్చును. సమర్త సమయమున చిమ్మిరి ఎంత పంచిన అంత మంచిది. ఏదైనా గుడి ముందు వాళ్ళకు చిమ్మిరి ముద్దలు పంచవచ్చును. 

చిమ్మిరి తొక్కుటకు కావలసినవి: 
 • నువ్వులు - ఒకటిన్నర కేజి (100 ముద్దలు వచ్చును)
 • బెల్లము - ఒకటిన్నర కేజి
 • ఎండు కొబ్బరి తురుము - అర కేజి
 • నువ్వులు వేయించి, రోలులో తొక్కి దానికి బెల్లము, ఎండుకొబ్బరి కలిపి బాగా తొక్కి ముద్దలు చేయాలి.
11వ రోజు అమ్మాయికి గాజులు తొడిగించెదరు. ఆ రోజు బంధువులను పిలిచి భోజనములు పెట్టెదరు. అందరికి 2 గాజులు కూడా పంచిపెట్టెదరు. 4సమర్తలు, కన్నెముట్లు 3, అయిన దాక ఊరు పొలిమేర దాటరాదు.

సమర్త స్నానము:
3వ రోజు రాత్రి 3గం||కి స్నానము చేయించవలెను. నువ్వుల నూనె వంటికి రాసి నలుగు పెట్టి తలస్నానము చేయించాలి. అయినాక 5ని|| తరువాత మరల తలస్నానము చేయించవలెను. దీనినే దొంగస్నానము అందురు. 7, 9, 11 రోజులలో ఉదయమే ఇలా నలుగుపెట్టి స్నానము చేయించవలెను. 11వ రోజు పంతులు గారు వచ్చి పుణ్య వచనము చేయించెదరు. 2వ సమర్త 9వ రోజుతో, 3వ సమర్త 7వ రోజుతో, 4వ సమర్త 5వ రోజుతో, మూడుముట్లు కన్నెముట్లు అని 4వ రోజు దూరము గానే వుంచి 5వ రోజు ఇంట్లోకి వచ్చెదరు.

రచన: శ్రావణీ రాజ్

25, డిసెంబర్ 2019, బుధవారం

అష్టాదశ శక్తి పీఠాలు - Ashtadasa Shakti Phiitaluఅష్టాదశ శక్తి పీఠాలు - Ashtadasa Shakti Phiitalu
అష్టాదశ శక్తి పీఠాలు

అఖిల జగత్తుకు మూలదేవతగా జగన్మాతను ఆరాధించడం మన సంప్రదాయం. 
 • మహేశ్వరి, 
 •  మహాకాళి
 •  మహాలక్ష్మి, 
 • 卍 మహా సరస్వతి. 
ఇలా ఒక్కొక్క రూపం ఒక్కో శక్తి కేంద్రమై ఈ విశ్వాన్ని కాపాడుతున్నాయి. 
అష్టాదశ శక్తి పీఠాలతోపాటు అష్టోత్తర శత శక్తి పీఠాలతో భారతావని అణువణువూ మహా శక్తి కేంద్రమై విరాజిల్లుతోంది. 
శక్తి పీఠాలు ఆకారాది క్షకారాంత వర్ణమాలలోని ఒక్కో అక్షరానికి శక్తి స్థానమైన ప్రతీకలు. దీనివల్లే ప్రతి అక్షరం శక్తి సంపుటితమై మహా మంత్రమవుతోంది. శక్తి పీఠాలలో ప్రధానమైన అష్టాదశ పీఠాల ఆవిర్భావ విశేషాలు…

బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడింది. దీంతో దక్షుడు శివద్వేషిగా మారాడు.

శివుడిని అవమానించడం కోసం యజ్ఞం తలపెట్టాడు. అల్లుడు పరమేశ్వరుడు, కూతురు శక్తిని ఆహ్వానించకపోయినా స్త్రీ సహజమైన కుతూహలంతో ఆమె దక్షయజ్ఞానికి వెళ్ళింది. అక్కడ అవమానింపబడి యోగాగ్ని సృష్టించుకుని అందులో ఆహుతైంది. విషయం తెలిసిన శంకరుడు ఆగ్రహంతో శివ తాండవం చేశాడు. శివ జటాజూటం నుంచి వీరభద్రుడు ఆవిర్భవించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. పరమేశ్వరుడు దాక్షాయాణి మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయతాండవం చేయసాగాడు. బ్రహ్మాది దేవతలు భయంతో కంపించి విష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించారు. సతీదేవి శరీరం శంకరుడి భుజాన ఉన్నంత కాలం ఆయన రౌద్రం తగ్గదని భావించి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగల్ని ఖండఖండాలుగా చేశాడు.

సతీదేవి శరీర భాగాలు భారతదేశం అంతటా అక్కడక్కడా పడ్డాయి. ఆ శరీరం మొత్తం ఖండించడంతో పరమేశ్వరుడు క్రమంగా క్రోధం వదలి శాంత స్థితిలోకి చేరుకున్నాడు. ఆ ఖండాలు, ఆభరణాలు పడిన చోటల్లా ఒక శక్తి క్షేత్రంగా వెలసింది. అవే 108 శక్తి పీఠాలుగా గుర్తింపు పొందాయి. వాటిలో ప్రధానమైనవి పద్దెనిమిది శక్తి పీఠాలు.


1. శ్రీ శాంకరీదేవి – శ్రీలంక
శ్రీ శాంకరీదేవి – శ్రీలంక
ఇక్కడ సతీదేవి కాలి గజ్జెలు పడ్డాయి. శ్రీలంకలోని ట్రింకోమలిలో ఈ శక్తి పీఠం ఉంది. రావణాసురుడు శివభక్తుడు కావడం వల్ల పార్వతీదేవి లంకలో శ్రీ శాంకరీదేవిగా వెలసిందని ఐతిహ్యం.

2. శ్రీ కామాక్షీదేవి – కాంచీపురం
kanchi kamakshi devi
ఇక్కడ సతీదేవి వీపు భాగం పడింది. దేవతల విన్నపం మేరకు లోక కళ్యాణం కోసం దేవి బంధకాసురుడిని సంహరించి తన ఉగ్రరూపాన్ని మార్చుకుని కామాక్షిదేవిగా మారినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం తమిళనాడు రాజధాని చెన్నైకి 76 కి.మీ. దూరంలో ఉంది.

3. శ్రీ శృంఖలాదేవి – ప్రద్యుమ్నమ్

ఈ క్షేత్రంలో సతీదేవి ఉదరం పడింది. త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని సృష్టించినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం ప్రశ్చిమబంగలోని హుగ్లీ జిల్లా ప్రద్యుమ్నంలో ఉందీ. కోల్ కతాకు 135 కి.మీ. దూరంలో గల గంగాసాగర్ క్షేత్రం గొప్ప శక్తిపీఠంగా పేరొందింది.

4. శ్రీ చాముండేశ్వరి – మైసూరు
chamundeshwari devi mysore
ఇక్కడ సతీదేవి తలా వెంట్రుకలు పడ్డాయి. త్రిమూర్తులు సహా సకల దేవతల అంశంతో వారివారి అస్త్రాలతో జన్మించి మహిషాసురుని వధించిన దేవియే శ్రీ చాముండేశ్వరి దేవి. ఈ శక్తి పీఠం కర్ణాటకలోని మైసూరు నగరానికి 13 కి.మీ. దూరంలో ఉంది.

5. శ్రీ జోగులాంబ – అలంపురం
jogulamba devi alampur mp
సతీదేవి పైవరుస దంతాలు పడిన క్షేత్రమిది. ఈశ్వర ప్రసాది అయిన ఒక యువకుడు ఇక్కడ ఆలయ నిర్మాణం చేస్తుండగా ఆ ప్రాంత పాలకుడైన విలసద్రాజు ఆ యువకుడిని వధించాడు. ఫలితంగా రాజ్యం పోయి తిండిలేక సంచరిస్తున్న సమయంలో కనువిప్పు కలిగి జోగులాంబదేవి ఆలయం నిర్మించినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపూర్ రైల్వే స్టేషన్ నుంచి 9 కి.మీ. దూరంలో ఉంది.

6. శ్రీ భ్రమరాంబదేవి – శ్రీశైలం
srisaila bramarambika
ఇక్కడ సతీదేవి మెడ భాగం పడింది. దేవతల, ఋషుల ప్రార్థనలకు మెచ్చి జగన్మాత ఝంకారం చేస్తూ ఉన్న భ్రమరాలతో వచ్చి అరుణాసురుని సంహరించింది. శ్రీ భ్రమరాంబాదేవిగా శ్రీశైలంలో కొలువుదీరినట్లు స్థల పురాణం. ఈ శక్తి పీఠం కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంది. ఈ క్షేత్రం కర్నూలు నుంచి 179 కి.మీ., హైదరాబాద్ నుంచి 218 కి.మీ. దూరంలో ఉంది.

7. శ్రీ మహాలక్ష్మి – కొల్హాపూర్
kolhapur mahalakshmi
ఈ క్షేత్రంలో సతీదేవి మూడు కళ్ళు పడ్డాయి. దేవతలందరూ మహాలక్ష్మిని ప్రార్థించగా వారి కోరిక మేరకు కాల్హుడిని సంహరించి ఈ క్షేత్రంలో కొలువైంది. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుంది అని ఆర్యోక్తి. ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రంలో ఉంది. ఈ శక్తి పీఠం హైదరాబాదుకు 540 కి.మీ. దూరంలో ఉంది.

8. శ్రీ ఏకవీరాదేవి – మహుర్వం
ekaveera devi nanded
సతీదేవి కుడి చేయి ఈ ప్రాంతంలో పడింది. తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తల్లి, సోదరుల తలలు నరికేశాడు. తల్లి శిరస్సు పడిన ప్రాంతమే ఈ క్షేత్రం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి 42 కి.మీ. దూరంలో ఉంది.

9. శ్రీ మహాకాళి – ఉజ్జయిని
ujjaini mahankali temple madhya pradesh
ఈ క్షేత్రంలో సతీదేవి పైపెదవి పడినట్లు చెబుతారు. త్రిపురాసురులను సంహరించడానికి శివుడు, పార్వతీదేవి మహాకాళిగా యుద్ధానికి సంసిద్ధమయ్యారు. పంచభూతాలు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడికి అస్త్రాలుగా సహాయపడ్డాయి. పరమేశ్వరుడు, మహాకాళి రాక్షసుణ్ణి సంహరించి విజయం సాధించిన ప్రాంతమే ఉజ్జయిని. ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉంది. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు 55 కి.మీ. దూరంలోని క్షిప్రానదీ తీరంలో వెలిసింది.

10. శ్రీ పురుహూతీకా దేవి – పిఠాపురం
ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడింది. గయాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి త్రిమూర్తులు గయుని దేహమే యజ్ఞానికి సరైన స్థలంగా భావించారు. ముని అజ్ఞానుసారం యజ్ఞం చేస్తూ పార్వతీదేవి సహాయంతో గయాసురుణ్ణి సంహరించిన ప్రాంతమే పిఠాపురం. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి 18 కి.మీ. దూరంలో ఉంది.

11. శ్రీ గిరిజాదేవి (బిరాజ దేవి) – ఒడిశా
girija devi odisha
ఇక్కడ సతీదేవి నాభి భాగం పడింది. లోకంలో శాంతి నశించి అశాంతిమయమైన సమయంలో లోకశాంతి కోసం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం నుంచి గిరిజా దేవి ఉద్భవించింది. లోకంలో శాంతిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతంలో కొలువైనట్లు పురాణ కథనం. ఈ శక్తిపీఠం ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు 113 కి.మీ. దూరంలో ఉంది.

12. శ్రీ మాణిక్యాదేవి – ద్రాక్షారామం
draksharama manikya devi
ఈ క్షేత్రంలో సతీదేవి కణత భాగం పడింది. శివపార్వతుల తనయుడు కుమారస్వామి ఈ ప్రాంతంలోనే తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడిలోని ఆత్మలింగం ముక్కలు కాగా ఏర్పడిన పంచారామాల్లో ఒకటి. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 33 కి.మీ. దూరంలో ఉంది.

13. శ్రీ కామరూపాదేవి – హరిక్షేత్రం
kamarupa devi assam
ఈ క్షేత్రంలో సతీదేవి యోని భాగం పడింది. ఈ శక్తిపీఠం అసోం రాజధాని గౌహతికి 7 కి.మీ దూరంలో ఉంది. బ్రహ్మపుత్రానదీ తీరంలో ఈ క్షేత్రంలో ఏటా ఆషాడమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. కాముడికి మళ్ళీ రూపం వచ్చిన ప్రాంతం కాబట్టి కామాఖ్య క్షేత్రమని, కాపారూప క్షేత్రమని అంటారు. ఇక్కడి నీలాంచల పర్వతం విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి హరిక్షేత్రమని కూడా పిలుస్తారు.

14. శ్రీ మాధవేశ్వరి – ప్రయాగ
ఈ క్షేత్రంలో సతీదేవి చేతి ఉంగరం వేలు పడింది. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతం పంపకానికి శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారమే శక్తి స్వరూపిణిగా ఇక్కడ కొలువుదీరినట్లు స్థలపురాణం. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదుకు 6 కి.మీ. దూరంలో ఉంది.

15. శ్రీ వైష్ణవీ దేవి – జ్వాలా క్షేత్రం
vaishnavi temple jammu
సతీదేవి శిరస్సు పడింది ఈ క్షేత్రంలోనే. అమ్మ త్రిమూర్తి స్వరూపిణిగా కొలువుదీరిన క్షేత్రం జ్వాలాక్షేత్రం. అమ్మవారు ఇక్కడ వైష్ణవీదేవిగా దర్శనమిస్తుంది. ఈ శక్తిపీఠం కాశ్మీర్ లోని జమ్మూ నగరానికి 60 కి.మీ. దూరంలో ఉంది.

16. శ్రీ మాంగల్యాదేవి – గయ
maa mangla gauri mandir gaya bihar
ఇక్కడ సతీదేవి వక్షోజం పడినట్లు చెబుతారు. పిండప్రదానాలకు, పితృదేవతలకు పూజలకు పేరొందిన ప్రాంతమే గయా క్షేత్రం. ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమైన ప్రయాగ క్షేత్రంలో సమానమై ఫలం అందిస్తోంది. ఈ శక్తిపీఠం బిహార్ రాజధాని పాట్నా నగరానికి 74 కి.మీ. దూరంలో ఉంది.

17. శ్రీ విశాలాక్షి – వారణాసి
vishalakshi varanasi
ఇక్కడ సతీదేవి మణికర్ణిక పడింది. అమ్మలగన్నయమ్మ అశేష భక్తులపై తన కృపాకటాక్షాలు ప్రసరించే క్షేత్రమే వారణాసి. కాశీక్షేత్రం, వేద విద్యలకు నిలయం, అక్కడ నిరంతరం శిష్యగణంతో వ్యాసమహర్షి విశేశ్వర, అన్నపూర్ణాంబికలను ఆరాధించేవాడు. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది. ఇది అలహాబాద్ కు 131 కి.మీ. దూరంలో ఉంది.

18. శ్రీ సరస్వతీ దేవి – కాశ్మీర్
saraswati kashmir
కపటంతో పార్వతీదేవి ఇంటిని సొంతం చేసుకున్న రావణాసురునిపై కోపగించుకున్న పార్వదేవిని బుజ్జగిస్తున్న సరస్వతిని ఇక్కడే కొలువై ఉండమని చెప్పిన ప్రాంతమే కాశ్మీర్ క్షేత్రం. ఈ క్షేత్రంలో సతీదేవి దక్షిణ హస్తం పడినట్లు చెబుతారు. ఈ శక్తిపీఠం కాశ్మీర్ లోని శ్రీనగర్ కు 10 కి.మీ. దూరంలో ఉంది. ఒక్కప్పుడు ఇక్కడ ఉన్న శక్తి పీఠాన్ని వైదికులపై దాడి లో భాగంగా తురకలు ఈ ఆలయాన్ని కూల్చివేశారు.

అష్టాదశ శక్తిపీఠాలు దర్శించినా, స్మరించినా, జగములనేలే జగదంబ కరుణాకటాక్ష వీక్షణాలతో సకల శుభాలు కలిగి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు పొందుతారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

రచన: నాగవరపు రవీంద్ర

27, ఆగస్టు 2019, మంగళవారం

అమ్మ ప్రేమ - Amma Prema, Mother Love


అమ్మ ప్రేమ - Amma Prema, Mother Love
అమ్మ
 • 🎔 అనిర్వచనీయమైన మాటే అమ్మ;
 • 🎔 ప్రేమ, అనుభూతులను పంచిచ్చేదే అమ్మ;
 • 🎔 తాను తిన్న ఆహారాన్ని ప్రేమరసంగా, ప్రాణరసంగా మార్చి ఇచ్చింది అమ్మ తన ప్రాణాన్నే పణంగాపెట్టి, త్యాగాన్ని నేర్పి, నాకు జన్మనిచ్చింది అమ్మ; 
 • 🎔 పుట్టగానే నా పనులు నేను చేసుకోలేనుగా అందుకే మలమూత్రాలను శుభ్రంచేసి, అందంగా ముస్తాబుచేసేది అమ్మ;
 • 🎔 నేను ఆరోగ్యంగా, బలంగా పెరగాలని, తన రక్తాన్ని పాలగామార్చి పట్టేది నాకు అమ్మ; అమ్మా, నాన్న, అత్త, అక్క అని మాటలు నేర్పింది అమ్మ;
 • 🎔 చేబట్టి, బుడిబుడి అడుగులు నేర్పింది అమ్మ;
 • 🎔 బడికివెళ్ళే వయసులో, అన్నంపెట్టి, బట్టలువేసి, తల అటు,ఇటు తిప్పుతుంటే, ఒక చేత్తో రెండు బుగ్గలను అదిమిపెట్టి, తలదువ్వి, బుగ్గలపై ముద్దులుపెట్టి, పుస్తకాల సంచి బుజానికి తగిలించి, వీధివాకిలివరకూ వచ్చి పంపించేది అమ్మ;
 • 🎔 ఆటల్లో దెబ్బతగిలి,రక్తంకారుతూ ఇంటికివస్తే చూసి తల్లడిల్లిపోయిన అమ్మ కళ్ళల్లో నీరుబుకుతుంటే, ముఖాన్ని పక్కకు తిప్పుకొని, చీరెకొంగుతో కళ్ళద్దుకొని, పళ్ళ బిగువన బాధను ఆపుకొని, తన గుండె గాయాన్ని మరచి, నా గాయానికి మందువేసి బుజ్జగించింది అమ్మ;
 • 🎔 పుట్టినరోజువస్తే, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు జీవించమని దీవించింది అమ్మ;
 • 🎔 రాత్రులు నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంటే, గుండెలకద్దుకొని నిద్రబుచ్చేది అమ్మ;
 • 🎔 పట్టభద్రుడయ్యానని చెప్పిన రోజున కొడుకు విద్యాధికుడయ్యాడని సంతోషించింది అమ్మ;
 • 🎔 ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు, ఆనందించి, ఆలోచనలో పడిపోయింది అమ్మ;
ఎందుకో తెలుసా?
 • 🎔 తన వయసు మీద పడుతున్నది, వీడికిక తానేమీ చేయలేనేమో, పెళ్ళీచేసి, తనలాంటి ఒక ఆడబిడ్డ చేతిలో పెడితే సుఖంగా బ్రతుకుతాడనే ఆశతోకూడిన ప్రేమమయి అమ్మ;
 • 🎔 కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమరాళ్ళు, మనవళ్ళతో కూడిన చక్కటి కుటుంబాన్ని చూసి మురిసిపోయింది అమ్మ;
 • 🎔 అమ్మ మాకేకాదు అమ్మ;
 • 🎔 నాన్నకుకూడా అమ్మ;
 • 🎔 అమ్మ చనిపోయిన రోజున చితిమంటలు ఎగసిపడుతుంటే తడి ఆరని నాలోని అమ్మ అనుభూతులు కన్నీరుమున్నీరై ధారలుగా కారుతుంటే అమ్మకు ప్రదక్షణాలుచేసి నమస్కరిస్తుంటే అగ్నిపునీతురాలుగా కనిపిస్తున్నది నా యెదుట అమ్మ;
 • 🎔 అమ్మలుగన్న అమ్మ;
 • 🎔 నా అమ్మ;
అమ్మమీద ఒట్టు అమ్మా,నాన్నలను మరిచిన రోజులేదు నాకు అందుకే నేనెప్పుడు సంతోషంగా వుంటాను అమ్మా, ఆనందమయివమ్మా నీవు.
ఈరోజుల్లో మదర్స్ డే అని కొత్తగా అంటున్నారు. కానీ నాకు రోజూ అమ్మ రోజే! ఈ నా భావాలు అమ్మకే అంకితం.
రచన: పబ్బరాజు మాధవ్ రావు 

28, జూన్ 2019, శుక్రవారం

స్త్రీ - శక్తి స్వరూపిణి - Stri Shakti


లక్ష్మివి నువ్వే.. సరస్వతివి నువ్వే.. పార్వతివి నువ్వే. మూడు శక్తులు నువ్వే.  బ్రహ్మా-విష్ణు-మహేశ్వరరూపం కూడా నువ్వే. ఓ దుర్గా నీకు నమస్సులని మొక్కుతారామెను. అంతటి మహిమాన్విత. దసరా శరన్నవరాత్రి రోజుల్లో దుర్గమ్మ ఒక్కో రోజు ఒక్కో అవతారమహిమ చూపుతుంది. స్త్రీ శక్తి నిదర్శనంగా నిలిచే ఆ తల్లి మహిమలు ఎలాంటివి?

ఒక్కో చోట ఒక్కో పేరు. ఒక్కో రూపం ఒక్కో శక్తి.. అందుకే ఆమెను అమ్మలగన్నయమ్మగా చెబుతారు. ముగరమ్మల మూలపుటమ్మగా కొలుస్తారు. ఈ సృష్టికి ఆధారం ఆ తల్లేనని భావిస్తారామె భక్తులు. ఈ శరన్నవరాత్రుల్లో దుర్గమ్మలో కనిపించే వివిధ రూపాలను చూపి పులకరించి పోతుంటారు భక్తులు. చిన్ని చిన్ని ఆడపిల్లల నుంచి అమ్మమ్మల వరకూ ప్రతి స్త్రీ మూర్తినీ గౌరవించి ఆదరించమని సూచిస్తాయా తల్లి అవతార మహిమలు. ఆమె నీ రక్షణలో కాదు.. నువ్వే ఆమె రక్షణలో బతుకుతున్నావని చెబుతాయా లీలలు.

దసరా వచ్చిందంటే కనకదుర్గమ్మ కోటి సూర్యకాంతులతో దర్శనమిస్తుంది. వివిధ అవతారాల్లో కరుణిస్తుంది. అర్ధం చేసుకోవాలేగానీ.. అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కో స్త్రీ సూక్తి విడమరచి చెబుతుంది.

తొలి రోజు కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. బాలత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగిపోతుందన్నది భక్తుల విశ్వాసం. బాలా అన్న శబ్ధానికి.. అన్నెం, పున్నెం ఎరుగని బాలికని అర్థం. చిన్న పిల్లల మనస్సు నిర్మలంగా ఉంటుంది. అటు వంటి హృదయాలలో పరమాత్మికత నివసిస్తుంది. కాబట్టి, మనం చిన్న పిల్లలలాగా నిర్మలంగా అమ్మవారిని ఆరాధించాలన్న అంతరార్ధం దాగి వుంటుందట ఈ అవతారంలో. అలాగే బాలా అంటే జ్ఞానమని కూడా అంటారు. బాలా స్వరూపమైన అమ్మవారిని ఎవరు అర్చిస్తారో వారికి జ్ఞానానందం కలుగుతుంది. కామక్రోధాలను జయించి ఆత్మానందాన్ని పొందుతారని తెలుస్తోంది. అందుకే నవరాత్రుల్లో ప్రధమ దినాన అమ్మవారిని బాలాత్రిపురసుందరీదేవిగా ఆరాధన చేసి అజ్ఞానాన్ని పారద్రోలడానికి ప్రయత్నించాలని చెబుతారు పండితులు. అంతే కాదు.. పిల్లల్లో తానుంటానని. వారి ఆయురారోగ్యాలను కాపాడే బాధ్యత ఎవరైతే చక్కగా తీసుకుంటారో.. వారే తనకు అత్యంత ఇష్టులని దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా కొలువుదీరి భక్తులకు సెలవిస్తుంది.

రెండవ రోజున కనకదుర్గమ్మ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది.  దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ... ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో కనిపిస్తుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులను కరుణిస్తుంది.  గాయత్రికి మించిన మంత్రము, అమ్మకు మించిన దైవమూ లేదని అంటారు. అను నిత్యం గాయిత్రి జపించే వారిని ఆమె సదా రక్షిస్తుందని నమ్ముతారు. అంతేకాదు ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి. ఆమెలో ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలున్నాయి. ఇవి ఆమెలోని విశేషశక్తులకు ప్రతిరూపం. ఆమెలోని అపారమైన విద్యలకు సాక్ష్యాలు. కనుక స్త్రీలను గౌరవించడం వల్లే ఈ ప్రపంచం కాపాడబడుతుందని  గాయిత్రీ అవతారమహిమను భావించవచ్చు.

అమ్మవారు మూడో రోజు అన్నపూర్ణాదేవిగా కనిపిస్తుంది. సకల ప్రాణకోటికి ఆహారాన్ని అందించే జగన్మాత అన్నపూర్ణదేవి అవతారంలో ఓ చేతిలో మధురసాలతో ఉన్న మాణిక్య పాత్ర. మరో చేతిలో రతనాల గరిట పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంది. ఈ చరాచర సృష్టికి జీవనాధారం తానేనన్నది అమ్మవారి దర్శన అంతరార్ధం. మీకు మీ మీ ఇండ్లల్లో కడుపునిండా అన్నం పెట్టే ప్రతి తల్లిలో తానుంటాని దుర్గమ్మ సూచించడంగా  అర్ధం చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ కని పెంచి.. అన్నం పెట్టి.. సాకి సంతరించిన తల్లులను, వ్రుద్ధాశ్రమాల పాలు చేయకుండా గౌరవించడని సూచించే అలంకారం అన్నపూర్ణాదేవిది.

మూడు శక్తులు ఏకమైన తల్లి. ఐశ్వర్యం ఆమే.. విద్యాశక్తి ఆమే.. మహాశక్తి ఆమే. ఈ మొత్తం సృష్టి ఆమె సృజనే. ఆమె లేని లోకం చూడనవసరం లేదు. అసలా మాటకొస్తే మహిళలేని లోకమే లేదు. అన్నీ ఆ అభయ హస్తంలో దాగి వున్నాయని సూచించడానికి నిదర్శనాలు ఆమె అవతార మహిమలు. అమ్మవారు ఇంద్రికీలాద్రిపై వెలసి భక్తుల పాలిట కొంగుబంగారమై పూజలందుకుంటోంది. దసరా శరన్నవరాత్రులు కనకదుర్గమ్మ అపార మహిమలను చూపుతుంది. అనితర సాధ్యమైన ఎన్నో విషయాలు తనలో దాగి వున్నాయని సూచిస్తుందా తల్లి.

అందుకు నిదర్శనంగా నాలుగో రోజు దుర్గమ్మను లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు.
లక్ష్మీ, సరస్వతులు అమ్మవారికి ఇరువైపులా వింజామరలు వీస్తుండగా.. సదాశివుడ్ని తన ఆసనంగా మలుచుకుని.. కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుందీ అవతారంలో.లలితా త్రిపుర సుందరి అంటే ఈ మొత్తం భూమండలానికీ ఆధారభూతమని అర్ధం. మనపై లాలిత్యంతో కూడిన అధికారం ఆమె సొంతం. అంతే కాదు విద్యకు ప్రతి రూపమైన సరస్వతి, ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి.. ఆమెకు ఇరువైపులా చేరి సేవించడంలో ఓ పరమార్ధముంది. విద్య-ధనం రెండూ స్త్రీ మూర్తి సేవ చేయడానికి ఉపయోగించాలని సూచిస్తాయి. ఎన్ని విద్యలొచ్చిన వారైనా.. ఎంత ధనవంతులైనా సరే.. ఆ విద్యాధనాలను మహిళాభ్యున్నతికి వినియోగించాలని సూచించే అలంకారమిది. అలా చేసినప్పుడు మాత్రమే వారి వారి కుటుంబాలు.. బలపడుతాయని అర్ధం చేసుకోవాలని అంటారు. ఇక ప్రకృతి- పురుషుడులో పురుషుడు కూడా ఆమె ఆధీనంలోనే ఉంటాడని. అలా వుండటమే ధర్మమని సూచిస్తుందీ అవతారం. విద్యా, ధన, పురుష శక్తులు ఆమె ఆధీనంలో వుండి.. ఆమె సేవలకు వినియోగించడంలోనే కుటుంబ వ్యవస్థకు మంచిదని సూచిస్తుంది లలితా త్రిపురసుందరి అలంకారం.

ఐదవరోజు అమ్మవారికి మహాలక్ష్మీ అలంకారం చేస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి పొందిన దుర్గమ్మ.. మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి రూపాలతో కూడా నిత్యం పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన ఈతి బాధలుండవని భక్తుల విశ్వాసం. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయన్న అపార నమ్మకం. ధనానికి అధిదేవత మహిళే. ఆమె ఇస్తున్న ధనమే ఇదంతా. అందుకే 'యత్రనార్యంతు పూజ్యంతే' అన్నా భాష్యం పుట్టిందని అంటారు. ఎక్కడ మహిళ గొప్పగా గౌరవించబడుతుందో అక్కడ సమస్త సంపదలుంటాయని సూచిస్తూ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది. అసలు స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలవడమే, సంపదలనిస్తుందని.. ఆమెను గౌరవించడంలోనే అష్టైశ్వర్యాలు దాగి వున్నాయని తెలుపుతూ కనకదుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో భక్తజనులకు దర్శనమిస్తుంది.

ఆరవ రోజు కనకదుర్గమ్మ జన్మనక్షత్రం సందర్భంగా  సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తుంది. వీణ చేతపట్టి, పుస్తకం ధరించిన రూపంతో సరస్వతీదేవిగా కనువిందు చేస్తుందీ రోజు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా, త్రిశక్తి స్వరూపిణియైన దుర్గాదేవి తన అంశంలోని నిజరూపాన్ని సాక్షాత్కరింపచేయడమే ఈ అలంకారం ప్రత్యేకతగా చెబుతారు. అజ్ఞానమే అసలు సిసలైన చీకటి. ఆ చీకటిని పారదోలడానికి విద్యాజ్ఞానం ఎంతో అవసరం. ఆ విద్యలన్నీ.. మహిళామూర్తిలో దాగి వుంటాయి. పుట్టినప్పుడు పాలివ్వడం నుంచి పెరిగి పెద్దయ్యి ప్రయోజకత్వం సాధించే వరకూ తల్లి నేర్పే విద్యలు అన్నిన్ని కావు. నిజమైన విద్యాస్వరూపం నీకు జన్మనిచ్చిన తల్లే.  నీ విజయంలో ప్రధాన భాగస్వామ్యం స్త్రీశక్తిదే. ఆమె నేర్పిన విద్యలే ఇవన్నీ. అలాంటి విద్యలకు అధిదేవత ఆమె. ఆమె దర్శనమాత్రం చేత.. అజ్ఞానం తొలిగిపోతుందని సూచిస్తుంది సరస్వతిదేవిగా కనిపించే కనకదుర్గ అవతారం.
నీకు వూపిరి పోసేది స్త్రీ.. నీకు పాలిచ్చి.. గోరుముద్దలు తినిపించి.. పెంచి పెద్ద చేసేది స్త్రీ.. నీకు పాపిడి తీసి బడికి పంపేది స్త్రీ.. నిన్ను ఇంతింతై వటుడింతై చేసేది స్త్రీ.. నీ విద్యా ఉద్యోగ వ్యాపారాభివృద్ధికి సహకరించేది స్త్రీ.. నీతో ఏడడుగులు నడిచేది స్త్రీ.. నీ వంశాకురాన్ని కని.. నీ చేతుల్లో పెట్టేది స్త్రీ.. వారిని తిరిగి లాలించి పాలించి పెంచి పెద్దవారిని చేసేది కూడా స్త్రీయే.. ఆఖరున నీతో కలసి నడిచేది స్త్రీ.. నీ ప్రారంభం.. ప్రారబ్ధం రెండూ స్త్రీ చేతిలోనే ఉంటాయి.. అలాంటి స్త్రీ శక్తి కి చిహ్నమైన దసరా ఉత్సవ సమయంలో తెలుసుకోవల్సిన సారం ఇంకెంతో ఉంది..
దసరా ఆరు రోజులు ఒకెత్తు. మిగిలిన మూడు రోజులు ఒకెత్తు. కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిలో వెలసినందుకు ప్రతీకగా జరిగే వుత్సవాలు ఈరోజునే జరుగుతాయి. ఆమెలోని అనితరసాధ్యమైన శక్తియుక్తులు దర్శనమిచ్చేది ఈ మూడు అవతారాల్లోనే. దుర్గమ్మను ఎదురిస్తే ఎంతటి మహిషాసురుడికైనా మరణమేనని సూచిస్తుంది. మహిషాసురుడిని అంతమొందించే సమయంలో దుర్గాదేవి అవతారం అత్యంత ప్రధానమైంది. శరన్నవరాత్రుల్లో అష్టమి నాడు దుర్గామాత అవతారంతో మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసినందుకు గుర్తుగా దర్శనమిస్తుంది. ఆ రోజు అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహిస్తారు.  దీన్నే దుర్గాష్టమి పర్వదినంగా పాటిస్తారు. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచిదని చెబుతారు. అలాగే ఉత్తరగోగ్రహణం యుద్ధంలో అర్జనుడు జమ్మి చెట్టు మీది ఆయుధాలను పూజించి విజయం సాధించింది ఈ పర్వదినంలోనే అన్నది ఇతిహాసం. అమ్మవారిని దుర్గాదేవిగా చూపడంలో అంతరార్ధం.. ఆమె దుష్టశక్తిని గుర్తించిందంటే ఇక ఆ దుర్మార్గుడి ఆయువు మూడినట్టేనని అర్ధం. మహిళల శక్తియుక్తులు తెలీక స్వైరవిహారం చేసే వారికి చరమగీతం తప్పదని సూచిస్తుంది దుర్గామాత అలంకారం.

దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపం మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ  శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా మహర్నవమిని భక్తులు మహోత్సవంగా జరుపుకుంటారు. సింహ వాహనం అధీష్ఠించి.. ఆయుధాలను ధరించి.. అమ్మ సకల దేవతాంశాలతో మహాశక్తి రూపంలో దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన శక్తి స్వరూపాన్ని మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయాలు తొలగిపోతాయని నమ్ముతారు.. సకల విజయములు కలుగుతాయని విశ్వసిస్తారు. మహిషాసుర మర్ధినీ దేవిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితమని చెబుతారు. మహిళలను గౌరవించడం అంటే సమస్తమైన శుభాలను ఆహ్వానించడమని చెబుతుందీ అలంకారం. ఆమెను అబలగా అనుకుని పొరబడ్డావో.. మహిషాసురుడికి పట్టిన గతే పడుతుందని  సూచిస్తుంది మహిషాసుర మర్ధిని అలంకారం.

రాజరాజేశ్వరీ దేవి అలంకారం. రాజరాజేశ్వరీ దేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. చేతిలో చెరకుగడతో.. భక్తులకు అభయమిస్తూ కనిపిస్తుంది. రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవిగానూ పిలుస్తారు. ఆమెకే విజయ అని మరో పేరు. మణిద్వీపంలో శ్రీనగరంలోని చింతామణి ఆమె నివాసం. విజయాదేవి చెడుపై సాధించిన విజయమే విజయదశమి అయ్యిందట. ఈ అలంకారంలోని అంతరార్ధమిదే. ఏ విషయంలోనైనా విజయం సాధించాలంటే మహిళ తోడ్పాటు ఎంతో అవసరమని సూచించే అలంకారమిది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ అండదండలు ఉంటాయన్న మాట ఊరకే పుట్టలేదు. అమ్మవారి మహిమల వల్లే ఈ మాటకు ప్రాణమొచ్చింది. నిజజీవితంలోనూ అంతే.. మహిళా శక్తి సాయం లేకుండా ఏ పురుషుడూ మనుగడ సాధించడం కష్టం. అందుకే స్త్రీశక్తికి గుర్తుగా దసరాను చేసుకోమని చెబుతాయి అమ్మవారి అలంకారాలన్నీ.

ఆమే మనకు ఆధారం. ఆమెను గౌరవించడంలోనే సమస్తమైన విజయాలు దాగి వుంటాయి. సుఖసంతోషాలు దొరుకుతాయి. ఆమె పట్ల దురాచారం.. సర్వమానవాళికి చేజేతులా కలిగించే నష్టం. కనకదుర్గను కొలవడం.. ఆమె అవతారమహిమలను తెలుసుకోవడం అంటే, మన చుట్టూ ఉండే మహిళలను తగిన రీతిన గౌరవంచడాన్ని సూచిస్తుంది.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి - తెలుగు శాల సౌజన్యంతో 

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఎంతటి వారైనా... అమ్మకు కొడుకే - Yenta Varalaina Amma ku Koduke

ఎంతటి వారైనా... అమ్మకు కొడుకే - Yenta Varalaina Amma ku Koduke
అమ్మ ప్రత్యక్ష దైవం. జగద్గురువైన ఆదిశంకరులు సైతం అమ్మ మాటకు కట్టుబడి ఉన్నారు. తల్లి అవసాన దశలో తప్పక వస్తానని మాటిచ్చిన శంకరులు.. యతిగా ఉన్నా.. ఆర్యాంబకు అంత్యేష్ఠి సంస్కారాలు నిర్వహించారు. ఆధునిక భారతంలో పరమయోగిగా భాసిల్లిన రమణ మహర్షి సైతం అమ్మ దగ్గరకు వచ్చేసరికి మామూలు మనిషైపోయారు.

ఐహిక విషయాలను విసర్జించి రమణులు కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి.. అరుణాచలం వచ్చేశారు. రమణుల జాడ తెలిసిన బాబాయి నెల్లియప్ప అయ్యర్‌ అరుణాచలం వచ్చారు. ఇంటికి రావాలని కోరగా.. స్వామి స్పందించలేదు. ఇదే విషయాన్ని నెల్లియప్ప.. రమణుల తల్లి అళగమ్మకు తెలియజేశారు. కొడుకుపై అవ్యాజమైన ప్రేమ కలిగిన ఆ మాతృమూర్తి.. నిమిషం నిలువక అరుణాచలం చేరుకుంది. తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా రమణులను కోరింది. అప్పుడూ స్వామి మౌనాన్ని ఆశ్రయించారు. తల్లికి ఒక కాగితంపై.. ‘కర్త వారి ప్రారబ్ధానుసారం జీవులను ఆడించును. జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు. జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరగక మానదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండటమే ఉత్తమం’ అని రాసిచ్చారు. ఆ సమాధానం చదివి బరువెక్కిన గుండెతో ఆ తల్లి వెనుదిరిగింది.

ఆ తర్వాత చాలాసార్లు రమణుల దగ్గరికి ఆ తల్లి వస్తూ, పోతూ ఉండేది. ఓసారి అళగమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. తల్లికి రమణులు ఎన్నో సపర్యలు చేశారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మనామదురైకి తిరిగి వెళ్లారు. 1916లో తిరువణ్ణామలై వచ్చిన ఆమె.. రమణుల వద్దనే స్థిరపడాలని నిశ్చయించారు. తర్వాత నాలుగేళ్లకు అళగమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. రమణులు కంటి మీద కునుకు లేకుండా తల్లికి సేవలు చేస్తూ గడిపారు. స్వామి ఆజ్ఞ చేస్తే చాలు.. ఆ తల్లికి సేవ చేయడానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు. అయినా.. తల్లికి రమణులే సపర్యలు చేశారు. అమ్మకు వేదాంత సారాన్ని బోధిస్తూ ఉండేవారు. చివరగా.. రమణుల కుడిచేతిని ఆమె హృదయంపైన.. ఎడమచేతిని శిరస్సుపైన ఉంచి.. తదేక దృష్టితో తల్లిని వీక్షిస్తూ.. ముక్తిని ప్రసాదించారు. ఏ స్థాయి వ్యక్తులైనా.. తల్లికి కొడుకులేనని.. తల్లికి సేవ చేయడం కొడుకుల బాధ్యత అని జగతికి చాటారు రమణులు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

ప్రతి స్త్రీ లో మనం అమ్మ ను చూడాలి, ఎలా ? Prati Strilo Manam Ammanu Chudali

ప్రతి స్త్రీ లో మనం అమ్మ ను చూడాలి, ఎలా ? Prati Strilo Manam Ammanu Chudali

ఆడవారిని మన సమాజము ఏ యే దశలలో ఏ విధంగా గౌరవించాలి పూజించాలి?
యత్ర నార్యోస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
కావున ఆడవారిని మన సమాజము ఏ యే దశలలో ఏ విధంగా గౌరవించాలి పూజించాలి. ప్రతి స్త్రీ లో మనం అమ్మ ను చూడాలి అంటారు పెద్దవాళ్లు .శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. మరి మహిళలను అమ్మ గా చూడాలి అన్నారు.

అది ఎలా??? అమ్మ అంటే ఆ జగన్మాత అయినటువంటి ఆది పరాశక్తి ని చూడాలి అని అర్థము . అది ఎట్లా చూడాలి.మనుష్యులము అయినవంటి మనము మన బుధ్ధితో జ్ఞానముతో అమ్మవారి స్వరూపాన్ని చూడటుము ఎలా సాధ్యము అవుతుంది?ఈ అంశము పై చాలా కాలము పరిశోధన చేసిన పెద్దలు అందించిన విజ్ఞానాన్ని సేకరించి పోస్ట్ చేస్తున్నాను ఆచరించండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి.

అమ్మవారి 9 రూపములలో స్త్రీ యొక్క పరిపూర్ణ జీవన విధానము మనకు ప్రతిబింబిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే..
 1. స్త్రీ యొక్క జననము అమ్మవారి మొదటి స్వరూపము (బాలా) .పేరు శైలపుత్రీ దుర్గ.
 2. కౌమార దశ అనగా విద్య ఇతరత్రా అన్నీ నేర్చుకుంటూ చిన్న పిల్లలు చేసే అల్లరి చేయడము రెండవ స్వరూపము పేరు (బ్రహ్మచారణీ దుర్గ) 
 3. వివాహానికి పూర్వము చంద్రుడి తో సమానమైనటువంటి కళలు కలిగి ప్రశాంతమయిన ముఖవర్చస్సు కలిగి ఉండటం మూడవ స్వరూపము .పేరు(చంద్ర ఘంటా దుర్గ) 
 4. కొత్త జీవికి జన్మనివ్వడము కోసము గర్భధారణ చేయడమనేది నాల్గవ స్వరూపము.పేరు(కూష్మాండా దుర్గ) 
 5. సంతాన ప్రాప్తి తరువాత తన పిల్లలను చూసుకునే క్రమము ఐదవ స్వరూపము.పేరు( స్కందమాత దుర్గ) 
 6. తన జీవితములో జరిగే అనేక సంఘటనలు చూస్తూ దైవాన్ని సాధన చేస్తూ జీవించే పధ్ధతి ఆరవ స్వరూపము.పేరు(కాత్యాయని దుర్గ) 
 7. తన సంకల్పము చే భర్త యొక్క అకాల మృత్యువును కూడా జయించేటప్పుడు తన ఏడవ స్వరూపము .పేరు(కాళరాత్రి దుర్గ) 
 8. తన వారికి మరియు కుటుంబానికీ తన ద్వారా ఉపకారము చేస్తూ ఉండేది ఎనిమిదవ స్వరూపము.పేరు (మహాగౌరీ దుర్గ ) 
 9. భూమిని విడిచి పెట్టి స్వర్గ ప్రయాణము చేసే ముందు తన సంతానానికి సిధ్ధి(( సమస్త-- సుఖ సంపదలు)) కలగాలని ఆశీర్వాదము ఇచ్చే క్రమములో తన తొమ్మిదవ స్వరూపము.పేరు( సిధ్ధిధాత్రీ దుర్గ) అందుకే స్త్రీ ని గౌరవించాలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

21, ఏప్రిల్ 2018, శనివారం

పురుషుడు భార్యని ఎలా గురవించాలి - Purushudu bharyani yela gauravinchali - How to give respect women

పురుషుడు భార్యని ఎలా గురవించాలి - Purushudu bharyani yela gauravinchali - How to give respect women
స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చెసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్నీ, సంతానాన్నీ, ధనాన్నీ, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహుతురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మిoచి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుది.
 • అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.
 • భార్య వడ్డించిన పదార్ధాలను తినకుండా విమర్శించరాదు.
 • ఇంటిని భార్య జైలులా భావించే పరిస్తితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బైటికి తీసుకెళ్ళాలి.
 • పిల్లలతొ సరళ సంభాషణలు చేయాలి.
 • పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు.
 • ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి.
 • భార్యకి ఎంతో కొంత ఆర్ధిక స్వేచ్హ ఇవ్వాలి.
 • ఆమె అభిప్రాయలను గౌరవించాలి.
 • భార్యను పరులముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు.
 • భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గాని, అనుమానించే వ్యక్తిగా చూడగూడదు.
 • భర్త తను తుదిశ్వాస వదిలేవరకు, భార్యను కంటికి రెప్పలాగ, సంతొషంలోనూ, బాధలలోను చేదొడువాదోడుగా ఉండాలి.
 • భర్త తను మరణించిన తరువాత గూడ, భార్య ఇతరుల మీద ఆధారపడకుండ, కష్ఠాలు పడకుండా ముందు జాగ్రతలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాది కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

5, మార్చి 2018, సోమవారం

పురిటి స్నానము అంటే ఏమిటో అదెలా చేస్తారో తెలుసుకోండి - Puriti snanam cheyatam yela

puriti-snanamu-gurinchi-telusukondi

పురిటి స్నానము:
ఒక స్టూలుపై అమ్మాయిని కూర్చొన పెట్టి, చేతికి పండు, తాంబూలము ఇచ్చి, స్టూలుకు నాలుగు వైపులా, చిన్న సైజు పసుపు ముద్దలు పెట్టాలి. ఒక కండువా లేక లుంగి ఎడమ భుజము మీదుగా కుడిచేతికిందకు రానిచ్చి ముడివేయుదురు. దీనిని కొలుగుడ్డ అంటారు. కిళ్ళీ నోటిలో వేసుకొనవలెను. నువ్వులనూనె రాసి నలుగు పెట్టి తలకిపోయవలెను. పసుపు ముద్దలు ఒళ్ళు తోముకోవలెను. ఒక ముద్ద తరువాత ఒకటి, వేడినీళ్ళలో పసుపు, వేపాకు కలపాలి. మామూలు కాన్పు అయితే చిన్న గిన్నెతో నీళ్ళు పొట్టమీదకు విసిరిపోయుదురు. స్నానము అయినాక చాకలి తెచ్చిన తెలుపు ప్రింటు చీర కట్టుకుందురు. కొల్లుగుడ్డ పిండి వుంచవలెను.
 • గిద్దబియ్యము, పెసరపప్పు కలిపి అన్నము వండవలెను. 
 • ఒక పళ్ళెములో ఇస్తరాకు వేసి పులగము అన్నము చిన్న వుల్లిపాయలు, నల్లకారము, బెల్లముముక్క, పండు తాంబూలము పెట్టి ఆ ప్లేటును దొడ్లో పెట్టవలెను. 
 • బాలింత స్నానము అయినాక కొలుగుడ్డ, చాకుపట్టుకుని మజ్జిగలో వేపాకు మండతో వారుపోస్తూ మజ్జిగ చుక్క తీసుకుని 'పాలచుక్క మాకివ్వు, ఏటా బాలింత ఏటా శూలింత' అంటూ సూర్యభగవానునికి నమస్కారము పెట్టవలెను. 
 • ఈ అన్నము చాకలికి ఇచ్చెదరు. బాబుకు స్నానము అయినాక వడ్లజల్లెడ కాని, చాటలో కాని కాటను తెలుపుచీర వేసి పరుండపెట్టవలెను. 
 • పుణ్యవచనము అయినదాక 13, 15, 17, 19 రోజులలో నలుగుపెట్టి వరస స్నానము చేయించాలి. తలస్నానము అవసరము లేదు. 
 • 21వ రోజున నలుగుపెట్టి తలస్నానము చేసి, పొంగలి వండి, దేవునికి దీపారాధన చేసి పూజచేసి పొంగలి నైవేద్యము పెట్టిన, పూర్తి పురుడుపోయినట్లు. నెలలోపల ఒకసారి బాబును గుడికి తీసుకువెళ్ళాలి. 
పత్యము:
దొండకాయ, దోసకాయ, టమాటా, బజ్జి, కాకరకాయ, పాత చింతకాయ పచ్చడి, నల్లకారం, పొట్లకాయ, బీరకాయతో చేసినవి పెట్టవచ్చును. అట్టు, అరిశె, జున్ను 6 నెలలు తినకూడదు. వంకాయ, గోంగూర, ఆకుకూరలు 2 నెలలు తినకూడదు. 10 రోజులు రాత్రిపూట అన్నములో పాలు పోయుదురు.

బాబు స్నానము అయినాక, తల్లి స్నానము చేసి సూర్యునకు నైవేద్యము పెట్టి నమస్కరించిన దాక బాబును చూడరాదు.
puriti-snanamu-gurinchi-telusukondi

కాట్‌రేట్‌ చీర:
ప్రసవించిన తరువాత 3, 5, 9 రోజులలో ఒకటే చీరను కట్టుకొనవలెను. ఈ చీర మామగారు తీసుకువెళ్ళి కోడలుకు ఇవ్వవలెను. మార్చుకొను సమయములో ఎవరూ వుండరాదు. తరువాత ఈ చీరను బాబుకు పక్కచీరగా వాడుకొనవచ్చును. బాలింత ఇంట వున్నవారు మాత్రమే ఈ చీర ఇచ్చెదరు. మామగారు లేని వాళ్ళు భర్త చేతితో ఇవ్వవలెను.

బ్రహ్మదేవుడు '60 సం|| ఆయుష్షు ఇవ్వగలనుగాని, 6వ రోజు చేతకాదు' అంటాడు. 5వ రోజు సాయంత్రం 5, 6 గంటల నుండి ఇలా అనుకొనవలెను. 'బ్రాహ్మడి కూతురు మాదిగవాని పెళ్ళాం ఏరమ్మ ఏరుదాటి మాఇంటికి రాకమ్మ'. 6వ రోజు ఉదయం వరకు అనుకుంటూ వుండాలి. ఆ రోజున పుట్టిన బాబును ఏ కొంచెము సమయము, ఒంటరిగా వుంచరాదు. ప్రసవించినప్పుడు 3వనెల వచ్చువరకు రెండుకాళ్ళు పక్కపక్కగా వుండునట్లు కూర్చొని లేదా పడుకొని వుండవలెను. గాలిలోపలకు పోకూడదు. బాలింతకు ఆహారములో తెలగపిండి పెట్టిన, బిడ్డకు పాలు సరిపోవును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

16, నవంబర్ 2017, గురువారం

స్త్రీ - తల్లి, భార్య, ఎవరు ఎక్కడున్నారు !

stri-thalli-bharya


స్త్రీ పాత్ర - తల్లి, భార్య, ఎవరు ఎక్కడున్నారు:
“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః
యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః ”
మనుస్మృతి
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వ సంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది.

మనము అమ్మవారి ఆలయానికి వెళతాము అక్కడ అమ్మవారికి పడీ పడీ దండాలు పెడతాము. అప్పుడు అమ్మవారు ఏమనుకుంటారో తెలుసా? నీవు నీవు చేయు ఈ పూజ, ఈ సేవ, ఈ దండాలు నేను కాక ఎవరో నిన్ను చూడాలని చూచి వారు నిన్ను మెచ్చుకోవాలని, లేదా ఏ బంధు ప్రీతి కొరకో లేదా బుధ జన ప్రీతి కొరకో అంతే కానీ నీకొరకు నాకొరకు కాదు. బంధు జనము ప్రీతి చెందుతారేమో కానీ, బుధజనము, నీగురించి తెలిసిన వారు, ధర్మమును ఆశ్రయించినవారు, ధర్మపరులు హర్షించరు. ఎందుకంటే అమ్మవారు అంటారు ఇక్కడకు వచ్చి, పడి పడి దండాలు పెడుతున్నావు. ఇక్కడ నేను సమిష్టి రూపంలో ఉన్నాను. అక్కడ మీ గృహములో వ్యష్ఠి రూపంలో ఉన్నాను. నీకు తల్లిగా, నీకు భార్యగా, నీకు చెల్లిలిగా, నీకు అక్కగా, నీకు ఒక వదినగా, మరదలుగానే కాక, ప్రతి స్త్రీ మూర్తిలోనూ వ్యష్ఠి రూపములో ఉన్నాను, కాబట్టి ముందు అక్కడ నుండి మొదలుపెట్టరా, నీ సేవ, నీ పూజ. అక్కడ అమ్మకు పట్టెడు అన్నం పెట్టవు. అమ్మా నీకు ఆరోగ్యం ఎలా వుంది అని అడిగిన పాపాన పోవు.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కులధర్మపత్నీ. అని కదా అన్నారు ? మరి అలాంటి ధర్మపత్ని, నీకు, మీ వంశానికి, వంశోద్ధారకుణ్ణి ప్రసాదించి,నిన్ను, నీ ముందు తరతరాలవారినీ, పున్నామనరకము నుండి తప్పించడానికి తన ప్రాణాలనే ఫణముగా పెట్టి యోగ్యమైన సంతానాన్నిచ్చి, మిమ్ములను, మీ వంశన్నీ ఉద్ధరింపచేసే స్త్రీ మూర్తి, నీ సహధర్మచారిణిని, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు.
ఇక్కడ ఒకవిషయం ఎవరైనా సరే మనస్పూర్తిగా ఆలోచించాలి మనకు ఆరోగ్యం బాగా లేక
stri-thalli-bharya
పడకవేస్తే, ఆమె బాధపడుతుంది, ఆక్రోశిస్తుంది, అల్లాడి పోతుంది, తల్లడిల్లిపోతుంది, వివిలలాడుతుంది మన అలనా పాలనా చూచి,సమయానికి మందులు, మాత్రలు, సరియైన ఆహారం ఇవ్వడం, మనకు సేవలు చేయడం, కన్నతల్లి లాగా, ఎక్కువగా మనలను సేవించి మనకోసం, మనకుటుంబముకోసం, అన్నీ తానై పాటుపడే సహనమూర్తి, త్యాగశాలి ధ్ర్మపత్ని. అందుకే కదా కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, ఇత్యాది రూపాలుగా మన పూర్వులు ధర్మపత్నిని గౌరవించి స్త్రీ మూర్తికి అగ్ర తాంబూలం ఇచ్చారు. మరి అలా తల్లిడిల్లినపుడు, బాధతో ఆక్రోశించినపుడు, విలవిలలాడేటప్పుడు, రాత్రంతా నీ మంచము ప్రక్కన కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతూ సేవలు చేస్తూ నీకోసం అహోరాత్రము శ్రమిస్తుంది.

మనము బ్రతికి (ఆరోగ్యం కుదుటబడి) బట్టకడితే ఈ జనులు, బుధజనులు ఏమంటారో తెలుసా “ఆ తల్లి మాంగల్యం గట్టిది, ఆతల్లి పూజాఫలము ఆయనకు పునర్జన్మ నిచ్చింది” అంటారే కానీ నీ గొప్పనో లేక నీ అదృష్టమనో అనరు. మన ఆకలిని ఎరిగి తనకు లేకపోయినా తన అమృత హస్తాలతో కొసరి కొసరి వడ్డించి అన్నము పెట్టే నీ సహధర్మచారిణి (భార్య) లో భోజన సమయములో అమ్మ కనిపించడములేదా? అమ్మతనాన్ని చూడలేవా? దాసిగా సేవలు చేయు నపుడు, మన కోపాలను, దుర్భాషలను, రాక్షసప్రవృత్తిని ఆ స్త్రీమూర్తి భరించు నపుడు ఆమె క్షమా గుణంలో భూమాతను దర్శించలేని నీవు, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు. ఎవరికి కావాలి ఇలాంటి ఈ నటనల పూజ. ఇక్కడ ఆలయంలో అమ్మవారికి పూజచేస్తూ ఒక సెకను నీ పంచేంద్రియాలను అమ్మవారి పాదముల చెంత ఆవిష్కరించలేవు, పూజ చేస్తూ కూడా పక్కన ఓ అమ్మాయి కనబడ్డా, ఒక స్త్రీమూర్తి కనబడ్డా ఇక్కడే నీ బుద్ధి, మనము వెర్రివేషాలు వేస్తుంటే చూస్తూ అన్నందిస్తావు. పరస్త్రీలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు.పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవత ను, తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?

ఇవే కాక మన పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ, అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ, విశ్వాసము అపారము అనిర్వచనీ యము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు. ఎందుకంటే అది తన రక్తం, పేగుబంధం కాబట్టి బిడ్డలు ఎక్కడ వున్నాతల్లి ఆ బిడ్డను వేయి కళ్ళతో వారి ప్రతి అలోచనను, ప్రతి అడుగును గమనిస్తూ ఉంటుంది.

stri-thalli-bharya

కావున కేవలం తల్లి కే (ఆ పరదేవతకే) అది సాధ్యం. బిడ్డలు చేసిన పనులను, ఆలోచ నలను, వారి అసంతృప్తు లను, మంచి చెడులు ఎప్పటి కప్పుడు వివరించి, ధర్మాధర్మములను వివరించి, బిడ్డలను తీర్చిదిద్ద కలిగే శక్తి ఒక్క తల్లికి మాత్రమే ఉంది. తండ్రికి కాదు. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారిని సమాధానపరచ గలదు తల్లి. అందుకే వేద వేదాంగములలో మొదటి నమస్కారము తల్లికే “మాతృదేవోభవ” అన్నారు. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించింది కావున ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గమునకు మన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శముగా పూజనీయ మైనది గౌరవప్రదమైనది. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించి తన బిడ్డలను ధర్మమార్గంలో నడపగలిగితే ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గ మునకు మన భారతదేశము ఇతర దేశములకు భావితరాలకు కూడా ఆదర్శము కాగలదు.

కాబట్టి ఈ సమాజమును మార్చగలిగే శక్తి ఒక్క స్త్ర్రీమూర్తికి మాత్రమే ఉంది. ఇందు పురుష పాత్ర ధర్మ జీవనం, ధర్మ సంపాదన, ధర్మ వర్తనము (స్త్రీ అయిన పురుషుడైన) కలిగి మన పిల్లలకు మనమే తొలి గురువులు కాబట్టి,మన పిల్లలు మనలను ఆదర్శంగా తీసుకొని, వారి భావి జీవితాన్ని వారి చుట్టు ప్రక్కల సమాజానికి, ఆదర్శపాత్రులైన నాడు, మనం మన బిడ్డలను చూచి, మనము సగర్వంగా గర్వపడతాము. “నేటి బాలలే రేపటి పౌరులు” కదా మరి ఆలోచించండి గృహస్తాశ్రమము (సంసారజీవనము) లో స్త్రీ పాత్ర ఎంతటిదో. అలాంటి స్త్రీ మూర్తిలో శయనేషు రంభే తప్పభోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు. పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవతను,తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా!అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?

తన ధర్మపత్నిలో పర దేవతను చూచిన మహానుభావులు పుట్టిన దేశంమనది, అంతగొప్ప సంస్కృతి మనది.

ఉదా:- శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంసగారు తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి