నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Saturday, September 19, 2020

చైనాలో వ్యాపిస్తున్న మరో క్రొత్త ప్రమాదకర వ్యాధి 'బ్రూసిల్లోసిస్' - The Another new disease name called 'Brucellosis' spreading in China

ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా వైరస్‌కు పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో మరో ప్రమాదకర వ్యాధి విజృంభిస్తోంది. వాయువ్య రాష్ట్రమైన గన్సూలోని ల్యాన్‌ఝౌ నగరంలో బ్రూసిల్లోలిస్‌ అనే జబ్సు క్రమంగా విస్తరిస్తున్నట్లు అక్కడి నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన 3,245 మంది పడ్డట్లు ప్రకటించారు. బ్రూసెల్లా అనే బ్యాక్టిరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది.
బ్రూసిల్లోలిస్‌నే ‘మాల్టా ఫీవర్‌’ అని కూడా పిలుస్తారు. ఇది సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కీళ్ల-కండరాల నొప్పి, వెన్ను నొప్పి, చలి, చెమటలు పట్టడం, ఆయాసం, బరువు తగ్గడం, ఆకలిగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇది జంతువుల నుంచి వ్యాపిస్తుంది. పాశ్చరైజ్‌ చేయని పాల ఉత్పత్తులు, అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది. 
మనిషి నుంచి మనిషికి సోకడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి కీళ్లనొప్పుల సమస్య జీవితకాలం వేధించే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే కొందరు సంతానసాఫల్యత సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మరికొందరిలో అవయవాల్లో వాపు ఏర్పడుతుందని తెలిపారు. వ్యాధి ముదురుతున్న కొద్దీ కాలేయం, గుండె, నాడీ వ్యవస్థపైనా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు.
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com