నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Monday, September 7, 2020

అంతర్వేది ఘటనపై సర్వత్రా ఆగ్రహం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పెద్దలు శ్రీ అమ్మిరాజు, శ్రీ సూర్యనారాయణ శాస్త్రి, శ్రీ పార్ధసారథి, శ్రీ పవన్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కలిసి జరిగిన ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కోట్లాది మంది హిందువుల హృదయాలు గాయపడ్డాయని, అధికారులు ఈ కేసును నీరు కార్చడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. హిందూ సమాజం ఇలాంటి కుయత్నాలను చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు.

మంత్రితో మాట్లాడుతున్న ఆరెస్సెస్ పెద్దలు:

అంతర్వేది దేవస్థానంలో స్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయిన సంఘటనకు సంబంధించి అంతర్వేది దేవస్థాన ఈవో ను వెంటనే సస్పెండ్ చేయాలని రాజోలు మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతర్వేది దేవస్థానం నందు ధర్నా చేశారు. రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు జరుగుతూ ఉండడం గర్హనీయమని, జరిగిన సంఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు.

జరిగిన ఘటన అత్యంత బాధాకరమని, రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనల పట్ల హిందూ సమాజం చాలా ఆందోళన చెందుతూ వున్నదని భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రంలోని అన్ని హిందూ సంఘాలు, హిందూ సమాజము వెంటనే స్పందించాలని, సమైక్యంగా ఉద్యమించాలని స్వామీజీ కోరారు.

ఈ ఘటనపై గవర్నర్ జోక్యాన్ని కోరుతూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు విజ్ఞప్తి చేసింది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అనుమానాస్పద సంఘటనలలో ఇది కూడా ఒకటని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పేర్కొంది.

« PREV
NEXT »