నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Saturday, September 19, 2020

ఆంధ్ర రాష్ట్రంలో ఆగని దేవాలయలపై దాడులు - Attack on another temple in the Andhra state

రాష్ట్రంలో మరో దేవాలయంపై దాడి జరిగింది.  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం లోని బొటవంపల్లి   గ్రామ శివార్లలో శ్రీ రామ మందిరం లో గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు కొందరు ధ్వంసం చేశారు.  

నిన్న (17/9/2020),  గురువారం మహాలయ అమావాస్య సందర్భంగా గుడిలో ప్రత్యేక పూజలు జరిగాయి.   పూజలు అనంతరం గ్రామస్తులందరూ ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయిన తర్వాత  గుర్తుతెలియని దుండగులు  ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం  చేసినట్లుగా  గ్రామస్తులు భావిస్తున్నారు.  ఆలయం గ్రామానికి దూరంగా ఉండడం  దుండగులకు అవకాశం  దొరికిందని గ్రామస్తులు తెలుపుతున్నారు.

రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై జరుగుతున్న వరుస దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని,  ఘటనలపై  సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు,  హిందుత్వ వాదులు,  హిందూ సంఘాల ప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

__విశ్వ సంవాద కేంద్రము 

« PREV
NEXT »