నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Saturday, September 12, 2020

ఎవరు హిందూ ద్రోహం చేస్తున్నారు???

ఎవరు హిందూ ద్రోహం చేస్తున్నారు???

ఎవరు హిందూ ద్రోహం చేస్తున్నారు???

 • హిందువుకాని ఒక ఫకీర్ ని పూజిస్తూ వేద విరుద్ధంగా ప్రవర్తిస్తుంది ఎవరు?
 • ఎవరిది హిందూ ద్రోహం...???
 • వేదాల్లో సాయి ఉన్నాడా? అని ప్రశ్నిస్తే... అసలు వేదాలు నిజమా అని వేదాన్నే ఎద్దేవా చేస్తున్నది ఎవరు?
 • ఎవరిది హిందూ ద్రోహం...???
 • శ్రద్ధా, సబూరి... శ్రద్ద సంస్కృత పదం. మరి సబూరి ఏ భాషా పదం??? పర భాష పదాల్ని ఇరికిస్తున్నది ఎవరు???
 • ఎవరిది హిందూ ద్రోహం...???
 • ఒకవైపు ఎడారి మతాల అరాచకాలు, మొన్న భైంసాలో, నిన్న బెంగళూరులో, నేడు స్వీడన్ లో జరుగుతుంటే... ఈ కుహనా సాయి భక్తులు అన్ని మతాలు సమానమే... అన్ని మతాల సారం ఒక్కటే అని చిలకపలుకులు పలుకుతూన్నది ఎవరు?
 • ఎవరిది హిందూ ద్రోహం...???
 • వేల ఏళ్ళ తపస్సులో ఋషులు మంత్రం ద్రష్టలుగా ఉండి దర్శించి, అనుష్టించి, ఆచరించిన మహా మంత్రాల్ని సాయికి ఆపాదించి " షిర్డీ వాసాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్"  అంటూ వేదమాత గాయత్రీని నీచాతినీచంగా అవమానిస్తున్నది ఎవరు?
 • ఎవరిది హిందూ ద్రోహం...???
 • పరమ పవిత్రమైన ఓంకారాన్ని శ్రీకారాన్ని  "ఓం సాయి శ్రీ సాయి" అని గొంతు చించుకుంటున్నది ఎవరు?
 • ఎవరిది హిందూ ద్రోహం...???
 • సాయి పాదాల కింద శ్రీ కూర్మాన్ని, శివలింగాన్ని పెట్టి పరమేశ్వరుణ్ణి కూడా తమ మార్కెటింగ్ వ్యామోహానికి బలిచేసింది ఎవరు?
 • ఎవరిది హిందూ ద్రోహం...???
 • శివుడు, విష్ణువు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, మహాలక్ష్మి, హనుమంతుడు ఇలా ఏ దేవీదేవతలు కూడా వదలకుండా అందరు సాయి అనుచరులే ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే వీళ్ళందరూ సాయి దాసులే అనే విధంగా ప్రచారం  చేస్తూ... సాయి తమ భుజస్కంధాల మీద మోస్తున్నది ఎవరు?
 • ఎవరిది హిందూ ద్రోహం...???
 • ఒకవైపు క్రిస్టియానిటీ మతమార్పిడులు, ఇంకోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదం సనాతన ధర్మాన్ని కబళిస్తూ ఉంటే కాషాయం జండా చేతపట్టి "జై శ్రీరామ్" అనాల్సిందిపోయి, జై సాయిరాం అన్ని మతాలు సమానమే, సబ్ కా మాలిక్ ఏక్ హై... అల్లా మాలిక్... శ్రద్ధ సబూరి... తొక్క తోటకూర అంటూ సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేస్తున్నది ఎవరు?
 • ఎవరిది హిందూ ద్రోహం...???

ఇంత అరాచకం సనాతన భారతి మీద జరుగుంతుంటే చూసి ఉండలేక అవైదిక శక్తుల్ని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్న మమ్మల్ని హిందూ ద్రోహులు అనడం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా... 

రచన: జయ శ్రీరామచంద్ర ప్రభూ...

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com