.. శివరాత్రి వ్రతం ..
ముందుగా పూజకు ఎలాంటి అడ్డంకులు రాకూడదని ప్రార్థిస్తూ గనాపతి పూజ జరుపుము. క్రింద సూచించిన విధంగా సంకల్పం చేయండి:మమోపాత్త సమస్త దురిత క్శయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్త్తమ్ శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖణ్డే అస్మిన్ వర్తమానే వ్యవహారిక - నామేన సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ కుమ్బ మాసే కృష్ణ పశే చతుర్ధశ్యామ్ సుభతితౌ - వాసర యుక్తాయామ్ శుభనశత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శివరాత్రి పుణ్యకాలే శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ శేమస్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాపి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోశ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం మమ సమస్త దురితోప శాన్త్యర్థం సమస్త మఙ్గళ వాప్త్యర్థం శ్రీ సామ్బ సదాశివ ప్రసాదేన సకుటుమ్బస్య ఘ్యాన వైరాగ్య మోక్శ ప్రాప్త్యర్త్తమ్ వర్షే వర్షే ప్రయుక్త శివరాత్రి పుణ్యకాలే సమ్బ పరమేశ్వ పూజామ్ కరిష్యే || నమః |
ఇప్పుడు కలశ పూజ చేయండి:
ఈ శ్లోకంతో పరమశివునికి పూజ చేయండి
చన్ద్ర కోఠి ప్రతీకాశం త్రినేత్రం చన్ద్ర భూషణమ్.హ్ |
ఆపిఙ్గళ జటజూటం రత్న మౌళి విరాజితమ్.హ్ ||
నీలగ్రీవం ఉతారాఙ్గం తారహారోప శోభితమ్.హ్ |
వరదాభయ హస్తఞ్చ హరిణఞ్చ పరశ్వతమ్.హ్ ||
తతానం నాగ వలయం కేయూరాఙ్గత ముద్రకమ్.హ్ |
వ్యాఘ్ర చర్మ పరీతానం రత్న సింహాసన స్థితమ్.హ్ ||
ఆగచ్చ దేవదేవేశ మర్త్యలోక హితేచ్చయా |
పూజయామి విదానేన ప్రసన్నః సుముఖో భవ ||
ఉమా మహేశ్వరం ద్యాయామి | ఆవాహయామి ||
శివుని ప్రాణ ప్రతిష్టా చేయండి మరియు ధూపదీప, పండ్ల సమర్పణతో సరళమైన పూజ చేయండి:
పాదాసనం కురు ప్రాఘ్య నిర్మలం స్వర్ణ నిర్మితమ్.హ్ |
భూషితం వివితైః రత్నైః కురు త్వం పాదుకాసనమ్.హ్ ||
ఉమా మహేశ్వరాయ నమః | రత్నాసనం సమర్పయామి ||
గఙ్గాది సర్వ తీర్థేభ్యః మయా ప్రార్త్తనయాహృతమ్.హ్ |
తోయమ్ ఏతత్ సుకస్పర్శమ్ పాద్యార్థమ్ ప్రదిగృహ్యతామ్.హ్ ||
ఉమా మహేశ్వరాయ నమః | పాద్యం సమర్పయామి ||
గన్ధోదకేన పుష్పేణ చన్దనేన సుగన్ధినా |
అర్ఘ్యం కృహాణ దేవేశ భక్తిం మే హ్యచలాం కురు ||
ఉమా మహేశ్వరాయ నమః | అర్ఘ్యం సమర్పయామి ||
కర్పూరోశీర సురభి శీతళం విమలం జలమ్.హ్ |
గఙ్గాయాస్తు సమానీతం గృహాణాచమణీయకమ్.హ్ ||
ఉమా మహేశ్వరాయ నమః | ఆచమనీయం సమర్పయామి ||
రసోసి రస్య వర్గేషు సుక రూపోసి శఙ్కర |
మధుపర్కం జగన్నాథ దాస్యే తుభ్యం మహేశ్వర ||
ఉమా మహేశ్వరాయ నమః | మధుపర్కం సమర్పయామి ||
పయోదధి కృతఞ్చైవ మధుశర్కరయా సమమ్.హ్ |
పఞ్చామృతేన స్నపనం కారయే త్వాం జగత్పతే ||
ఉమా మహేశ్వరాయ నమః | పఞ్చామృత స్నానం సమర్పయామి ||
మన్ధాకినియాః సమానీతం హేమాంబోరుహ వాసితమ్.హ్ |
స్నానాయ తే మయా భక్త్యా నీరం స్వీకృయతాం విభో ||
ఉమా మహేశ్వరాయ నమః | శుద్దోదక స్నానమ్ సమర్పయామి |
స్నానానన్తరం ఆచమనీయం సమర్పయామి ||
వస్త్రం సూక్శ్మం తుకూలేచ దేవానామపి దుర్లభమ్.హ్ |
గృహాణ త్వమ్ ఉమాకాన్త ప్రసన్నో భవ సర్వతా ||
ఉమా మహేశ్వరాయ నమః | వస్త్రం సమర్పయామి ||
యఘ్యోపవీతం సహజం బ్రహ్మణా నిర్మితం పురా |
ఆయుష్యం భవ వర్చస్యం ఉపవీతం గృహాణ భో ||
ఉమా మహేశ్వరాయ నమః | యఘ్యోపవీతం సమర్పయామి ||
శ్రీకణ్ఠం చన్దనం దివ్యం గన్ధాఢ్యం సుమనోహరమ్.హ్ |
విలేపనం సురశ్రేష్ట మత్దత్తమ్ ప్రతి గృహ్యతామ్.హ్ ||
ఉమా మహేశ్వరాయ నమః | గన్ధం సమర్పయామి ||
అక్శదాన్ చన్ద్ర వర్ణాపాన్ శాలేయాన్ సదిలాన్ శుభాన్ |
అలఞ్కారార్థమానీదాన్ ధారయస్య మహాప్రభో ||
ఉమా మహేశ్వరాయ నమః | అక్శదాన్ సమర్పయామి ||
మాల్యాతీని సుగన్ధీని మలద్యాతీని వై ప్రభో |
మయాహృదాని పుష్పాణి పూజార్థం తవ శఞ్కర ||
ఉమా మహేశ్వరాయ నమః | పుష్పమాలాం సమర్పయామి ||
|| అఙ్గ పూజ ||
శివాయ నమః | పాదౌ పూజయామి |
శర్వాయ నమః | కుల్పౌ పూజయామి |
రుద్రాయ నమః | జానునీ పూజయామి |
ఈశానాయ నమః | జఙ్ఘే పూజయామి |
పరమాత్మనే నమః | ఊరూ పూజయామి |
హరాయ నమః | జఘనం పూజయామి |
ఈశ్వరాయ నమః | గుహ్యం పూజయామి |
స్వర్ణ రేతసే నమః | కటిం పూజయామి |
మహేశ్వరాయ నమః | నాభిం పూజయామి |
పరమేశ్వరాయ నమః | ఉదరం పూజయామి |
స్ఫటికాభరణాయ నమః | వక్శస్థలం పూజయామి |
త్రిపురహన్త్రే నమః | భాహూన్ పూజయామి |
సర్వాస్త్ర ధారిణే నమః | హస్తాన్ పూజయామి |
నీలకణ్ఠాయ నమః | కణ్ఠం పూజయామి |
వాచస్పతయే నమః | ముఖం పూజయామి |
త్ర్యమ్బకాయ నమః | నేత్రాణి పూజయామి |
ఫాల చన్ద్రాయ నమః | లలాటం పూజయామి |
గఙ్గాధరాయ నమః | జటామణ్డలం పూజయామి |
సదాశివాయ నమః | శిరః పూజయామి |
సర్వేశ్వరాయ నమః | సర్వాణ్యఙ్గాని పూజయామి |
శివ అష్టోత్తర లేదా శివ సహస్ర నామావళి పూజ ప్రారంభించండి (క్రింద సూచించిన మంత్రములతో):-
సామ్బ పరమేశ్వరాయ నమః | నానావిత పరిమళపత్ర
పుష్పాణి సమర్పయామి ||
|| ఉత్తరాఙ్గ పూజ ||
వనస్పతిరసోద్భూతః గన్ధాఢ్యశ్చ మనోహరః |
ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్.హ్ ||
ఉమా మహేశ్వరాయ నమః | ధూపం ఆగ్రాపయామి ||
సాజ్యం త్రివర్త్తి సమ్యుక్తం వహ్నినా యోజితం మయా |
దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహమ్.హ్ ||
ఉమా మహేశ్వరాయ నమః | దీపం దర్శయామి ||
నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు |
శివేప్సితం వరం దేహి పరత్ర చ పరాం గతిమ్.హ్ ||
ఉమా మహేశ్వరాయ నమః | మహానైవేద్యం సమర్పయామి ||
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
ధీమహి దియో యో నః ప్రచోదయాత్.హ్ |
ఓం దేవ సవితః ప్రసూవ సత్యం త్వర్థేన పరిశిఞ్చామి |
అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణయస్వాహా | ఓం అపానాయస్వాహా | ఓం వ్యానాయ స్వాహా |
ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
ఓం బ్రహ్మణే స్వాహా | బ్రహ్మణి మ ఆత్మా అమృతత్వాయ |
అమృతాభితానమసి ||
నైవేద్యానన్తరం ఆచమనీయం సమర్పయామి |
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్ యుతమ్.హ్ |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్.హ్ ||
ఉమా మహేశ్వరాయ నమః | కర్పూర తాంబూలం సమర్పయామి ||
చక్శుర్తం సర్వలోకానాం తిమిరస్య నివారణమ్.హ్ |
ఆర్దిగ్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వర ||
ఉమా మహేశ్వరాయ నమః | కర్పూర నీరాఞ్జనం సమర్పయామి |
ఆచమనీయం సమర్పయామి ||
యానికానిచ పాపాని జన్మాన్తర కృతాని చ |
తాని తాని వినశ్యన్తి ప్రదక్శిణ పతే పతే ||
ఉమా మహేశ్వరాయ నమః | ప్రదక్శిణం సమర్పయామి ||
పుష్పాఞ్జలిం ప్రదాస్యామి గృహాణ కరుణానిదే |
నీలకణ్ఠ విరూపాక్శ వామార్ద గిరిజ ప్రభో ||
ఉమా మహేశ్వరాయ నమః | పుష్పాఞ్జలిం సమర్పయామి |
మన్త్రపుష్పం స్వర్ణపుష్పం సమర్పయామి ||
మన్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణమ్ తతస్తు తే ||
వన్దే శమ్భుముమాపతిం సురగురుం వన్దే జగత్కారణమ్.హ్
వన్దే పన్నగభూషణం మృగధరం వన్దే పశూణామ్ పతిమ్.హ్ |
వన్దే సూర్య శశాంకవహ్ని నయనం వన్దే ముకున్ద ప్రియమ్.హ్
వన్దే భక్త జనాశ్రయఞ్చ వరదం వన్దే శివం శఙ్కరమ్.హ్ ||
నమఃశివాభ్యాం నవ యౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్ ధరాభ్యామ్.హ్ |
నగేన్ద్ర కన్యా వృష కేతనాభ్యాం
నమో నమఃశఙ్కర పార్వతీభ్యామ్.హ్ ||
|| అర్ఘ్యమ్ ||
శుక్లామ్బరధరం విశ్ఃణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వవిగ్నోపశాన్తయే ||
మమోపాత్త సమస్త దురిత క్శయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్త్తం |
మయా చరిత శివరాత్రి వ్రదపూజాన్తే క్శీరార్ఘ్య ప్రదానం
ఉపాయదానఞ్చ కరిష్యే ||
నమో విశ్వస్వరూపాయ విశ్వసృష్ట్యాది కారక |
గఙ్గాధర నమస్తుభ్యం గృహాణార్ఘ్యం మయార్పితమ్.హ్ ||
ఉమా మహేశ్వరాయ నమః | ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ||
నమఃశివాయ శాన్తాయ సర్వపాపహరాయచ |
శివరాత్రౌ మయా దత్తమ్ గృహాణార్ఘ్యం ప్రసీత మే ||
ఉమా మహేశ్వరాయ నమః | ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ||
దుఃఖ దారిద్ర్య పాపైశ్చ దగ్తోహం పార్వతీపతే |
మాం త్వం పాహి ,అహాభాహో గృహణార్ఘ్యం నమోస్తు తే ||
ఉమా మహేశ్వరాయ నమః | ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ||
శివాయ శివరూపాయ భక్తానాం శివదాయక |
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి ప్రసన్నో భవ సర్వతా ||
ఉమా మహేశ్వరాయ నమః | ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ||
అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతి |
అమ్బికే వరదే దేవి గృహ్ణీదార్ఘ్యం ప్రసీద మే ||
పార్వత్యై నమః | ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ||
సుబ్రఃమణ్య మహాభగ కార్తికేయ సురేశ్వర |
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో వరదో భవ ||
సుబ్రహ్మణ్యాయ నమః | ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ||
చణ్డికేశాయ నమః | ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ||
అనేన అర్ఘ్య ప్రదానేన భగవాన్ సర్వదేవాత్మకః సపరివార
సంబ పరమేశ్వరః ప్రీయతామ్.హ్ ||
|| ఉపాయన దానమ్ ||
సాంబశివ స్వరూపస్య బ్రాహ్మణస్య ఇతమాసనం | అమీతే గన్ధాః ||
క్రింది మంత్రంతో తాంబూలం, దక్షిణ, ఇవ్వండి:
హిరణ్యగర్భ గర్భస్తం హేమబీజం విభావసోః |
అనన్తపుణ్య ఫలతం అతః శాన్తిం ప్రయచ్చ మే ||
ఇదముపాయనం సదక్శిణాకం సతాంబూలం సాంబశివప్రీతిం కామమానః
తుభ్యమహం సమ్ప్రతతే న మమ ||
నమస్కరించండి:
ఓం సమస్త లోక సుఖినో భవన్తు ||
| ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు |