లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడులను నడిపిస్తున్న జీహాదీల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాసిన భజరంగ్ దళ్..

Bajrang Dal urges CM Yogi Adityanath to take action against individuals involved in ‘love jihad’ and forced conversions
వ్ జిహాద్, బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాన్పూర్ లోని భజరంగ్ దళ్ నాయకులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు.

బజరంగ్ దళ్ రాష్ట్ర కార్యదర్శి రామ్ జీ తివారీ రాసిన లేఖలో జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కొన్ని అతివాద సంస్థలు ఈ కుట్రలో ఉన్నాయని వారు సూచించారు.

భారతదేశంలో మెజారిటీ హిందూ సమాజం పట్ల విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వారు క్రమం తప్పకుండా దేశాన్ని అస్థిరపరిచేందుకు మరియు భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బజరంగ్ దళ్ ఆరోపించింది.

హిందూ స్త్రీలే లక్షయంగా కుట్రలు:
రామ్ జీ తివారీ మాట్లాడుతూ, "ఈ సంస్థలు వ్యక్తులు లవ్ జిహాద్ మరియు మత మార్పిడుల కార్యకలాపాల్లో పాల్గొంటూ గత కొన్ని నెలల నుండి, లవ్ జిహాద్ మరియు మతమార్పిడులకు సంబంధించిన కేసులు భారీగా పెరుగుతున్నయని ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు"

ఇది వివిధ వర్గాల వ్యక్తుల మధ్య ప్రేమ వ్యవహారం మాత్రమే కాదని, ఇది దేశం అంతర్యుద్ధం వైపు దేశాన్ని ముందుకు నెట్టడానికి చేస్తున్న ప్రయత్నంగా దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కుట్రలో ఒక భాగం.

"దేశభక్తి - జాతీయవాదం కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా హిందువులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు, ఈ అవమానం నుంచి మేం విముక్తి పొందగలమని హిందువులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు."

తమ నాలుగు డిమాండ్లను ఆమోదించాలని భజరంగ్ దళ్ సీఎం యోగిని కోరింది:
  • 1. ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మత మార్పిడిని నిషేధించాలి.
  • 2. లవ్ జిహాద్ లో పాల్గొన్న సంస్థలను నిషేధించాలి.
  • 3. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆమెను ఇస్లాంమతంలోకి మార్చడంలో నిమగ్నమైన మతగురువులను శిక్షించాలి.
  • 4. మతాంతర హిందూ-ముస్లిం వివాహాన్ని నిషేధించాలి.
కాన్పూర్ లో ఇటీవల 'లవ్ జిహాద్' కేసు
గత కొన్ని రోజులుగా కాన్పూర్ లో పలు లవ్ జిహాద్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 21వ తేదీన శాలిని యాదవ్ కేసు నమోదు కావడంతో ఇది మొదలైంది. ఆమె ఫైజల్ ను వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారింది.

ఇది లవ్ జిహాద్ కేసు అని అతని సోదరుడు పేర్కొన్నాడు. షాలిని యాదవ్ కేసు డొమినో ఎఫెక్ట్ తో మొదలైన కేసు, ఇతర కేసులు వెలుగులోకి రావడం మొదలైంది.

28వ తేదీన లక్కీఖాన్ ఒక మైనర్ హిందూ అమ్మాయితో స్నేహం చేసి, ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి అభ్యంతరకరమైన ఫోటోలు తీసుకున్నాడని కేసు నమోదు చేశారు. ఆగస్టు 29వ తేదీన నఫీజ్ తమ కుమార్తెను బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకున్నాడని హిందూ బాలిక కుటుంబం ఆరోపించిన విషయం వెలుగులోకి వచ్చింది.

Source: op

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top