నిత్య కర్మలు
మనం నిత్యమూ చేసే పనులనే ఒక నియమం ప్రకారం, ధర్మబద్ధంగా చేస్తే చాలు మనకు విశేషమైన పుణ్యమే వస్తుంది. ధర్మం రెండు రకాలు ద్రవ్యంతో చేసేది(యజ్ఞం, యాగం లాంటివి), దేహంతోచేసేవి(తీర్ధయాత్రలు, స్నానసంధ్యలు లాంటివి) ధర్మంవల్ల ధనం లభిస్తుంది.తపస్సువల్ల దివ్యత్వం కలుగుతుంది. దివ్యత్వంవల్ల నిష్కామకర్మాచరణం అలవడుతుంది తద్వారా చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తాయి.
ప్రాతః కాలం:
నిద్ర లేస్తూ
మెలుకువ రాగానే ముమ్మారు "శ్రీ హరి" అని బయటకి పలకాలి అ పిదప, ముగ్గురమ్మలకి నిలయాలైన మన అరచేతులను చూసుకుని కండ్లకద్దుకొంటు, కింద ఇచ్చిన శ్లోకం చెప్పాలి.
కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతీ
కరమూలే పార్వతి/గౌరీ
కరస్పర్శేన శుభంకురు
లేచి నిలబడే ముందు
నేల మీద కాలు పెట్టే ముందు భూదేవిని ధ్యానము చేయాలి.
సముద్రవసనే దేవీ, పర్వతస్థనమండలే
విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే
స్నానం
స్నానం చేయబోయే సమయంలో చెంబులోకి నీళ్లు తీసుకొని కింద ఇచ్చిన శ్లోకంచదవాలి.అలా చేస్తే ఆయా నదుల్లో స్నానంచేసిన ఫలితమూ వస్తుంది.
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరీ జలేస్మిన్ సన్నిన్ధిం కురు
స్నానంచేసిన తరువాత కింద ఇచ్చిన నామాలని అ౦టూ నాలుగు నీటి చుక్కలను శిరస్సు మీద చల్లుకొంటే మనం శరీరానికి వెలుపల,లోపల కూడా పవిత్రులమవుతాం.
"పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!"
స్నానం దిగంబరంగ చేయరాదు. ఒక వస్త్రం చుట్టుకుని చేయాలి. దిగంబరంగ స్నానం చేస్తే అది వరుణిడి(జలాధి దేవత) పట్ల అపచారం మరియు శరీరం పిశాచ గ్రస్తం అవుతుంది. ఈ పాపకర్మకి(దిగంబరంగ స్నానం చేస్తే) ప్రాయశ్చిత్తం ఏమి అనగా ప్రతి రోజు సువర్ణం(బంగారం) దానం చేయాలి అలా 12 ఏళ్లు చెయలి.
దైవారాధన కి ముందు
భస్మధారణము
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్ఠివర్ధనం |
ఉర్వారుక మివబన్దనాత్ మృత్యో ర్ముక్షీయ మామృతాత్ ||
శ్రీకరంచ పవిత్రంచ శోకరోగనివారణం |
లోకే వశీకరణం పుంసాం భస్మం త్రిలోకపావనమ్ ||
ఊర్ద్వపుండ్ర ధారణము
లలాటే సతతం దేవ్యాశ్రియా విరాజితమ్ |
చతుశ్చక్రం నమస్యామి కేవలం కనకప్రభమ్ ||
మంత్రం రానివారు నమః శివాయ అని చెప్తూ భస్మధారణ చేయాలి.
స్త్రీహత్య, గోహత్య, వీరహత్య, అశ్వహత్య, పరనింద, అకారణహింస, పంటలనుదొంగిలించడం, తోటలను పాడుచేయటం, ఇల్లు తగలబెట్టడం, పాపుల నుంచి అన్నవస్త్రాలు,ధాన్య,జల,సువర్ణ దానం పట్టటం, పరస్త్రీసంగమం,బహిష్ఠయివున్న భామలతోసంగమం, అవివాహితలతోసంగమం, విధవతోసంగమం, మాంసం-తోలు-ఉప్పు అమ్మడం,చాడీలు చెప్పడం,కపటంగా ప్రసంగించడం,దొంగసాక్ష్యం,అసత్యం, అవి పూర్వజన్మవైనా ఈజన్మలోవైనాసరే, తెలిసి చేసిన తెలియక చేసిన నిరంతరం భస్మ త్రిపుండ్రధారణ మాత్రాన తత్కాలముననే నశించిపోతాయి.
ఆఫై దేవుడి ముందు దీపారాధన చేయాలి.
దీపం జ్యోతీ పరబ్రహ్మం
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
ప్రాతః దీపం నమోస్తుతే
అని ప్రార్ధించి ఇష్ట దైవాన్ని పూజించి, పాలు గాని, పళ్ళు గాని, బెల్లం గాని (పంచదార నివేదనకి పనికిరాదు) నివేదన చెయలి.ఇలా నిత్యం దీపం వెలిగే ఇంటిలో సర్వదా దేవతలు కొలువై వుంటారు.
ఈశ్వరుడు మనకి కళ్ళతోలోకాన్ని చూసే శక్తి ఇచ్చినందుకు కృతజ్ఞతతో చేసేది దీపారాధన, చెవులతోవినే శక్తి ఇచ్చినందుకు కృతజ్ఞతతో చేసేది పుష్పార్చన, ముక్కుతో వాసనలుచూసే శక్తి ఇచ్చినందుకు కృతజ్ఞతతో ఇచ్చేది ధూపం, రుచికరమైన పదార్ధాలు ఆస్వాదించటానికి నాలుక ఇచ్చినందుకు నైవేద్యం(సాత్విక పదార్ధాలు మాత్రమే),స్పర్శ ఇచ్చినందుకు గంధలేపనం. మనం చెసే పూజ దేవుడికి కృతజ్ఞత తెలుపటమే. మనకి ఇన్నిమంగళములు చేసిన ఆ ఈశ్వరుడుకి రోజుకి కనీసం ఒకసారి అయిన ఇలా ధూప,దీప,పుష్ప,గంధ,నివేదనలతో కృతజ్ఞతలు తెలుపకపోతే మనం కృతఘ్నులం అవుతాము.
మధ్యాహ్న కాలం:
భోజనానికి ముందు
అన్నపూర్ణా దేవి ప్రార్ధన చేసి భోజనం చేయటం కనీస ధర్మం ఎందుకు అనగ అన్నపూర్ణ అనుగ్రహం లేనిదే మనకు భోజనం దొరకదు కాబట్టి. సాక్షాత్తూ పరమశివుడు లోకానికి ఈవిషయం తెలుపటానికి అన్నపూర్ణ దగ్గర భిక్షస్వీకరిస్తాడు.
అన్నపూర్ణ ధ్యానం
అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరాగ్య సిథ్ధ్యర్ధం బిక్షాం దేహీ చ పార్వతి
మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం
అన్నపూర్ణని భోజనంతో పాటు, జ్ఞాన వైరాగ్యలు కూడా ఇమ్మని అడగటం వెనుక వున్నఆంతర్యం ఏమిఅనగా భోజనంతో శరీరంని, జ్ఞానవైరాగ్యలతొ ఆత్మని(జీవుడిని) పోషించమని.
సాయం కాలం:
సాయం సంధ్యలో మళ్ళీ దీపం వెలిగించి భగవంతుని ప్రార్ధన చేయాలి
దీపం జ్యోతి పరబ్రహ్మం
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే
రాత్రి పడుకునే ముందు ఇష్టదేవత ప్రార్ధన చేసుకుని, 11 మార్లు "హర" అనిపలికి నిద్రకుపక్రమించాలి. దైవనామస్మరణతో రోజువారి కార్యక్రమాలు చేసుకునే వారికి ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూలేదు.
సంకలనం: కోటేశ్వర్