తమిళ హిందువుల ఐక్యతే ఆయన జీవిత లక్ష్యం

0
మిళనాడులో నడయాడే హైందవ వీరుడు, శూరుదు రామ్ గోపాలన్ (94) సెప్టెంబర్ 30 2020న  స్వర్గస్థులయ్యారు. ఆయన ఆర్ ఎస్ఎస్ ప్రచారక్ హిందూ మున్నని (హిందూవాహిని) వ్యవస్థాపకులు.  హిందువులను చైతన్యపరిచేందుకు అలుపెరుగని పోరాటం చేశారు. 70సంవత్సరాలుగా హిందూ సంఘటనకు నిర్విరామంగా కృషి చేశారు.
   నాగుపట్టినమ్ జిల్లాలోని సిర్మాలిలో గోపాలన్ సెప్టెంబర్ 19, 1927లో జన్మించారు. చెన్నైలో 1994లో సంఘానికి పరిచయమైనారు. 1947లో హిందూ కాందిశీకుల శిబిరంలో సేవలందించారు దేశ విభజన ఆయనను కలచివేసింది. విద్యాభ్యాసం తర్వాత విద్యుత్ బోర్డులో కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత హిందూ ఐక్యత కోసం ఉద్యోగాన్ని త్యాగంచేసి, 1947లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పూర్తి సమయం సమాజ సేవలకు అంకితమయ్యారు. స్వల్పకాలంలోనే మదురై జిల్లా ప్రచారక్ గా వెళ్లారు గోపాలన్ 1964లో తమిళనాడు ప్రాంత ప్రచారక్ గా బాధ్యతలు స్వీకరించారు. 1975-77 ఎమర్జెన్సీ కాలంలో ఆయన కలం యోధుడిగా ప్రసిద్ధికెక్కారు సంఘ-పరివార్ సంస్థలకు దిక్సూచిగా వ్యవహరించి నియంతృత్వానికి వ్యతిరేకంగా నమాజాన్ని మేల్కొల్పారు.

'దేశీయ చింతనై కళగమ్' అనే సంస్థను స్థాపించి విభజించు పాలించు శక్తులైన ద్రావిడ కళగమ్ దీఎంకే సంస్థల ఆలోచనాధోరణికి అడ్డుకట్టవేసి జాతీయ జీవన స్రవంతికి కొత్తపుంతలు వేశారు. ప్రముఖ తమిళ స్కాలర్లను సమీకరించి వంద పుస్తకాలకుపైగా ప్రచురించి హిందూ జాతి సమైక్యతకు నాంది పలికారు. 'నన్నేరి' అనే పుస్తకం రాశారు. 'త్యాగభూమి' వార్తాపత్రికను ప్రారంభించారు.

హిందూ మున్నని:
తమిళనాడులో ప్రత్యేకవాదులు, క్రైస్తవ, ముస్లింలు మతతత్వ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు 1980లో హిందూ మున్నని సంస్థను స్థాపించారు. కన్యాకుమారి జిల్లాను కన్నిమేరి జిల్లాగా మార్పు చేసేందుకు జరిగిన కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. రామనాథపురం జిల్లాలో మీనాక్షిపురంను రెహ్మత్ నగర్ గా మార్చే ఉద్దేశంతో ముస్లింలు వేసిన ఎత్తుగదలను, మత మార్పిడిలకు అడ్డుకట్టవేశారు. 
   ద్రావిడ కళగం నేతృత్వంలో హిందూ దేవతా మూర్తులను: అపహాస్యం చేసే చేష్టలను నిరోధించారు. ఇలాంటి సమాజ చైతన్య కార్యక్రమాల వల్ల అతిస్వల్ప కాలంలోనే హిందూ మున్నని హిందువులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ యువత కులాలకు అతీతంగా సంస్థ కార్యకర్తలుగా ఎదిగారు.
1993 లో ఈ రోజు చెన్నైలో ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీస్ పై జిహాదీలు జరిపిన బాంబు దాడిలోలో మరణించిన 11 మంది స్వయంసేవకులు
1993 చెన్నైలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం పై జిహాదీలు జరిపిన బాంబు దాడిలో మరణించిన 11 మంది స్వయంసేవకులు.
ఎన్నో ఆటుపోట్లు:
హిందువులను ఏకం చేసే పోరాటంలో గోపాలన్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.  మదురైలో ముస్లిం మతోన్మాదులు వారిపై కత్తులు గొడ్డళ్లతో దాడికి పాల్పడితే తలకు తీవ్ర గాయమైంది తృటిలో మృత్యువు నుండి తప్పించుకొన్నారు. 1993లో దుండగులు సంఘ కార్యాలయంపై బాంబులతో దాడి చేశారు. ఈ దాడికి కొద్ది సమయం ముందే ఆయన కార్యాలయాన్ని వీడి వెళ్లారు. బాంబుదాడిలో పలువురు అసువులు బాశారు.

మాతృ సంఘటన:
విళకు పూజ (దీపారాధన) ప్రారంభం ద్వారా లక్షలాది స్త్రీలను సమీకృతం చేసి హిందూ జాగరణ చేశారు.

పోరాట పటిమ:
     వెల్లూరులోని తిరువారూర్ దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా జలకంఠేశ్వర ఆలయంలో పూజాదికాలు లేవు శివాలయంలోని శివలింగాన్ని ముష్కరులు తస్కరించారు. ఆర్కియలాజికల్ సంస్థ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో మళ్లీ శివలింగ ప్రతిష్ట చేయించారు. ఈ ఉద్యమంలో స్వర్గీయ వీరబాహు (విజయభారత- వారపత్రిక సంపాదకులు) కూడా ప్రధాన పాత్ర పోషించారు. ధనుష్కోటిలో రామసేతు ఉద్యమం ద్వారా యూపీఏ ప్రభుత్వం పన్నిన కుయుక్తులను సమర్ధవంతంగా ఎదురించారు. ఈ విధంగా ద్రావిడ మున్నీట్ర కజగం, కాంగ్రెస్ కుట్రలకు అంతం పలికారు.

గణపతిబొప్పామోరియా:
విగ్రహారాధనను ప్రతిఘటించే శక్తులకు పుట్టినిల్లు అయినా తమిళనాడులో యాభయ్ వేల గణేష
ప్రతిమలను
ప్రతిష్ఠించేలా చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్టతో హిందువుల ఐక్యత గోపాలన్ మార్గ నిర్దేశంలో మరింత పెరిగింది.

ప్రజ్ఞాశాలి:
గోపాలన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. బాల్యంలోనే పాటలను వినసొంపుగా పాడేవారు. వంశీ (మురళి) నాదంలో ఆయన అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఎన్నో దేశభక్తి గీతాలను రాయడమే కాక అలపించేవారు. జీవితంలో ఎన్నో సవాళ్లను స్వీకరించి అధిగమించారు. బహు భాషా కోవిదులు. తమిళం, ఆంగ్లం, హిందీ, మలయాళంలో అనర్గళంగా మాట్లాడేవారు. సంఘ పరిచయం కారణంగా మరాఠీ భాషను కూడా తేలికగా ఆకళింపు చేసుకున్నారు.

దేశభక్తి, దైవభక్తి:
గోపాలన్ కి దైవభక్తి ఎక్కువ. ఆయన రోజు అనుష్టానం చేసేవారు. హనుమాన్ చాలీసా, సహస్ర గాయత్రీ చేసేవారు. విద్రోహశక్తుల ఆటకట్టించేందుకు పక్కాగా ఆధారాలు సేకరించేవారు. సమయస్ఫూర్తిగా విమర్శలకు బదులిచ్చి, ప్రత్యర్థుల నోటికి తాళం వేసేవారు. మతోన్మాదుల బలహీనతలను ఎత్తి చూపేవారు. 
   ప్రముఖ మేధావి ఎస్. గురుమూర్తి గోపాలన్ నుండి ఎంతో స్ఫూర్తి పొందానని చెబుతారు. మిషనరీ కార్యక్రమాలకు దీటుగా, సమాంతరంగా హిందూ మిషనరీ స్థాపన ఆయన చిరకాల స్వప్నం. గోపాలన్ నుండి స్ఫూర్తిపొందిన కార్యకర్తలు ఆయన కలను, హిందూ జాగృతి చైతన్యానికి ఇతోధికంగా శ్రమించినప్పుడే గోపాలన్జీకి నిజమైన శ్రద్ధాంజలి.

రచన: దండు కృష్ణవర్మ, సీనియర్ జర్నలిస్టు - జాగృతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top