నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label హిందుత్వం. Show all posts
Showing posts with label హిందుత్వం. Show all posts

Wednesday, October 14, 2020

తమిళ హిందువుల ఐక్యతే ఆయన జీవిత లక్ష్యం

మిళనాడులో నడయాడే హైందవ వీరుడు, శూరుదు రామ్ గోపాలన్ (94) సెప్టెంబర్ 30 2020న  స్వర్గస్థులయ్యారు. ఆయన ఆర్ ఎస్ఎస్ ప్రచారక్ హిందూ మున్నని (హిందూవాహిని) వ్యవస్థాపకులు.  హిందువులను చైతన్యపరిచేందుకు అలుపెరుగని పోరాటం చేశారు. 70సంవత్సరాలుగా హిందూ సంఘటనకు నిర్విరామంగా కృషి చేశారు.
   నాగుపట్టినమ్ జిల్లాలోని సిర్మాలిలో గోపాలన్ సెప్టెంబర్ 19, 1927లో జన్మించారు. చెన్నైలో 1994లో సంఘానికి పరిచయమైనారు. 1947లో హిందూ కాందిశీకుల శిబిరంలో సేవలందించారు దేశ విభజన ఆయనను కలచివేసింది. విద్యాభ్యాసం తర్వాత విద్యుత్ బోర్డులో కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత హిందూ ఐక్యత కోసం ఉద్యోగాన్ని త్యాగంచేసి, 1947లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పూర్తి సమయం సమాజ సేవలకు అంకితమయ్యారు. స్వల్పకాలంలోనే మదురై జిల్లా ప్రచారక్ గా వెళ్లారు గోపాలన్ 1964లో తమిళనాడు ప్రాంత ప్రచారక్ గా బాధ్యతలు స్వీకరించారు. 1975-77 ఎమర్జెన్సీ కాలంలో ఆయన కలం యోధుడిగా ప్రసిద్ధికెక్కారు సంఘ-పరివార్ సంస్థలకు దిక్సూచిగా వ్యవహరించి నియంతృత్వానికి వ్యతిరేకంగా నమాజాన్ని మేల్కొల్పారు.

'దేశీయ చింతనై కళగమ్' అనే సంస్థను స్థాపించి విభజించు పాలించు శక్తులైన ద్రావిడ కళగమ్ దీఎంకే సంస్థల ఆలోచనాధోరణికి అడ్డుకట్టవేసి జాతీయ జీవన స్రవంతికి కొత్తపుంతలు వేశారు. ప్రముఖ తమిళ స్కాలర్లను సమీకరించి వంద పుస్తకాలకుపైగా ప్రచురించి హిందూ జాతి సమైక్యతకు నాంది పలికారు. 'నన్నేరి' అనే పుస్తకం రాశారు. 'త్యాగభూమి' వార్తాపత్రికను ప్రారంభించారు.

హిందూ మున్నని:
తమిళనాడులో ప్రత్యేకవాదులు, క్రైస్తవ, ముస్లింలు మతతత్వ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు 1980లో హిందూ మున్నని సంస్థను స్థాపించారు. కన్యాకుమారి జిల్లాను కన్నిమేరి జిల్లాగా మార్పు చేసేందుకు జరిగిన కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. రామనాథపురం జిల్లాలో మీనాక్షిపురంను రెహ్మత్ నగర్ గా మార్చే ఉద్దేశంతో ముస్లింలు వేసిన ఎత్తుగదలను, మత మార్పిడిలకు అడ్డుకట్టవేశారు. 
   ద్రావిడ కళగం నేతృత్వంలో హిందూ దేవతా మూర్తులను: అపహాస్యం చేసే చేష్టలను నిరోధించారు. ఇలాంటి సమాజ చైతన్య కార్యక్రమాల వల్ల అతిస్వల్ప కాలంలోనే హిందూ మున్నని హిందువులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ యువత కులాలకు అతీతంగా సంస్థ కార్యకర్తలుగా ఎదిగారు.
1993 లో ఈ రోజు చెన్నైలో ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీస్ పై జిహాదీలు జరిపిన బాంబు దాడిలోలో మరణించిన 11 మంది స్వయంసేవకులు
1993 చెన్నైలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం పై జిహాదీలు జరిపిన బాంబు దాడిలో మరణించిన 11 మంది స్వయంసేవకులు.
ఎన్నో ఆటుపోట్లు:
హిందువులను ఏకం చేసే పోరాటంలో గోపాలన్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.  మదురైలో ముస్లిం మతోన్మాదులు వారిపై కత్తులు గొడ్డళ్లతో దాడికి పాల్పడితే తలకు తీవ్ర గాయమైంది తృటిలో మృత్యువు నుండి తప్పించుకొన్నారు. 1993లో దుండగులు సంఘ కార్యాలయంపై బాంబులతో దాడి చేశారు. ఈ దాడికి కొద్ది సమయం ముందే ఆయన కార్యాలయాన్ని వీడి వెళ్లారు. బాంబుదాడిలో పలువురు అసువులు బాశారు.

మాతృ సంఘటన:
విళకు పూజ (దీపారాధన) ప్రారంభం ద్వారా లక్షలాది స్త్రీలను సమీకృతం చేసి హిందూ జాగరణ చేశారు.

పోరాట పటిమ:
     వెల్లూరులోని తిరువారూర్ దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా జలకంఠేశ్వర ఆలయంలో పూజాదికాలు లేవు శివాలయంలోని శివలింగాన్ని ముష్కరులు తస్కరించారు. ఆర్కియలాజికల్ సంస్థ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో మళ్లీ శివలింగ ప్రతిష్ట చేయించారు. ఈ ఉద్యమంలో స్వర్గీయ వీరబాహు (విజయభారత- వారపత్రిక సంపాదకులు) కూడా ప్రధాన పాత్ర పోషించారు. ధనుష్కోటిలో రామసేతు ఉద్యమం ద్వారా యూపీఏ ప్రభుత్వం పన్నిన కుయుక్తులను సమర్ధవంతంగా ఎదురించారు. ఈ విధంగా ద్రావిడ మున్నీట్ర కజగం, కాంగ్రెస్ కుట్రలకు అంతం పలికారు.

గణపతిబొప్పామోరియా:
విగ్రహారాధనను ప్రతిఘటించే శక్తులకు పుట్టినిల్లు అయినా తమిళనాడులో యాభయ్ వేల గణేష
ప్రతిమలను
ప్రతిష్ఠించేలా చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్టతో హిందువుల ఐక్యత గోపాలన్ మార్గ నిర్దేశంలో మరింత పెరిగింది.

ప్రజ్ఞాశాలి:
గోపాలన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. బాల్యంలోనే పాటలను వినసొంపుగా పాడేవారు. వంశీ (మురళి) నాదంలో ఆయన అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఎన్నో దేశభక్తి గీతాలను రాయడమే కాక అలపించేవారు. జీవితంలో ఎన్నో సవాళ్లను స్వీకరించి అధిగమించారు. బహు భాషా కోవిదులు. తమిళం, ఆంగ్లం, హిందీ, మలయాళంలో అనర్గళంగా మాట్లాడేవారు. సంఘ పరిచయం కారణంగా మరాఠీ భాషను కూడా తేలికగా ఆకళింపు చేసుకున్నారు.

దేశభక్తి, దైవభక్తి:
గోపాలన్ కి దైవభక్తి ఎక్కువ. ఆయన రోజు అనుష్టానం చేసేవారు. హనుమాన్ చాలీసా, సహస్ర గాయత్రీ చేసేవారు. విద్రోహశక్తుల ఆటకట్టించేందుకు పక్కాగా ఆధారాలు సేకరించేవారు. సమయస్ఫూర్తిగా విమర్శలకు బదులిచ్చి, ప్రత్యర్థుల నోటికి తాళం వేసేవారు. మతోన్మాదుల బలహీనతలను ఎత్తి చూపేవారు. 
   ప్రముఖ మేధావి ఎస్. గురుమూర్తి గోపాలన్ నుండి ఎంతో స్ఫూర్తి పొందానని చెబుతారు. మిషనరీ కార్యక్రమాలకు దీటుగా, సమాంతరంగా హిందూ మిషనరీ స్థాపన ఆయన చిరకాల స్వప్నం. గోపాలన్ నుండి స్ఫూర్తిపొందిన కార్యకర్తలు ఆయన కలను, హిందూ జాగృతి చైతన్యానికి ఇతోధికంగా శ్రమించినప్పుడే గోపాలన్జీకి నిజమైన శ్రద్ధాంజలి.

రచన: దండు కృష్ణవర్మ, సీనియర్ జర్నలిస్టు - జాగృతి

Sunday, July 19, 2020

హిందుత్వం పైనే అన్ని మతాల దాడులు - Hindutvaṁ pai anni matāla dāḍulu

హిందుత్వం పైనే అన్ని మతాల దాడులు - మాజీ డీజీపీ అరవిందరావు..

"అర్చక పురోహితులు లేని గ్రామాలు నేడు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మత మార్పిడి మాఫియా చెలరేగి పోతుంది. సామ, దాన, బేద, దండోపాయాలతో మత మార్పిడి చేస్తున్నారు" అని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపి శ్రీ అరవింద్ రావు గారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి హిందువు భగవద్గీతను చదవాలని, ఒకసారి భగవద్గీతను చదివి అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితిలో మతం మారే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. కోటి లోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్ని అరవింద రావు గారు మర్యాదపూర్వకంగా సందర్శించారు. తమ జీవితంలో మొట్టమొదటి సారి విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో కాలు పెట్టానని, నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఓవైపు ముస్లింలు, మరోవైపు క్రైస్తవులు ప్రపంచాన్నంతా తమ తమ మతంతో నింపి వేయాలని పోటీపడి పనిచేస్తున్నారని ఉదాహరణలతో వివరించారు.

హైందవ జీవన విధానాన్ని అణువణువునా వ్యతిరేకిస్తూ కొన్ని శక్తులు భావితరాల మెదళ్ళలో విషం నింపుతున్నాయి అని చెప్పారు. హిందుత్వంలో ఎక్కడ కూడా కులాల మధ్య తారతమ్యాలు కనిపించవని, కానీ ఒక్కటిగా ఉన్న హిందువులను విభజించేందుకు కులాల ప్రస్తావన తీసుకు వచ్చి చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా అవకాశం ఉన్న ప్రతి దగ్గర హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి, వలలో వేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అహింస, నైతికత తోనే హిందుత్వం:
హింస, అనైతికం ఆధారంగా ఇతర మతాలు పనిచేస్తున్నాయని.. అహింస, నైతికత పేరుతోనే హిందుత్వం పనిచేస్తుందని అరవింద రావు గారు చెప్పారు. ఒక మతాన్ని నాశనం చేసి, తమ మతమే గొప్పది అని చెప్పుకునే వాళ్లే దాడులకు తెగబడుతున్నారు అని వివరించారు. శాంతి, అహింస, నీతి, విశ్వాసం అనేవి హిందుత్వానికి మూలాధారాలు అన్నారు. హిందువులలో ఎందరో దేవుళ్ళు ఉన్నా కూడా, అందరినీ సమన్వయపరుస్తూ వారి వారి పద్ధతులతో, ఆరాధిస్తూ పూజించడం గొప్ప విషయమన్నారు.

ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలి:
ప్రతి హిందువు భగవద్గీత, రామాయణం తో పాటు చరిత్రను ఇతర విషయాలను తప్పకుండా అవగాహన పరుచుకోవాలి, అందుకు అధ్యయనం తప్పనిసరి అని మాజీ డిజిపి సూచించారు. వ్యక్తికి శారీరక దృఢత్వం ఎంత అవసరమో, అంతకుమించి మానసిక శక్తి ..బుద్ధిబలం కూడా అవసరమేనన్నారు. సమాజంలో జరిగే అన్ని విషయాలపై శ్రద్ధగా అధ్యయనం చేయాలని, తద్వారా ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలని సూచించారు. ఎదుటివారిని కట్టడి చేసే టప్పుడు నీళ్ళు నమలకుండా జవాబు అందివ్వాలని చెప్పారు.

యథేచ్ఛగా చరిత్ర వక్రీకరణ:
నేడు పాఠ్యాంశాల్లో ఔరంగజేబు గొప్పతనం గురించి రాస్తున్నారని, టిప్పు సుల్తాన్ ను కీర్తిస్తూ పాఠ్యాంశాలు ముద్రిస్తున్నారని అరవింద రావు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా 1590 లోనే గోవాలో హిందువులపై ఊచకోత ప్రారంభమైందని, కేరళలో బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయర్లను కనుమరుగు చేశారని చెప్పారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హిందుత్వాన్ని నాశనం చేసేందుకు రక్తపాతం సృష్టించిన చరిత్ర ముస్లింలు, క్రైస్తవుల దేనని పేర్కొన్నారు. కానీ నేడు వాస్తవాన్ని వక్రీకరించి అదే టిప్పుసుల్తాన్ ను, ఔరంగజేబును కీర్తిస్తూ పాఠ్యాంశాలు రావడం వల్ల భావితరాలు వాస్తవాన్ని తెలుసుకొని లేక పోతున్నాయని పేర్కొన్నారు.

కమ్యూనిస్టుల ఎజెండా "ఎడిట్- ప్రాప్ "
ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ సాధించలేకపోతే "ఎడిట్ - ప్రప్" సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అరవింద్ రావు చెప్పారు. ఎడిట్ ప్రాపు అంటే కమ్యూనిస్టులు అవలంబించే సిద్ధాంతమని..

ఒక విషయాన్ని శ్రద్ధగా చదివి దానిపై అవగాహన పెంచుకోవడం. అదేవిధంగా వాస్తవాన్ని అవాస్తవంగా ప్రాపగాండా చేయడం కమ్యూనిస్టుల ముఖ్యలక్షణం అని చెప్పారు.(Education & Propaganda ). భవిష్యత్తులో హిందుత్వంపై విపరీతమైన దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని, అందుకు దాడులను ఎదుర్కొని నిలబడే శక్తి సామర్థ్యాలు హిందూ సమాజం సంపాదించాలని ఆయన కోరారు. అంతకుముందు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బండారు రమేష్ గారు అరవింద్రావు గారిని మర్యాదపూర్వకంగా కార్యాలయంలోకి ఆహ్వానించారు. మెడలో కాషాయపు కండువా వేసి ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సహ కార్యదర్శి శ్రీ సత్యం జి మాట్లాడుతూ అరవింద రావు గారు ఎక్కడున్నా హైందవ అభివృద్ధి కోసమే తపిస్తుంటారని గుర్తు చేశారు.

దాదాపుగా పాతికేళ్ల నుంచి హిందూ సంస్థలతో మమేకమై పని చేయడం గొప్ప విషయమన్నారు. అవకాశాన్ని బట్టి విశ్వహిందూ పరిషత్ కు సమయం ఇవ్వాలని అరవింద్ రావు గారిని కోరారు. కార్యక్రమంలో VHP రాష్ట్ర సహ కార్యదర్శులు శ్రీ జగదీశ్వర్ జి, శ్రీ రాజేశ్వర్ రెడ్డి జి, ప్రాంత ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, మహా నగర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస రాజా జి, బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ శ్రీ సుభాష్ చందర్ జి, కో కన్వీనర్ లు శ్రీ శివరాం జి, శ్రీ కుమారస్వామి జీ, శ్రీ గణేష్ జి, రంజిత్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీడియో ను వీక్షించండి..

అందరికి షేర్ చేయండి

సంకలనం: బడే రాము. 

Thursday, June 4, 2020

చరిత్రను చెప్పాలి.. (హితవచనం) - Charitra Cheppali

హిందూదేశం ఎల్లపుడూ ఏదో ఒక విదేశీ పాలనలో ఉండేది, దాని చరిత్ర నిరంతర పరాభవాల గాధ అంటూ అబద్దాలతోను, అవమానాల తోను కూడిన దుర్మార్గ ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారం కేవలం విదేశీయుల చేతనే గాక స్వజనుల చేత కూడా అడ్డూ, ఆపు లేకుండా కొనసాగింది. 
   ఈ అబద్దాల ప్రచారానికి ప్రతిక్రియ చేయటం కేవలం స్వాభిమాన దృష్టితోనే కాకుండా చరిత్ర నిజాలను నిరూపించుకోవడానికి అత్యంత అవసరం, వాంఛనీయం కూడా. భారతదేశం మీద దండెత్తి తమ రాజ్యాలను స్థాపించిన విదేశీశక్తులను పరాభ వించి హిందూదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన వీరులను, హిందూ రాష్ట్రాన్ని ఉద్దరించిన వారి పరం పరను, ఆ స్వాతంత్ర సంగ్రామాలకు నాయకత్వం వహించిన పరాక్రమ సంపన్నులైన మహాపరుషుల చారిత్రక శబ్ద చిత్రాన్ని ఆవిష్కరించ టానికి నిర్ణయించుకొన్నాను.     

- స్వాతంత్య్ర వీర సావర్కార్‌

Friday, May 29, 2020

అగ్నికణం వీర సావర్కర్‌ - Agnikanam Veer Savarkar


అగ్నికణం వీర సావర్కర్‌ - Agnikanam Veer Savarkar

– క్రాంతి దేవ్‌ మిత్ర

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు..

ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్‌ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్‌.

దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్‌ బ్రిటిష్‌ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగత పరిచారు.

1857 స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్‌ వారు భారత్‌ను స్వాధీనం చేసుకొని పాలనపై పట్టు బిగించారు. భారతీయుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జన్మించే నాటికి దేశం కఠోర బానిసత్వంలో మగ్గుతూ అష్టకష్టాలు పడుతోంది. దీనికితోడు సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలలో మునిగిపోయిన భారత సమాజాన్ని సంస్కరించేందు ఎన్నో సాంఘిక, మత ఉద్యమాలు వచ్చాయి. మరోవైపు బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు తోడు రహస్య విప్లవోద్యమాలు కూడా ప్రారంభ మయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మించిన సావర్కర్‌ స్వాతంత్య్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడిగా మారాడు. అదే సమయంలో ఆయన సాహితీవేత్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో సేవలు అందించారు.

దేశం కోసమే జీవితం
వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జీవితాన్ని రెండు భాగాలుగా ఆవిష్కరించవచ్చు. ఇందులో ముందుగా ప్రథమార్ధాన్ని చూద్దాం. 1883 మే 28న నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్‌ పంత్‌, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. సావర్కర్‌ అన్న గణేష్‌ దామోదర్‌ సావర్కర్‌, తమ్ముడు నారాయణ రావు సావర్కర్‌. ఈ ముగ్గురు సోదరులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు.

ఆనాటి బ్రిటిష్‌ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సావర్కర్‌ సోదరులు తమ కుల దేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆశయ సాధన కోసం ‘రాష్ట్ర భక్త సమూహ్‌, మిత్ర మేళా, అభినవ భారత్‌’ అనే సంస్థలను స్థాపించారు.

పుణే పెర్గ్యుసన్‌ కాలేజీలో బిఎ పూర్తి చేసుకున్న వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ ‘బార్‌-ఎట్‌-లా’ చదువు కోసం 1906లో లండన్‌ బయలుదేరారు. న్యాయవిద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్‌కు వివాహమైంది. ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్‌ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవ కారులతో కలిసి పని చేశారు. వారందరికీ సావర్కర్‌ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు.
అండమాన్‌లో కారాగార శిక్ష
అండమాన్‌లో కారాగార శిక్ష
సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలోనే అన్న గణేష్‌ సావర్కర్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం అండమాన్‌లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్‌ న్యాయ విద్య పూర్తి చేసినా, బ్రిటిష్‌ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు బార్‌ ఎట్‌ లా పట్టా నిరాకరించారు. సావర్కర్‌ కుడి భుజం మదన్‌లాల్‌ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్‌ విల్లేని హతమార్చాడు. గణేష్‌ సావర్కర్‌కు శిక్ష విధించిన జాక్సన్‌ అనే అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ రెండు ఘటనల తర్వాత వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్‌ నుంచి లండన్‌ వచ్చిన సావర్కర్‌ను రైల్వేస్టేషన్‌లో బంధించారు. స్టీమర్‌లో భారత్‌కు తీసుకొస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు.

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌కు న్యాయస్థానం అండమాన్‌ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్‌ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి అయన సావర్కర్‌. అంతేకాదు ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్‌. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్‌ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు.

జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్‌ తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత బేధాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా 1923 డిసెంబర్‌లో సావర్కర్‌ను అండమాన్‌ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్‌వారు. అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్‌ ప్రభుత్వం వీర సావర్కర్‌ను పూర్తిగా విడుదల చేసింది.
 వీర సావర్కర్‌
 వీర సావర్కర్‌ 
సంఘ సంస్కర్తగా పునర్నిర్మాణం
సుధీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్‌ జీవితం ద్వితీయార్థమంతా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది. నాటి హిందూ సమాజం అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతోంది. సమాజంలోని ఈ అసమానతలు రూపుమాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్‌. సావర్కర్‌ తన గ్రామంలోని హరిజనుడి ఇంట టీ తాగడం సనాతన ఆచార పరాయణులకు ఆగ్రహం తెప్పించింది. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్‌. హిందువులు అంతా బంధువులేనని చాటి చెప్పారు.

1929లో రత్నగిరిలోని విఠలేశ్వరాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు వీర సావర్కర్‌. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో కొనసాగింది. పాఠశాలల్లో అన్ని కులాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. 1931లో పతిత పావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యులచే ప్రారంభించారు సావర్కర్‌. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు సావర్కర్‌. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిందూ సంఘటన కోసం సామూహిక గణేష్‌ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.
 వీర సావర్కర్‌ 
హిందుత్వం, జాతీయ వాదం:
హిందుత్వ పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్‌ గుర్తుకు వస్తారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు సావర్కర్‌.

‘ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పితభూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మతాః’

‘సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే..’ హిందువులు అంటే ఎవరనే ప్రశ్నకు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది.

హిందువనే పదం సాంస్కృతిక జీవితానికి సంబంధించినది. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి ప్రాంతం, భాష, మతాలకు అతీతంగా తాను భారతీయుడినని భావించాలి. అదే మన జాతీయత అని చెప్పారు సావర్కర్‌. హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. దేశంలో మతాలు ఎన్ని ఉన్నా జాతీయత ఒక్కటే. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేర్లలా కలిసిపోవాలి అని కోరుకున్నారు సావర్కర్‌. ఏ మతం వారైనా భారతీయులే. వారు ముస్లింలైతే భారతీయ ముస్లింలు, క్రైస్తవులైతే భారతీయ క్రైస్తవులు. అంతేకాని ‘ఏ మతం ప్రత్యేక జాతి కాదు’ అని చెప్పారు సావర్కర్‌.

హిందుత్వాన్ని భారత జాతీయతతో సమానంగా నిర్వచించారు సావర్కర్‌. ప్రపంచంలో ఎన్నో దేశాలు, జాతులు, మతాలు, సాంస్కృతులు ప్రత్యేక అస్తిత్వంతో ఉన్నట్లే హిందూ జాతీయత తనదైన గుర్తింపుతో మనుగడ సాగిస్తుంది. హిందూ సంఘటన అంటే జాతి సంరక్షణ అని చెప్పారు సావర్కర్‌. హిందువుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఘర్షణ తప్పదు. ఈ స్వీయ రక్షణ కోసం హిందూ సంఘటనోద్యమాన్ని ప్రారంభించారు వీర సావర్కర్‌. స్వాతంత్య్రంతో పాటు దేశ విభజన కూడా తప్పదని చాలా ముందుచూపుతో గ్రహించారు సావర్కర్‌. ఆనాటి బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హిందువులు చాలా తక్కువ. అందుకే హిందువులు సైన్యంలో చేరాలని ప్రోత్సహించారు సావర్కర్‌. సావర్కర్‌ ఈ పిలుపు ఇవ్వడాన్ని తప్పు పట్టిన వారంతా, తర్వాత కాలంలో ఆయన దూరదష్టిని అభినందించారు.

1938 నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై అన్ని ఆంక్షలను ఎత్తేసింది. తరువాత హిందూ మహాసభకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

చరిత్రకారుడు, సాహితీవేత్తగా..
వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధులు. ఆయన గ్రంధాలు ప్రజల్లో దేశభక్తిని రగిలించేవి. ఈ కారణం వల్లే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన రచనలపై గట్టి నిఘా పెట్టింది. చాలా ఏళ్ల పాటు నిషేధం కూడా అమలులో ఉంది. భారతదేశంతో పాటు విదేశీ చరిత్రలను కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేసి మనకు సాహిత్య సష్టి చేశారు సావర్కర్‌.

సావర్కర్‌ 1908లో లండన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ను రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్‌ చరిత్రకారులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ అది స్వాతంత్య్ర సంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పారు సావర్కర్‌. దీన్ని ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంధాన్ని నిషేధించింది. దీన్ని ముద్రణ కోసం భారత్‌ లోని తన అన్న గణేష్‌ సావర్కర్‌కు పంపగా, బ్రిటిష్‌ వారు పసిగట్టారు. ఆయన్ను ఆరెస్టు చేసి అండమాన్‌కు పంపింది ఈ కేసులోనే. మహారాష్ట్రలోని అన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్తగా దాడులు జరిపారు. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రహస్యంగా భారతదేశం చేరింది. ఈ గ్రంథం ఎంతో మంది స్వాతంత్య్ర సమర వీరులకు, విప్లవ యోధులకు స్పూర్తినిచ్చింది.

సావర్కర్‌ అండమాన్‌ జైలులో బందీగా ఉన్నప్పుడు అక్కడ విధించిన కఠిన శిక్షలకు చింతిస్తూ కూర్చోలేదు. చేతులకు, కాళ్లకూ బేడీలు వేసి శరీరాన్ని బంధించారు, కానీ మనసును కాదు అనుకునేవారు. స్వతహాగా ఆయన కవి. శిక్ష సమయంలో జైలు గోడల మీదే కవితలు రాశారు. వీటిని కంఠస్థం చేసి, గుర్తు పెట్టుకొని, తర్వాత కాలంలో గ్రంథస్తం చేశారు. కొద్ది నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్‌ జైలులో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్‌, మహాసాగర్‌ తదితర గొప్ప కావ్యాలు వచ్చాయి.

1922లో జైలు గోడల మధ్యే హిందుత్వ గ్రంధ రచనకు పూనుకున్నారు సావర్కర్‌. హిందుత్వకు సమగ్ర నిర్వచనం ఇచ్చిన గ్రంథం ఇదే.

సావర్కర్‌ తన ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కూడా రచనా వ్యాసాంగాన్ని వదిలిపెట్టలేదు. 1963లో ఆయన రాసిన ‘భారత ఇతిహాసంలో ఆరు స్వర్ణపుటలు’ మన చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ఉల్లేఖిస్తూ స్వాభిమానాన్ని చాటి చెప్పింది. అండమాన్‌ జైలులో తాను గడిపిన దుర్భర జీవితంపై రాసిన ఆత్మకథ మరాఠా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. దీని ఆధారంగా ఎన్నో రంగస్థల నాటకాలు కూడా వచ్చాయి.

ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో సావర్కర్‌ ఒకరు. ఆయన మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా. అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు ఆయన రచనలు, ఉపన్యాసాల్లో కనిపిస్తాయి.
 వీర సావర్కర్‌ - అఖండ భారత్
స్వదేశీ ప్రభుత్వ నిర్దయం:
సావర్కర్‌ జీవితం అంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్‌ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయనపట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మాగాంధీ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం ‘అప్రతిహతీ స్వాతంత్య్ర వీర’ అనే బిదురుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలచి ఆహారాన్ని త్యజించారు సావర్కర్‌. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీ యుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది.

వీర సావర్కర్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలు
 • – 1883 మే 28 – మహరాష్ట్ర నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో రాత్రి 10 గంటలకు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జననం
 • – 1892 – తల్లి రాధాబాయి మరణం
 • – 1898 – దేశ స్వాతంత్య్రం కోసం జీవితాన్ని సమర్పిస్తానని కుల దేవత అష్టభుజాదేవి ముందు ప్రతిన
 • – 1899 సెప్టెంబర్‌ – తండ్రి దామోదర్‌ పంత్‌ మరణం, ‘రాష్ట్రభక్త సమూహ్‌’ రహస్య సంస్థ ప్రారంభం
 • – 1900 – ‘మిత్రమేళా’ అనే రహస్య సంస్థ ప్రారంభం
 • – 1901 మార్చి – యమునా బాయితో వివాహం’
 • – 1902 – పూణే ఫెర్గ్యూసన్‌ కాలేజీలో చేరిక
 • – 1904 మే – ‘మిత్ర మేళా’ పేరు ‘అభినవ్‌ భారత్‌’ గా మార్పు
 • – 1905 డిసెంబర్‌ – బిఎ ఉత్తీర్ణత
 • – 1906 జూన్‌ 9 – ‘బార్‌ ఎట్‌ లా’ చదువు కోసం ఇంగ్లాడ్‌ చేరిక
 • – 1908 మార్చి – ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రచన

 • – 1909 – సావర్కర్‌ కుమారుడు ప్రభాకర్‌ మరణం, అన్న గణేష్‌ సావర్కర్‌కు అండమాన్‌ జైలు శిక్ష. బ్రిటిష్‌ రాణికి విధేయత చూపనందుకు సావర్కర్‌కు బార్‌-ఎట్‌-లా డిగ్రీ నిరాకరణ
 • – 1909 – లండన్‌లో కర్జన్‌ వైలీని హతమార్చిన సావర్కర్‌ అనుచరుడు మదన్‌లాల్‌ ధింగ్రా
 • – 1910 మార్చి 13 – లండన్‌ రైల్వే స్టేషన్‌లో సావర్కర్‌ అరెస్టు
 • – 1910 జూలై 18 – స్టీమర్‌లో భారత్‌ తీసుకువస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే యత్నం
 • – 1910 డిసెంబర్‌ 24 – సావర్కర్‌కు అండమాన్‌ యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
 • – 1911 జనవరి 31 – సావర్కర్‌కు రెండో యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
 • – 1911 జూలై 4 – అండమాన్‌ కారాగార శిక్ష ప్రారంభం
 • – 1918 – సావర్కర్‌కు తీవ్ర అనారోగ్యం
 • – 1922 – ‘హిందుత్వ’ గ్రంధ రచన
 • – 1923 డిసెంబర్‌ – ఎరవాడ జైలుకు సావర్కర్‌ బదిలీ
 • – 1924 – రాజకీయాల్లో పాల్గొనరాదు, రత్నగిరి వదిలి పోరాదు అనే షరతులతో సావర్కర్‌ విడుదల
 • – 1924 – ‘గోమంతక్‌’ గ్రంథ రచన
 • – 1925 – కుమార్తె ప్రభ జననం, అస్పశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమం
 • – 1927 – రత్నగిరిలో మహాత్మా గాంధీజీతో సమావేశం, అండమాన్‌ అనుభవాలపై పుస్తక రచన
 • – 1931 ఫిబ్రవరి – రత్నగిరిలో పతిత పావన మందిర ప్రారంభం
 • – 1937 – సావర్కర్‌పై ఆంక్షల ఎత్తివేత, పూర్తిస్థాయి విడుదల.. హిందూ మహాసభ అధ్యక్షునిగా ఎన్నిక
 • – 1938 అక్టోబర్‌ – హైదరాబాద్‌ విముక్తి సత్యాగ్రహం
 • – 1943 – సావర్కర్‌ షష్టిపూర్తి
 • – 1945 మార్చి – సావర్కర్‌ అన్న గణేష్‌ సావర్కర్‌ మరణం
 • – 1946 ఏప్రిల్‌ – సావర్కర్‌ సాహిత్యంపై నిషేధం ఎత్తివేత
 • – 1948 ఫిబ్రవరి 5 – గాంధీ హత్య కేసులో అరెస్టు
 • – 1949 మే 10 – నిర్దోషిగా విడుదల
 • – 1949 అక్టోబర్‌ – తమ్ముడు నారాయణరావు మరణం
 • – 1958 – సావర్కర్‌కు 75 ఏళ్ల సందర్భంగా అమతోత్సవం
 • – 1959 – పూణె విశ్వ విద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్‌
 • – 1963 – ‘భారతీయ ఇతిహాస్‌ కే ఛే స్వర్ణిమ పష్ట్‌’ పుస్తక ప్రచురణ
 • – 1963 మే – సావర్కర్‌ భార్య యమునాబాయి మరణం
 • – 1966 ఫిబ్రవరి 26 – వీర సావర్కర్‌ శాశ్వత నిష్క్రమణ
(మే 28 సావర్కర్‌ జయంతి)

మూలము: జాగృతి

Saturday, April 4, 2020

భారత మాత సేవలో భారతీయ సన్యాసిని, సోదరి ‘నివేదిత’ - Sodari "Sister" Nivedithaభారత మాత సేవలో భారతీయ సన్యాసిని, సోదరి ‘నివేదిత’ - Sodari "Sister" Nivedita
నదేశం బ్రిటిష్‌వారి పాలనలో ఉన్న కాలమది. అనేక సమస్యలు, అవిద్య, పేదరికం ఇతర సామాజిక రుగ్మతలలో సతమతమవుతున్న మనదేశానికి పశ్చిమ దేశాల నుండి సేవాభావంతో సహాయం చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారిలో మార్గరెట్‌ నోబుల్‌ ఒకరు. కేవలం సేవా భావమే కాకుండా భారత దేశపు సాంస్కృతిక జ్యోతి తనను ఆకర్షించిన కారణంగా భారతదేశమే తమ గమ్యంగా భావించి ఆజీవన పర్యంతం ఇక్కడి ప్రజలలో మమేకమై సోదరి నివేదితగా మనకు ప్రాతఃస్మరణీయురాలైనది.

స్వామీ వివేకానంద స్ఫూర్తి
1895 సంవత్సరంలో మార్గరెట్‌ జీవితం అసాధారణమైన మలుపుతిరిగింది. ఆమె స్నేహితు రాలు ఆమెకు ఒక భారతీయ సన్యాసిని పరిచయం చేయటానికి తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ సన్యాసి ఎవరో కాదు స్వామి వివేకానంద. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొని తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో పాశ్చాత్య జనుల హృదయాలను జయించిన ఆ యుగ పురుషుని వ్యక్తిత్వం, తేజస్సు, ఆయన వాక్కు ఆమెను ఆకట్టు కున్నాయి. ఆయన ఉపదేశాలు, ప్రవచనాలు ఆమె ఆత్మను మేలుకొలిపాయి. భారతదేశానికి సేవ చేసే విధంగా ప్రేరేపించాయి.

మహిళా విద్యకు ప్రాధాన్యత
భారతదేశ స్థితిని గురించి స్వామిజీ ఆమెతో ఇలా అన్నారు ‘మా మహిళలు విద్యావంతులయ్యే వరకూ మా దేశం ప్రగతి సాధించదు. మా దేశపు మహిళల విద్య, అభివృద్ధి కొరకు, వారిని ఆ పనిలో నిమగ్నం చేయటానికి నువ్వు నాకు సహాయం చేస్తావా’. తనపట్ల స్వామిజీకి ఉన్న విశ్వాసానికి ప్రభావితురాలై స్వామీజీ దేశమే తన దేశంగా భావించి భారతదేశానికి రావటానికి నిర్ణయించుకొని 1898 జనవరి 28న కలకత్తా చేరుకుంది. ఆమెను స్వాగతించేందుకు స్వయంగా స్వామీజీ అక్కడికి వెళ్ళారు. త్వరలోనే ఆమె అక్కడ ప్రజలలో కలిసి పోయింది. బెంగాలీ భాష నేర్చుకుని ఆ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసింది. స్వామీజీ శిష్యులు అమెరికా నుండి ఇద్దరు వచ్చారు. ముగ్గురూ కలసి ఒక తమ నివాసాన్నే ఆశ్రమంగా మార్చేశారు. వారికి స్వామిజీ స్పష్టంగా ఒక సందేశం ఇచ్చారు. ”ఈ దేశాన్ని ప్రేమించండి. పూజించండి. ఇదే ప్రార్థన. ఇదే పూజ.” 1898 మార్చి 25న స్వామిజీ మార్గరెట్‌తో శివపూజ చేయించి ”నివేదిత” నామ కరణం చేశారు. నివేదిత అంటే నివేదించబడినది (సమర్పితమైనది) అని అర్ధం. ఆమెను భగవంతునికి తద్వారా భారతదేశానికి సమర్పించారు.

మహిళలకు, బాలికలకు విద్యనేర్పటానికి నివేదిత ఒక పాఠశాలను ప్రారంభించింది. ఇంటింటికీ వెళ్ళి బాలికలను బడికి పంపవల సిందిగా ప్రజలను కోరింది. వారినుండి ఎంత ప్రతికూలత వచ్చినా, వారికి నచ్చజెప్పి కొందరి బాలికలకు వ్రాయటం, చదవ టమే కాకుండా చిత్రకళ, శిల్పకళ కూడా నేర్పింది. అలా తన నిస్వార్ధ సేవా, సహయాలతో కలకత్తా ప్రజల హృదయాలలో స్థానం పొందింది.

బాధితుల సేవలో
1899 మార్చిలో కలకత్తాలో ”ప్లేగ్‌” వ్యాధి వ్యాపించింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పో యారు. ఆ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే సంకల్పం తీసుకుని మురికి వాడలను శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఆమె సేవాకార్యక్రమాల ప్రభావంతో మిగతా మహిళలు కూడా ముందుకు వచ్చారు. శుభ్రపరచడమేకాక రోగగ్రస్తులకు సేవచేయటం కూడా ఆమె ఆచరణ ద్వారా నేర్పింది.

పాఠశాలకు నిధులు సమకూర్చేందుకు ఆమె యూరప్‌కు ప్రయాణమైంది. నిధులకోసమేకాక క్రైస్తవ మిషనరీలు పాశ్చాత్య దేశాలలో మనదేశం గురించి ప్రచారం చేసే అసత్యాలను ఖండించి ఇక్కడి మ¬న్నత సంస్కృతిని గూర్చి వారికి సరియైన అవగాహన కల్పించేందుకు కూడా ఆమె తన యాత్రను ఉపయోగించుకున్నారు.

జనజాగృతి…
1902లో స్వామిజీ మహాసమాధి చెందారు. అంతకుముందు మన దేశ స్వాతంత్రంకోసం సంఘర్షణ చేయాలనే మరో కార్యాన్ని కూడా ‘నివేదిత’కు అప్పగించారు. అలా ఆమె భారత స్వాతంత్య్ర సాధనే తన జీవన కార్యంగా స్వీకరిం చింది. దేశమంతా పర్యటించి ప్రజలను స్వతంత్ర పోరాటానికి సమాయత్తం చేసే విధంగా ప్రేరణ దాయకమైన ప్రసంగాలు చేసింది.
అలా ఆమె మానసిక బానిసత్వం నుండి బయటపడే విధంగా ప్రజలకు ప్రేరణ కల్గించింది.

రచన: రమేష్‌ చంద్ర
మూలము: సమాచార భారతి

Friday, March 27, 2020

కరోనా మూలంగా మళ్ళీ ప్రపంచం భారతీయ ఆచార విశిష్టత గురించి తెలుసుకొంటోంది, నటి ప్రణీత - Hindu Aacharalalo dagi unna aarogyam

కరోనా మూలంగా మళ్ళీ ప్రపంచం భారతీయ ఆచార విశిష్టత గురించి తెలుసుకొంటోంది, నటి ప్రణీత - Hindu Aacharalalo dagi unna aarogyam
వ్వుకున్న వారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని నటి ప్రణీత పేర్కొంది. కోలీవుడ్‌లో ఉదయన్, శకుని చిత్రాల్లో నటించిన కన్నడ భామ ప్రణీత. మాతృభాషతో పాటు, తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మంచి స్థానం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో ప్రణీత కనిపించి చాలా కాలమైంది.

నటి ప్రణీత  చేసిన  ట్వీట్ ఇదే:
ఇకపోతే కరోనా వైరస్‌ గురించి అందరూ గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. దాని నుంచి ఎలా కాపాడుకోవాలని ప్రభుత్వం, ప్రజలు పాట్లు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి ప్రణీత ఆలోచన మాత్రం వేరేగా ఉంది.

అదేంటో మీరే చూడండి: 
 • ⧫ హిందువులు రెండు చేతులతో నమస్కరించడాన్ని ఇతరులు నవ్వుకున్నారు.
 • ⧫ బయట నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్లేముందు చేతులు, కాళ్లు కడుక్కోవడం చూసి నవ్వుకున్నారు.
 • ⧫ జంతువులను పూజించడం చేసి నవ్వుకున్నారు. 
 • ⧫ మొక్కలకు, వనాలకు ప్రణమిల్లడాన్ని నవ్వుకున్నారు. 
 • ⧫ హిందువులు శాఖాహారాన్ని భుజించడం చూసి నవ్వుకున్నారు. 
 • ⧫ యోగా చేయడం చూసి నవ్వుకున్నారు. 
 • ⧫ మరణించిన వారి భౌతికకాయాలను దహనం చేయడాన్ని చూసి నవ్వుకున్నారు.
 • ⧫ అంత్యక్రియల్లో పాల్గొన వారు తరువాత తలారా స్నానం చేయడాన్ని నవ్వుకున్నారు. 
అలాంటిది ఇప్పుడు ఎవరూ నవ్వడం లేదు. అందుకు బదులుగా ఆలోచిస్తున్నారు. ఈ అలవాట్లే కరోనాను వ్యాప్తి చెందకుండా చేస్తోంది. ఇది మతం కాదు. జీవన బాట. అని నటి ప్రణీత తన ట్విట్టర్‌లో పేర్కొంది.
నటి ప్రణీత చేసిన ట్వీట్ ఇదే
నటి ప్రణీత  చేసిన  ట్వీట్ ఇదే
ఇంతకీ ఈ అమ్మడు ఎవరిపై దండయాత్ర చేసిందో అర్థమైందా?
హిందూయేతరుల గురించా, లేక పాశ్చాత్య దేశాల గురించా ఎవరికెలా అర్థమ అయితే అలా తీసుకోండి. సత్యమేవ జయతే

రచన: హిందూ వాది

Monday, March 23, 2020

మనది జాతీయతే, జాతీయవాదం కాదు ! - Manadi Jaathiya, Jaatiyavaadam Kaadu - RSS

మనది జాతీయతే, జాతీయవాదం కాదు ! - Manadi Jaathiya, Jaatiyavaadam Kaadu - RSS
భారతదేశంలో ఒక రాష్ట్రీయ (జాతీయ) జీవనాన్ని రుషులు తపస్సును ధారబోసి, విశ్వ కోసం వికసింపజేశారు.. (ఓం భద్రమిశ్చంతి ఋషయః I సర్విధః తపో దీక్షామ్ ముపనిషే దురాగ్రేమ్ | తధో రాష్ట్రమ్ బలమోజశ్చ జాతమ్ | తదస్మై దేవా ఉపసన్నమన్తు ||)

రాష్ట్రీయ అనే సంస్కృత శబ్దానికి తెలుగులో జాతీయ అనే పదం సమానార్థం కాదు అంతకంటే మించిన పదం లేదు కాబట్టి అదే వాడుతున్నాం. కానీ రుషులు మానవ కల్యాణం కోసం మాత్రమే కాకుండా చరాచర సృష్టిలోని ప్రాణికోటి సంక్షేమాన్ని కోరారు. అందుకనే ఇక్కడి జీవనం వికసించింది. ఇదే ఈ దేశపు రాష్టీయ జీవనం, హిందూ జీవనం. జాతీయత కూడా. అయితే గడచిన 2000 సంవత్సరాలలో ప్రపంచంలో జాతీయత పేరుతో అనేక దేశాలు శక్తిని పుంజుకొన్నాయి.
ప్రపంచాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేసిన కమ్మూనిస్టులు
ప్రపంచాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేసిన కమ్మూనిస్టులు 
      ప్రపంచాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశాయి. ఊదాహరణకు హిట్లర్ నాజీయిజం, రష్యా, చైనాల కమ్యానిజం, యూరోప్ దేశాల క్యాపిటలిజం, ఇవన్ని కూడా తమ శక్తిని ఆధారం చేసుకొని, మరొక దేశాన్ని ఆక్రమించుకొన్నాయి. అక్కడ తమ రాజ్యాధికారాన్ని చెలాయించాయి. భారతదేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించారు. కాబట్టి జాతీయవాదం అనేది ఆ దేశం గొప్పతనం మాత్రమే కాకుండా ఆయా దేశాల శక్తి ద్వారా మిగతా దేశాన్ని కబళించడమో ఆక్రమించడమో, ఆధిపత్యం చెలాయించడం ద్వారానే గుర్తింపునకు వచ్చింది. ఇది చారిత్రక సత్యం కాబట్టి ప్రపంచంలో, అనేకమంది మేధావులలో కూడా జాతీయవాదం ప్రమాదకరమన్న ఆలోచన రూపుదిద్దుకుంది. అపోహ ఉంది అవగాహనా రాహిత్యం కూడా ఉంది, భారతదేశ పరిస్థితి అలాంటిది కాదు. ఈ భూమిలో ప్రారంభం నుంచి 'ఓం భద్రం' - విశ్వకల్యాణమనే ఆదర్శాన్ని స్వీకరించింది. ఇక్కడి జీవన విధానంతోనే ప్రజలు సుఖంగా, వైభవంగా జీవించాలన్నది ప్రధానం కావడం దీని ఫలితమే తమ కృషి. ప్రయత్నం, గుణగణాలు, వనరుల ద్వారా ప్రపంచ మానవాళికి, మిగతా చరాచర స్పష్టికి మేలు కలుగజేయాలి. కాబట్టి రాష్ట్రీయత అనే శబ్దం, రాష్ట్రీయ జీవనం, రాష్ట్రీయ పరంపర, రాష్ట్రీయ సంస్కృతి, రాష్ట్రీయ చరిత్ర అనేది ఈ దేశంలో వికసించింది.
హిందూ రాష్ట్రీయత
హిందూ రాష్ట్రీయత 
     అదే హిందూ రాష్ట్రీయత లేక భారత జాతీయత. లేక ఈ దేశ జాతీయత. ప్రాచీన మూలాలు అన్వేషించినప్పటికి వాటి గుర్తులు నేటికి కనిపిస్తున్నాయి. అమెరికాలో ఫినిక్స్ మహానగరం ఉంది. ఫినిక్స్ దగ్గరలో గ్రాండ్ కెనెన్స్ అనే మూడు పర్వతాలున్నాయి. అవి భూమి లోపల 500 కిలోమీటర్ల పొడవు, 50 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్నాయి. వాటిని దర్శనం చేసుకున్నాం. అక్కడి గైడ్ 'ఈ మూడు పర్వతాలను బ్రహ్మ, విష్ణు మహేశ్వరులుగా పిలుచుకుంటారు' అని చెప్పగానే ఆశ్చర్యపోయాం.

అప్పుడు గైడ్ 'మీరెందుకు త్చర్యపోతున్నారు సార్! కొద్ది నిమిషాల తర్వాత మధ్యాహ్నం వేళ అమెరికా ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రదర్శిస్తోంది. అది 20 నిమిషాలు ఉంటుంది. అది చూడండి' అన్నాడు. ఆ ఫిల్మ్లో అమెరికన్ ప్రభుత్వం చూపించింది. 'Long back some people were came to here. They taught culture and civilization. They called the three mountains as Brahma, Vishnu and Maheswara' ) Jogas. నించింది. ఇప్పుడు ఎవరైనా వెళ్లి చూడవచ్చు వినవచ్చు. దీనికి కారణం - నేటి భారత ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ కాదు.

మన పూర్వులు, రుషులు, మేధావులు, విద్యావేత్తలు అక్కడికి వెళ్లారు. అమెరికాలోని మూల నివాస ప్రజలకి స్నేహం, సేవలు అందించారు. కనుకనే పర్వతాలరూపంలో నేటికి బ్రహ్మ, విష్ణు మహేశ్వరులుగా గౌరవించుకుంటున్నారు.

      అంటే వేలాది సంవత్సరాలుగా భారతీయులు ఈ దేశం నుంచి అనేక దేశాలకు వెళుతున్నారు ముఖ్యంగా దక్షిణ, పూర్వ ఈశాన్య దేశాలకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మంగోలియా లాంటి దేశాల్లో భారతీయుల అడుగుజాడలు కనిపిస్తున్నాయి. అయితే ఆయా దేశాల్లో ఎక్కడా విధ్వంసం సృష్టించినట్లు, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసినట్లు కనిపించదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికీ గణపతి విగ్రహాలు, భారతీయ సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

     అందుకే రాష్ట్రీయత అనే భావన భారతదేశంలో రాజకీయపరమైంది కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇక్కడ రాజ్యాలుండేవి. రాజులు ఉండేవారు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం ఉంది. 'ఇజం' ఒక రాజకీయమైన దృష్టి, మేము మాత్రమే గొప్పవారమనే అధిపత్యం చెలాయించే గుణం నిష్క్రియాత్మక ధోరణి (Passive tendency) ఇతరులను కబళించాలనే ఆలోచన, ఇతరుల రాజ్యాలను ఆక్రమించాలనే కోరిక అందులో కనిపిస్తాయి. వ్యవహార సరళి కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది. నేడు అనేక దేశాలు సైన్యంతో మనది జాతీయతే ఆక్రమిస్తాయి. అలా కాకపోయినా భిన్న పద్దతులు ఆర్థికసంస్థల ద్వారా ఆయా దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించడం గమనించవచ్చు. అయితే ప్రపంచ ధోరణి ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం చెప్పే విషయం అర్థం కావడం కష్టమే అనిపించవచ్చు.

     కాబట్టి ఇక్కడి జాతీయత (రాష్ట్రీయత) రాజకీయపరమైనది కాదు. సాంస్కృతిక పరమైనది. ప్రజావళిని కలిపి ఉంచేది. సంస్కృతిని ఒకటిగా నిలిపేది. ఏకాత్మతను నిర్మాణం చేసేది. రాజకీయ శక్తులలో ఆధిపత్యం, దురాక్రమణలున్నాయి. కానీ, రాష్ట్రీయతలో ప్రేమ, కరుణ, త్యాగం, సేవ సమన్వయాలు ఉన్నాయి. అలాగే హిందూ రాష్ట్రం, భారతరాష్ట్రం, హిందూ రాష్ట్రీయ భావన, హిందూ రాష్ట్రీయత, అనేవి సరైనవి. రాష్ట్రీయవాదం జాతీయవాదం అనేవి సకారాత్మకమైన భావనను కలిగించే పదాలు కాలేవు. వాదానికి ఇక్కడ అవకాశమే లేదు. ఇదొక జీవన విధానం. ఇదొక జీవనదృష్టి కాబట్టి భారతదేశంలో వేదకాలం నుండి వికసించిన జీవన విధానం ప్రపంచానికి కొన్ని జీవన విలువలను ఇచ్చింది. ఈ సృష్టి ఒకే పరమేశ్వర తత్వం నుంచి జనించింది. పరమేశ్వరుని అంగీకరించిన వ్యక్తులు ఒకే తత్వం, ఒకే పదార్థం అని నమ్ముతారు. రసాయనశాస్త్రంలో పదార్థం మార్పు చెందుతుంది తప్పితే విధ్వంసం కాదు అందుకని ఒకే పదార్థం నుండి ఆవిష్కరించినది.

కాబట్టి సృష్టి అంతటా ఒకే పదార్థం, ఒకే దైవత్వముంది అన్నప్పుడు సృష్టిమొత్తంలో ఏకాత్మత ఉంటుంది. ఏకాత్మతను దర్శించటమే హిందూత్వం, హిందూ రాష్ట్రీయత, హిందూ జీవన విధానం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వైవిధ్యం ఉంది. భాషల్లో వైవిధ్యం ఉంది. కొన్ని పదార్థాల్లో వైవిధ్యం ఉంది. కాబట్టి అదే కళ్లద్దాలతో చూస్తున్న కారణంగా వేరే వాళ్లకు అర్థం కాదు. వైవిధ్యమనేది సృష్టి సౌందర్యం. Diversity the beauty of nature. అందుకని వైవిధ్యంలో ఏకాత్మతను దర్శించడమే భారతీయ సంస్కృతి, రాష్ట్రీయ జీవనం.

        హిందూ రాష్ట్రీయ జీవనం అన్నప్పుడు వైవిధ్యంలో అనేక భాషలున్నాయి. విశ్వంలోని ప్రతి భాషను గౌరవించాలి. ప్రతి భాష వికసించేందుకు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల జీవన పద్ధతులున్నాయి. భోజన పద్దతులున్నాయి. ఆయా మతాలను బట్టి వేషధారణ ఉంది. వాటన్నిటిని గౌరవిస్తూ, వాటి పోషణకు అవకాశం ఇవ్వాలి.  ఇతరుల జీవన విధానానికి, మరొక జీవన పద్ధతికి, సమాజ శ్రేయస్సుకు, సృష్టి శ్రేయస్సుకు గాని విఘాతం కలిగించనంత వరకు ప్రతీది గౌరవింప తగినదే.

       అలాగే ప్రపంచంలో భగవంతుడిని ఎన్నో పేర్లతో పీలుస్తున్నారు. భగవంతుడు ఒక్కడే. పేర్లు వేర్వేరు. ఆ భగవంతుని చేరడం కోసం పద్దతులు, మార్గాలు అనేకం. ప్రతి మార్గాన్ని గౌరవించవలసిందే. అయితే దైవం పేరుతో మతోన్మాదం, దురహంకారం, తమ మతాన్ని ఇతరులపై రుద్దటం, మతం పేరుతో సామ్రాజ్యాన్ని నిర్మించాలని అనుకోవడం, మత మార్పిడి వంటివి భారతీయ రాష్ట్రీయ జీవనంలో పొసగదు. ఇది మానవాళికి మంచిది కాదు కూడా.

   ప్రపంచ వ్యాప్తంగా హిందూ రాష్ట్రీయ జీవనంలోనే ఉపాసన పద్ధతికి స్వాతంత్య్రం ఉంది. ఏ దేవుని పట్ల విశ్వాసం లేనివారికి కూడా స్వాతంత్య్రం ఉంది,  అటువంటి వారికీ గౌరవం లభిస్తోంది. ఒక్క హిందూ రాష్ట్రీయ జీవనంలో అందరూ కలిసి జీవించే అవకాశం ఉంటుంది. ఇజం అన్నప్పుడు మళ్లీ ' వెంటనే వేరేవాళ్లమీద తమ భావాలను రుద్దే దృష్టి ఏర్పడుతుంది.

      హిందూ రాష్ట్రీయ భావన (రాష్ట్రీయత)లో ప్రకృతి అనేది మనిషి భోగం కోసం కాదు. మనిషి కూడా ప్రకృతిలో ఒక అంగం మాత్రమే. ప్రకృతి అంటే మనిషి కోసమే అనే ఆలోచన తప్పు. నేడు మనిషి తన అవసరాల కోసం ప్రకృతిని కొల్లగొడుతున్నాడు ఫలితంగా పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్నది వాతావరణం కలుషితమవుతోంది. ప్రపంచంలో వనరులన్నీ ఖాళీ అయిపోతాయని అందరు భయపడుతున్నారు. ఆ దృష్ట్యా హిందూ రాష్ట్రియ జీవనంలో ఉపనిషత్తులో బోధించినట్లుగా. గాంధీజీ చెప్పినట్లుగా, ప్రకృతి మనిషి అవసరాలను తీర్చుతుంది గాని, దురాశను తీర్చలేదు. అందుకనే మనిషి కోరికలను సంయమనం చేసుకోవటమే రాష్ట్రీయత. అదే సంస్కృతి.

    మనిషి సుఖంగా గౌరవంగా జీవించాలి. మనిషి తన సుఖం కోసం భోగవిలాసాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయడం సంస్కృతికి భిన్నమైనది. పర్యావరణ సంతులనం జరిగి అన్ని ప్రాణులను సంరక్షించేందుకు దోహద పడేదీ, ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే సంబంధం తెలిపేదే హిందూ రాష్ట్ర జీవనం. నేడు ప్రపంచంలో అందరు కోరుకునేది 'పర్యావరణ పరిరక్షణ'. ఇది కూడా హిందూ రాష్ట్రీయ జీవనంతోనే సాధ్యమవుతుంది. అందుకే మానవుడికి- ప్రకృతికి మధ్య ఉండే సంబంధం, మానవ- మానవ సమాజానికి ఉండే సంబంధం.. దేశానికి - దేశానికి ఉండే సంబంధం. వీటన్నిటిని సమన్వయం చేసేదే హిందూ రాష్ట్రీయ జీవనం.

అయితే ఇటీవలకాలంలో వచ్చిన ఇజం కారణంగా హిందూ రాష్ట్ర జీవవ విధానాన్ని కూడా జాతీయవాదం అని కొందరు వాడుతున్నారు. ఈ కారణంగా ఒక రాజకీయమైన దృష్టి ఏర్పడింది అందువల్ల అనేక అనుమానాలకు, భ్రమలకు దారితీస్తున్నది. అవన్నీ పటాపంచలై ప్రజలందరూ కలిసి ఉండే వాతావరణం నేడు కావాలి.

మనదేశంలో వైవిధ్యం ఉంది. అనేక ప్రాంతాలు, భాషలు, గిరిజన తెగలు, ప్రకృతి ఆరాధకులు, ఏ దేవుడినీ పూజించని వాళ్లు ఉన్నారు ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. పార్సీలు, బౌద్ధులు సిక్కులు జీవిస్తున్నారు. వీళ్లందరూ హిందూ సంస్కృతి రాష్ట్రీయత ఆధారంగా కలిసి జీవించగలరు. తమ మతాలను అవలంబిస్తునే అందరూ ఒకే పరమేశ్వర అంశ అనే భావన ఉన్నప్పుడు రాష్ట్రీయ జీవనంలో కలిసి జీవించగలరు. గిరిజన, గ్రామీణ, నగర అనే తేడాలు లేకుండా, ఏ రకమైన తెగలు, భాషా భేదాలు లేకుండా, పూజా పద్ధతులు వేర్వేరు అయినప్పటికి అందరు కలిసి ఈ భూమిలో జీవించగలరు, అందుకు ఆధారం సంస్కృతియే.

    ఇక్కడ రాష్ట్రీయ జీవనానికి, రాష్ట్రీయతకు ఆధారం సంస్కృతి తప్ప రాజకీయం కాదు. దేశాన్ని, పాలించేందుకు ప్రభుత్వం అవసరం. రాజ్యాంగం కావల్సిందే. చట్టాలు రూపొందించవలసిందే. వాటిని అందరూ గౌరవించాలి. ఆచరించాలి. అనుసరించాలి కానీ రాజ్యాంగంతో పాటుగా ఈ సంస్కృతిని కూడా అనుసరించాలి. అందుకే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే సమయంలో డా|| అంబేడ్కర్ కూడా ఈ దేశ ప్రజల అందరూ కలిసే జీవించాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాణం చేశారు. కనుకనే మత వివక్ష, మత దురాహంకారం, మతం పేరుతో సంతుష్టీకరణ ఈ దేశంలో లేవు. నేడు సామాజిక, రాజకీయ జీవితంలో సంతుష్టీకరణ కారణంగానే భేదాభిప్రాయాలు, హింస దౌర్జన్యాలు చెలరేగుతున్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం, హింస కనబడుతున్నాయి వైషమ్యాలు చోటు చేసుకుంటున్నాయి. అసంతృప్తి నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఇజమే.

రెండు ప్రపంచ యుద్దాలు జరిగాయి. మూడవ వ్రవంచ యుద్దం వస్తుందనిపిస్తుంది. వాస్తవానికి మూడవ ప్రపంచ యుద్ధం కొనసాగు తున్నట్లే ఉంది. కనుకనే అందరూ విచారంగా, అసంతృప్తిగా ఉన్నారు. ఏదో ఒక పేరుతో అశాంతి రగులుతోంది. హింసా, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఒకరు మరొకరిని కబళించాలనే దృష్టితో ఉన్నారు. వీటి ప్రతిబింబమే నేటి పరిస్థితి ఇందుకు ఉగ్రవాదం అవసరం లేదు. ఉగ్రవాదాన్ని హింసను ప్రేరేపించి ఏదో ఒక జాతి పేరుతో ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి, అబద్దాలు ప్రచారం చేసి, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి హింసను రెచ్చగొడుతున్నారు. దానికి ఇజమే కారణం.

   ప్రాచీన, మధ్య యుగాలలో గానీ, నేడు గానీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఉండడానికి ఉపకరించే రాష్ట్రీయ భావన సాంస్కృతిక పరమైనది. దానికి మనం, అంటే భారతీయులం ప్రతినిధులం. అలాగే ఈ సమాజం వ్యవహరించాలి హిందూ రాష్ట్రీయతలో, భారత జాతీయతలో జాతీయవాదం అనేది సరైంది కాదు. ఇందులో ఏ రకమైన ఇజం లేదు. ఇది ఏ రకమైన రాజకీయ దురాహంకారం కాదు. అది సాంస్కృతిక, ఏకాత్మత పరమైంది, విశ్వకల్యాణం కోరుకునేది.

  ప్రపంచంలో నేడు భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి వారు గౌరవిన్తున్నారు. ఎందుకంటే భారతీయులు స్థానిక జాతీయ జీవనంలో, అక్కడి ప్రజల జీవనంతో మమేకమైతున్నారు. సమాజ వికాసం కోసం కృషిచేస్తున్నారు. వారితో కలసి వనిచేస్తున్నారు. ఎక్కడా కబళించేందుకు యత్నించడం లేదు. ఇది నేడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అందుకే వసుధైక కుటుంబకం విశ్వకల్యాణం లాంటివి మనం కోరుకుంటున్నాం.  కృణ్యంతో విశ్వమార్యం అనే శబ్దంలో కూడా ఆర్య అనేది జాతి వాచకం కాదు. సంస్కార వాచకం మాత్రమే. అట్లాగే సర్వేభవంతు సుఖినః అంటున్నామే కాని, భారతీయ భవంతు సుఖినః, పాకిస్తాన్ భవంతు సుఖినః అని చెప్పడం లేదు. ఈ దృష్టికోణంలో విశ్వకల్యాణం, సమిష్టి కల్యాణం, చరాచర సృష్టి కల్యాణం కనిపిస్తోంది.

  కలసి మెలసి జీవించే అవకాశం ఇచ్చింది మన సంస్కృతి. ఇక్కడ రాష్ట్రం అంటే భూమి. ఆ భూఖండం మీద నివసించే సమాజం. ఆ సమాజ జీవనంతో- వికసించే సంస్కృతి, పరంపర. ఆ సమాజంలో జీవించిన మహాపురుషులు, వారి జీవన విలువలు ఆ సమాజ జీవనలక్ష్యం. ఈ మొత్తం కలిస్తేనే రాష్ట్రం రాష్ట్రీయ జీవనం, రాష్ట్రీయత ఏర్పడతాయి. అందుకనే దీనదయాళ్ జీ భారత- హిందూ - రాష్ట్ర జీవన పరంపర, రాష్ట్రీయ సంస్కృతి, రాష్ట్రీయ చరిత్ర రాష్ట్రీయ మహాపురుషులు, రాష్ట్రీయ జీవన లక్ష్యం వంటి అంశాల గురించి ఒక పుస్తకమే రాశారు అందులో వ్యక్తి నుండి, కుటుంబం, సమాజం, దేశం దేశంలో ఉండే సంస్కృతి తద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలనే విషయం విపులంగా వివరించారు వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. రాష్ట్రీయత అంటే ఏమిటో తెలుస్తుంది

వ్యాసకర్త : ఆర్ఎస్ఎస్ సహ సర్కార్యవాహ - పి. భాగయ్య
మూలము: జాగృతి వార పత్రిక
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

Tuesday, December 10, 2019

ఇతర మతస్తులు హైందవులుగా మారితే వారికి వైదికంలో ఏ కులములోనికి చేరుస్తారు? - Hinduvuga Marithe Ye Kulam Vartisundiఇతర మతస్తులు హైందవులుగా మారితే వారికి వైదికంలో ఏ కులములోనికి చేరుస్తారు? - Hinduvuga Marithe Ye Kulam Vartisundi
ప్రశ్న; ఇతర మతస్తులు ఎవరైనా హైందవులుగా మారితే వారికి వైదిక సమాజంలో ఏ కులములోనికి చేరుస్తారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసిలలో వాళ్లకు ఏ కులము వస్తుంది?

జవాబు;
I) అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం హైందవ సమాజంలో మాత్రమే కులం ఉంది కానీ హిందుత్వంలో కులం లేదు, ఉన్నది కేవలం చాతుర్వర్ణ వ్యవస్థ మాత్రమే.
David Frawley (డేవిడ్ ఫ్రాలే)
David Frawley (డేవిడ్ ఫ్రాలే)
2) David Frawley (డేవిడ్ ఫ్రాలే) అనే అమెరికా క్రైస్తవ విదేశీయుడు హిందుత్వాన్ని అభ్యాసం చేసి, ప్రపంచ మతాల్లో హిందుత్వం మాత్రమే మనిషిని ఉద్దరించగలదు, అని పెద్ద పెద్ద శాస్త్రాలు చదివి, తనకు జన్మతః వచ్చిన క్రైస్తవాన్ని వదిలేసి, హైందవుడిగా మారాడు. ఇప్పుడు ఆయన వామదేవశాస్త్రిగా పేరు మార్చుకున్నారు. అంటే? హిందుత్వం మూల సూత్రం ప్రకారం సకల శాస్త్రాలు చదివాడు కాబట్టి శాస్త్రి అయ్యాడు, అంటే ద్విజుడు అయ్యాడు. నేడు మనం అనుకునే బ్రాహ్మణుడు అయ్యాడు, దాని అర్థం ఆయన మనువాది అనా? RSS అనా?

3) హిందుత్వంలో బ్రాహ్మణ కులాన్ని ఆయనకు ఎలా అపాదించారు అని అడగకండి, కారణం జన్మతః కులం అనేది హిందుత్వంలో లేదు, జన్మనా జాయతే శూద్రహ, కర్మణా జాయతే ద్విజహ... చేసే వృత్తిని బట్టే వర్ణము సంక్రమిస్తుంది అని మాత్రమే హిందుత్వంలో ఉంది. హిందుత్వం అంటే భారతీయ తత్వం. అంతేగానీ RSS కాదు. భారతీయ తత్వం నుండి RSS "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" పుట్టింది తప్ప RSS నుండి భారతీయ తత్వం పుట్టలేదు. గమనించండి.
Ford company - అధినేత ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ - Alfred Ford
Ford company - అధినేత ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ - Alfred Ford
II) ప్రపంంలోకెల్లా సంపన్నవంతుడు Ford company అధినేత ఆల్ఫ్రెడ్ ఫోర్డ్-Alfred Ford పుట్టుకతో క్రైస్తవుడు, అయిన పేరు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్-Alfred Ford. హిందుత్వం లోకి మారి, అంబరీష్ దాస్ అయ్యాడు. ఆయనొక బిజినెస్ మాన్ కాబట్టి హిందుత్వం ప్రకారం ఆయనొక వైశ్యుడు.

ఎస్సీ/బీసీ/ఓసి అనేది మీరు తేల్చుకోండి. కానీ భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి ఈ ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఓసి కులం చెల్లదు, హిందుత్వం లో వర్ణము మాత్రమే చెల్లుతుంది.

ఇంకా ఈ పట్టిక చాలా పెద్దదే ఉంది, కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడండి. అంతే గాని కమ్మ్యునికష్ట కళ్ళతో, బావిలో కప్పలాగా ఇదే ప్రపంచం అనుకోకండి. భారతీయతత్వం మీద విషం చిమ్మే విషనాగులుగా తయారై, మీ నిజమైన అస్తిత్వాన్ని కమ్మునికష్ట కుక్కలకు తాకట్టు పెట్టకండి. ఓపిక ఉంటే మీరు కూడా శాస్త్రాలను చదవండి, హిందుత్వాన్ని అర్థం చేసుకోండి.

ముఖ్య గమనిక: వీళ్ళని మతం మారండి, మారండి అని Christians లాగా ఎవరూ అడుక్కోలేదు, వీళ్ళు కూడా ప్రలోభాలకు లోబడిపోయి మతం మారలేదు. బాగా study అధ్యయనం చేశాకే, ఏది గొప్పది, ఏది కాదు అని తెలుసుకున్నాక మాత్రమే వైదికులుగా మారారు. ప్రపంచానికి హిందుత్వ గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు.

రచన: మౌనిక సుంకర - Mounika Sunkara (శివశక్తి సభ్యురాలు)

Sunday, April 8, 2018

హిందువు ఇండ్లల్లో మతాప్రచారకు ఎలా పాల్పడుతున్నారో....చూడండి , How xitans destroying our culture and how to defend


హిందువు ఇండ్లల్లో మతాప్రచారకు ఎలా పాల్పడుతున్నారో....చూడండి అలాగే మనా సనాతనా ధర్మం గురించి తెలుసుకోవడం మన భాద్యత.... జై శ్రీ రామ్
ఈ వీడియో చుడండి !


భరత్ టుడే సుజన్యంతో


GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com