నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Friday, October 16, 2020

పూజావిధిలో నిషిద్ధ కర్మలు -Pooja Vidhi, Nishidda Karmalu


నిషిద్ధకర్మలు
పూజావిధిలో నిషిద్ధకర్మలు
 • ➧ సువర్ణం చేతికి లేకండా ఆచమనం చేయకూడదు అలా చేస్తే రక్తంతో చేసినట్టు.
 • ➧ మంత్రపుష్పం,సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు.
 • ➧ బొట్టు,విభూతి లేదా కనీసం బొట్టుఅయిన లేకుండా పూజ చేయకూడదు.
 • ➧ ఈశ్వరుడికి,గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి.
 • ➧ ఈశ్వరుడికి వీపు చూపరాదు.ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు.
 • ➧ ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం( యా దేవి సర్వభూతేషు జ్యోతిరూపేణ స౦స్థితా). ఆ దీపారాధనతో పుల్లలుకానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరిఏదైనాకానీ వెలిగించకూడదు.
 • ➧ పూజ సమయమున ఈశ్వరుడు మనకంటే ఎత్తులోవుండాలి, అలానే పూజా వస్తువులు కుడివైపునుంచి తీసుకోవాలి. వెడంచేయి పూజావిధులలో నిషేధం.
 • ➧ ఆచమనం చేసేటప్పుడు శబ్దంరాకుండా చేయవలెను.
 • ➧ ఇంట్లో దేవతావిగ్రహాలు బొటనవేలుకన్నా పెద్దగఉండరాదు.
 • ➧ ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈజన్మలో చేసుకున్న పుణ్యంతోపాటు పూర్వజన్మలో చేసుకున్నపుణ్యంకూడా నశించును.
 • ➧ రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి ,మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
సంకలనం: కోటేశ్వర్
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com