సాంఖ్యము - Sankhyamu

0
సాంఖ్యము - Sankhyamu
సాంఖ్యము
గీ||  తారకంబు మనశ్శుద్ది కారకంబు | సాంఖ్యమాత్మరూప విచారకంబు||
అనుభవజ్ఞాన మమనస్కమట్లు గాన | నాద్యమెరిగింపు మొదల, నీవవధ రింపు ||

ముప్పదియారు తత్త్వములు :
 • చిద్రూపములు : శివ, శక్తి, సదాశివ, ఈశ్వర, విద్య - 5
 • చిదచిద్రూపములు : మాయా, కాలము, నియతి, కళా, విద్యా, రాగము, పురుషుడు - 7
 • అచిద్రూపములు : అవ్యక్తము, బుద్ధి, అహంకారము, మనస్సు, 
 • పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచ మహాభూతములు - 24
 • మొత్తము తత్త్వములు = 36
 • ముప్పది యారవ తత్త్వము = కేవల శివ స్వరూపము. ఈ ముప్పది యారుకు అతీతమైనది = పరశివము, పరతత్త్వము, తత్త్వాతీతము, బట్టబయలు.
పంచ వింశతి (25) తత్త్వములు : 
అవ్యక్తము (ప్రకృతి), మహత్తత్త్వము, అహంకారము, మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచ మహాభూతములు, పురుషుడు =25
96 తత్త్వములు : విషయ పంచకము, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము, రాగ ద్వేషములు, అరిషడ్వర్గము, దశనాడులు, చతుర్దశ వాయువులు, సప్త ధాతువులు, పంచ భూతములు, షడ్చక్రములు, మలత్రయము, ఈషణాత్రయము, పంచావస్థలు, మండల త్రయము, వ్యాధి త్రయము, త్రిగుణములు, పంచకోశములు, జీవేశ్వర తనువులు రెండు, వెరసి 96 తత్త్వములు.
పుర్యష్టకము : 1. పంచ జ్ఞానేంద్రియములు 2. పంచ కర్మేంద్రియములు 3. పంచ ప్రాణములు 4. పంచభూతములు 5. అంతఃకరణ చతుష్టయము 6. అవిద్య 7. కామము 8. కర్మము
చతుర్దశ వాయువులు : సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువులు, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ ఉప వాయువులు, అంతర్యామి వాయువు, ప్రాపంచకుడనే వాయువు, వజ్రుడనే వాయువు, ముఖ్యుడనే వాయువు, వెరసి చతుర్దశ వాయువులు.
మలత్రయము : ఆవరణ విక్షేప సంస్కారములు.
పంచావస్థలు : జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, తురీయము, తురీయాతీతము
మండల త్రయము : చంద్ర మండలము, అగ్ని మండలము, సూర్య మండలము.
జీవ తనువులు : స్థూల, సూక్ష్మ, కారణ, ప్రత్యగాత్మ శరీరములు.
ఈశ్వర తనువులు : విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ శరీరములు
పంచ శక్తులు : పరాశక్తి, ఆదిశక్తి, ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి.
పంచ బీజములు : (1) అం, యం, రం, వం, లం (2) న, మ, శి, వా, య.
పంచ అధిదేవతలు : సదాశివ, ఈశ్వర, రుద్ర, విష్ణు, బ్రహ్మ.
పంచకర్తలు : సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన.
పంచ అధిదేవతల సామర్ధ్యము : స్థంభన, మోహన, మారణ, ఉచ్ఛాటన, ఆకర్షణ శక్తులు.
పంచ అధిదేవతల కార్యము  : సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలు.
మానవుని ఏడు శరీరములు : 1. స్థూల శరీరము. 2. సూక్ష్మ శరీరము 3. కారణ శరీరము 4. వివేకరూప శరీరము 5. వివేకముననుసరించు శరీరము 6. దీనికి ప్రమాణమైన ప్రజ్ఞా శరీరము 7. ఆత్మ అనెడి నేనుగా ఉండే శరీరము.

జీవుని త్రివిధ రూపములు :
 • 1. స్థూల రూపము : కాళ్ళు, చేతులు మొదలగు అవవయములు కలిగి జీవుని భోగమునకు పనిముట్టుగా ఉపయోగపడేది.
 • 2. సూక్ష్మ రూపము : తాను ఏ సంకల్పము చేసెనో, ఆ సంకల్ప రూపమైనదీ, సంసారమున్నంత కాలము కొనసాగే చిత్త రూపము.
 • 3. పరమ రూపము : ఆద్యంత రహితము, సత్యము, చిన్మాత్రము, నిర్వికల్పము అయినది.
వివిధ శరీరములు :
 • 1. జీవుల స్థూల శరీరము సప్త ధాతుమయము.
 • 2. ఈశ్వర శరీరము పంచభూతమయము
 • 3. గంధర్వాది దేవతల శరీరము తేజోమయము.
 • 4. పరమాత్మ శరీరము అపంచీకృత పంచ మహాభూత సమష్ఠి ఆధ్యాత్మికము, త్రిగుణ సామ్యమైన ప్రకృతి.
పదునారు కళలు : 
1. హిరణ్య గర్భుడు 2. శ్రద్ధ 3. వాయువు 4. తేజస్సు 5. ఆకాశము 6. జలము 7. పృథివి 8. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు 9. మనస్సు 10. అన్నము 11. వీర్యము 12. తపస్సు, 13. మరత్రము 14. అగ్ని హోత్రాది కర్మలు 15. స్వర్గాది లోకములు 16. నామములు. ఈ కళలు పురుషుని నుండి పుట్టి మరల పురుషునిలోనే లయమగును. కళలు పురుషుడిని ఆధారము చేసుకొని ఉండును. కాని పురుషుడు కళలకు అసంగుడు. నిజానికి పురుషుడు నిష్కళుడు, నిత్య ముక్తుడు, అకళుడు అగు పరబ్రహ్మ స్వరూపము. ప్రకృతి కళలు పురుషునిపై ఆరోపించబడినవి. ప్రకృతి అనగా త్రిగుణ సామ్యము అనగా మాయ అనగా ఏ కళలు నిజానికి లేవో అవి ఉన్నట్లు చూపును. నిష్కళ పరబ్రహ్మమును చిత్కళా పురుషునిగా చూపించును.
అజ్ఞాన భూమికలు : 
1. బీజ జాగ్రము 2. జాగ్రము 3. మహా జాగ్రము 4. జాగ్ర స్వప్నము 5. స్వప్నము 6. స్వప్న జాగ్రము 7. సుషుప్తి
నవ విధ ద్రవ్య పదార్థములు : పంచభూతములు, దిక్కులు, కాలము, మనస్సు, ఆత్మ. వీటికి అతీతమైనది, ద్రవ్య గుణ కర్మలు లేనిది అచల పరిపూర్ణము.
వైశేషికము : ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయి అనెడి ఆరు పదార్థ గుణములు.

ప్రకృతి అష్టమూర్తులు :
 • 1. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవాత్మ
 • 2. పంచ తన్మాత్రలు, మహదహంకారము, మహత్తు, అవ్యక్తము
సప్తావరణలు : 
 • 1. అవిద్య, శరీర పరిగ్రహణ, కర్మ, దుఃఖము, అవివేకము, అభిమానము, రాగద్వేషములు (వ్యక్తిలోనివి).
 • 2. అజ్ఞానము, ఆవరణ, విక్షేపము, పరోక్షము, అపరోక్షము, అనర్థ నివృత్తి, ఆనందావాప్తి (సాధక సోపానములు).

జీవుని తత్త్వముల సంఖ్య : (వివిధ గురు బోధలననుసరించి)

తత్త్వములు 2 : చిత్‌ - జడములు - 2
తత్త్వములు 3 : త్రిగుణములు - 3
తత్త్వములు 4 : అంతఃకరణ చతుష్టయము, భూమి, జలము, తేజస్సు - 4
తత్త్వములు 5 : పంచ భూతములు గాని, పంచ తన్మాత్రలు గాని - 5
తత్త్వములు 6 : పంచ భూతములు, పురుషుడు        6
తత్త్వములు 7 : వ్యక్తమైన సప్త ధాతువులు, లేక వాటియొక్క అవ్యక్తము   7 
తత్త్వములు 9 : 
1. అష్టవిధ ప్రకృతులు, వాటి కావల పురుషుడు (పరమాత్మ) - 9
2. పంచ భూతములు, పురుషుడు, ప్రకృతి, అవ్యక్తము, అహంకారము - 9
తత్త్వములు 11 : పంచ మహా భూతములు, పంచేంద్రియములు, ఆత్మ - 11
తత్త్వములు 13 : పంచ మహాభూతములు, పంచేంద్రియములు, మనస్సు, జీవాత్మ, పరమాత్మ - 13
తత్త్వములు 16 : పంచ మహాభూతములు, పంచ తన్మాత్రలు, పంచేంద్రియములు, మనస్సు గాని, ఆత్మ గాని - 16
తత్త్వములు 17 : పంచ మహాభూతములు, పంచ తన్మాత్రలు, పంచేంద్రియములు, మనస్సు, ఆత్మ - 17
తత్త్వములు 25 : పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణములు, విషయ పంచకము, అంతఃకరణ చతుష్టయము, పురుషుడు - 25     
26వ తత్త్వము : పరమాత్మ
27వ తత్త్వము : జీవాత్మ లేక పురుషుడున్ను, పరమాత్మన్ను ఒక్కటైనది.
28వ తత్త్వము : పరబ్రహ్మము, లేక అవ్యక్తము.
దేహికి దేహముతో నున్న సంబంధ, వ్యవహార అవస్థలు 9 : 
1. నిషేకము అనగా దేహము ఏర్పడవలెనని ఆవేశము. 2. మాతృ గర్భ ప్రవేశము 3. భూమిపై జననము 4. బాల్యము 5. కౌమారము 6. యవ్వనము 7. ప్రౌఢత్వము 8. వార్ధక్యము 9. మరణము అని 9 అవస్థలు.

జీవుని స్థూల శరీర విశ్లేషణ : 
96 అంగుళముల ప్రమాణము, 7 జానల పొడవు, 4 జానల చుట్టు కొలత, 23 కోట్ల రోమ రంధ్రములు, 30 మూరల ప్రేగులు, 92 సంధులు, 70 ఎముకలు, 8 ఫలముల గుండె, 40 ఫలముల రక్తము, 360 ఫలముల మాంసము, 1 సోలెడు పైత్య రసము, 1/2 సోల శ్లేష్మము, 1. సోలెడు శుక్లము, 72 వేల నాడులు, 190 మర్మ స్థానములు ఉన్నవి.
త్రివృత్‌ కరణము : పంచీకరణములో ఐదు భూతములు చేరి యుండగా, సృష్టి విధానమునందు మూడు భూతములు చేరి యుండుటను త్రివృత్‌కరణము అందురు. 
 • 1. మనస్సు అన్నమయము 
 • 2. వాక్కు తేజోమయము 
 • 3. ప్రాణుడు ఆపోమయము. 
అన్నము, జలము, తేజము అను మూడింటి కలయికయే విశ్వము. ఈ మూడింటియొక్క వివిధ నిష్పత్తులలో జరిగిన సంయోగము వలన బ్రహ్మాండ పిండాండములు ఏర్పడినవి. జీవులు కూడా మనస్సు, వాక్కు, ప్రాణముల త్రివృత్‌ కరణముగా ఏర్పడెను.

శ్రు|| స్వవపుః కుణపా-కారమివ పశ్యన్న
ప్రయత్నేనా-నియమేన లాభా-లా భౌ సమౌకృత్వా||
తా|| తన శరీరమును శవమువలె చూచుకొనుచు, ఏ ప్రయత్నము, నియమము లేకుండా, లాభనష్టములను సమదృష్టితో చూచుచు సంచరించవలెను.

శ్రు||  ఔషధ వదశన మాచరే ఔషధ వదశనం ప్రాశ్నీయాత్‌ ||
- సన్న్యాసోపనిషత్‌
తా||  అన్నమును ఔషధమువలె భుజించవలెను. (కాని రుచుల కొఱకు కాదు) హితము, మితముగా తినవలెను. 

సంకలనం: విజ్ఞాన స్వరూప్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top