సి.ఎ.ఎ వ్య‌తిరేక అల్ల‌ర్ల త‌ర్వాత ఆర్‌.ఎస్‌.ఎస్ నాయ‌కులే ల‌క్ష్యంగా జిహాదీల ప్ర‌ణాళిక‌లు - After anti-CAA riots, Jihadi's targeted on RSS leaders

సి.ఎ.ఎ వ్య‌తిరేక అల్ల‌ర్ల త‌ర్వాత ఆర్‌.ఎస్‌.ఎస్ నాయ‌కులే ల‌క్ష్యంగా జిహాదీల ప్ర‌ణాళిక‌లు -  After anti-CAA riots, Jihadi's targeted on RSS leaders
ఢిల్లీలో CAA వ్యతిరేక అల్లర్ల తర్వాత RSS నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు కొన్ని తీవ్రవాద బృందాలు వేసిన ప్రణాళికలను ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. విశ్వసనీయమైన వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ముగ్గురు వ్యక్తుల మధ్య టెలీఫోన్ సంభాషణలను వెలికితీశారు. రిపబ్లిక్ టీవీ ఈ వార్తను గత శనివారం ప్రసారం చేసింది.

పోలీసులు నమోదు చేసిన FIR ప్రకారం, ఈ బృందం గరిష్ట స్థాయిలో శిక్షలు పడకుండా చూసేందుకు, 16-17 సంవత్సరాల బాలురకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. కుట్ర పన్నిన ముగ్గురు వ్యక్తులను ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితులుగా పేర్కొన్నప్పటికీ ఇంతవరకూ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అరెస్టు జరపలేదు.
 ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల అనంతరం రాజకీయ నాయకులను ఆర్ ఎస్ ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని దేశ రాజధానిలో అశాంతి అల్ల కల్లోలం సృష్టించటం అనేది ఈ బృందం లక్ష్యం. ‘ఢిల్లీ అల్లర్ల అనంతరం నిందితులు అనేకమంది ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారు ఆర్ ఎస్ ఎస్ నాయకులపైనా కుట్ర పన్ని వారు ఇతర నేరా బృందాలను సంప్రదించారు. కిషోర వయస్సులో ఉండే వారికి శిక్షణ ఇచ్చేందుకు వారు డబ్బు కూడా సేకరించారు అంతేకాకుండా ఈ నేరం జరిపేందుకు అవసరమైన అక్రమ ఆయుధాలను కూడా వారు కొనుగోలు చేశారు,’ ఢిల్లీ పోలీస్ అధికారిని ఉటంకిస్తూ రిపబ్లిక్ టీవీ తన వార్తలో  ఈ విషయం పేర్కొంది.
  ‘వేరు వేరుగా ఒంటరి నేరస్థుల చేత దాడి చేయించడం అనేది ఈ బృందం ఎంచుకున్న పద్ధతి. సమాజంలో అశాంతి సృష్టించడమే వారి లక్ష్యం. భారత శిక్షాస్మృతి IPC లోని వివిధ సెక్షన్ల కింద మేము కేసు నమోదుచేశాం. వారిని గుర్తించడం జరిగింది అరెస్ట్ చేస్తాం,” అని పోలీస్ వర్గాలు తెలియజేశాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కనీసం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మతపరమైన అల్లర్లకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 751 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 751 కేసులకు సంబంధించి పోలీసులు ఇంతవరకు 1,575మందిని అరెస్టు చేశారు. 250 కి పైగా ఛార్జిషీట్లను అల్లర్లకు సంబంధించిన కేసులో దాఖలు చేయగా 1153 మంది నిందితుల పైన చార్జిషీట్లు దాఖలయ్యాయి.

Source : ORGANISER

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top