నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

15, నవంబర్ 2020, ఆదివారం

అయోధ్యలో కనులపండుగగా దీపోత్సవ్ - Deepavali Dipotsav festival in Ayodhya -

దీపావళి సందర్భంగా అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్ జరిగింది. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించినా…… పెద్ద ఎత్తున 5 లక్షల దీపాలను వెలిగించి ఘనంగా నిర్వహించారు.
  యూపీలోని రామజన్మభూమి అయోధ్యను వేద రామయణ నగరంగా అభివృద్ధి చేయడమే ప్రధాని మోడీ స్వప్నమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. దీన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రారంభ ఘట్టం చూడటం ఈ తరం అదృష్టమేనన్నారు. గత 500 ఏళ్లుగా సాగిన పోరాటంలో ఎంతోమంది సాధువులు ఈ నిర్మాణం ప్రారంభం కావాలని కలలు కన్నప్పటికీ చివరకు మరణించారని తెలిపారు. రామ రాజ్యం అనే భావజాలాన్ని అమలుపరుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

   అయోధ్యను సుందరమైన ఆధ్యాత్మిక నగరంగా దీన్ని తీర్చిదిద్దడంలో అందరి మద్దతు తీసుకుంటున్నామన్నారు. దేశంలో కేంద్రం చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, విద్యుత్‌ కనెక్షన్లు, పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం వంటివి కార్యక్రమాలు అభివృద్ధికి సూచికలుగా నిలుస్తున్నాయని యోగి చెప్పారు. కరోనా లేకపోయినట్టయితే ఈ దీపోత్సవం మరింత ఘనంగా జరుపుకొనేవాళ్లమని తెలిపారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కరోనా వైరస్‌పై గట్టి పోరాటం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
   రామ్‌, రామరాజ్య అనే పదాలు భారతీయ సంస్కృతి నుంచి విడదీయరాని భాగాలని యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ అన్నారు. కరోనా అంతమయ్యేంత వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ దీపోత్సవ్‌ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌, పలువురు సాధువులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే.

__విశ్వ సంవాద కేంద్రము
« PREV
NEXT »