క్రైస్తవ మతబోధకుడు పాల్‌ దినకరన్ ఇళ్ళు, ఆఫీసులలో ఐటీ సోదాలు - Income Tax raids underway at 28 properties of Christian Evangelist Paul Dhinakaran in Tamil Nadu

క్రైస్తవ మతబోధకుడు పాల్‌ దినకరన్ ఇళ్ళు, ఆఫీసులలో ఐటీ సోదాలు - Income Tax raids underway at 28 properties of Christian Evangelist Paul Dhinakaran in Tamil Nadu
వివాదాస్పద క్రిస్టియన్ ఇవాంజెలిస్ట్ పాల్ ధీనకరన్, ఆయన క్రైస్తవ మిషనరీ సంస్థ 'జీసస్ కాల్స్'తో సంబంధం ఉన్న చెన్నై, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో 28 చోట్ల ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నది. తమిళనాడు అంతటా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే ఇవాంజిలిస్ట్ పాల్ ధీనకరన్ నిర్వహిస్తున్న సంస్థ 'జీసస్ కాల్స్'తో సహా దినకరన్ కు సంబంధించిన 200 మంది ఆదాయపన్నుశాఖ అధికారులు తమిళనాడులోని 28 ప్రాంతాల్లో బుధవారం దాడులు నిర్వహించింది.
    కరుణయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పై కూడా దాడులు జరిగినట్లు నివేదికల చెబుతున్నాయి. చెన్నై, కోయంబత్తూరు, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉన్న ధీనకరణ్ కు చెందిన ఆస్తులపై ఐటీ అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. క్రైస్తవ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కరుణ క్రిస్టియన్ స్కూల్ పై కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది.
    పన్ను ఎగవేత, విదేశీ నిధుల ద్వారా అక్రమాలకు పాల్పడిననట్టు  'జీసెస్ కాల్స్' పై ఫిర్యాదుల ఆధారంగా ఐటీ దాడులు నిర్వహించారు. దివంగత తమిళనాడు డీజీఎస్ ధీనకరన్ కుమారుడు పాల్ ధీనకరణ్ కు తమిళనాడులో క్రైస్తవుల్లో పెద్ద అనుచర గణమే ఉంది. 

Source: Opindia
buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top