శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణంలో మనమూ పాలుపంచుకుందాం – SC.,ST., హక్కుల సంక్షేమ వేదిక పిలుపు !

శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణంలో మనమూ పాలుపంచుకుందాం – SC.,ST., హక్కుల సంక్షేమ వేదిక పిలుపు - Let us all take part in the construction of Sri Rama Janmabhoomi Mandir - SC., ST., Rights Welfare Forum Call
యోధ్యలో నిర్మితమవుతోన్న భవ్య రామ మందిర నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని SC, ST ప్రజలు కూడా భాగాస్వాములవ్వాలని SC, ST హక్కుల సంక్షేమ వేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు SC, ST హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రిటైర్డ్ IAS, డాక్టర్ పరశురామయ్య విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. ఆ ప్రకటన యదాతథంగా…….
    శ్రీ రాముడు మంచి పరిపాలనను అందించిన గొప్ప చక్రవర్తి. మిత్రత్వం, సోదర భావం,సామాజిక సమతలకు ప్రతీక. మన చరిత్రలో అనేక మంది రాజులు,చక్రవర్తులు ప్రజలను పాలించారు. శ్రీ రాముడు అందించిన రామరాజ్యం అంటే అన్ని విధాలా ప్రజా రంజక పరిపాలన. మిత్రుడైన వనవాసీ గిరిజన రాజు గుహుని పట్ల మిత్రత్వం, నిమ్న కులానికి చెంది, ఉన్నత భక్తికి సంకేతమైన శబరిమాత పట్ల ఆత్మీయత, సీతమ్మ రక్షణలో అశువులు బాసిన జటాయువుకు స్వయంగా అంత్యక్రియలు చేయడం, సోదరుడు లక్ష్మణుడు ప్రమాదంలో ఉన్నపుడు శ్రీ రాముడు సొదరునికై విలపించిన తీరు, ధర్మ రక్షణకై అన్ని విధాలా నిలబడ్డ హనుమంతుని పట్ల చూపిన ప్రేమ శ్రీ రాముని వ్యక్తిత్వాన్ని తెలియచేసే కొన్ని ఉదాహరణలు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని, ధర్మానికి ప్రతీక అయిన శ్రీ రాముని జన్మభూమి ఆయోధ్య మందిర నిర్మాణంలో SC.,ST.,వర్గాల ప్రజలమైన మనము కూడా పాలు పంచు కావాలని SC.,ST.,హక్కుల సంక్షేమ వేదిక పిలుపునిస్తోంది.
  • డాక్టర్ పరశురామయ్య,
  • రిటైర్డ్ IAS,
  • ర్రాష్ట్ర గౌరవాధ్యక్షులు,
  • SC, ST హక్కుల సంక్షేమ వేదిక, ఆంధ్రప్రదేశ్.
__విశ్వ సంవాద కేంద్రము - (ఆంధ్ర)..

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top