పల్లెల్లో నీటి వనరులు - Water resources in the Villages

పల్లెల్లో నీటి వనరులు - Water resources in the Villages
నీటి వనరులు
తంలో అనగా సుమారు యాభై సంవత్సరాల క్రితం పల్లె ప్రజలు అనగా రైతులు వారి వ్యవసాయ నీటి అవసరాలకు కాలువలు, చెరువులు, బావులు, కసిం కాలువలు, బోరు బావులు, కుంటలు, వాగులు, వంకలు, వంటి జల వనరులు పై ఆధార పడే వారు.. రైతులు కొన్ని ప్రాంతాలలో నీటి వసతి కొరకు చెరువులు, బావులు పైనే ఆధార పడి వుండే వారు. వర్షాకాలంలో చెరువులు నిండితే ఆరు నెలల వరకు నీళ్లు వుండేవి. చిన్న చిన్న వంకలు వాగులు ఉన్నాయి. 
   ఆ రోజుల్లో వాటిల్లో సన్నగానైనా ఎల్లప్పుడు నీరు పారు తుండేవి. దాంతో భూగర్బ జలం పుష్కలంగా వుండి బావుల్లో నీళ్లు పైకే వుండేవి. ఆ వంకల్లో సాగె నీటిని నిలగట్టి చిన్న కాలువ ద్వారా పంటలకు మల్లించే వారు. లేదా ఏతం గూడ వంటి సాధనాల ద్వారా నీటిని పొలాలకు మళ్లించి పంటలు వండించె వారు. బావుల నుండి కపిలి అనే సాధనం ద్వారా ఎద్దులతో నీటిని పైకి తోడి పంట పొలాలకు పెట్టే వారు. ఆ తర్వాత బావులకు కరెంటు మోటార్లు వచ్చాయి. దాంతో రైతుల పని కొంత సులువైంది. బావులు సాధారణంగా గుండ్రంగా గాని, నలు చదరంగా గాని వుంటాయి. చుట్టు రాతి కట్టడం వుండి లోనికి దిగడానికి రాతి బండలతో చేసిన మెట్లుంటాయి. వీటి లోతు సుమారు ఐదు లేక ఆరు మట్లు వుంటుంది. ఒక మట్టు అంటే ఐదు అడుగులు. మహా లోతైన బావి అంటే ఏడు మట్లు బావి. ఆరోజుల్లో ఈ బావుల్లో నీళ్లు పైకే వుండేవి, అనగా పది అడుగుల లోతులో వుండేవి. పిల్లలందరు ఎండా కాలం బావుల్లో ఈత కొట్టే వారు. కొత్తవారు ఈత నేర్చు కునే వారు. ఈ బావుల్లో నుండి కపిలి / మోటతో నీళ్లను బయటకు తోడి పంటలు పండించె వారు. ప్రస్తుతం ఇటు వంటి బావులు వర్షం లేక అడుగంటి పోయాయి.
పల్లెల్లోని పొలంలో అడుగంటిన అందమైన దిగటానికి మెట్లున్న దిగుడు బావి.
పల్లెల్లోని పొలంలో అడుగంటిన అందమైన దిగటానికి మెట్లున్న దిగుడు బావి.
గొట్టపు బావులు లేదా బోరింగు బావులు:
   వర్షాబావంతో మామూలు బావుల్లో నీరు అడుగంటి పోగా విధిలేక రైతు లందరు బోరింగు బావులు త్రవ్వించారు. అవి వంద లాది అడుగుల లోతులో నుండి మోటార్ల సాయంతో నీటిని తోడు గలవు. భూగర్బ జలాన్ని ఈ బోరు బావులు వందలాది అడుగుల లోతునుండి తోడేస్తున్నందున లోతు తక్కువ గల దిగుడు బావులన్ని ఎండి పోయాయి. ఆ ఎండి పోయిన బావుల్లోనె బోరులు వేసి యంత్రాలతో నీటిని పైకి లాగు తున్నారు. ప్రస్తుతం అందారూ ఈ బోరు బావులపైనే ఆధార పడి కొంత వరకు పంటలు పండించు కుంటున్నారు. 
    ఒకప్పుడు ఈ దిగుడు బావులన్ని కపిలి బావులే. గతంలో ఈ బావులనుండి కపిలి/ మోటతో నీళ్లను తోడి పంటలకు పండించేవారు. ఆ బావులకు కపిలి వుండేదనడానికి నిదర్శనంగా ఆ బావులకు ఉన్న కపిలి దొరువులను ప్రక్కనున్న చిత్రంలో చూడ వచ్చు. అప్పట్లో మహా అయితే ముప్పై నలమై అడుగుల లోతు నుండి కపిలితో నీరు తోడే వారు. ఆ బావులు అడుగంటగ ఆ దిగుడు బావులలోనె వందలాది అడుగుల లోతున బోరులు వేసి నీటిని తోడె వారు. కొంత కాలం తర్వాత ఆబోరు బావులలో కూడా నీరు అతి తక్కువగా వస్తున్నందున, అంత సన్నగా వచ్చే నీరు పొలానికి పెట్టితే ఒక బారెడు దూరంకూడ పారవు. అందు చేత ఆ బోరుబావిలో నుండి సన్నగా వచ్చే నీటి దారను ఒడిసి పట్టి ఆ దిగుడు బావిలోనె నిల్వ చేసి సుమారు అయిదారు అడుగులు లోతు నీరు వచ్చాక ఆనీటిని మరిక మోటారుతో బయటకు తోడి కొంత కాలం పంటలు పండించారు. భూగర్బంలోని నీరు బోరు ద్వారా పైకి అనగా దిగుడుబావి అడుకుకి వస్తుంది. అక్కడ కొంత మేర నిల్వ చేసుకొని మరొక మోటారుతో ఆ నీటిని పైకి తోడె వారు. ప్రక్కనున్న చిత్రంలో ఈ తతంగ మంతా చిత్రంగా చూడండి. ప్రస్తుతం అలాంటివి కొన్ని పని చేయడం లేదు. ఈ ప్రాంతంలో ఈ తరం వారికి బావుల్లో ఈత కొట్టడం, చెరువుల్లో గేలాలతో, కొడంతో చేపలు పట్టడం, వంకల్లో, వాగుల్లో చేపలు పట్టడం మొదలగు ఆటలన్ని పూర్తిగా అందు బాటులో లేవు. అవన్నీ కనుమరుగయ్యాయి.
కసింకాలువ:
   చిన్న చిన్న కసింకాలువలు చెరువు కట్ట క్రింద ప్రారంబమై సుమారు ఒక మైలు పొడవునా వుంటాయి. అటు ఇటు పొలాల్లోని మురుగు నీరు ఈ కాలవలోకి ప్రవహిస్తుంది. అందు చేత అంద్లో నీళ్లు పారు తుంటుంది. చెరువులో నీరు అయిపోయినా ఈ కసింకాలవలో నీరు ఉంటుంది. ఆ నీటిని ఏతం, గూడ, ద్వారా పైకి తోడి పొలాలకు పారిస్తుంటారు రైతులు. ఇదొక నీటి వనరు. కాని ప్రస్తుతం సంవత్సరాల తరబడి చెరువులు నిండక పోవడంతో ఈ కసిం కాలువలు కూడా ఎండి పోయాయి. ఇంకొన్ని కసింకాలువలు అరుదుగా వుంటాయి. అవి ఏ కొండ వాలులోనో ప్రారంబమై కొన్ని మైళ్ల పర్వంతం వుంటాయి. ఇందులోని నీరు కూడా పంటలకు వాడుకుంటారు. 
    ఈ కసింకాలావల్లో నీరు ప్రవహించదు కాని నీరు నిల్వ వుంటుంది. ఎంత తోడినా తిరిగి వూరు తుంది. అంచేత దానికిరుపక్కాలా బావుల్లో నీరు సంవృద్దిగా వుంటుది. ఈ కరువు కాలంలో అవి కూడా ఎండి పోయాయి. పశువుల మేతకు కూడా ఈ కసిం కాలవలు చాల ఉపయోగ పడేవి. ఎలాగంటే ఇందులో నీరు ఎల్లప్పుడ్లు వున్నందున అందులో జమ్ము, గడ్డి ఏపుగా పెరిగి వుండేది. దాని గట్టు మీద కూడా గరిక బాగ వుండేది. ఆవులు గట్టున మేస్తె బర్రెలు నీళ్లలో దిగి జమ్ము, తుంగ వంటి గడ్డిని బాగా మేసేవి. చిన్న చిన్న చేపలు, పీతలు మొదలగు వాటిని పట్టే వారికి కూడా ఇవి ఉపయోగ పడేవి. ఇలాంటి కసింకాలువలు ఎండి పోయాయి. 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top