Page Nav

HIDE
FALSE
HIDE_BLOG

Classic Header

{fbt_classic_header}

తాజా విశేషాలు:

latest

రంజాన్ కు కోట్లు - హిందూ దేవుళ్ల కైంకర్యాలకు తూట్లు !

ఆలయం  రంజాన్ కు కోట్లు - హిందూ దేవుళ్ల కైంకర్యాలకు తూట్లా  ఆలయాల మెరుగైన నిర్వహణ, అక్రమాల నిరోధం వంటి కారణాలు చెప్పి 1936 నాటికి చాలా. దేవస్...

రంజాన్ కు కోట్లు - హిందూ దేవుళ్ల కైంకర్యాలకు తూట్లు - Crores for Ramadan Hindu Gods for the purpose of Bullets
ఆలయం 
రంజాన్ కు కోట్లు - హిందూ దేవుళ్ల కైంకర్యాలకు తూట్లా
 ఆలయాల మెరుగైన నిర్వహణ, అక్రమాల నిరోధం వంటి కారణాలు చెప్పి 1936 నాటికి చాలా. దేవస్థానాల మీద ఈ బోర్డు ఆధిపత్యం సంపాదించింది. 1940 వరకు ఈ చట్టానికి చాలా మార్పులు చేశారు. 1959లో మళ్లీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ఎం డోమెంట్ యాక్ట్ ను తీసుకువచ్చింది. దీనికి సంప్రదాయ హిందువుల నుంచి తీవ్ర ప్రతిఘటనే వచ్చింది. ఆ తరువాత మరొక విధ్వంసక పరిణామం జరిగింది. 

  1967లో వచ్చిన డీఎంకే ఆ చట్టానికే ఇంకొన్ని సవరణలు చేసింది. తాజాగా కొవిడ్ 19 నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన నిధుల సందేశం కూడా ఎంజీ రామచంద్రన్ 1983లో చేసిన సవరణ ఫలితమే. ఆలయ అదనపు నిధుల నుంచి ఇలాంటి అవసరాలకు ప్రభుత్వం ధనం తీసుకోవచ్చునని ఆ సవరణ చెబుతోంది. పేదలకు ఆహారం అందించడానికి దేవాలయాల సొమ్ము ఇచ్చే అధికారం ఈ చట్టం ధర్మకర్తలకు ఇస్తున్నది. నేటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ 'దినమలార్' పత్రిక ప్రచురణకర్త ఆర్ ఆర్ గోపాల్ మరికొందరు హైకోర్టుకు వెళ్లారు. ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ (ఏప్రిల్ 27) దీనిని జిజియా పన్ను పేరుతో విమర్శించింది.

  మరొక ముచ్చటైన సంగతిని కూడా ఆర్గనైజర్ బయటపెట్టింది. ఆ సమయంలోనే వచ్చిన రంజాన్ పండుగ కోసం అన్నాడీఎంకే ప్రభుత్వం రూ. 22 కోట్లు అలవోకగా ఇచ్చేసింది. నిజానికి 1967 నుంచి , అంటే పచ్చి హిందూ వ్యతిరేక వాదులైన ద్రవిడవాదుల పాలన ఆరంభం నుంచే అక్కడ హిందువులు ఆలయాల రక్షణ కోసం పోరాడుతున్నారు. 2016 ఎన్నికల సమయంలో బీజేపీ ఒక అద్భుతమైన హామీ ఇచ్చింది. ఇది భవిష్యత్తులో ఆలయాల విముక్తికి నాంది కాగలదని అనిపిస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల మీద ప్రభుత్వ అజమాయిషీని తొలగిస్తాం అన్నదే ఆ హామీ.
  చిత్రం ఏమిటంటే, ఆలయాల నుంచి సేకరించిన డబ్బులు పేదల ఆహారం, వసతి కోసం వినియోగిస్తామన్నది నోటి మాటే తప్పితే, జీవోలో ఆ ప్రస్తావనలేదు. ఎప్పటిలాగే ఇలాంటి సంక్షోభ సమయంలో దేవాలయాల ధనం పేదలకు ఉపయోగిస్తే తప్పేమిటని యథాప్రకారం కొందరు వీరంగం వేశారు. అది తప్పని ఎవరన్నారు? గతంలో ఆలయాలలో జరిగినదీ, ఇప్పటికీ కొన్ని దేవస్థానాలలో జరుగుతున్నదీ అది కాదా! కానీ ప్రజా సంక్షేమం కోసం హిందూ దేవాలయాల డబ్బే ఎందుకు ? చర్చిలు, మసీదులకు సైతం కోట్లాది రూపాయల ఆదాయాలు ఉన్నాయి. వందల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. వాటి నుంచి ఎందుకు తీసుకోరు? 

  తమిళనాడు బీజేపీ నాయకుడు ఎస్ఆర్ శేఖర్ 'కొవిడ్లో పేదలకు ఆహారం కోసం డబ్బులు కావాలంటూ మసీదులనీ, చర్చిలను ఎందుకు అడగడం లేదు? అని ప్రశ్నించారు. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వాలకు దేవస్థానాల సొమ్మును ధారి మళ్లించడం ఒక అలవాటుగా మారిందని కూడా ఆయన విమర్శించారు. మరొక ప్రశ్న కూడా వచ్చింది, కొవిడ్ 19 సమయంలో నెలల తరబడి ఆలయాలు మూతపడ్డాయి. ఇక మిగులు నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? అంటే ధర్మకర్తలను ప్రభావితం చేసి ఆలయాల స్థిరాస్తులను బయటకు తేవడమే ఉద్దేశం. 
  తమిళనాడుకు చెందిన రాజకీయ విశ్లేషకుడు అళి సెంథిల్ నాథన్ ఒక విషయం అంగీకరించారు.  ప్రభుత్వం ఈ జీవో వెనక్కి తీసుకోవడానికి కారణం హిందుత్వ వర్గాలు ఒత్తిడి తెచ్చినందుకే' అన్నారాయన. రాముని విగ్రహం శిరన్సును కోసేసినా, నరసింహస్వామి రథం దగ్గం చేసినా, అమ్మవారి రథం వెండిసింహాలు ఎత్తుకు పోయినా, కళ్లెదురుగా 140చోట్ల హిందూ దేవతామూర్తులకు అపచారం జరిగినా హిందువులు ఇంకా మౌనం దాల్చడం సాధ్యమా?

__జాగృతి సౌజన్యంతో...{full_page}