స్వామి ల‌క్ష్మ‌ణానంద స‌ర‌స్వ‌తి ఆశ్రమం పేల్చివేస్తామంటూ బెదిరింపులు - Swami Laxmanananda in Kandhamal, his Jalespata Ashram gets death and bomb threats

0
స్వామి ల‌క్ష్మ‌ణానంద స‌ర‌స్వ‌తి ఆశ్రమం పేల్చివేస్తామంటూ బెదిరింపులు - Swami Laxmanananda in Kandhamal, his Jalespata Ashram gets death and bomb threats
స్వామి ల‌క్ష్మ‌ణానంద స‌ర‌స్వ‌తి ఆశ్రమం
13 ఏళ్ల నాటి దారుణ ఘటన ఇప్పటికీ హిందూ సమాజాన్ని వెంటాడుతోంది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో స్వామి లక్ష్మణానంద సరస్వతి దారుణ హత్యను మరిచిపోకముందే లక్ష్మణానంద సరస్వతి ప్రధాన శిష్యులు, ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్వామీ జిబనాముక్తానందను కూడా హత్యచేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం విస్మయం కలిగిస్తోంది.
   స్వామి జిబనామముక్తానంద తెలియజేసిన వివరాలను ఉటంకిస్తూ OpIndia ప్రచురించిన కధనం ప్ర‌కారం.. ఒక వ్య‌క్తి త‌న‌కు ఫోన్ చేసి తనను చంపుతామ‌ని బెదిరిస్తున్నాడ‌ని స్వామిజీ తెలిపారు. ఫిబ్రవరి 20, శనివారం సాయంత్రం మొదటి కాల్ వచ్చింద‌ని, ఫోన్‌లో మాట్లాడిన వ్య‌క్తి  న‌క్స‌లైట్ అని చెప్పాడ‌ని, త‌న‌ను చంపుతాన‌ని, ఆశ్ర‌మాన్ని పేల్చివేస్తానని బెదిరించాడ‌ని స్వామిజీ తెలిపారు. మరుస‌టి రోజు, ఆదివారం ఉద‌యం మ‌ళ్లీ అటువంటి బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్టు తెలిపారు. ఈ విష‌యాన్ని తుముడిబంధ పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా వెంట‌నే స్పందించిన పోలీసులు ఆశ్ర‌మంలో భ‌ద్ర‌తా సిబ్బందిని నియ‌మించారు.

  ఈ సంద‌ర్భంగా స్వామిజీ జీవానాముక్తానంద ఒక టీవీ చాన‌ల్ తో మాట్లాడుతూ ఈ బెదిరింపుల వెనుక స్వామి లక్ష్మణానంద హత్యకు కారణమైన వ్యక్తులు హ‌స్తం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తాను ఈ ఆశ్రమం వ‌దిలిపెట్టే ప్రసక్తి లేదని, పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశార‌న్నారు. కానీ పోలీసులు తమ భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించుకున్న మరుక్షణం ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాధువుని కావడం వల్ల, ధర్మప్రచారం నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నందున త‌నకు రక్షణ అవసర‌మే అని తెలిపారు.

  గిరిజన ప్రాబల్యం కలిగిన కంధమాల్ జిల్లా చాలా కాలంగా  క్రైస్త‌వ మిష‌న‌రీల‌కు బలవంతపు మతమార్పిడికి కేంద్రంగా ఉండేది. మావోయిస్టులు‌ స‌హ‌కారంతో  క్రైస్తవ మిషనరీలు చేసే బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిళ్ల‌ను నివారించ‌డానికి ఎంతో మంది హిందు సాదువులు నిరంత‌రం కృషి చేశారు. చేస్తున్నారు. అటువంటి సాధ‌వుల‌నే ల‌క్ష్యంగా చేసుకుని అక్క‌డి క్రైస్త‌వ మిష‌న‌రీలు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాయి. నక్సలైట్లు క్రైస్తవులకు మద్దతు ఇస్తున్నారు. అయితే నిత్యం ఎదో ర‌కంగా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నక్రైస్త‌వ మ‌తోన్మాదుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మ‌త మార్పిళ్ల‌ను అడ్డుకోవాల‌ని, వారికి స‌హ‌క‌రిస్తున్న మావోస్టుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు, హిందూ సంఘాల నాయ‌కులు అధికారుల‌ను, పోలీసుల‌ను, రాజ‌కీయ నాయ‌కుల‌ను కోరుతున్నారు.

  2008 ఆగష్టు 23 నాడు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కంధమాల్ జిల్లాలోని జాలెస్పటాలోని కన్యాశ్రమంలో స్వామీజీ భక్తులతో ప్రార్ధనా మందిరంలో సమావేశమయ్యారు. అదే సమయంలో ముసుగులు ధరించి, ఏకే 47 తుపాకులు చేతబట్టిన 15 మంది సాయుధ క్రైస్తవ మిషనరీ తీవ్రవాదులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. మొదట అక్కడ ఉన్న బాబా అమృతానంద స్వామీజీని లక్ష్మణానంద స్వామీజీగా భావించి వారిని కాల్చివేశారు. ఆ త‌ర్వాత స్వామిజీ ఉన్న తలుపులు బద్దలు కొట్టి, వారిపై విచక్షణారహితంగా కాల్పులు చేసి దారుణంగా హత్యచేశారు. 84 ఏళ్ల వయసు గల శ్రీ లక్ష్మణానంద, క్రైస్తవ తీవ్రవాదులు జరిపిన కాల్పులతో అక్కడికక్కడే నేలకొరిగారు.

లక్ష్మణానంద స్వామీజీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల కోసం లింక్ క్లిక్ చేయండి:

__విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)
{full_page}

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top