ఆలయంలో అభిషేక జలం పోవు మార్గాన్ని ఏమంటారు ?

0
ఆలయంలో అభిషేక జలం పోవు మార్గాన్ని ఏమంటారు ? - What is the path of anointing water in the temple?
గుడిలో అభిషేక జలం పోవు మార్గాన్ని ఏమంటారు ?

ప్రాచీన దేవాలయాన్ని ముఖమండపం, రంగమండపం, అంతరాళం, గర్భగుడి అనే భాగాలుగా విభజించవచ్చు.
భక్తులు మొదట ప్రవేశించేది ముఖమండపంలోనికి. ముఖమండపం అందమైన శిల్పస్థంభాలతో అలరారుతూవుంటుంది. ఇక్కడే ద్వారపాలకులు అటు ఇటు కొలువైవుంటారు. రంగమంటపం కూడా శిల్పస్థంబాలతో శోభిల్లుతూవుంటుంది. రంగమంటపంలోనే నృత్యము, గానము, సంగీతము భజనలు ఉంటాయి. రంగమంటప వాకిలి పైన లక్ష్మీదేవికి ఏనుగులు పూలమాలలతో  అర్చిస్తూవుంటాయి.
   అంతరాళం గర్భగుడికి అనుకొనేవుంటుంది. ఎత్తైన అరుగులుంటాయి. ఈ అరుగులు కూడా శిలాశిల్ప స్థంబాలతో వుంటాయి. గర్భగుడి ద్వారానికి అటుఇటుగా ద్వారపాలకులుంటారు. గర్భగుడిలో పానవట్టం లేదా అధిష్టానం పై శిలామూర్తైన మూలవిరాట్టు విగ్రహం వుంటుంది.
విమానం :
విమానమంటే గర్భగుడిపై గల గోపురం. గర్భగుడిలోని మూలవిరాట్టు ఎత్తును బట్టి విమానం రూపురేఖలు ఎత్తు నిర్ణయిస్తారు.

విమానగోపురాలలో దాదాపు 20 రకాలున్నాయి. అవి
(1) మేరువు 
(2) మందరం 
(3) కైలాసం
(4) విమానం 
(5) నందనం 
(6) సముద్గం
(7) పద్మం
(8) గారుడం
(9) నందిని
(10) కుంజరం
(11) వర్ధనం
(12) గృహరాజం
(13) వృషభం
(14) హంస
(15) ఘటము
(16) సర్వతోభద్రం
(17) సింహం
(18) మహేంద్ర
(19) రాజహంస
(20) స్వస్తికం

దేవుడి అభిషేకజలం పోవుమార్గాన్ని సోమసూత్రం అంటారు. దేవుడిని ప్రతిష్టించే అధిష్టానం నాలుగు లేదా ఎనిమిది లేదా పదహారు ముఖములు కలిగివుండాలి. లేదా గుండ్రంగా వుండాలి.
ప్రధానదేవుడి అధిష్టానం, ఉత్సవ విగ్రహాలకు అధిష్టానం వేరువేరుగా వుంటాయి.
  ఈ దేవతాపీఠాలు లేదా మూలవిగ్రహపీఠాలు
 (1) పద్మపీఠం, (2)శేషపీఠం, (3) కుముదపీఠం (4) సోమపీఠం (5) ద్వాదశాశ్రమం అని 5 రకాలు.
  శిల :
ఘంటానాదం వలె  గంభీరంగా మ్రోగేది పురుషశిల.
సంగీతంలోని లయతాళములవలే  మ్రోగునది స్త్రీ శిల.
స్వరంపీలగా, హీనంగావుండునది నపుంసకశిల.
   పురుషశిలతో మూర్తిని, స్త్రీ శిలతో పీఠాన్ని, నపుంసకశిలతో పాదపీఠం చేయడం ఉత్తమo.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top