'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-3

0
'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-3

శ్లోకము - 7
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్జార్థం తాన్ బ్రవీమి తే ||

అస్మాకం - మన; తు - కాని; విశిష్టా: - విశేషముగా శక్తిమంతులు; యే - ఎవరో; తాన్ - వారిని; నిబోధ - గుర్తించండి, తెలిసికోండి; ద్విజోత్తమ - బ్రాహ్మణోత్తమా, వాయణాణః - నాయకులు; మమ - నా యొక్క; సైన్యస్య - సేనల; సంజ్ఞార్థం - సమాచారము; తాన్ - వారిని గురించి; బ్రవీమి - చెబుతాను; తే - మీకు.  
  కాని ఓ బ్రాహ్మణోత్తమా! నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనటి నాయకులను గురించి మీకు నేను చెబుతాను.

శ్లోకము - 8
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథై చ ||

భవాన్ - మీరు; భీష్మః - భీష్మపితామహుడు; - కూడ; కర్ణ: - కర్ణుడు; చ - మరియు; కృపః - కృపుడు; - మరియు; సమితింజయః - యుద్ధంలో ఎల్లప్పుడు విజయశీలురైన; అశ్వత్థామా - అశ్వత్థామ; వికర్ణ: - వికర్ణుడు; - కూడ; సౌమదత్తి - సోమదత్తుని పుత్రుడు; తథా - అలాగుననే; ఏవ - నిశ్చయంగా; - కూడా.
   యుద్ధంలో ఎల్లప్పుడు విజయము సాధించే మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటివారు ఉన్నారు.

 భాష్యము : యుద్ధరంగంలో ఎల్లప్పుడు విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లీకరాజు పుత్రుడు, పాండురాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని ఆర్ధసోదరుడు. కృపాచార్యని కవలసోదరి ద్రోణాచార్యుని భార్య.

శ్లోకము 9
అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదా: ||

అన్యే - ఇతరులు; - కూడా; బహవః - బహుసంఖ్యలో; శూరాః - వీరులు; మదర్థే - నా కొరకు; త్యక్తజీవితాః - ప్రాణత్యాగానికి సిద్ధపడినవారు; నానా - నానారకాల ఆయుధాలను; ప్రహరణాః - దాల్చి; సర్వే- వారందరు; యుద్ధ విశారదాః - యుద్ధ నిపుణులు.
  నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు వారందరు నానారకాల ఆయుధాలను దాల్చి యుద్ధనిపుణులై ఉన్నారు.

 భాష్యము : జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధనుని కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిశ్చయులై ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే పాపియైన దుర్యోధనుని పక్షమున చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగములో వారందరు మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది. కాని దుర్యోధనుడు మాత్రము పైన చెప్పబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండ విజయము లభిస్తుందని ధైర్యముతో ఉన్నాడు.


'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top