'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page 2

0
'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page 2
: కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము :

శ్లోకము - 3
పస్వై తాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
ప్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||
పశ్య - చూడండి; ఏతాం - ఈ; పాండుపుత్రాణాం - పాండుసుతుల యొక్క ఆచారయ
ఓ ఆచార్యా; మహతీం - గొప్పదైన; చమూమ్ - సేవాబలమును; వ్యూఢాం - ఏర్పాటు చేయబడిన; ద్రుపదపుత్రేణ - ద్రుపద తనయుని ద్వారా; తవ - మీ యొక్క; శిష్యేణ - శిష్యుడు; ధీమతా - బుద్ధికుశలుడైన.
  ఓ ఆచార్యా! మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి.

భాష్యము : బ్రాహ్మణుడు, గొప్ప సేనాధిపతియైన ద్రోణాచార్యుని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలని అనుకున్నాడు. ద్రౌపది (అర్జునుని భార్య) తండ్రియైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైరము ఉండేది. ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుని సంహరింపగలిగే ఒక పుత్రుని వరంగా పొందాడు. ద్రోణాచార్యునికి ఇది బాగా తెలిసినప్పటికిని ద్రుపద తనయుడైన ధృష్టద్యుమ్నుడు యుద్ధవిద్యను నేర్చుకోవడానికి తన పద్ద చేరినపుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా తన యుద్ధ రహస్యాలను అతనికి తెలియజేయడంలో సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర
రణరంగములో ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించాడు. ద్రోణాచార్యుని నుండి నేర్పిన విద్యతో అతడే వారి సేనావ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుడు సాపధానుడై రాజీధోరణి లేకుండ యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అతని ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు. అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించకూడదని కూడ దీని ద్వారా అతడు చెప్పగోరాడు. ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడు, తెలివిగల శిష్యుడు యుద్ధంలో అటువంటి సౌమ్యస్వభావము అపజయానికి దారితీస్తుందని కూడ దుర్యోధనుడు హెచ్చరించాడు.

శ్లోకము - 4
అత్ర శూరా మహీశ్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||
అత్ర - ఇక్కడ; శూరాః - శూరులు; మహీశ్వాసాః - గొప్ప ధనుర్ధరులు; భీమ అర్జున - భీముడు,అర్జునులకు; సమా: - సమానంగా; యుధి - యుద్ధము నందు; యుయుధానః - యుయుధానుడు; విరాట: - విరాటుడు; - కూడా; ద్రుపదః - ద్రుపదుడు; - కూడా; మహారథః - మహారథుడైన.
  ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలామంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు.

భాష్యము : యుద్ధవిద్యలో ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకపోయినప్పటికిని భయకారణమైన ఇతరులు చాలామంది ఉన్నారు. వారిలో ప్రతియొక్కడు భీమార్జునులలాగా ప్రబలమైనవాడు కావడం వలన వారందరు విజయపథంలో గొప్ప అవరోధాల వంటివారని దుర్యోధనుడు పేర్కొన్నాడు. భీమార్థునుల శక్తిని తెలిసియున్నందునే ఆ విధంగా అతడు ఇతరులను వారితో పోల్చాడు.

శ్లోకము - 5
ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్ కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||
ధృష్టకేతుః - ధృష్టకేతువు; చేకితానః - చేకితానుడు; కాశీరాజః - కాశీరాజు, - కూడా
వీర్యవాన్ - శక్తిమంతుడైన; పురుజిత్ - పురుజిత్తు; కున్తిభోజః - కుంతీభోజుడు; చ - మరియు; శైబ్య - శైబ్యుడు; - మరియు; నరపుంగవః - నరులలో వీరుడు.
  ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి
శూరులైన మహాయోధులు కూడ ఉన్నారు.

శ్లోకము - 6
యుధామన్యుశ్చ విక్రాస్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||
యుధామన్యు: - యుధామన్యుడు; - మరియు; విక్రాస్తః - పరాక్రమవంతుడైన; ఉత్తమౌజాః - ఉత్తమౌజుడు; చ - మరియు; వీర్యవాన్ - శక్తిశాలియైన; సౌభద్రః - సుభద్రా తనయుడు; ద్రౌపదేయా: - ద్రౌపది కుమారులు; - మరియు; సర్వ - అందరు; ఏవ - నిశ్చయముగా; మహారథాః - మహారథులు. 
  పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడు, సుభద్రా అనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరు మహారథులు.


'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top