'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One - Page-1

0
'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One
: కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము :
శ్లోకము - 1
ధృతరాష్ట్ర ఉవాచ
ధక్షేర్మత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||

ధృతరాష్ట్ర: ఉవాచ - ధృతరాష్ట్ర మహారాజు పలికాడు; ధర్మక్షేత్రే - తీర్థస్థానంలో, కురుక్షేత్రే - కురుక్షేత్రమనే పేరు కలిగిన ప్రదేశంలో; సమవేతా: - సమకూడి; యుయుత్సవః - యుద్ధము చేయగోరి; మామకాః - నా పక్షమువారు (పుత్రులు); పాండవాః - పాండు తనయులు; - మరియు; ఏవ - నిక్కముగా; కిం - ఏమి; అకుర్వత - చేసారు, సంజయ - ఓ సంజయా,
   ధృతరాష్ట్రుడు పలికాడు : ఓ సంజయా! కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండు తనయులు యుద్ధము చేయగోరినవార్తె సమకూడిన తరువాత ఏమి చేసారు?

భాష్యము : భగవద్గీత విస్తారముగా చదువబడే ఆస్తిక విజ్ఞానశాస్త్రము, అది గీతా మాహాత్మ్యములో (గీతామహిమ) సంగ్రహముగా చెప్పబడింది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణభక్తుని సహాయ్యంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండ అర్థం చేసికోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసికొన్నాడు. స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది. ఎవ్వడైనా గురుశివ్యవరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండ భగవద్గీతను అర్థం చేసికోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త వేదజ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల స్త్రాలను అతిశయించగలుగుతాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండ అన్యత్ర గోచరించని విషయాలను కూడ పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు. ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని ద్వారా ప్రత్యక్షంగా పలుకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రముగా అయింది.
    మహాభారతంలో వర్ణించబడినట్టి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్త్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనాయి. అనాదియైన వేదకాలము నుండి తీర్థస్థానమైనట్టి కురుక్షేత్రంలో ఈ తత్త్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తున్నది. ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు.

    కురుక్షేత్ర రణరంగములో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రము (ధర్మవిహిత కర్మలు చేయబడే స్థలము) అనే పదము ప్రధానమైనది. కౌరవుల తండ్రియైన ధృతరాష్ష్రుడు తన తనయుల చరమ విజయావకాశము గురించి చాలా సందేహించాడు. ఆ సందేహముతోనే అతడు “వారు ఏమి చేసారు"? అని తన కార్యదర్శియెన సంజయుని అడిగాడు. తన పుత్రులు, తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగములో సమకూడారని అతనికి తెలుసు. అయినా అతడు ఆ విచారణ చేయడం చాలా ముఖ్యమైనది. జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు. అలాగే రణరంగములో తన
పుత్రుల విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలిసికోగోరాడు. అయినా స్వర్గలోకవాసులకు కూడ పూజనీయస్థానంగా వేదాలలో పేర్కొనబడినట్టి కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్దపరిణామముపై ఆ తీర్థక్షేత్ర ప్రభావము గురించి అతడు చాలా భీతి చెందాడు. స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు, ఇతర పాండుసుతులపై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు. సంజయుడు వ్యాసుని శిష్యుడు, అందుకే ధృతరామ్జని భవనంలోనే ఉన్నప్పటికిని అతడు వ్యాసుని అనుగ్రహముచే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు. కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగాడు.
     పాండవులు, ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు. కాని ధృతరాష్ట్రుని మనస్సు ఇక్కడ బయటపడింది. అతడు ఉద్దేశపూర్వకంగా కేవలము తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండుసంతానాన్ని వంశము నుండి వేరు పరిచాడు. ఈ విధంగా పాండుసుతులతో, అంటే తన సోదరుని సంతానముతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టి సంబంధ స్థితిని ఎవ్వరైనా అర్థం చేసికోగలుగుతారు. పంట పొలము నుండి కలుపుమొక్కలను తీసివేసీ రీతిగా, ధర్మపితయైన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నట్టి కురుక్షేత్రములోని ధర్మక్షేత్రమునుండి కలుపుమొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర తనయులు పెరికివేయబడతారని, ధర్మరాజాది పరమధర్మయుతులు భగవంతునిచే నుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడింది. చారిత్రిక వైదిక ప్రొముఖ్యముతో పాటుగా ధర్మక్షేత్రము, కురుక్షేత్రము అనే పదాలకు ఈ విశేషార్థము ఉన్నది.

శ్లోకము - 2
సంజయ ఉవాచ 
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||

సంజయః ఉవాచ - సంజయుడు పలికాడు; దృష్ట్యా - చూసిన తరువాత; తు - కాని; పాండవానీకం - పాండవుల సీనను; వ్యూఢం - వూ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి; దుర్యోధనః - రాజగు దుర్యోధనుడు; తదా - అప్పుడు; ఆచార్యం - గురువు; ఉపసంగమ్య - దగ్గరకు వెళ్ళి; రాజా - రాజు; వచనం - మాటలు; అబ్రవీత్ - పలికాడు.
   సంజయుడు పలికాడు: ఓ రాజా! పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు.

భాష్యము : ధృతరాష్ట్రుడు పుట్టుకతో గ్రుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడ లోపించింది. ధర్మవిషయంలో తన పుత్రులు కూడ ఆంతే గ్రుడ్డివాళ్ళని అతనికి బాగా తెలుసు. పుట్టుక నుండే ధర్మాత్ములైనట్టి పాండవులతో వారు ఒక ఒడంబడికకు ఏనాడు రాలేరని అతడు నిశ్చయం చేసికొన్నాడు. అయినా తీర్ధక్షేత్ర ప్రభావము గురించి అతడు సందేహించాడు. యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసికోగలిగాడు. అందుకే నిరాశలో ఉన్నట్టి రాజుకు ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్ధక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని ఆ విధంగా ఆశ్వాసం ఇచ్చాడు. 
 పాండవసీనా బలాన్ని చూసిన తరువాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియజేయడానికి సేనాధిపతియైన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికిని పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు. కాని పాండవసేనా వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది. 


'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top