'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-8

'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-8

శ్లోకము - 26
తత్రావశ్యత్ స్థితాన్ పార్ణః పితృనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్ భ్రాత్యన్ పుత్రాన్ సౌత్రాన్ సఖీంస్తథా |
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ||
తత్ర - అక్కడ; అపశ్యత్ - చూసాడు; స్థితాన్ - నిలబడియుండి; పార్థః - అర్జునుడు; పితౄన్ - తండ్రులను; అథ - కూడా; పితామహన్ - తాతలను; ఆచార్యాన్ - గురువులను; మాతులాన్ - మేనమామలను; భ్రాతృన్ - సోదరులను; పుత్రాన్ - పుత్రులను; పౌత్రాన్ - మనుమలను; సఖీన్ - మిత్రులను; తథా - కూడ; శ్వశురాన్ - మామలను; సుహృదః - శ్రేయోభిలాషులను; - కూడ; ఏవ - నిక్కముగా; సేనయో - సేనలలో; ఉభయోః - రెండు పక్షాల; అపి - కలిపి.
   ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను చూసాడు.

భాష్యము : రణరంగములో అర్జునుడు నానారకాల బంధువులను చూసాడు. తన తండ్రికి సమకాలీకులైన భూరిశ్రవుని వంటివారిని, తాతలైన భీష్ముడు సోమదత్తులను, ద్రోణాచార్యుడు కృపాచార్యుని వంటి గురువులను, శల్యుడు శకుని పంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మ ణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూసాడు. పలువురు మిత్రులతో కూడియున్న సీనలను కూడ అతడు గాంచగలిగాడు

శ్లోకము - 27
తాన్ సమీక్ష్య స కౌస్తేయః సర్వాన్ బస్థూనవస్థితాన్ |
కృపయా పరయావిష్ఠో  విషీదన్నిదమబ్రవీత్ ||
తాన్ - వారినందరిని; సమీక్ష్య - చూసిన తరువాత; సః - అతడు; కౌన్తేయః - కుంతీ పుత్రుడు; సర్వాన్ - నానారకాల; బన్దూన్ - బంధువులను; అవస్థితాన్ - ఉన్నట్టి; కృపయా -కరుణతో; పరయా - అధికమైనట్టి; ఆవిష్టః - లోనై; విషీదన్ - చింతిస్తూ; ఇదం - ఈ విధంగా; అబ్రవీత్ - పలికాడు.
  ఆ నానారకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనే ఈ విధంగా పలికాడు.

శ్లోకము - 28
అర్జున ఉవాచ
దృష్ట్వీమం స్వజనం కృష్ణం యుయుత్సుం సమువస్థితం |
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ||
అర్జునః:ఉవాచ - అర్జునుడుపలికాడు; దృష్ట్వా - చూసిన తరువాత; ఇమం - ఈ అందరు;  స్వజనం - స్వజనులను; కృష్ణ - ఓ కృష్ణా, యుయుత్సుం - యుద్ధోత్సాహముతో; సముపస్థితం - ఉన్నట్టి; సీదన్తి - కంపిస్తున్నాయి; మమ - నా యొక్క; గాత్రాణి - దేహాంగాలు; ముఖం - నోరు;- కూడ; పరిశుష్యతి - ఎండిపోతున్నది.
   అర్జునుడు పలికాడు : కృష్ణా! ఇంతటి యుద్దోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది.

భాష్యము : భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషైనా దైవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు. కాగా అభక్తుడు విద్యాసంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీని దైని గుణాలు లోపించి ఉంటాడు. తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్కమారుగా వారి పట్ల కృపావూర్ణుడయ్యాడు. తన సైనికుల పట్ల ఆతడు మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు, కానీ ప్రతివక్ష సైనికులకు ఆసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడ అతడు కృపాభావాన్ని పొందాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు అతని దేహాంగాలు కంపించాయి, నోరు ఎండిపోయింది. వారందరి యుద్ధోత్సాహాన్ని చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. దాదాపు రాజవంశమంతా, అంటే అర్జునుని రక్తసంబంధికులు అందరు అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. 
   అర్జునుని  వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్నతకు గురిచేసింది. ఇక్కడ పేర్కొనబడనప్పటికిని అరునుని దేహాంగాలు కంపించడము, నోరు ఎండిపోవడమే కాకుండ కరుణతో రోదిస్తున్నాడని కూడ ఎవ్వరైనా సులభముగా ఊహించుకోగలరు. అర్జునునిలో అటువంటి లక్షణాలు బలహీనత వలన గాక అతని మృదుహృదయము వలననే కలిగాయి. అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవద్భక్తుని లక్షణము. అందుకే భాగవతములో (5.18.12) ఈ విధంగా చెప్పబడింది. 
యస్యాస్తి భక్తిర్భగవత్యకించనా సర్వై ర్గుణైస్తత్ర సమాసతే సురాః
హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథేనాసతి ధావతో బహిః ||
భగవంతుని యెడ అకుంఠితమైన భక్తి కలిగినవాడు దేవతల సకల శుభలక్షణాలను కలిగి ఉంటాడు. కాని అభక్తుడు విలువలేనట్టి లౌకికయోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు. ఎందుకంటే వాడు మానసికస్థాయిలో సంచరిస్తూ మిరమిట్లు గొలిపీ భౌతికశక్తిచే ఆకర్షితుడు కావడము సునిశ్చితము. 


'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top