ఉమ్మడి కుటుంబం, వసుధైక కుటుంబం - Ummadi Kutumbamu

0
ఉమ్మడి కుటుంబం, వసుధైక కుటుంబం - Ummadi Kutumbamu
హిందూ కుటుంబం
: ఉమ్మడి కుటుంబం :
 • భార్య తప్పు చేస్తే భర్తని తప్పు బడతారు, భర్తకి చెడ్డ పేరు....
 • అలాగే బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులను,
 • ఆడపిల్ల తప్పు చేస్తే తల్లిని,
 • మగ పిల్లవాడు తప్పుజేస్తే తండ్రిని,
 • శిష్యుడు తప్పుజేస్తే గురువును,
 • ప్రజలు తప్పు జేస్తే రాజును నింద జేస్తారు... వాళ్ల ఖాతాలో ఈ పాపాన్ని వేస్తారు... రాజు సరిగా పరిపాలించలేదని, గురువు శిష్యునికి మంచి బుద్దులు నేర్పలేదని, తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్ధులు చెప్పలేదని లోకం అంటుంది, ధర్మం కూడా అదే చెబుతుంది. బిడ్డలకు విద్యా బుద్ధులతో బాటు మంచి సంస్కారం ఇవ్వకపోతే....ఆ పాపం ఎవరిది?
 • మంచి నడవడిక ఇవ్వలేదు, కొడుకు కోడలను బాగా చూసుకోలేదు, భార్యను వదిలేసినాడు,
 • తప్పు ఎవరిది?
 • లోకం ఎవరిని అంటుంది.....పిల్లలకు మంచి విషయాలు చెప్పాలా? పల్లేదా?
 • పట్టించుకోవాలా? పల్లేదా?
 • మనం మంచి నడవడిక నేర్పనందువలన, భార్య విలువ తెలియనందు వలన కొడుకు కోడలను వదిలేసినాడు.....తప్పు ఎవరిది? ఆ పాపం ఎవరిది?
 • కొడుకు ఆవేశం అణుచుకోలేక తప్పు జేసి జైలుకు వెళ్లాడు ....ఆ తప్పు ఎవరిది?
 • ఆ కొడుకును ఎప్పటికప్పుడు సరియైన శిక్షణలో పెంచకుండా వదిలివేసిన ఆ తల్లిదండ్రులది పాపం.....గారాబం....మొండితనం.....చెప్పిన మాట వినకుండా పోవడం....
 • మన కంటి ముందే మన పిల్లవాడు పాడైపోయినాడు, చెడిపోయినాడు......తప్పు ఎవరిది?
 • ఎంత మంది మగ వాళ్లు తమ భార్యలను ఏడిపించుకొని తింటున్నారో తెలుసా?
 • ఎంత మంది కూతుళ్లు కోడళ్లు అయ్యి అత్తమామలను వేధిస్తున్నారో తెలుసా?
 • ఇది మనం మన పిల్లలను సక్రమంగా పెంచకపోవడం వలనే కదా?
  కొంత మంది మిత్రులు చెబుతున్నారు....పిల్లలను తప్పు బట్టకూడదని, కొంత వయసు వచ్చిన తరువాత వాళ్ల విషయాలలో పట్టించుకోకూడదని...వాళ్ల దగ్గర నుంచి మనం ఏదీ ఆశించకూడదని...వాళ్ల మీద ఆధారపడకూడదని, విడిగా వుండాలని, దూరంగా వుండాలని, అంటీ అంటనట్లు వుండాలని................ఇది తప్పు. వాళ్ల దైనందిక విషయలలో మనం పట్టించుకోకూడదు గానీ, వాళ్ల తప్పు ఓప్పుల గురించి పట్టించుకోవాలి....మంచి చెడ్డలు గురించి చెప్పాలి.... దాన దర్మములను గురించి, పాప పుణ్యములను గురించి పదే పదే చెప్పాలి....మంచి నడవడికను, సంస్కారాన్ని నేర్పించాలి.

మనం చెప్పక, వాళ్లు తెలుసుకొనక తప్పుచేసి, పాపం చేసి శిక్ష అనుభవిస్తూ వుంటే, నిజంగా ఆ శిక్ష ఎవరికి? తండ్రిగా చూస్తూ వుండగలవా? ఆ శిక్ష నీకు వేసినట్లు....పిల్లలు బాధపడుతూ వుంటే అది చూసి ఏడవమని భగవంతుడు నీకు వేసిన శిక్ష అది....
 • ఉదాహరణకు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పలేదు, జోక్యం చేసుకోలేదు....చివరికి తన ముందే కొడుకు మరణించాడు....ఆ క్షోభ ఎవరికి?
 • ధ్రౌపది విషయంలో భీష్మడు వారించకుండా, మిన్నకుండా చూస్తూ వుండిపోయినాడు, శిక్ష అనుభవించినాడు....ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భీష్మునికి చెబుతాడు....
 • ధర్మం తప్పినట్లు అవుతుంది తండ్రిగా వారించకపోతే,  చెప్పకపోతే.....
 • కొడుకు చేసిన పాపం తండ్రిగా నీవు అనుభవించాలి....
 • కొడుకుకు మంచి చెడు చెప్పి, కొడుకు చేత ధర్మకార్యములు చేయించే భాద్యత నీదే....
 • పెళ్లి చేసేశాను నా భాధ్యత అయిపోయింది అనుకొంటే కుదరదు....మనవడు పుట్టేదాక భాధ్యత వుంది, చివరి వరకు కొడుకును తీర్చిదిద్ద వలసిన భాధ్యత తల్లిదండ్రుల మీద వున్నది...
 • తల్లిదండ్రులను చూడవలసిన భాధ్యత కొడుకు కోడలు మీద వున్నది....పిల్లల దగ్గరనే పెద్దలు వుండి ఆ పుణ్యాన్ని పిల్లలకు కట్టబెట్టే భాధ్యత కూడా తల్లిదండ్రుల మీద వున్నది....మన పురాణాలలో ఇదే చెప్పబడి వున్నది....ఇదే శాస్త్ర వచనం....ఇది నా వచనం కాదు...
 • శిష్యుడ్ని గురువు డండించక పోతే ఎలాగ? నాకెందుకులే అని ఊరకుండితే ఎలాగ? గురువులు వచ్చి నిలదీస్తే రాముల వారు పరిగెత్తినారు, శ్రీ కృష్ణుడు పరుగెత్తినాడు....
ఆఖరాకి భగవంతుడు భక్తుని నుంచి భక్తి కోరుకొంటున్నాడు....except చేస్తున్నాడు..భక్తుడు పూజ చేసి పుణ్యాన్ని అడుగుతున్నాడు, మోక్షాన్ని అడుగుతున్నాడు.....ఎదుటి వారి నుంచి మనం ఏదీ ఆశించకూడదు అంటే ఎలాగ? అది ఇతరుల వద్ద సరే బాగుంటుంది.....పిల్లల దగ్గర కుదరదు.....పిల్లల దగ్గర మనం ఆశించాలి, అప్పుడే మన ఋణం, వాళ్ల ఋణం తీరుతుంది.... పిల్లల ప్రేమను ఆశించాలి, వాళ్లు మనకు సేవ చేయాలి, మనల్ని బాగా చూడాలి, అది వాళ్ల విధి....ఆ అవకాశం వాళ్లకు ఇవ్వకుండా నీవు నీ అంతట వేరుగా వుంటే వాళ్లకు పుణ్యం ఎలా వస్తుంది? తల్లిదండ్రులకు సేవ చేసినాడు అనే పుణ్యం ఎలా వస్తుంది? చేయలేదు, చూడలేదు అనే పాపం వాళ్ల ఖాతాలో పడుతుంది నీవలన ...

అన్యం పుణ్యం ఎరుగని భార్యను,  భర్త ఉత్త పుణ్యానికి వదిలేసి భరణం ఇస్తాను అంటే ఎలా సరపోతుంది....ఎవరి లెక్కన వేయాలి ఈ పాపం....ప్రేమగా చూడాలా పల్లేదా? అనుబంధం ఎక్కడి నుంచి వస్తుంది....కొంత మంది తల్లిదండ్రులు కొడుకుకు మంచి చెప్పకుండా కోడలను తరిమేసి ఆనందిస్తున్నారు.....తప్పు ఎవరి లెక్కలో వేయాలి....సంసారాన్ని చక్కదిద్దాల్సిన భాధ్యత తల్లిదండ్రుల మీద లేదా? జోక్యం చేసుకోకూడదు అంటే ఎలాగ? ఆ అమ్మాయి బ్రతుకు ఎమి కావాలి? కొడుకును నాలుగు తన్ని పో పో పోయి కోడలను పిల్చుకొనిరా అనాలి...
అలాంటి పనికిమాలిన తల్లిదండ్రులు లోకంలో వున్నారు.....మనకెందులే తలదూర్చకూడదని.

దయచేసి విదేశీ సంస్కృతిని ఇక్కడకు తీసుకొని రావద్దండి..... మనది వసుధైక కుటుంబం ... వారసత్వ కుటుంబం.... ఉమ్మడి కుటుంబం.... అమ్మా, నాన్నలతో, తాతయ్య, బామ్మలతో పెరిగే కుటుంబం..... అత్తా- మామలతో ఆడుకొనే కుటుంబం.... బంధువులతో, స్నేహితులతో, ప్రేమానురాగాలతో ఓలలాడే కుటుంబం మనది.

రచన: భాస్కరానంద నాథ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top