అష్టభైరవులు - రూపాలు - మహిమలు - Ashta Bhairavas

0
అష్టభైరవులు - రూపాలు - మహిమలు - Ashta Bhairavas

: అష్టభైరవులు - రూపాలు - మహిమలు :
నుషులుగా ఈ భూమ్మీద జన్మించి కష్టాలు,దుఃఖాలు అనుభవిస్తున్న జీవులు తమ దుఖాలను నివృత్తి చేసుకోవడం కోసం భైరవుడిని సేవించాలి. సతీదేవి శరీరత్యాగం చేసిన కారణంతో శివుడు దుఖాన్ని తట్టుకోలేక భైరవ రూపాన్ని ఆశ్రయించాడు. కనుక భైరవుడిని సేవిస్తే శివున్ని సేవించినట్లే."నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూర్చూతాను." అని సదాశివుడి వాక్యం.

అసితాంగో రురుశ్చండహ్ క్రోధశ్ఛోన్మత్త భైరవ
కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాహ్

కాలభైరువుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి. 
  1. అసితాంగ భైరవుడు
  2. రురు భైరవుడు
  3. చండ భైరవుడు
  4. క్రోధ భైరవుడు
  5. ఉన్మత్త భైరవుడు
  6. కపాల భైరవుడు
  7. భీషణ భైరవుడు
  8. సంహార భైరవుడు

ఈ ప్రతి ఒక్క రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

1. అసితాంగ భైరవుడు - Sri Asithanga Bhairavar :
  ఈయన నల్లని/బంగారు శరీరఛాయలో, శాంతి రూపంలో, దిగంబర శరీరంతో, మూడూ కళ్ళతో, బ్రహ్మీ శక్తితో కూడి నాలుగు చేతులతో ఉంటాడు. అక్షమాల, ఖడ్గం, కమండలం, పానపాత్ర నాలుగు చేతులలో ధరిస్తాడు. ఈయన హంసవాహనుడు. వరాలనిస్తాడు భూషణాధికారి. సరస్వతి ఉపాసకులు అసితాంగ భైరవుని అర్చించి సిద్ది పొందాలి. ఆ తరువాతే సరస్వతీ ఉపాసన సిద్దిస్తుంది.

1. అసితాంగ భైరవుడు - Sri Asithanga Bhairavar :

ఈయన బ్రహ్మ స్వరూపుడు.  మహా సరస్వతికి క్షేత్రపాలకుడు. 
ఈయన తూర్పు దిశకు అధిపతి.

2. రురు భైరవుడు  - Sri Ruru Bhairavar :
  ఈయన స్వచ్చమైన స్పటికంలాగ తెల్లని శరీర ఛాయతో, మూడు కళ్లతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, చిరునవ్వుతో, మహేశ్వరి శక్తితో  కూడిన కుమారరూపంతో వృషభ వాహనుడిగా ఉంటాడు. నాలుగు చేతుల్లో కత్తి, టంకము, పాత్రను, లేడిని ధరించి ఉంటాడు. శ్యామల, ప్రత్యంగిర, దశమహావిద్యలు మొదలగు ఉపాసకులు ముందు ఈయనని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే అమ్మవారి ఉపాసనలు సిద్దిస్తాయి. 

2. రురు భైరవుడు  - Sri Ruru Bhairavar :

ఈయన రుద్ర స్వరూపుడు. రుద్రాణికి క్షేత్రపాలకుడు. 
ఈయన ఆగ్నేయ దిశకు అధిపతి.


3. చండ భైరవుడు - Sri Chanda Bhairavar :
  ఈయన తెల్లని శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబరంగా, కౌమారి శక్తితో, శాంత కుమార రూపంలో నెమలి వాహనంతో ఉంటాడు. సుబ్రమణ్య ఉపాసకులు,కన్యకాపరమేశ్వరి ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్దిస్తాయి. 

3. చండ భైరవుడు - Sri Chanda Bhairavar :

ఈయన సుబ్రమణ్య స్వరూపుడు. 
సర్పదోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు,వివాహం కానివారు ఈయన్ని ఉపాసించాలి.
ఈయన దక్షిణ దిశకు అధిపతి.


4. క్రోధ భైరవుడు - Sri Krodha Bhairavar :
  ఈయన నీలి శరీర ఛాయతో,మూడు కళ్ళతో,నాలుగు చేతులతో,దిగంబర శరీరంతో,వైష్ణవి శక్తితో కూడిన శాంత రూపంతో గరుడ వాహనారూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో గద, చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ, హనుమ, సుదర్శన, నారసింహ, వరాహ, కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి.

4. క్రోధ భైరవుడు - Sri Krodha Bhairavar :

ఈయన విష్ణు స్వరూపుడు. నైరుతి దిశకు అధిపతి.


5. ఉన్మత్త భైరవుడు - Sri Unmatha Bhairavar :
   ఉన్మత్త భైరవస్వామి బంగారం లాగ పచ్చని శరీర ఛాయతో, మూడు కండ్లతో, నాలుగు చేతులతో,దిగంబరుడిగా, వారాహి శక్తితో కూడిన శాంత రూపంలో, అశ్వరూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో రోకలి, కత్తి, కపాలము, వేటకత్తి ధరించి ఉంటాడు. వారాహి,కుబేర ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్దిస్తాయి.

5. ఉన్మత్త భైరవుడు - Sri Unmatha Bhairavar :

ఈయన వారాహి స్వరూపుడు. పశ్చిమ దిక్కుకి అధిపతి.


6. కపాల భైరవుడు - Sri Kapaala Bhairavar :
   ఈయన ఎర్రని దేహకాంతితో, మూడు కళ్ళతో, నాలుగు చేతులు,దిగంబర శరీరంతో, ఇంద్రాణీ శక్తితో కూడిన శాంతమైన బలరూపంతో గజవాహనుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో వజ్రం,ఖడ్గం, పానపాత్ర, పాశం ధరించి ఉంటాడు. భౌతిక సుఖ సంపదలు కావాల్సిన వారు ఈయన ఉపాసన చేయాలి. ఈ ఉపాసనతో ఈ లోకంలోనూ,స్వర్గలోకంలోను సుఖాలు సిద్దిస్తాయి.

6. కపాల భైరవుడు - Sri Kapaala Bhairavar :

ఈయన దేవరాజు ఇంద్ర స్వరూపుడు. స్వర్గ క్షేత్రపాలకుడు.
ఈయన వాయువ్య దిశకు అధిపతి.


7. భీషణ భైరవుడు - Sri Bheeshana Bhairavar :
  ఈయన ఎర్రని శరీర ఛాయతో,మూడు కళ్ళతో,నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, చాముండా శక్తితో, శాంత బాలరూపంతో, సింహ వాహనారూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో శూలం, ఖడ్గం, కపాలము, ముద్గరం ధరించి ఉంటాడు. చండి,చాముండా ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతో చండీ సప్తసతి  సిద్దిస్తుంది. 

7. భీషణ భైరవుడు - Sri Bheeshana Bhairavar :

ఈయన చాముండాకు క్షేత్ర పాలకుడు. ఈయన ఉత్తర దిశకు అధిపతి.


8. సంహార భైరవుడు - Sri Samhaara Bhairavar :
  సంహార భైరవుడు మూడు కళ్లు, పది చేతులు కలవాడై,నాగ యజ్ఞోపవీతం ధరించి, దిగంబరంగా, బాల రూపంతో, కోరలు గల భయంకర వదనంతో, కుక్క వాహనంగా గలవాడై ఉంటాడు.చేతుల్లో శూలం, చక్రం, గద, ఖడ్గం, అంకుశం, పాత్ర, శంఖం, డమరుకం, వేటకత్తి, పాశం ధరించి ఉంటాడు. తాంత్రికులు కాపాలికులు,యామలులు,ముందుగా ఈయన్ని ఉపాసించాలి. ఈయన దయవల్లే తాంత్రిక షట్కర్మలు సిద్దిస్తాయి, ఫలవంతమౌతాయి.

8. సంహార భైరవుడు - Sri Samhaara Bhairavar :

ఈయన సర్వశక్తి స్వరూపుడు.తంత్ర క్షేత్రపాలకుడు. ఈయన ఈశాన్య దిశకు అధిపతి.

దిగంబరాయ విద్మహే
కాశీక్షేత్రపాలాయ ధీమహి
తన్నో కాల భైరవ ప్రచోదయాత్


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top