ప్రతినిత్యం మన దగ్గర ఉంచుకోవాల్సిన కొన్ని ఆయుర్వేద మూలికలు - Some Ayurvedic herbs to be kept with us everyday

0
ప్రతినిత్యం మన దగ్గర ఉంచుకోవాల్సిన కొన్ని ఆయుర్వేద మూలికలు - Some Ayurvedic herbs to be kept with us everyday
 1. అల్లం: అల్లం శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగపడుతుందని సైన్స్ చెబుతుంది.
 2. తాటిబెల్లం : ఆయుర్వేదంలో చేదు లేదా ఘాటైన మొక్కలను ఔషదంగా ఉపయోగెంచడానికి ఆ ఔషదాన్ని తాటిబెల్లంతో తీసుకుంటారు. తాటిబెల్లం రుచికి తియ్యగా ఉన్నా ఆ ఔషదం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటిబెల్లాన్ని వాడతారు. 
 3. తేనే: తేనె ను ఆయుర్వేదంలో చాలా ఔషదాల్లో వాడతారు. ఔషధాలు డైరెక్ట్ గా రక్తంలో కలవడానికి చాలా రకాల ఔషధాలను తేనెతో కలిపి తీసుకుంటారు. తేనే కు కఫాన్నీ తగ్గించే గుణధర్మం ఉంటుంది.
 4. నల్లజిలకర్ర: ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలసట,బలహీనతలను తగ్గిస్తుంది. నల్లజిలకర్రకు యాంటీ మైక్రోబయాల్ లక్షణం ఉండటంచేత ఉదరంలో ఏర్పడే పురుగులను తొలగించడానికి , కడుపునొప్పికి , విరచనాల్లో మరియు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగిస్తుంది. తేనే,నల్లజీలకర్ర,వెల్లుల్లి కలిపి వాడితే జలుబు , దగ్గు తగ్గుతుంది. నల్లజిలకర్ర ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. నల్లజిలకర్ర లో క్యాల్షియం, మెగ్నీషియం,పోటాషియం, పాస్ఫరస్,జింక్,మాంగనీస్ కాపర్ మరియు ఐరన్ ఖనిజ పోషకాలు ఉన్నాయి. నల్లజిలకర్ర లో థైమోక్వీనోన్ ఉండటంచేత ఇది బయోయాక్టీవ్ కాంపోనెంట్ గా ఉపయోగపడుతుంది. నల్లజిలకర్ర హనీకర , సూక్ష్మజీవుల నుండి మరియు బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది. నల్లజిలకర్ర అధిక కోవ్వును కూడా తగ్గిస్తుంది.
 5. తోకమిరియాలు: ఆయుర్వేదంలో తోకమిరియాలను స్వరపేటిక దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు మరియు జలుబు,దగ్గు,కండరాల నొప్పికి తోకమిరియాలను వాడతారు.
 6. లవంగాలు: లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ ,యాంటీ వైరల్ లక్షణాలు జలుబు,దగ్గను నివారిస్తుంది. లవంగాల్లోని యుజెనల్ అనే పధార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు ఉండటంచేత శరీరంలో సైటోకైన్లను తగ్గిస్తుంది కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. లవంగాలను తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
 7. వేప: వేప మూడువేల సంవత్సరాల నుండి భారతదేశంలో వాడుతున్న ఒక ఔషధ మూలిక. వేపలో సహజ కీటకనాసిని అజాదిరాచ్టిన్ కలిగి ఉంటుంది. వేప రోగనిరోధక చర్యను మోరుఘుపరచడానికి, విభిన్న  బ్యాక్టీరియా ,వైరస్ , శిలీంధ్రం మరియు పరాన్నజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. దగ్గు,ఆస్తమా,కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో వేప ఉపయోగపడుతుంది. వేప తెల్లరక్తకణాలైన లింఫోసైట్స్ ,మోనోసైట్స్ లను గణనీయంగా పెంచుతుంది కాబట్టి శరీరంలో సంక్రమించే సూక్ష్మ జీవులపై పోరాడుతుంది. వేపను కడుపునొప్పి , అతిసారం,గ్యాస్,అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
 8. నేరేడు: ఈ మొక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా ఇది దివ్వ ఔషదంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఈ ఔషదాన్ని వాడతారు. జ్వరాన్ని తగ్గించడానికి నేరెడు చెట్టు ను వాడతారు. ఈ మొక్క బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది.అధిక రక్తపోటు ను నివారిస్తుంది.
 9. మామిడి: కడుపులో పురుగులను తొలగించడానికి,జ్వరాన్ని తగ్గించడానికి, కాలేయసమస్యలో ఈ చెట్టును వాడతారూ.
 10. నేల ఉసిరి: వైరల్ జ్వరాలకు తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు. ఉదర మరియు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు హెపటైటిస్ -బి వైరస్ ను నిర్ములించడానికి వాడతారు.
 11. కొండపల్లేరు: ఆయాసం,ఉబ్బసంను తగ్గించడానికి వాడతారు. క్షయ వ్యాధితో దగ్గు మరియు దెర్బల్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు సంతోష శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.
 12. కుప్పింటాకు రోగనిరోధక శక్తిని పెంచడానికి, దగ్గు,జలుబు, గొంతునొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపులో ఉన్న నూలిపురుగులను తొలగించడానికి,కీళ్ల నొప్పులకు ఈ మొక్కను వాడతారు.   
 13. తెల్లజిల్లేడు పువ్వు : దీర్ఘకాలికంగా ఉన్న అస్తమాను నివారించడానికి ఉపయోగిస్తారు.ఈ మొక్క వేర్లను పాముకుటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు...
 14. ముళ్ల వంకాయ: ముళ్ల వంకాయ రక్తం పలచ బడటానికి వాడతారు.
 15. పట్ట (దాల్చిన చెక్క): దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి...షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులు నుంచి కాపాడుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top