శ్రీ వరాహస్వామివారి ఆలయ విశేషాలు - Sri Varahaswamy Temple

0
శ్రీ వరాహస్వామివారి ఆలయ విశేషాలు - Sri Varahaswamy Temple

: శ్రీ వరాహస్వామివారి ఆలయం :

తిరుమలలో శ్రీస్వామి పుష్కరిణికి వాయవ్యమూలలో తూర్పుముఖంగా శ్రీవరాహస్వామి ఆలయం ఉంది . శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవత రించి భూదేవిని రక్షించి ఇక్కడే నిలిచాడు . అందుకే ఇది ఆదివరాహ క్షేత్రమని ప్రసిద్ధి పొందింది . ఆ తర్వాత మరి కొంతకాలానికి శ్రీనివాసుడు వైకుంఠం నుండి ఇక్కడికి వచ్చి తాను వుండడానికి శ్రీవరాహస్వామివారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు . 
  స్థలం 'దేహ్యవనీకాంత యావత్కలియుగం భవేత్ ఇతి తేన సవిజ్ఞప్తో వరాహవదనో హరి ఉవాచ' వచనం దేవ స్థలం మౌల్యేన గృహ్యతాం తి వాక్యం తత శ్రుత్వా ప్రోవాచ మధురం వచః. ప్రథమం దర్శనం చ స్యాన్నై వేద్యం క్షీర సేచనం ఇదమేవ పరం ద్రవ్యం దదామి కరుణానిధే. 'ఇత్యుక్తో హరిణాపోత్రీహరయే స్థాన కాంక్షిణే తదా దదౌ స్థలం ' పాదశతమాత్రం రమాపతే అని పేర్కొన్నట్లుగా ' ప్రథమదర్శనం , ప్రథమ పూజ , ప్రథమ నైవేద్యం ' అను నియమ ఒప్పందంతో దానపత్రం రాసిచ్చి , 100 అడుగుల స్థలాన్ని  దానంగా పొందినాడు . ఆ తర్వాతి కాలంలో ఆక్షేత్రంలో తన ప్రాబల్యాన్ని స్వామి పెంచుకున్నాడు వేంకటేశ్వరస్వామి . ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికీ తిరుమలలో శ్రీ భూవరాహస్వామివారికి తొలిగా పూజా నివేదనాడు లన్నీ సక్రమంగా జరుపబడుతున్నాయి. 
  అంతేగాక శ్రీవరాహస్వామివారికి స్వామివా వలసిన నివేదనలు , పూజాసామాగ్రి , వగైరాలన్నీ శ్రీవేంకటేశ్వర స్వామివారి వగైరాలను ఆలయం నుండే నేటికీ పంపబడుతుండటం గమనించదగిన విశేషం. ఈ వరాహస్వామిని తొలుత దర్శిస్తేనే శ్రీవేంకటేశ్వరుడు సంతోషిస్తాడు కూడా.

 నమో వెంకటేశాయ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top