ఆత్మజ్ఞానము - Agnanamu - Soul-Wisdom

0
: ఆత్మజ్ఞానము :
జ్ఞానమే మాయ. ఈ శరీరమే నేను అనుకోవడం మాయాకార్యం. దీనివల్ల అహంకారం ఏర్పడి, తాను పరమాత్మ కన్న భిన్నుడనని జీవుడు భావిస్తాడు. ముందు సూక్ష్మరూపంలో ఉండే ఆహంకారం దేహమంతా వ్యాపించి  శరీరమే తాననే భావన ఏర్పడి, జీవుడు బద్ధుడవుతున్నాడు. విముక్తి యొక్క లక్ష్యం స్వస్వరూపావబోధం. అవబోధం అంటే మేల్కొనడం. అంటే అజ్ఞానమనే చీకటినుండి జ్ఞానోదయం అవ్వడమే ఇక్కడ మేల్కొన్న స్థితి అని చెప్పబడింది. 

   ఈ జ్ఞానం స్వస్వరూపం గురించి. అదే తన సహజానందస్థితి. ఆత్మయే జ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానం  అన్నమాట. అదే ఎరుక కలిగి ఉండటం అంటే. అట్టి ఎరుకయే ఆత్మ. అజ్ఞానం నుంచి మేల్కోగా, కలిగే జ్ఞానం యొక్క ఎరుకకై  ఉండే తపనయే ముముక్షుత్వ మని చెప్పబడింది. అంటే అజ్ఞానమనే చీకటి తొలగగా తన సహజస్థితిలో ప్రకాశించి ఉండటాన్ని మేల్కొన్న స్థితిగా చెప్పవచ్చు. అలాంటి స్వయంప్రకాశమైన స్వస్వరూపము యొక్క ఎరుకయే ఆత్మ. అదే జీవాత్మ పరమాత్మల అభేదతను గుర్తించడం. అదే ఆత్మసాక్షాత్కారం. అదే నిత్యమైన ఎరుక అన్నా, సస్వరూపాన్ని ఎరుగుట అన్నా రెండూ ఒక్కటే. బంధవిముక్తీ, ఆత్మ సాక్షాత్కారమూ ఒకేసారి జరుగుతాయి. కాబట్టి ఆత్మ జ్యోతిని చూడటమే వేదాంతం యొక్క లక్ష్యం. అట్టి స్వీయానుభవం వల్ల మాయాబంధం తొలగినట్లు గ్రహిస్తారు. 
    ఆత్మాన్వేషణలో మునిగినవారు , వారికి తటాలున ఆత్మదీప్తి కలిగినట్లు చెబుతారు. అందుకే అద్వైతసాధకుడు చివరి దశలో జీవ బ్రహ్మముల ఐక్యతను వివరించే మహావాక్యాలపై దృష్టిని పెడతాడు. ఆ అనుభవం వల్ల మాయబంధం తొలగినట్లు భావిస్తాడు. అందుకే ముముక్షుదశలో సాధకుడు బంధం నుంచి విముక్తి కోరుతాడు. అది దాటి తత్వజ్ఞానం కల్గినప్పుడు తన అసలైన సస్వరూపం తెలుసుకోవడం వల్ల బంధవిముక్తి పొందినట్లే. అంటే పొందినట్లు భావిస్తాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top