గోమాత విశ్వరూపం - Gomata

0
గోమాత విశ్వరూపం - Gomata
గోమాత విశ్వరూపం - Gomata

: గోవు విశ్వరూపం :
గోవు యొక్క కంఠం మస్తకం మధ్య గంగ ఉంటుంది. గోవు యొక్క సమస్త అంగములయందు సమస్త దేవతలున్నారు. సప్తర్షులు, నదులు, తీర్థములు గోవులో ఉన్నాయి. ఆవు యొక్క నాలుగు పాదాల్లోనూ ధర్మార్ధ కామ మోక్షములుంటాయి. అందుకే ఆవు కాళ్ళు కడిగి ఆ నీరు తలపై చల్లుకుంటే పాపాలు నశిస్తాయి. ఆవు ముఖంలో నాలుగు వేదాలు ఉంటాయి. అందుకే ఆవును ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాతనే నూతన గృహంలో యజమాని ప్రవేశిస్తాడు.గోధూళి తో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. గోవుకు నవధాన్యాలు ఆకుకూరలు పళ్ళు మొదలైనవి ఆహారంగా ఇస్తే శుభం కలుగుతుంది. రుణగ్రస్తులు బాధల నుండి బయటపడతారు. అందుకే పండుగలలోను, శుభకార్యాల సందర్భంగా ను గోపూజలు, గోదానం చేయడం జరుగుతోంది.

సూర్యచంద్రులు, శివుడు, కుమారస్వామి, గణపతి, విష్ణుమూర్తి, బ్రహ్మ, సరస్వతి, హనుమంతుడు, నవగ్రహాలు, కుబేరుడు, పర్వతాలు, అగ్ని, వరుణుడు,  నారదుడు, లక్ష్మి, భౌమాదేవి, భైరవుడు, వాయుదేవుడు మొదలగు ముప్పైమూడు కోట్లమంది దేవతలు గోవు శరీరంలో నివసించి ఉంటారు. గోవుకు ఆహారం సమర్పించినట్లైతే 33 కోట్ల దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే. అందుకే గో ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షణం చేసినట్లు అన్నారు.

గోమాత విశ్వమాత ఆవు యొక్క శక్తి. : ఒక్క ఆవు - ఇంటి ముందు ఉంటే.
 1. అన్ని దోషములను పోగొడుతుంది.
 2. అన్ని కష్టములను తొలగిస్తుంది.
 3. అన్ని సంపదలను ఇస్తుంది.
 4. అన్ని బాధలను పోగొడుతుంది.
 5. అన్ని కోరికలను తీరుస్తుంది.
 6. అన్ని కార్యములలోను విజయం ఇస్తుంది.
 7. మంచి సంతానమును ఇస్తుంది. అన్ని శుభములను ఇస్తుంది.
 8. అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.
 9. అన్ని సుఖములను ఇస్తుంది.
 10. అన్ని జాతక సమస్యలను పరిష్కరిస్తుంది..అంత గొప్పది ఆవుఆవుకు అంత శక్తి ఉంది. 
గోసేవ ఎందుకు చేయాలి ? గోసేవ మరియు దాని ప్రాముఖ్యత ఏంటి ?
 1. ఆరోగ్య సమస్య - గోసేవ చేయండి. 
 2. డబ్బు సమస్య - గోసేవ చేయండి.
 3. కుటుంబ సమస్య - గోసేవ చేయండి. 
 4. వివాహ సమస్య - గోసేవ చేయండి.
 5. ఉద్యోగ సమస్య - గోసేవ చేయండి. 
 6. పిల్లల సమస్య - గోసేవ చేయండి. 
 7. ఉద్యోగ భద్రత - గోసేవ చేయండి. 
 8. ఆసుపత్రి బాధ - గోసేవ చేయండి. 
 9. వ్యాపార సమస్య - గోసేవ చేయండి.
 10. కెరీర్ సమస్య - గోసేవ చేయండి. 
 11. మానసిక శాంతి - గోసేవ చేయండి.
 12. భక్తి అవసరం - గోసేవ చేయండి. 
 13. న్యాయ సమస్య - గోసేవ చేయండి.
 14. ఏదైనా సమస్య - గోసేవ చేయండి.
ఇది నిజమా? ఇన్ని సమస్యలు గోసేవతో తీరుతాయా నమ్మకంతో చేసి చూద్దాం.

గోమాత మహిమ :
 1. ఆవు పంచకం రోజు సేవిస్తే అన్ని పాపములు తొలగి పోతాయి. ఆవు పాలు + ఆవు పెరుగు+ ఆవు నెయ్యి+ఆవు మూత్రం+ ఆవు పేడ.
 2. ఆవుకు ప్రదక్షిణము చేయడం = అమ్మ వారికి ప్రదక్షిణము చేయడం
 3. ఆవు గొంతు తాకితే పుణ్యం
 4. ఆవు తోకతో చిన్న పిల్లలకు దిష్టి తీయవచ్చు
 5. ఆవు పేడతో విభూతిని /భస్మమును తయారు చేస్తారు
 6. ఆవు విభూతిని /భస్మమును తలపై చల్లుకొంటే స్నానం చేసిన పలితం వస్తుంది
 7. ఆవు గోరచనముతో గుడిలో దీపం వెలిగిస్తారు
 8. ఆవు కొమ్ముతో శివుడికి అభిషేకము చేస్తారు.
 9. పుట్టిన రోజున ఆవు పాలు+నల్ల నూగులు+బెల్లం తాగితే చిరంజీవిగా జీవిస్తారు.
 10. ఆవుకు ఎదైనా తనిపిస్తే, అది అమ్మ వారికి పెట్టిన పలితం వస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top