'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-16

'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-16

శ్లోకము - 44
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం | 
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ||

భోగ - భౌతికభోగానికి; ఐశ్వర్య - ఐశ్వర్యానికి; ప్రసక్తానాం - అనురక్తులైనవారికి; తయా - అటువంటివాటిచే; అపహృత చేతసాం - మనస్సులో మోహితులైనవారు; వ్యవసాయాత్మికా - స్థిరనిశ్చయము; బుద్ధిః - భగవానుని భక్తియుతసేవ; సమాదౌ - నియమిత మనస్సులో; న విధీయతే - కలుగదు.

ఇంద్రియభోగానికి, భౌతికసంపత్తికి అమితముగా ఆనురక్తులై అటువంటివాటిచే మోహితులయ్యేవారి మనస్సులలో భగవానుని భక్తియుతసేవ పట్ల స్థిరనిశ్చయము కలుగనే కలుగదు.

భాష్యము : సమాధి అంటే స్థిరమైన మనస్సని ఆర్థము. "సమ్యగాధీయతేస్మిన్నాత్మతత్త్వ 
యాథాత్మ్యమ్" ఆత్మావగాహన కొరకు మనస్సు స్టిరపడినప్పుడు సమాధిలో ఉన్నదిగా చెప్పబడుతుంది అని వేదనిఘంటువైన నిరుక్తి చెబుతున్నది. భౌతిక ఇంద్రియభోగాల పట్ల అభిరుచి కలిగి, అటువంటి తాత్కాలిక విషయాలచే మోహితులయ్యే జనులకు సమాధి ఎన్నడును సాధ్యము కాదు. వారు దాదాపుగా మాయచే శిక్షింపబడినవారే అవుతారు.

శ్లోకము - 45
త్రైగుణ్యవిషయా వేదా నిస్తైణ్యో భవార్డున |
నిర్ద్వందవో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||

త్రైగుణ్య - ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన; విషయాః - విషయాలపై; వేదాః - వేదములు; నిస్తైగుణ్యః - మూడు గుణాలకు అతీతుడవు; భవ - కావలసింది; అర్జున - ఓ అర్జునా; నిర్ద్వన్దః  - ద్వంద్వాలు లేకుండ; నిత్యసత్త్వస్థః - విశుద్ధ ఆధ్యాత్మిక అస్తిత్వ స్థితిలో; నిర్యోగక్షేమః - లాభక్షేమాల ఆలోచనల నుండి విడివడి; ఆత్మవాన్ - ఆత్మలో నెలకొనవలసింది.

వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి, అర్జునా! నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావలసింది. సకల ద్వంద్వాల నుండి లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసింది.

భాష్యము : సమస్త భౌతికకార్యాలు ప్రకృతి త్రిగుణాలలో చర్యప్రతిచర్యలను కూడి ఉంటాయి. అవి సకామఫలాలకే ఉద్దేశించబడ్డాయి. అవి భౌతికజగత్తులో బంధాన్ని కలుగజేస్తాయి. జనులను ఇంద్రియభోగ పదము నుండి ఆధ్యాత్మికపదములో ఒక స్థాయికి క్రమంగా తీసికొని పోవడానికే వేదాలు దాదాపుగా సకామకర్మలను చెబుతాయి. శ్రీకృష్ణభగవానుని శిష్యునిగా, మిత్రునిగా అర్జునుడు వేదాంతతత్త్వ దివ్యస్థాయికి ఎదగమని ఉపదేశించబడ్డాడు. బ్రహ్మజిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గురించిన ప్రశ్నలే వేదాంతతత్త్వ ఆరంభంలో ఉంటాయి. భౌతికజగత్తులోని జీవులందరు తీవ్రమైన జీవనసంఘర్షణలో నెలకొని ఉంటారు. ఈ భౌతికజగత్తును సృష్టించిన తరువాత భగవంతుడు వారికి వేదజ్ఞానాన్ని అందించి ఏ విధంగా జీవిస్తూ భవబంధవిముక్తులు
కావాలో ఉపదేశించాడు. ఇంద్రియభోగ కలాపాలు, అంటే కర్మకాండ విభాగము పూర్తి కాగానే ఉపనిషత్తుల రూపంలో ఆధ్యాత్మికానుభూతికి అవకాశము ఇవ్వబడింది.
   భగవద్గీత పంచమవేదమైనట్టి మహాభారతంలో భాగమైనట్లుగా, ఉపనిషత్తులు వివిధ వేదాలలోని భాగాలు, ఉపనిషత్తులే ఆధ్యాత్మికజీవన ఆరంభాన్ని సూచిస్తాయి. భౌతికదేహము ఉన్నంతవరకు భౌతికగుణాలతో కూడిన చర్యలు, ప్రతిచర్యలు తప్పవు, కనుక సుఖదుఃఖాలు లేదా శీతోష్ణాల వంటి ద్వంద్వాలను సహించడం మనిషి నేర్చుకొని, అట్టి ద్వంద్వసహనము ద్వారా లాభనప్టాల చింతల నుండి విముక్తుడు కావాలి. శ్రీకృష్ణుని సంకల్పము మీదనే పూర్తిగా ఆధారపడినప్పుడు సంపూర్ణ కృష్ణభక్తి భావనలో ఈ దివ్యస్థితి లభిస్తుంది.

శ్లోకము - 46
యావానర్థ ఉదపానే సర్వతః సంప్ణుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ||

యావాన్ - ఏవైతే; అర్ధః - ఉపయోగాలు; ఉదపానే - నీళ్ళబావితో; సర్వతః - అన్నివిధాలుగా; సంప్ణుతోదకే - పెద్ద జలాశయముతో; తావాన్ - అదేవిధంగా; సర్వేషు - అన్ని; వేదేషు - వేదాలలో; బ్రాహ్మణస్య - పరబ్రహ్మమును ఎరిగినవానికి; విజానతః - పూర్ణజ్ఞానవంతుడు.

చిన్న బావిచే ఒనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నట్టి ఉద్దేశమును ఎరిగినవానికి సిద్ధిస్తాయి.

భాష్యము : వేదవాఙ్మయములోని కర్మకాండ విభాగంలో పేర్కొనబడిన ఆచారకర్మలు ప్రోత్సహించడానికే ఉద్దేశించబడ్డాయి. 

ఇక ఆత్మానుభూతి ఉద్దేశము భగవద్గీతలోని (15.15) పదిహేనవ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. సమస్తానికీ ఆదికారణమైనట్టి శ్రకృష్ణభగవానుని తెలిసికోవడమే వేదాధ్యయనము యొక్క ఉద్దేశము. కనుక ఆత్మానుభవమంటే శ్రీకృష్ణుని, ఆతనితో మనిషికి ఉన్నట్టి నిత్యసంబంధాన్ని తెలిసికోవడమని అర్థం. జీవులకు శ్రీకృష్ణునితో ఉన్నట్టి సంబంధము కూడ భగవద్గీతలోని (15.7) పదిహేనప అధ్యాయంలో పేర్కొనబడింది. జీవులందరు శ్రీకృష్ణుని అంశలు. కనుక వ్యక్తిగతజీవుడు కృష్ణభక్తిభావనను జాగృతము చేసికోవడమే మహోన్నతమైన వేదజ్ఞాన పరిపూర్ణస్థితి అవుతుంది. ఇది శ్రీమద్భాగవతములో (3.33.7) ఈ విధంగా ధ్రువపరుపబడింది :

అహో బత శ్వపచోకఃతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం |
తేపుస్తపస్తే జుహువు; నస్నురార్యా బ్రహ్మానూచుర్నామ గృణన్తి యే తే ॥

" దేవా! నీ పవిత్ర నామాన్ని కీర్తించేవాడు నీచమైన చండాలుని (కుక్కమాంసం తినేవాడు) వంశంలో పుట్టినప్పటికిని అత్యున్నతమైన ఆత్మానుభూతి స్థాయిలో నెలకొని ఉంటాడు. అటువంటివాడు వేదానుష్టానము ప్రకారము అన్ని రకాలైన తపస్సులను, యజ్ఞాలను చేసినవాడే, అన్ని తీర్థాలలో స్నానం చేసిన తరువాత వలుమార్లు వేదవాఙ్మయాన్ని అధ్యయనం చేసినవాడే అవుతాడు. అట్టి వ్యక్తి ఆర్యవంశములో ఉత్తమునిగా పరిగణించబడతాడు. 
     కనుక మనిషి కేవలము కర్మకాండకే అనురక్తుడు కాకుండ వేదాల ఉపయోగాన్ని అర్థం చేసికొనేటంత తెలివి కలవాడు కావాలి. ఉన్నతమైన ఇంద్రియభోగం కొరకు స్వర్గలోకాలను పొందాలని కూడ అతడు కోరుకోకూడదు. వేదానుష్టానంలోని అన్ని నియమనిబంధనలను పాటించడం గాని, వేదాంతాన్ని ఉపనిషత్తులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం గాని ఈ కాలంలో సామాన్య మానవునికి అసాధ్యం. వేదాల ఉద్దేశాలను నెరవేర్చడానికి చాలా సమయం, శక్తి, జ్ఞానము, వనరులు అవసరమౌతాయి. ఇవన్నీ ఈ కాలంలో ఏమాత్రం సాధ్యపడవు. అయినా సమస్త పతితులను ఉద్దరించే శ్రీవైతన్యమహాప్రభువు ఉపదేశించినట్లుగా భగవన్నామ కీర్తన ద్వారా వేదాల సర్వోత్తమ ఉపయోగము సిద్ధిస్తుంది. వేదాంత తత్త్వాన్ని అధ్యయనం చేయడానికి బదులుగా భావావేశము కలిగినవానిగా భగవన్నామాన్ని ఎందుకు కీర్తిస్తున్నావని గొప్ప వేదపండితుడైన ప్రకాశానందసరస్వతి అడిగినపుడు శ్రీచైతన్య మహాప్రభువు సమాధానమిస్తూ తనను గురుదేవుడు మహామూఢునిగా భావించి పవిత్రమైన కృష్ణనామాన్ని కీర్తించమని చెప్పినట్లుగా తెలిపారు. 
   ఆయన ఆ విధంగానే చేసి ఉన్మత్తునిలాగా పారవశ్యానికి గురయ్యారు. ఈ కలియుగంలో దాదాపుగా జనులందరు మూర్ఖులు, వేదాంతతత్త్వాన్ని అర్థం చేసికోగలిగినంత విద్య లేనివారు అయి ఉంటారు. భగవంతుని పవిత్ర నామాన్ని అపరాధ రహితంగా కీర్తించడం ద్వారా వేదాంతతత్త్వము
యొక్క ఉత్తమ లాభము సిద్ధిస్తుంది. వేదాంతము వేదవిజ్ఞానంలో చివరి మాట. వేదాంత తత్వాన్ని రచించినవాడు, ఎరిగినవాడు శ్రీకృష్ణభగవానుడు. వవిత్రమైన భగవన్నామాన్ని జపించడంలో ఆనందాన్ని పొందే మహాత్ముడే మహోన్నతుడైన వేదాంతి. అదే సమస్త వేదజ్ఞాన ఉద్దేశము.

« Page - 15  మునుపటి పేజీ. 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top