ఆలయ గంటను మ్రోగించి పఠించవలసిన శ్లోకం - The hymn to be recited by the temple bell -

0
ఆలయ గంటను మ్రోగించి పఠించవలసిన శ్లోకం - The hymn to be recited by the temple bell -
దేవాలయంలో భగవంతుని దర్శించి, గంటను మ్రోగించి పఠించవలసిన శ్లోకం..!

గతం పాపం గతం దుఃఖం
గతం దారిద్ర్యమేవచ |
ఆగతా సుఖ సంపత్తిః
పుణ్యాశ్చ తవ దర్శనాత్ ||
రూపందేహి జయందేహి
యశోదేహి ద్విషోజహి |
పుత్రాన్దేహి ధనందేహి
సర్వాన్కామాంశ్చదేహిమే ||
ఇలా స్మరించుకున్న అనంతరం.., ఆత్మ ప్రదక్షిణలు చేసి, తీర్ధప్రసాదాలు స్వీకరించవలెను.
తాత్పర్యం ;
గత జన్మల్లోనూ,
గడిచిన రోజుల్లోనూ..,
పాపమెంతున్నా..
దుఃఖమెంతున్నా..
దారిద్ర్యమెంత అనుభవించినా..,
నీ దర్శన భాగ్యమున తొలగి
సుఖసంతోషాలూ..
సకల సంపదలూ..
విశేషమైన పుణ్యఫలాలూ..
పొందగలవాడను..!
చక్కని రూపం..,
కార్య విజయం..,
కీర్తి ప్రతిష్ఠలు..,
కామక్రోధాది శతృనాశమూ..,
సత్సంతానం..,
ధనధాన్యాలూ..,
మరియు నా యొక్క కోర్కెలు తీర్చు పరమాత్మ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top